Indian Railway Board
-
రూ.5 వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా!
రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్‌మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్‌మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురుభారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలుకాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్.ఆన్లైన్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.రైల్‌మదద్: రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: వలస పాలన నాటి నుంచి అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ ఖలాసీల(టీఏడీకే)కు సంబంధించిన నియామక ప్రక్రియను సమీక్షిస్తున్నట్లు పేర్కొంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా జూలై 1, 2020 నాటికి చేపట్టిన నియామకాలను రైల్వే బోర్డు పునఃసమీక్షించే అవకాశం ఉందని పేర్కొంది. అన్ని రైల్వే సంస్థలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.(రైల్వే సంస్కరణలకు గ్రీన్‌సిగ్నల్) కాగా టీఏడీకే గ్రూప్ డీ కేటగిరీ ఉద్యోగులు అన్న సంగతి తెలిసిందే. సీనియర్ రైల్వే అధికారుల నివాసాల వద్ద వీరు విధులు నిర్వర్తిస్తారు. ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం, ఫైల్స్ అందించడం వంటి పనుల చేస్తారు. అయితే చాలా మంది అధికారులు టీఏడీకేలను తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లుతుతున్న విషయం తెలిసిందే. ఇక వివిధ విభాగాల్లో కాలానుగుణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టిన రైల్వే శాఖ.. ఇప్పటికే డాక్ మెసేంజర్ వ్యవస్థకు చరమగీతం పాడిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా వీడియో కాన్ఫరెన్స్‌లు లేదా మెయిల్స్ ద్వారా సమాచారం చేరవేయాలని అధికారులకు సూచించింది. కాగా రవాణా రంగంలో శతాబ్దిన్నరకు మించి అనుభవం గడించి, రోజూ 22,000 రైళ్లు నడుపుతూ ప్రపంచ రైల్వేల్లోనే నాలుగో స్థానం ఆక్రమించిన రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే రైల్వే బోర్డును కుదించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. -
రైల్వే సంస్కరణలకు గ్రీన్‌సిగ్నల్
రవాణా రంగంలో శతాబ్దిన్నరకు మించి అనుభవం గడించి, రోజూ 22,000 రైళ్లు నడుపుతూ ప్రపంచ రైల్వేల్లోనే నాలుగో స్థానం ఆక్రమించిన మన రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశలో తొలి అడుగుగా దాని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే రైల్వే బోర్డును కుదించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో 53,596 కిలోమీటర్ల రైలు మార్గంవుంది. అదిప్పుడు మరో 13,772 కిలోమీటర్ల మేర మాత్రమే పెరిగిందంటే దాని వృద్ధి ఏమేరకువుందో అర్ధమవుతుంది. అప్పటితో పోలిస్తే అది నిత్యం నిర్వహించాల్సిన రైళ్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. స్టేషన్లు ఎక్కు వయ్యాయి. ప్రయాణికుల సంఖ్య కూడా ఊహకందనివిధంగా పెరిగింది. 29 రాష్ట్రాలూ, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలూ, 8,500 స్టేషన్లువున్నాయి. వేలాది రైళ్లు రోజూ 2 కోట్ల 30 లక్షలమంది ప్రయాణికులను చేరేస్తాయి. సరుకు రవాణా రోజుకు 30 లక్షల టన్నులమేర విస్తరించింది. ఈ కార్యనిర్వహణంతా 17 జోన్లు, 68 డివిజన్లు పరిధిలోవుండే 13 లక్షలకుపైగా సిబ్బంది చేతుల మీదుగా సాగుతుంది. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా తర్వాత మన రైల్వే వ్యవస్థే అతి పెద్దది. కానీ ఈ వ్యవస్థ నిత్యం ఆర్థిక సమస్యలతోనే కొట్టుమిట్టాడుతోంది. 