Indian spy
-
సల్మాన్ ఖాన్ నటించనున్న తొలి బయోపిక్! వివరాలివే..
గూఢచారిగా మారనున్నారు బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్. హిందీ ‘రైడ్’ (2018)తో హిట్ అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనే సల్మాన్ గూఢచారిగా కనిపించనున్నారని టాక్. ఆల్రెడీ సల్మాన్‌ను రాజ్‌కుమార్ గుప్తా కలిసి కథ చెప్పారట. ఈ చిత్రం భారతీయ గూఢచారి రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందనుందని సమాచారం. ఇందులో రవీంద్ర కౌశిక్ పాత్రలో సల్మాన్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. రవీంద్ర కౌశిక్‌కు బ్లాక్ టైగర్‌గా కూడా పేరుంది. ప్రస్తుతం ‘టైగర్ 3’తో బిజీగా ఉన్న సల్మాన్ ఆ తర్వాత ఫర్హాద్ సామ్జీ డైరెక్షన్లో ‘భాయీజాన్’లో నటిస్తారు. ఈ చిత్రానికి ముందు ‘కభీ ఈద్ కభీ దీవాలి’ అని టైటిల్ పెట్టారు. అయితే ‘భాయీజాన్’గా మార్చారట. ఆ నెక్ట్స్ సల్మాన్‌ఖాన్, రాజ్‌కుమార్ గుప్తా కాంబినేషన్లో రవీంద్ర కౌశిక్ బయోపిక్ సెట్స్‌పైకి వెళుతుందని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే 32 ఏళ్ల కెరీర్లో సల్మాన్ నటించనున్న తొలి బయోపిక్ ఇదే కావడం విశేషం. -
యూ టర్న్ తీసుకున్న పాకిస్థాన్
-
యూ టర్న్ తీసుకున్న పాకిస్థాన్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్ గూఢచారిగా పాకిస్థాన్ ఆరోపణలు చేసిన కుల్‌భూషణ్ జాదవ్ అప్పగింత విషయంలో ఆ దేశం యూ టర్న్ తీసుకుంది. తమ దేశంలో జాదవ్ విద్రోహ చర్యలకు పాల్పడ్డాడని, తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని, ఆయన్ను భారత్‌కు అప్పగించబోమని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారి సర్తాజ్ అజీజ్ చెప్పారు. జాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. గతేడాది మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్‌లో జాదవ్‌ను అరెస్ట్ చేశారు. జాదవ్ రా ఏజెంట్ అని, ఆయన 2013 నుంచి తమ దేశంలో విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడని పాక్ అధికారులు ఆరోపించారు. పాక్ ఆరోపణలను భారత్ అప్పట్లో ఖండించింది. గతేడాది డిసెంబర్లో అజీజ్ మాట్లాడుతూ.. జాదవ్ నేరం చేసినట్టు తగిన ఆధారాలు లేవని చెప్పారు. దీంతో ఆయన్ను భారత్‌కు అప్పగిస్తారని భావించారు. అజీజ్ తాజాగా మాటమారుస్తూ.. పాక్‌లో జాదవ్ విద్రోహ, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడని, ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. పాక్ ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చింది. పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, జాదవ్ దారితప్పి పాక్ భూభాగంలోకి వెళ్లాడని భారత్ అధికారులు చెప్పారు. -
'మీడియా జాగ్రత్తగా ఉంటే మంచిది'
ఇస్లామాబాద్: తమ దేశ మీడియాకు పాకిస్థాన్ గట్టి హెచ్చరికలు చేసింది. ఇరాన్‌తో కలిసి గూఢచర్యం నిర్వహిస్తున్నారనే కారణంతో భారత్ కు చెందిన ఓ ఇంటెలిజెన్స్ అధికారిని అరెస్టు చేశారని అక్కడి కొన్ని పాకిస్థాన్ మీడియా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల పట్ల ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది. దీంతో పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి తాము అరెస్టు చేసిన భారత అధికారికి ఇరాన్ కు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని వార్తలు ప్రచురించే సమయంలో కాస్తంత ముందూ వెనుక చూసుకొని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో తమకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, తమది సోదరుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అని, అది చెడిపోయేలా చూడొద్దని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.