Indisposition
-
భారత ఫుట్‌బాల్ దిగ్గజం చునీ గోస్వామి ఇక లేరు
కోల్‌కతా: భారత విఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు చునీ గోస్వామి కన్నుమూశారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 ఏళ్ల మాజీ సారథి కోల్‌కతాలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మేటి ఫుట్‌బాలరే కాదు... క్రికెటర్ కూడా! ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీల్లో ఆయన బెంగాల్ తరఫున ఆడారు. కాలేజీ రోజుల్లో ఆయన కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫుట్‌బాల్, క్రికెట్ జట్లకు ఆడటం విశేషం. 1962లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ను విజేతగా నిలిపిన ఈ కెప్టెన్ మరో రెండేళ్ల తర్వాత ఆసియా కప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చి రన్నరప్‌గా నిలిపాడు. కొంతకాలంగా ఆయన అధిక మధుమేహం, ప్రొస్టేట్, తీవ్రమైన నరాలకు సంబంధించిన వ్యాధులతో పోరాడుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబసభ్యులు నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే గుండెపోటు రావడంతో సాయంత్రం 5 గంటలకు చునీ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఫుట్‌బాల్ క్లబ్లో ఆడినంత కాలం మోహన్ బగన్కే ఆడిన ఈ స్టార్ 1957లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత అలనాటి మేటి ఆటగాళ్లలో ఒకరైన చునీ 27 ఏళ్ల వయసులోనే 1964లో ఆటకు గుడ్‌బై చెప్పారు. అయితే ఈ ఆటకు బై చెప్పినా... మరో ఆటలో బిజీ అయ్యారు. క్రికెట్లోనూ మెరిసిన గోస్వామి 1966లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సుబ్రోతో గుహతో కలిసి గ్యారీ సోబర్స్ ఉన్న వెస్టిండీస్ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కంబైన్డ్ సెంట్రల్ అండ్ ఈస్ట్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగిన గోస్వామి 8 వికెట్లు తీశాడు. 1971–72 సీజన్లో చునీ బెంగాల్ రంజీ జట్టుకు సారథ్యం వహించగా... జట్టు ఫైనల్లోకి చేరింది. తుదిపోరులో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో తృప్తిపడింది. -
గిరీష్ కర్నాడ్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు: ఐదు దశాబ్దాల పాటు నాటక, సినీ, సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ (81) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సరస్వతి, జర్నలిస్టు, రచయిత అయిన కొడుకు రఘు కర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. తన తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని రఘు తెలిపారు. ఆయన ఉదయం వేళలో మరణించారని, 8.30 సమయంలో ఆయన చనిపోయినట్టుగా తాము గుర్తించామని చెప్పారు. కాగా ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం గిరీష్ కర్నాడ్ భౌతికకాయాన్ని బయ్యప్పనహళ్లి రోడ్డులోని కల్లహళ్లిలో ఉండే విద్యుత్ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించినా.. కర్నాడ్ కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యుల విజ్ఞప్తితో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేకుండా నిరాడంబరంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా కర్నాడ్ మృతికి సంతాప సూచకంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మరో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. గిరీశ్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు, నటులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, హెచ్డీ కుమారస్వామి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్, ఆర్వీ దేశ్‌పాండే, బి.జయశ్రీ, సురేష్ హెబ్లీకార్ తదితర నాటక, సినీరంగ ప్రముఖులు తమ అంతిమ నివాళులర్పించారు. అంత్యక్రియలను తమ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించాలని భావిస్తున్నందున, అంతిమ నివాళుర్పించేందుకు నేరుగా స్మశానానికే రావాల్సిందిగా కర్నాడ్ కుటుంబం అంతకుముందు ఆయన అభిమానులకు, ప్రుముఖులకు విజ్ఞప్తి చేసింది. భారత సాహితీ రంగానికి మరింత వన్నె తెచ్చే విధంగా తన సొంత భాష కన్నడలో చేసిన గొప్ప రచనలకు గాను 1998లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం: రంగస్థలంలో గిరీశ్ కర్నాడ్‌ది ప్రత్యేక స్థానమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతితో భారత సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయిందన్నారు. ‘ఆయన మృతి విచారం కలిగించింది. అన్ని మాధ్యమాల్లో తన విలక్షణ నటన కారణంగా కర్నాడ్ కలకాలం గుర్తుండి పోతారు. ఆయన రచనలకు భవిష్యత్తులోనూ ప్రజాదరణ కొనసాగుతుంది..’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా తామొక సాంస్కృతిక రాయబారిని కోల్పోయామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. వైఎస్ జగన్ సంతాపం గిరీష్ కర్నాడ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కర్నాడ్ మరణం అటు సినీ రంగానికి, ఇటు సాహితీ రంగానికి తీరని లోటు అని జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్నాడ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేసీఆర్ సంతాపం కర్నాడ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ నాటక, సాహిత్య, సినీ రంగానికి ఆయన చేసిన సేవ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిందని కొనియాడారు. -
కష్టాలకే కన్నీళ్లొచ్చె!
