Indian growth
-
వృద్ధి ఆశావహమే.. కానీ అప్రమత్తత
భవిష్యత్తులో దేశ ఆర్థిక వృద్ధి పట్ల ఆశావహంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే అదే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. సరిపడా వర్షాలు, రిజర్వాయర్లలో మెరుగైన నీటి నిల్వలు, కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచడం, ముడి సరుకుల లభ్యత ఇవన్నీ ఆర్థిక వృద్ధికి సానుకూల అంశాలుగా పేర్కొంది.‘ప్రస్తుతం కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, మెరుగైన వ్యవసాయ ఉత్పాదకత వల్ల రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం దిగొస్తుంది. నవంబర్ నెల ప్రారంభ ధోరణులు కీలక ఆహార ధరలు మోస్తరు స్థాయికి చేరుతున్నట్టు సంకేతమిస్తున్నాయి. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం దేశీయంగా ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలపై కొనసాగుతుంది’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక వెల్లడించింది. ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాలు వర్షాకాలంలో కొంత నిదానించినప్పటికీ, తిరిగి అక్టోబర్‌లో పుంజుకున్నట్టు కొన్ని సంకేతాలు వస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ, పట్టణ డిమాండ్‌తోపాటు, పీఎంఐ సూచీ, ఈవే బిల్లుల జారీ తదితర సంకేతాలను ప్రస్తావించింది.ఉపాధి విస్తరణ.. సంఘటిత రంగంలో ఉద్యోగుల సంఖ్య విస్తరిస్తోందని.. తయారీ రంగంలో చెప్పుకోతగ్గ మేర ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నట్టు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వల్ల దేశ ఎగుమతులు పుంజుకునే విషయంలో సవాళ్లను ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. మరోవైపు సేవల రంగం ఊపందుకుంటున్నట్టు తెలిపింది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐలు) చెప్పుకోతగ్గ వృద్ధి లేదని వెల్లడించింది. విదేశీ మారకం నిల్వలు ఈ ఏడాది ఇప్పటి వరకు 64.8 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు, చైనా తర్వాత అధిక వృద్ధి నమోదైనట్టు తెలిపింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, కంపెనీల ఆదాయాల వృద్ధి, విలువలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ట్రంప్ సర్కారు విధాన నిర్ణయాలు తదుపరి విదేశీ పెట్టుబడుల రాకను ప్రభావితం చేస్తాయని వివరించింది. ఇదీ చదవండి: ఆకాశవీధిలో 1.36 కోట్ల మందిఅంతర్జాతీయ పరిణామాలు..రష్యా–ఉక్రెయిన్ మధ్య తాజా ఉద్రిక్తతలతో ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళనకు దారితీసిందని, దీంతో భద్రత ఎక్కువ ఉండే సాధనాలైన యూఎస్ ట్రెజరీలు, బంగారానికి డిమాండ్ ఏర్పడినట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. యూరప్, చైనాలో ఆర్థిక మందగమనం ప్రభావం అంతర్జాతీయ వృద్ధిపై కొనసాగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి పనితీరు చూపిస్తున్నట్టు పేర్కొంది. -
మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధి
డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే దేశం వృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సమ్మిళిత వృద్ధికి అనువైన చట్టాలను సరళీకరిస్తూ దేశం ఆర్థికంగా దూసుకుపోతోందని తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.‘ఉపాధి కల్పన, ఉత్పత్తి విలువను పెంచే పీఎల్ఐ ప్రోత్సాహకాలు దేశవృద్ధికి ఎంతో ఉపకరిస్తున్నాయి. దేశీయంగా తయారీ రంగం ఊపందుకుంటుంది. మొబైల్, సెమీకండక్టర్లు వంటి తయారీ రంగాల్లో రానున్న రోజుల్లో ఎంతో వృద్ధి నమోదవుతుంది. ప్రభుత్వం భౌతిక, డిజిటల్ ఆస్తులపైనే కాకుండా సామాజిక వనరులపై కూడా పెట్టుబడి పెడుతుంది. గత పదేళ్లలో మెడికల్ కాలేజీలు దాదాపు రెట్టింపు పెరిగి 706కు చేరుకున్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సంఖ్య ఏడు నుంచి 22కు చేరింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా కొత్త పరిశ్రమలను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఉపాధి లభిస్తుంది. ఉత్పాదకత పెంపొందుతుంది. మొబైల్ ఫోన్ తయారీకి సంబంధించిన పీఎల్‌ఐల వల్ల గత దశాబ్దంలో 12 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు నమోదయ్యాయి. దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్ల మొత్తం ఉత్పత్తి విలువ 2014లో 2.3 బిలియన్ డాలర్లు(రూ.19.3 వేలకోట్లు)గా ఉండేది. 