2017–18లో రైల్వే శాఖ ఆర్జించిన ప్రతి రూపాయిలో 98.44 పైసల వరకూ నిర్వహణకే పోయిందని ఇటీవల కాగ్ నివేదిక తెలిపింది. ఇది గత పదేళ్లతో పోలిస్తే అత్యంత అధమ స్థాయిలో ఉందని వ్యాఖ్యానించింది. ఇంత కన్నా దారుణమేమంటే ఎన్టీపీసీ, ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఇర్కాన్) సంస్థలు రైల్వేలకిచ్చిన అడ్వాన్సుల వల్ల ఈమాత్రమైనావుంది కానీ, లేనట్టయితే ఇది 102. 66 పైసలుగా నమోదయ్యేదని కాగ్ తెలిపింది. ఈ అడ్వాన్సుల కారణంగా రైల్వేల జమాఖర్చుల పద్దులో రూ. 1,665.61 కోట్లు మిగులు కనబడింది. ఆ రెండింటినీ మినహాయిస్తే 5,676.29 కోట్ల నష్టం నమో దయ్యేది. సరుకు రవాణా నుంచి వచ్చే లాభాల్లో 95 శాతాన్ని ప్రయాణికుల సర్వీసులో ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేయడానికి వినియోగించాల్సివస్తోంది. వచ్చే అయిదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమీకరించి రైల్వేశాఖకు జవసత్వాలు కల్పిస్తామని నాలుగేళ్లక్రితం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. ప్రయాణికుల సంఖ్య, సరుకు రవాణా పరిమాణం భారీగా పెంచడం, కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, అధునాతన రైళ్లను సమకూర్చుకోవడం రైల్వేల ప్రణాళికలో ప్రాధాన్యతాంశాలని వివరించింది. అన్నీ పూర్తయితే రైల్వేల ఆదాయం మరిన్ని రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఇదంతా ఆశించినంతమేర జరగలేదు. నిజానికి బడ్జెట్లలో ప్రకటించిన ప్రాజెక్టులన్నీ సక్రమంగా అమలు చేయడానికి అవస రమైన నిధులు ఆ శాఖ దగ్గర ఉండవు. కనుక ప్రాథమికమైన పనులు మొదలు కావడానికే ఏళ్లూ పూళ్లూ పడుతూంటుంది. మన రైల్వేలు 30 ఏళ్లకిందటి ప్రాజెక్టుల్ని కూడా ఇంకా పూర్తిచేయాల్సే వున్నదని ఆమధ్య ఒక నివేదిక ప్రకటించింది. రైల్వేల్లో వున్న అనేకానేక విభాగాలు మధ్య సరైన సమన్వయం వుండకపోవడం వల్ల అడుగడుగునా ఇబ్బందులు తలెత్తడమేకాక, తలపెట్టినవేవీ సక్ర మంగా సాగటం లేదని ఆ నివేదిక తెలిపింది. ఒకపక్క అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ సాధనను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, అందులో కీలకపాత్ర పోషించాల్సిన రైల్వే వ్యవస్థ మాత్రం ఇంతటి దుస్థితిలో వుండ టం ఆందోళన కలిగించే అంశమే. కనుకనే కేంద్రమంత్రివర్గం రైల్వే ప్రక్షాళనకు నడుం బిగించా నంటున్నది. సమస్యలెదురైనప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు సిబ్బంది సంఖ్యపై దృష్టి పెడ తాయి. రిటైరవుతున్నవారు అవుతుండగా వారి స్థానంలో కొత్తవారి నియామకం విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు. కానీ ఈసారి పైస్థాయినుంచి ప్రక్షాళన మొదలుపెట్టాలని నిర్ణయించడం మెచ్చదగిందే. రైల్వే బోర్డులో ఇప్పుడున్న ఎనిమిది మంది సభ్యుల సంఖ్యను అయిదుకు తగ్గించాలని, వేర్వేరు కేడర్లనూ, విభాగాలనూ విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, ట్రాఫిక్, మెకానికల్, ఎలక్ట్రికల్ వగైరా ఎనిమిది విభాగాలను ఇండియన్ రైల్వే మేనే జ్మెంట్ సర్వీస్(ఐఆర్ఎంఎస్) పేరిట ఒకే సర్వీస్కిందకు తీసుకొస్తారు. ఇకపై రైల్వేల్లో రైల్వే పరిరక్షణ దళం, వైద్య సర్వీసుల విభాగాలు మాత్రమే వుంటాయి. రైల్వే బోర్డు చైర్మన్, మరో నలుగురు సభ్యులు మాత్రమే బోర్డులో వుంటారు. చైర్మన్‌ను సీఈఓగా వ్యవహరిస్తారు. అలాగే సమర్థత, అనుభవం, నైపుణ్యం వున్నవారిని బయటినుంచి తెచ్చే యోచన కూడావుంది. 