ఈ సంక్షోభానికి శస్త్రచికిత్సే మందు | Shekhar Gupta Article On Financial Crisis In India | Sakshi
Sakshi News home page

ఈ సంక్షోభానికి శస్త్రచికిత్సే మందు

Published Sat, Oct 5 2019 1:11 AM | Last Updated on Sat, Oct 5 2019 1:17 AM

Shekhar Gupta Article On Financial Crisis In India - Sakshi

ఆర్థిక సంక్షోభం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, హామీలు ఇస్తే సర్దుకునే స్థాయిని దాటిపోయింది. వీటిలో కొన్ని పని చేయొచ్చు, కానీ స్టెరాయిడ్స్, ఇన్సులిన్‌ లాంటి మందు కావాలి. నిజమైన, ధైర్యంగా తీసుకునే చర్యలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం. బహుశా, పీఎస్‌యూలను పెద్దఎత్తున ప్రైవేటీకరించడం ద్వారా అది సాధ్యం కావచ్చు.మోదీ ప్రభుత్వం ఆరో ఏడాది పాలనలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోనట్టయితే, అది ఓ గెలుపు గుర్రమే కానీ, సంస్కరణలు తీసుకువచ్చే సత్తాను కోల్పోయిందని అభివృద్ధి అనేది వాంఛనీయమైనదే తప్ప అత్యవసరమైన అంశం కాదని నమ్మేవారి మాటలను నిజం చేసినట్లవుతుంది. 

నిజమైన, సాహసోపేతమైన సంస్కరణతో మాత్రమే ఆర్థిక సంక్షోభాన్ని సరిచేయవచ్చు. నరేంద్రమోదీ ప్రభుత్వం దాన్ని చేయలేకపోతే, అది తన ప్రాభవాన్ని కోల్పోతోందన్న భయాలు రుజువైనట్లే లెక్క.  ఇది మన రాజకీయ వర్గాలు తరచుగా ఉపయోగించే వ్యక్తీకరణ కాదు. కానీ భారతీయ పారిశ్రామిక వర్గం జంతు సహజాతాల బలీయమైన ప్రభావం గురించి ప్రతిచోటా మాట్లాడుకుంటూ ఉంటడం కద్దు. భారతీయ కార్పొరేట్‌ వర్గం నుంచి ఇలాంటి సహజాతాలకు సంబంధించినంతవరకు అభ్యర్థన చేసిన ఏౖకైక నాయకులు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్, తర్వాత జస్వంత్‌ సింగ్‌ మాత్రమే. ఇక మోదీ ప్రభుత్వం ఆలస్యంగానైనా తన సొంత మాటల్లో ఆ పని చేయడానికి ప్రయత్నించింది. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో, భారతీయ సంపద సృష్టికర్తలను ఆకర్షించడానికి కొంత ప్రయత్నం చేశారు. భారత సంపన్నులను తన ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పడమే కాక, జాతి నిర్మాణంలో వారు చక్కటి పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎర్రకోట నుంచి ఒక భారతీయ ప్రధాని ప్రైవేట్‌ పారిశ్రామిక వర్గాన్ని అత్యంత శక్తివంతంగా సొంతం చేసుకున్న ఘటనలలో ఇదీ ఒకటి. ఇది మరింత దిద్దుబాటు చర్యకు వీలు కల్పించింది. 

భారీగా కార్పొరేట్‌ పన్ను కోతలు, మూలధన లబ్ధిపై పన్నులో మార్పులు, కార్పొరేట్‌ లాభాలపై  పన్ను తగ్గింపు వంటివి ప్రకటించారు. అదేవిధంగా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారుల కార్పొరేట్‌ లాభాలపై పన్ను విధింపును వెనక్కు తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నటికీ వెనక్కు తీసుకోని, నష్టభయాన్ని తట్టుకునే ప్రభుత్వం, పారాచూట్‌ని తనిఖీ చేయకుండానే విమానం వెనుకనుంచి దుమికేయాలని నిర్ణయించుకున్నాక వెనక్కు తిరగని ప్రభుత్వం ఈవిధమైన తిరోగమనాలకు పాల్పడటమే ఒక కొత్త అనుభవం.

అలా తిరోగమించడాన్ని ప్రభుత్వంలో  ఏ ఒక్కరూ అంగీకరించకపోవచ్చు, కానీ మొట్టమొదటిసారిగా అసాధారణ ప్రజాదరణ కలిగిన ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం కలిసి నియంత్రించలేని అంశమేమిటంటే మార్కెట్లే. న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల కమిషన్, చివరకు పాకిస్తా¯Œ తో అయినా సరే.. మోదీ అంత శక్తివంతంగా వ్యవహరించగలిగింది. కానీ పశుబలం కలిగిన రాజకీయ అధికారం కూడా మార్కెట్‌ విషయంలో ఏమీ చేయలేదు. 