2024 నాటికి అది రూ.4.1 లక్షల కోట్లకు పెరిగింది’ అన్నారు.ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు‘ఈ సంవత్సరం యాపిల్ సంస్థ దేశంలో తమ సరికొత్త మోడల్‌ను తయారు చేయనుంది. గత దశాబ్దంలో మొబైల్ ఫోన్ తయారీలో దేశం గణనీయ వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత భారత్ ఈ రంగంలో రెండో స్థానానికి చేరుకుంది. పీఎల్ఐకు సంబంధించి మొబైల్ తయారీ విభాగం విజయవంతం కావడంతో సెమీకండక్టర్ చిప్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. సెమీకండక్టర్ డిజైన్, ఏటీఎంపీ(అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో వృద్ధి నమోదు కానుంది. ఈ రెండు పరిశ్రమలకు అనుబంధంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను ప్రారంభించనున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.40 వేలకోట్లు కేటాయించనుంది. సమ్మిళిత వృద్దికి అవసరమయ్యే చట్టాలను సరళీకరిస్తూ దేశం ఆర్థికంగా దూసుకుపోతుంది’ అని మంత్రి వివరించారు. -
భారత వృద్ధిపై ఎస్ అండ్ పీ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత వృద్ధి ప్రగతి పట్ల అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచాలను పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించినప్పటికీ.. ఎస్అండ్పీ మాత్రం 7.3 శాతంగానే కొనసాగించింది. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి ఎగువనే చలించొచ్చని అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఆర్థిక అంచనాలను తాజాగా ఎస్అండ్పీ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి వాతావరణం ప్రతికూలంగా ఉందని, అధిక అంతర్జాతీయ రేట్ల వల్ల కరెన్సీ విలువల క్షీణత, పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం వంటి ఒత్తిళ్లు ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. చైనాలో మందగమనం ప్రభావం.. భారత్‌లో వినియోగం, పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. ‘‘సవాళ్లు ఉన్నప్పటికీ.. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరం 2023–24కు 6.5 శాతంగా కొనసాగిస్తున్నాం’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయిస్ కూజ్స్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధించొచ్చని ఆర్బీఐ అంచనాగా ఉంది. ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్, సిటీ గ్రూపు భారత వృద్ధి రేటును 2022–23కు 7 శాతం, అంతకంటే దిగువకు ఇప్పటికే తగ్గించేశాయి. గత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండడం గమనార్హం. పస్త్రుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడడం తెలిసిందే. రూపాయిలో అస్థిరతలు.. రానున్న రోజుల్లో రూపాయి ఒత్తిళ్లను చూస్తుందని ఎస్అండ్పీ ఆర్థికవేత్త విశృత్ రాణా అంచనా వేశారు. అయితే, భారత్ వద్ద విదేశీ మారకం నిల్వలు గణనీయంగా ఉన్నట్టు తెలిపారు. రూపాయి డాలర్‌తో 81.52కు పడిపోవడం గమనార్హం. ‘‘గత నెల రోజుల్లో అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే రూపాయి క్షీణించింది తక్కువే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతున్న కొద్దీ రూపాయి మరిన్ని అస్థిరతలు చూడనుంది. బారత విదేశీ మారకం నిల్వల నిష్పత్తి అన్నది స్వల్పకాల విదేశీ రుణాలతో పోలిస్తే 2 కంటే ఎక్కువే ఉంది. ఇది గణనీయమైన మిగులు నిల్వలను సూచిస్తోంది’’అని విశృత్ రాణా వివరించారు. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగాను ఉంటుందని ఎస్అండ్పీ అంచనా వేసింది. వాతావరణంలో మార్పుల వల్ల గోధుమలు, బియ్యం ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్ల పెరుగుదలకు దారితీస్తుందంటూ, 2022–23 చివరికి 5.9 శాతం స్థాయిలో రెపో రేటు ఉంటుందని అంచనా వేసింది. -
వెలుగురేఖలు కనబడుతున్నాయ్... కొనసాగాలి!