1994లో ప్రకాష్ టాండన్ కమిటీతో మొదలుపెట్టి 2015లో వివేక్ దేబ్రాయ్ కమిటీ వరకూ మూడు, నాలుగు కమిటీలు ఈ సంస్కరణలన్నీ సూచిస్తూనేవున్నాయి. అయితే కేంద్రం ఆ విషయంలో తట పటాయిస్తూ వచ్చింది. దేబ్రాయ్ కమిటీ 2015లో చేసిన సిఫార్సులు అప్పట్లో కలకలం సృష్టించాయి. రైల్వే మంత్రిత్వ శాఖను, రైల్వేలను వేరుచేయాలనడం, రైల్వే వ్యవస్థను రైళ్ల నిర్వహణకు మాత్రమే పరిమితం చేసి ఇతర బాధ్యతల నిర్వహణకు మౌలిక సదుపాయాల కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పడం అప్పట్లో తీవ్ర విమర్శలు రేకెత్తించాయి. ఇప్పుడు కేంద్ర కేబినెట్ అంత లోతుకు పోలేదు. అయితే మున్ముందు వాటిపై కూడా దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే 2018–2030 మధ్య రైల్వేల్లో 50 లక్షల కోట్ల మేర పీపీపీ ప్రాతిపదికన పెట్టుబడులు సేకరించాలని నిర్ణయించినట్టు నిరుటి రైల్వే పద్దులోనే కేంద్రం ప్రకటించింది. రైల్వేల్లో అమలు చేసే ఏ సంస్కరణలైనా దాని లోపాలను పరిహరించి, అది పూర్తి జవసత్వాలతో పనిచేసే విధంగా తీర్చిదిద్దాలి. కేవలం ప్రైవేటుకిస్తే మంత్రించినట్టు అంతా సవ్యంగా మారుతుందనే ధోరణి సరికాదు. -
సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలి
హైదరాబాద్: సమయానుకూలమైన మార్పు చేర్పులు, పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, చక్కటి పని సంస్కృతితో సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని భారత రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్వనీ లోహాని అన్నారు. సిబ్బందికి పూర్తి పని స్వేచ్ఛ ఇస్తూ జవాబుదారీతనం పెంచడం ద్వారా చక్కటి పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఎర్రమంజిల్‌లోని ఆస్కీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘ఆస్కీ 61వ ఫౌండేషన్ డే లెక్చర్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సిబ్బందిలో నీతి, నిజాయితీతో పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించాలని కోరారు. ఉద్యోగులను ప్రోత్సహించడం, వారి ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా సంస్థను అద్భుతంగా ముందుకు నడపవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య, డైరెక్టర్ ఆర్‌హెచ్.ఖ్వాజా లోహానిని సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఇక నుంచి రైల్వే ఉద్యోగులకు ఆస్కీలో శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాగుంది.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాగుందని అశ్వనీ లోహాని కితాబిచ్చారు. బుధవారం ఆయన సికింద్రాబాద్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల సదుపాయాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది సేవలను అభినందించారు. రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. అనంతరం చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అర్జున్ ముండియా, చీఫ్ వర్క్‌షాపు మేనేజర్ ఎం.విజయ్‌కుమార్ ఆయనకు లాలాగూడలోని సీడబ్ల్యూఎస్ వర్క్‌షాప్ పనితీరును వివరించారు. అనంతరం రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజినల్ రైల్వేమేనేజర్లతో మాట్లాడారు. -
ఐఐటీలో 'బుల్లెట్' కోర్సు
కొల్కతా: ఖరగ్‌పూర్ ఐఐటీలో బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రొఫెసర్ సుబ్రన్షు రాయ్ శుక్రవారం కొల్‌కత్తాలో వెల్లడించారు. ఏ ఏడాది చివరి నాటికి ఈ కోర్సు రూపకల్పన పూర్తి అవుతుందని... ఆ వెంటనే కోర్సును ప్రారంభిస్తామని చెప్పారు. అందుకు భవనాల నిర్మాణం కోసం రైల్వే పరిశధన కేంద్రం (సీఆర్ఆర్) రూ. 20 కోట్లు కేటాయించిందని తెలిపారు. మరో ఆరు నెలలో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే రైల్వే రంగంలో నాలుగు కీలక అంశాలపై కూడా పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా రైల్వేలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాయ్ విశదీకరించారు. ఇప్పటికే క్యాంపస్‌లోని ఐఐటీయన్లు హైస్పీడ్ ట్రైన్ బోగిలో టెక్నాలజీపై పని చేస్తున్నారని తెలిపారు. అలాగే రైల్వే టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధి కోసం రైల్వే శాఖ మరో రూ. 20 కోట్లు మంజురు చేసిందని రాయ్ వెల్లడించారు.