గత కొద్ది వారాలుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ వాణిజ్య ప్రముఖులను కలుసుకుంటూ వస్తున్నారు. ప్రెస్‌ కాన్ఫరె¯Œ్స తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్సులో ఆమె తన బడ్జెట్‌లోని అత్యంత సమస్యాత్మక విభాగాలను గురించి చెబుతూ వచ్చారు. ఈ ’అప్రియ వార్తల’ బడ్జెట్‌ ముసాయిదా తయారీలో కీలక వ్యక్తి అయిన ఆర్థిక శాఖ కార్యదర్శి రంగంనుంచి తప్పుకుని ముందస్తు పదవీవిరమణ కోసం ప్రయత్నించారు. ఈదఫా కేంద్రబడ్జెట్‌ సమర్పించిన తర్వాత ఆర్బీఐ రెండు సత్వర రెపో రేట్స్‌ని తీసుకొచ్చింది. 

అయినప్పటికీ మన కార్పొరేట్‌ వర్గం మానసిక స్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. చివరకు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన ఇండియా ఎకనమిక్‌ సమ్మిట్‌లో కూడా మన కార్పొరేట్‌ వర్గంలో కళాకాంతులు లేవు. చిరునవ్వు కనిపించలేదు. మనం జంతు సహజాతాల గురించి మాట్లాడుతున్నామా? అవి కచ్చితంగా కంటికి కనబడతాయి. మీరు కోరుకుంటున్న రీతిలో జంతువు ఉండలేదు. పులి తోక పైకి లేపి మరీ పడుకుంటుంది. యజమాని వదిలేసిన కుక్క కూడా తన తోకను కాళ్లమధ్య దాచుకుంటూ ఉంటుంది. 

మీకు నేను వాడుతున్న పదబంధం ఇష్టం కానట్లయితే, కుక్కలతో పోల్చడం ఇష్టం లేకపోతే, నేను మరింత సాంప్రదాయికమైన పదం వెనుక దాక్కుంటాను. అది నైతిక ధృతి లేని సైన్యం. అత్యుత్తమ ఆయుధాలను మీరు ఇవ్వవచ్చు. కానీ సైనికాధికారులు తమ మనస్సులో ఇప్పటికే ఓడిపోవడం జరిగాక, యుద్ధంలో గెలవటం మాట అటుంచి తమ సైనిక బలగాలను కూడా ముందుకు నడిపించలేక పోవచ్చు. 

సెప్టెంబర్‌ 24న పన్ను కోతలు తగ్గించినప్పటినుంచి దేశీయ కార్పొరేట్‌ రంగం తన స్పూర్తిని ఎంతగా కోల్పోయిందంటే, బీఎస్‌ఈ సెన్సెక్‌లో నమోదైన కంపెనీలు తాజాగా రూ. 2.53 లక్షల కోట్లను కోల్పోయాయి. గత నిర్ణయాలనుంచి వెనక్కు రావడం, వడ్డీ రేట్లలో కోతలు వంటి సంస్కరణలు నిండా ఆవరించిన నిరాశావాదంలోంచి బయటపడలేకపోయాయి. మార్కెట్లకు పికెట్టీ భరోసా ఇచ్చిన తర్వాత కూడా ప్రపంచ స్థాయిలో మార్కెట్ల పరిస్థితి బాగాలేదు. అయితే కార్పొరేట్‌ వర్గాలు ఎంత అసమర్థంగా ఉన్నప్పటికీ, క్రమరాహిత్యంతో ఉన్నప్పటికీ అధికారపీఠంలో కూర్చుని ఉన్నవారికి నిజం చెప్పడంలో ఇప్పుడు వెనుకాడటం లేదు. మీడియా, న్యాయవ్యవస్థ వంటి కనీసం ఊహించలేని చోట భారతీయ మార్కెట్లు నిర్బయంగా ఒక విషయాన్ని చెబుతున్నయి: మోదీ ప్రభుత్వం దృష్టికి చెడువార్తలను తీసుకుపోండి. 