న్యూఢిల్లీ: పదకొండు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత మందగమన ధోరణిని ఎదుర్కొంటున్న భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కొంత పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితి మరింత పటిష్టం కావాల్సి ఉందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో డిమాండ్ పునరుద్ధరణకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని అన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ తీవ్ర ఆందోళన సృష్టిస్తున్న చైనా కోవిడ్–19 (కరోనా) వైరస్‌ను పరిణామాలను ప్రతి ‘‘విధాన నిర్ణేత’’ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. తగిన తక్షణ చర్యలు తీసుకోడానికి ఇది అవసరం. అతి పెద్ద రెండవ ఆర్థిక వ్యవస్థలో వైరెస్ సంక్షోభ ప్ర భావం ప్రపంచ వృద్ధిపై ప్రతికూలత చూపుతుంది. ♦ తాజా 2020–21 బడ్జెట్ ప్రతిపాదనలు, అలాగే కార్పొరేట్ పన్నుకోతసహా ఇటీవల కేంద్రం తీసుకున్న మరికొన్ని కీలక చర్యలు డిమాండ్, వినియోగం పునరుద్ధరణ దిశలో తగిన సానుకూల పరిస్థితులను సృష్టించాయి. అయితే మరిన్ని వ్యవస్థాగత చర్యలూ అవసరం. భూ, కార్మిక వ్యవహారాలకు సంబంధించి సంస్కరణలు, వ్యవసాయ మార్కెటింగ్ పటిష్టత, మానవ వనరుల విషయంలో నైపుణ్యత పెంపు వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ♦ 2019 మొదట్లోనే మందగమన ఛాయలను ఆర్బీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో ధరల కట్టడి పరిస్థితిని అదనుగా తీసుకుని బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను వరుసగా ఐదుసార్లు తగ్గించింది. ♦ అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి పరిస్థితులు, దేశీయంగా డిమాండ్ మందగించడం, బ్యాంకింగ్ మొండి బకాయిల తీవ్రత ,కార్పొరేట్ రుణ భారాలు వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి ప్రధాన కారణాలు. అయితే ఇప్పుడు కొన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ఆయా అంశాల ధోరణి ఎలా ఉండబోతోందన్న విషయం వేచిచూడాల్సి ఉంది. భారత్...ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 2019లో బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించి భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని యూఎస్‌కు చెందిన విశ్లేషణా సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ఒకటి తెలిపింది. భారత్ జీడీపీ విలువను 2.94 ట్రిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. బ్రిటన్ ఎకానమీ పరిమాణాన్ని 2.83 ట్రిలియన్ డాలర్లుగా, ఫ్రాన్స్‌కు సంబంధించి ఈ విలువను 2.71 ట్రిలియన్ డాలర్లుగా పేర్కొంది. -
భారత్ వృద్ధి అంచనా యథాతథం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) భారత వృద్ధి రేటును యథాతథంగా 7.2 శాతంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018–19లో ఇది 7.7 శాతానికి చేరుతుందని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) అప్డేట్ నివేదికలో పేర్కొంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ రెండేళ్లూ కూడా భారత వృద్ధి రేటు చైనా కన్నా అధికంగానే ఉండనుంది. చైనా వృద్ధి 2017లో 6.7 శాతంగాను, 2018లో 6.4 శాతంగాను ఉండగలదంటూ గతంలో ప్రకటించిన అంచనాలను తాజా నివేదికలో ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచింది. భారత వృద్ధి రేటు అంచనాలను గతంలో ఇచ్చిన స్థాయిలోనే యథాతథంగానే ఉంచినప్పటికీ.. చైనాను మించగలదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాలతో గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.1 శాతానికే పరిమితమైనప్పటికీ.. ఇది ఊహించిన దానికన్నా అధికమేనని ఐఎంఎఫ్ పేర్కొంది.