ఆటపాటలతో తోటి యువకుల మధ్య సరదాగా గడపాల్సిన వారికి నాలుగు గోడలే ప్రపంచమయ్యాయి. అందరిలాగా ఉన్నత చదువులు చదవాల్సిన వారు మంచానికే పరిమితమయ్యారు. రెండు పదుల వయసు దాటినా అమ్మ చేతిముద్ద లేకపోతే ఆ రోజు కడుపు నిండని దుస్థితి. కనీసం సొంతంగా కాలకృత్యాలు కూడా తీర్చకోలేని దయనీయ పరిస్థితి. ఇలాంటి ఇద్దరి పిల్లలను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఆ తల్లికి భర్త మృతి కోలుకోలేని దెబ్బ. ఈక్రమంలో తల్లిదండ్రులకు వద్దకు చేరినా అక్కడా కష్టాలే ఆహ్వానం పలికాయి. ఆమె దయనీయ పరిస్థితికి కష్టాలకు కూడా కన్నీళ్లొస్తున్నాయి.. తుగ్గలి(కర్నూలు): విధి పగపట్టడం అంటే ఇదేనేమో.. పుట్టిన ఇద్దరు పిల్లలు మానసిక వికలాంగులు కావడం, పెళ్లయిన కొన్నేళ్లకే భర్త మృతి.. ఆ ఇల్లాలని కష్టాల్లోకి నెట్టాయి. దీనికి తోడు తల్లిదండ్రుల అనారోగ్యం, కడు పేదరికం ఆమెను దయనీయ స్థితికి చేర్చాయి. వివరాల్లోకెళితే.. మండలంలో గిరిగెట్ల గ్రామానికి చెందిన రసూల్‌బీ, రాజాసాహెబ్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కూతురు ఇమాంబీని 25 ఏళ్ల క్రితం డోన్‌కు చెందిన ఖలీల్‌తో వివాహం జరిపించారు. వీరికి ఖాదర్‌బాషా(23), చాంద్‌బాషా(21) ఉన్నారు. వీరికి పుట్టుకతో నరాల బలహీనత, మానసిక వికలత్వం ఉంది. ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉంటారు. ఆకలేస్తే అన్నం పెట్టమని ఆడగలేని దుస్థితి వీరి అవసరాలన్నీ తల్లి చూసుకోవాల్సిందే. వీరిని ఎలాగైనా బాగు చేసుకోవాలని కర్నూలు, తిరుపతి, పుట్టపర్తి, బళ్లారి, మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో పెళ్లయిన ఐదేళ్లకే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో తల్లిదండ్రుల వద్దకు చేరింది. చుట్టుమట్టిన కష్టాలు కష్టాలకు కుంగిపోకుండా పుట్టిన పిల్లలతో ఎలాగైనా బతకాలని ఆత్మస్థైర్యంతో ముందుకుసాగింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకున్నా కూలీనాలీ చేసుకుంటూ కుమారులను పోషించింది. తల్లి దగ్గర పిల్లలను ఉంచి తండ్రితో పాటు కూలీ పనులకు వెళ్లేది. అయితే 6 నెలల క్రితం తల్లి రసూల్‌బీ పక్షవాతానికి గురై లేవలేని స్థితికి చేరుకుంది. కష్టాలు చాలవన్నట్లు రెండు నెలల క్రితం తండ్రి రాజాసాహెబ్ కూడా కింద పడి కాలు విరిగింది. కష్టాల మీద కష్టాలు రావడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈక్రమంలో పనులు మానేసి ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలతో పాటు తల్లిదండ్రులను బాగోగులు చూసుకుంటోంది. దాతలూ స్పందించండి.. ఇమాంబీ, పిల్లలకు వచ్చే పింఛన్ సొమ్ము వారికి వైద్యానికే సరిపోవడం లేదు. రేషన్ బియ్యం, అక్కడక్కడ కొంత అప్పు చేస్తూ బతుకు బండిని నడిపిస్తోంది. దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. సాయం చేయాల్సి వారు ‘ఇమాంబీ షేక్– 91067294654–4(ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు– తుగ్గలి)లో నగదు జమ చేయాలని లేదా 8499067538 నంబరుకు ఫోన్ చేయాలని వేడుకుంటోంది. -
బీసీ హాస్టల్లో కలకలం
కలుషితాహారం తిని 27 మంది విద్యార్థినులకు అస్వస్థత గూడూరు పీహెచ్సీలో అత్యవసర వైద్యసేవలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ సస్పెన్షన్ కోలుకుంటున్న విద్యార్థినులు గూడూరు : గూడూరులోని బీసీ బాలికల వసతి గృహంలో కలుషితాహారం తిన్న కారణంగా 27 మంది విద్యార్థినులు అస్వస్ధతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఉదయం 9.30 కు హాస్టల్లో అల్పాహారం తీసుకున్న విద్యార్థినులు పాఠశాలలకు వెళ్లారు. 10.15 సమయంలో పలువురు విద్యార్థినులకు కడుపునొప్పిగా ఉందని, కాళ్లు, చేతులు లాగుతున్నాయని, వికారంగా ఉందని చెప్పడంతో పాఠశాల హెచ్ఎం లక్ష్మీనాంచారమ్మ, గ్రామసర్పంచి ఈశ్వరరావు (నాని) కలిసి గూడూరు పీహెచ్‌సీకి వారిని తరలించారు. హాస్టల్లో 87 మంది విద్యార్థినులు ఉండగా వీరిలో 27 మంది అస్వస్థతకు గురయ్యారు. వైద్యాధికారి పి శేషుకుమార్ నేతృత్వంలో గైనకాలజిస్టు జ్ఞానరత్నం, పీహెచ్ఎన్ వెంకటేశ్వరమ్మ, ఎంపీహెచ్‌వోలు రాజకుమార్, వైద్యసిబ్బంది సత్వర వైద్యసేవలు అందించటంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న తహశీల్దార్ బి.ఎల్.ఎన్. రాజకుమారి, ఎంపీడీవో పద్మ, ఎంఈవో వెన్నా వెంకటసుబ్బయ్య, ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలుషిత ఆహారం వల్లే అస్వస్థత కలుషిత ఆహారం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యాధికారి ప్రాథమిక నివేదికలో తేలింది. అందిన సమాచారం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఎగ్ బిర్యాని, సాయం త్రం తోటకూర పప్పు, సాంబారు, గుడ్డులను మెనూ కింద విద్యార్థినులకు వడ్డించారు. అర్థరాత్రి వేళ ఇద్దరు స్వల్ప అస్వస్థతకు గురికాగా ట్యాబ్లెట్లు వేయించారు. సోమవారం ఉదయం అల్పాహారం కింద ఉప్మా పెట్టగా అందరూ తిన్నారు. అయితే కొద్ది సేపటికే 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం గమనార్హం. కాగా విద్యార్థుల తల్లిదండ్రులు తెచ్చిన ఆహార పదార్థాలు తినడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వార్డెన్ నాగలక్ష్మి, వంటమనిషి వాదించారు. గుల్లమోదకు చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం తమ పిల్లలను చూసేందుకు వస్తూ కోడి, రొయ్యకూరలను తీసుకువచ్చారని, దాన్ని తినటం వల్లే అస్వస్థతకు గురయ్యారని వార్డెన్ వాదించడంపై తహశీల్దార్, ఎంపీడీవోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ సస్పెన్షన్ విద్యార్థుల పర్యవేక్షణలో నిర్లక్ష్య వైఖరి అవలంభించిన కారణంగా వార్డెన్ నాగలక్ష్మి, నైట్‌వాచ్‌మెన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ జేడీ మధుసూదనరావు తెలిపారు. ఫుడ్ శాంపిల్స్‌ను కూడా సేకరించాలని ఆదేశించామన్నారు. కోలుకున్న విద్యార్థినులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యాధికారులు సేవలందించటంతో బాధిత విద్యార్థినులు కోలుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారిలో పి.లీలావతి, పి. రమ్య, ప్రత్యూష, కావ్య, నాగమణి, రేవతి, యామిని, రామానుజమ్మ, ఆశ, నందిని, శ్రీలక్ష్మి, ప్రతిష్ట, ముక్తేశ్వరి, రూపావతి, ఆదిలక్ష్మితో పాటు మరో 12 మంది ఉన్నారు. సమగ్ర విచారణకు ఆదేశం మంత్రులు దేవినేని, కొల్లు గూడూరు : బీసీ బాలికల హాస్టల్లో 27 మంది విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై సమగ్ర విచారణ చేయించి దోషులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం గూడూరు పీహెచ్సీలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రులు వేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్యం అందుతున్న విధానంపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మంత్రి కొల్లు మాట్లాడుతూ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. వార్డెన్ నాగలక్ష్మిని పిలిచి విధుల పట్ల అలసత్వంపై మందలించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొనకళ్ల జగన్నాధం (బుల్లయ్య), సర్పంచి పెదపూడి ఈశ్వరరావు, మండల ప్రత్యేకాధికారి శరత్‌బాబు, వైద్యాధికారి ప్రసాదరావు, శేషుకుమార్లు పాల్గొన్నారు. -
ఉత్తరం: నష్టం గొడవ వల్ల కాదు...
నవ వధువు... ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానాలు పురాణాలు వేరుగా చెబుతాయి. సమాజం ఒకలా చెబుతుంది. ఆధునికులు ఇంకోలా చెబుతారు. బయటి వారు ఎన్నైనా చెబుతారు. పాటించేవారే వాటిని క్రోడీకరించుకోవాలి. ఎందుకంటే పాత్ర కొత్త.. మనిషి పాత. ప్రతిఒక్కరికి కొన్ని లక్షణాలు కామన్‌గా ఉంటాయి. అందుకే మన సహజ లక్షణాలు ఎలా ఉన్నా కొత్త చోట, కొత్త వ్యక్తులతో ఉన్నపుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇంకొన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా నవ వధువు పాత్ర జీవితంలో అతి క్లిష్టమైన ప్రశ్నలను రేకెత్తించే పాత్ర. ‘ఇష్టానుసారం’ అన్నది ఏ రూపంలో అయినా కనిపిస్తుంది గానీ క్రమశిక్షణ ఒకే రూపంలో ఉంటుంది అన్న స్పష్టత ఉంటే పరిస్థితులు నెగ్గుకు రావడం చాలా సులువు. క్రమశిక్షణ అంటే అణగిమణిగి ఉండటం కాదు. పద్ధతిగా ఉండటం. జీవితాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుకునే ఓ మార్గం. ప్రతి భర్త తన భార్యకు హీరోలానే కనిపించాలనుకుంటాడు. ఆమె నుంచి తన సమర్థతకు సంబంధించిన ప్రతికూల వ్యాఖ్యలను భరించలేడు. ఆ విషయం ఇద్దరిలో ఇగోలను, ఫ్రస్ట్రేషన్‌ను పెంచుతుంది. కాబట్టి అలాంటి కామెంట్లకు దూరంగా ఉండడం మంచిది. ఒకరి బంధువులపై మరొకరి కామెంట్లు చాలా ఈజీ గోయింగ్ ఉన్న వారికి తప్ప అస్సలు పనికిరావు. ఇలాంటి జంటలు చాలా తక్కువ. పైగా ఇటీవలి కాలంలో వీటిని సరదాగా తీసుకోవడం తగ్గిపోయింది. ఇవి మొత్తం జీవితాన్నే డిజప్పాయింట్ చేస్తాయి. సాధారణంగా గొడవలన్నీ పరిష్కరించుకోగలిగినవే ఉంటాయి... కానీ వాటిలోకి కోపంతో ఇతర విషయాల ప్రస్తావన తేవడం వల్ల గొడవ పడిన కారణం చిన్నదయినా గొడవ పెద్దది అవుతుంది. అసలు... కాపురాన్ని చెడగొడితే... కొసరు... కాపురాన్ని కూలుస్తుంది. కాపురంలో గొడవలు చాలా సాధారణం... కానీ అవి దారితప్పడం వల్లే విషమిస్తాయి. జీవితాలను శాసించే స్థాయికి తీసుకెళ్తాయి. గొడవపడండి కానీ... వాటిని ఆ గొడవకే పరిమితం చేయండి. ఎంత ఫ్రస్ట్రేషన్లోనూ అనవసర విషయాలను గొడవల్లోకి తేకండి. మీ భాగస్వామి అలా తెస్తే స్పష్టంగా హెచ్చరించండి. వీలైతే మౌనంగా ఉండండి. కొన్ని సార్లు మౌనం కూడా శాంతిని ఇస్తుంది. రోగం కాదు... కానీ ఇబ్బంది! పౌష్టికాహారం అసలైన రోగ నివారణి. ఇది 99 శాతం మాత్రమే నిజం. స్వచ్ఛమైన పాలు కూడా కాలవ్యవధి మించిన తర్వాత విషపూరితమే. పౌష్టికాహారం అన్నది ఎంత అత్యవసరమో దాన్ని సమయానికి తీసుకోవడం అంతే అవసరం. ఎందుకంటే మిగతా ఏ అనారోగ్యమూ కలిగించని అసౌకర్యాన్ని కలిగించేది గ్యాస్ట్రబుల్. దీనికి అతిపెద్ద కారణం...సమయానికి ఆహారం తీసుకోకపోవడం. ఇది ఎవరికీ మంచిది కాదు, స్త్రీలకు అసలు మంచిది కాదు. సమయానికి తినకపోతే మన శరీరం విడుదల చేసే కొన్ని జీర్ణవాయువులు కడుపులో ఆహారం వున్నా లేకున్నా తమ పని అవిచేసుకుంటూ పోతాయి. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే గ్యాస్‌ట్రబుల్‌గా పరిణమిస్తుంది. ఇప్పటికే మీకు ఈ సమస్య వచ్చి అది ప్రాథమిక దశలో ఉంటే...ఇప్పటినుంచి అయినా సమయానికి భోజనం చేయడం ద్వారా అదుపులో ఉంచవచ్చు. ఉదయం లేస్తూనే రెండు గ్లాసుల నీళ్లు తాగండి. రోజులో ఏదో సమయంలో జామ పళ్లు, బొప్పాయి, మజ్జిగ తీసుకోండి. దీంతో కొంతకాలానికి మీ సమస్య బాగా తగ్గుతుంది.