గత త్రైమాసికంలో వృద్ధి రేటు 5శాతం వద్ద కనిపడి అందరికీ షాక్‌ కలిగించింది. అయితే అలా షాక్‌ తగిలింది అమాయకులకే అనుకోండి. ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న ఎవరికైనా ఇది బోధపడుతుంది. ఏదైనా అసాధారణమైనది జరిగితే తప్ప ఈ పరిస్థితిని మెరుగుపర్చడం కష్టమే. ఆ మార్పు ఏంటన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలీదు. మన అదృష్టాన్ని నిర్ణయించే అలాంటి అసాధారణ పరిణామం ఎవరికైనా తెలిసి ఉంటే, ఆర్బీఐ ఈ సంవత్సరం వృద్ధి అంచనాను 6.9 నుంచి 6.1కి తగ్గించి ఉండదు. ఈరోజు లాభాలు, పన్ను కోతల బట్టి కాక, రేపటి ఆశావాదం బట్టే పారిశ్రామిక వర్గం ముందడుగు వేస్తుంది. ఆ ఆశావాదమే పతనమవుతోంది. మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో అన సొంత ఆర్థిక అభివృద్దిని విచ్చిన్న పర్చుకోవడం సాధ్యమైనప్పటినిుంచి మన ఆశావాదం తగ్గుపట్టనారంభించింది.

వ్యాపార వర్గాలు సాధారణ ప్రజలు, కుటుంబాలనుంచి విభిన్నంగా ఉండవు. భవిష్యత్తు బాగా లేదని అర్థం కాగానే వారు తాజా ఆదాయాలు, సేవింగ్స్, ఇటీవలి పన్ను కోతలు వంటి ద్వారా వచ్చే బొనాంజాలను మొత్తంగా కుటుంబ ఆదాయాలుగా మార్చిస్తారు. పరిస్థితి మెరుగుపడిందని గ్రహించాకే వారు నష్టభయాలకు సిద్ధమై వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ఈ సమాచారాన్ని మీరు ఎటునుంచి ఎటు తిరగేసినా విషయం మాత్రం అదే. ఎటువంటి మినహాయింపూ లేకుండా అన్ని ఆర్థిక సూచికలు గత కొద్దికాలంగా దిగజారుతూనే ఉన్నాయి. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఇందుకు మీరు ఏదో కారణం వెతకచ్చు. కానీ, అది చాలా చిన్న విషయం. సమస్య మూలాలు ఇక్కడ ఉన్నాయి.

ముఖేష్‌ అంబానీలాంటివారితో సహా చాలామంది నగదు నిల్వలను వదులుకోవడం లేదు. లేదంటే అప్పులు తగ్గించుకోవడానికీ, ఇబ్బందులు లేకుండా చూసుంటూ, లోన్లను తిరిగి చెల్లిస్తూ కాలం వెళ్లబుచ్చుతూ–మిగిలినవారంతా పెట్టుబడులు పెట్టాలని చూడటం సరికాదు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఎవరిని అడిగినా 1991 తర్వాత ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని గుసగుసగా చెబుతారు. పన్నుల అధికారులకు దాడులు చేయడానికి, అరెస్ట్‌ చేయడానికి అవసరమైన అధికారాలు కట్టబెట్టడం వల్ల మాత్రమే కాదు, మొండి బాకీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తింది. 

అన్ని వ్యాపారాల్లో రిస్క్‌ ఉంటుందని ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు నాతో చెప్పారు. 30 రోజుల్లో నేను తీసుకున్న అప్పు తీర్చకపోతే, బ్యాంకులు నన్ను ఎ¯Œ సీఎల్‌టీగా పేర్కొంటూ నా పేరును ఎగవేతదారుల జాబితాలో ప్రచురిస్తాయి. నేనెందుకు రిస్క్‌ తీసుకోవాలి? ఒక మనిషి అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి తీసుకువెళతారా, లేక స్మశానానికా? ఆర్‌బీఐ కొత్త దివాళా నిబంధనలు భారత పారిశ్రామికవిధానానికి ఎ¯Œ సీఎల్‌టీ అనే స్మశానాలు నిర్మిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, హామీలు ఇస్తే సర్దుకునే స్థాయిని దాటిపోయింది. 

వీటిలో కొన్ని పని చేయొచ్చు, కానీ స్టెరాయిడ్స్, ఇన్సులిన్‌ లాంటి మందు కావాలి. నిజమైన, ధైర్యంగా తీసుకునే చర్యలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం. బహుశా, పీఎస్‌యూలను పెద్దఎత్తున ప్రైవేటీకరించడం ద్వారా అది సాధ్యం కావచ్చు.మోదీ ప్రభుత్వం ఆరో ఏడాది పాలనలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోనట్టయితే, అది ఓ గెలుపు గుర్రమే కానీ, సంస్కరణలు తీసుకువచ్చే సత్తాను కోల్పోయిందని అభివృద్ధి అనేది వాంఛనీయమైనదే తప్ప అత్యవసరమైన అంశం కాదని నమ్మేవారి మాటలను నిజం చేసినట్లవుతుంది. 
వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement