industrialization
-
IPE Global: డేంజర్ మార్కు దాటేస్తున్న... భుగభుగలు
ఈ వేసవిలో ఉత్తర భారతమంతా కనీవిని ఎండలతో తల్లడిల్లిపోయింది. ఢిల్లీలో ఏకంగా 40 రోజుల పాటు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదై జనాలను బెంబేలెత్తించాయి. అలస్కాలో హిమానీ నదాలు ఇటీవలి కాలంలో వేసిన అంచనాలను కూడా మించి శరవేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి. భూగోళానికి ఊపిరితిత్తులుగా చెప్పే అమెజాన్ సతత హరిత అరణ్యాలే క్రమంగా ఎండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా కార్చిచ్చుల బారిన పడుతున్నాయి.సౌదీ అరేబియాలో ఏకంగా 50 డిగ్రీలు దాటేసిన ఎండలకు తాళలేక 1,300 మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతాలన్నీ సూచిస్తున్నది ఒక్కటే. భూగోళం శరవేగంగా విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందనంత దారుణ ప్రభావం చూపుతోంది. భూతాపం ఈ శతాబ్దంలోనే ఏకంగా 2.5 డిగ్రీలకు పైగా పెరిగి మొత్తం మానవాళినే వినాశనం వైపు నెట్టడం ఖాయమని వందలాది మంది ప్రపంచ ప్రఖ్యాత వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు! పారిశ్రామికీకరణ ముందు స్థాయితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగింది. అది 1.5 డిగ్రీలను దాటితే ఊహించని ఉత్పాతాలు తప్పవని సైంటిస్టులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అలాంటిది, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ శతాబ్దాంతానికే భూతాపంలో పెరుగుదల 2.5 డిగ్రీల డేంజర్ మార్కును దాటేయడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వే తేలి్చంది. ఎండాకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనీవినీ ఎరగని విపరిణామాలు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ అంచనాకు వచి్చంది. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ప్రతి నెలా రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ ఏడాది సంభవించిన ఎల్‌నినో ఇప్పటిదాకా నమోదైన ఐదు అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచింది. శిలాజ ఇంధనాల వాడకం తదితరాల వల్ల జరుగుతున్న భారీ కాలుష్యం వంటివి వీటికి తోడవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌లో మూడొంతులు కేవలం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారం వల్లనే జరుగుతోంది. వాతావరణంలో సీఓటూ స్థాయి పెరుగుతున్న కొద్దీ వేడి గాలులు, హరికేన్లు, కార్చిచ్చులు, వరదలు వచి్చపడుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో చైనా, అమెరికా, భారత్ టాప్ 3లో ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధానంగా సంపన్న దేశాలే కారణమని ఐపీఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ హెడ్ అబినాశ్ మహంతీ చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో గత రెండు శతాబ్దాలుగా జరిగిన మితిమీరిన పారిశ్రామికీరణ పర్యావరణానికి చెప్పలేనంత చేటు చేసిందని వివరించారు. ‘‘ఇప్పుడు కూడా సంప్రదాయేతర ఇంధనాల వాడక తదితరాల ద్వారా గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేస్తామన్న పెద్ద దేశాల ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా భరించలేని ఎండలు, ఆ వెంటే వరదలు, హరికేన్ల వంటి ఉత్పాతాలు కొన్నేళ్లుగా సాధారణ పరిణామంగా మారిపోతున్నాయి. ఇవన్నీ ప్రమాద సూచికలే’’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిన పాతాళానికి భూగర్భ జలాలు20 ఏళ్లలో 450 క్యుబిక్ కి.మీ. మేరకు మాయంఉత్తర భారతదేశంలో భూగర్భ జల వనరులు శరవేగంగా అడుగంటుతున్నాయి! ఎంతగా అంటే, 2002 నుంచి 2021 మధ్య కేవలం 20 ఏళ్లలోనే కంగా 450 క్యుబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు లుప్తమైపోయినట్టు ఐఐటీ గాం«దీనగర్ తాజా సర్వే తేల్చింది. దేశంలోకెల్లా అతి పెద్ద జలాశయమైన ఇందిరా సాగర్ మొత్తం నీటి పరిమాణానికి ఇది ఏకంగా 37 రెట్లు ఎక్కువని సర్వేకు సారథ్యం వహించిన ఐఐటీ గాం«దీనగర్ సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగంలో విక్రం సారాబాయి చైర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా వివరించారు! అందుబాటులో ఉన్న సంబంధిత గణాంకాలతో పాటు శాటిలైట్ డేటా తదితరాలను విశ్లేíÙంచి ఈ మేరకు తేలి్చనట్టు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ధోరణి మరింతగా ఊపందుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఉత్తరాదిన గత 75 ఏళ్లలో వర్షపాతం ఇప్పటికే 8.5 శాతం తగ్గిపోయింది. వాతావరణం 0.5 డిగ్రీల మేరకు వేడెక్కింది. దాంతో సాగునీటికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయి విచ్చలవిడిగా బోర్లు పుట్టుకొచ్చాయి. దాంతో కనీసం భూగర్భ జల వనరులు 12 శాతం తగ్గిపోయాయి’’ అని మిశ్రా వెల్లడించారు. ఒక్క 2009లోనే వర్షాకాలంలో అల్ప వర్షపాతం, చలికాలంలో హెచ్చు ఉష్ణోగ్రతల దెబ్బకు ఉత్తరాదిన భూగర్భ జలాలు 10 శాతం మేర తగ్గిపోయాయని అంచనా! ‘‘గ్లోబల్ వారి్మంగ్ మరింత పెరిగే సూచనలే ఉన్నందున భూగర్భ జలాలు ఇంకా వేగంగా ఎండిపోయేలా ఉన్నాయి. ఎలా చూసినా ఇవన్నీ ప్రమాద సంకేతాలే. ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు గనుక 1 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగితే భూగర్భ జలాలు మరో 10 శాతం దాకా తగ్గిపోతాయి’’ అంటూ సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ ఎన్జీఆర్ఐ పరిశోధకులు కూడా ఆందోళన వెలిబుచ్చారు. సర్వే ఫలితాలను జర్నల్ ఎర్త్ తదుపరి సంచికలో ప్రచురించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పీకల మీదకొచ్చింది!
ముప్పు ముంచుకొచ్చినప్పుడు కాని మేలుకోకపోతే కష్టమే. పరిస్థితి చూస్తే అలానే ఉంది. పర్యావరణ మార్పులపై సంబంధిత పక్షాల సదస్సు తాజా సమావేశం (కాప్–28) ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ 12 దాకా దుబాయ్‌లో జరగనుంది. ఏటేటా ఐరాస ఆధ్వర్యంలో ఇది మొక్కుబడి తంతుగా మారిపోతున్న వేళ కొద్దిరోజులుగా వివిధ నివేదికలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితి విషమించిందని వెల్లడిస్తున్నాయి. రోజువారీ సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు తొలి సారిగా ఈ నవంబర్ 17న పారిశ్రామికీకరణ మునుపటి హద్దు దాటి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగా యన్న వార్త ఆందోళన రేపుతోంది. పుడమిపై కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు తాము పెట్టుకున్న లక్ష్యాల గురి తప్పుతూనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఎప్పటికప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రతిన చేస్తున్నా, నష్టనివారణకు నిధుల కొరత పీడిస్తూనే ఉంది. ఆహార అభద్రత మొదలు వ్యాధుల దాకా అనేక రకాలుగా వాతావరణ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి. ఆ నేపథ్యంలో వాతావరణ మార్పులపై తాజా నివేదికలు అలజడి సృష్టిస్తున్నాయి. పుడమి మీది ఒక శాతం అత్యంత ధనికులే మొత్తం ప్రపంచ జనాభాలోని 66 శాతం మంది కలగజేసేటంత భూతాపానికి కారణమని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక తేల్చింది. ఇక, ‘కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ అంటూ గత వారం లాన్సెట్ వెలువరించిన 8వ వార్షిక నివేదిక ప్రజారోగ్యం, ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై పడే ప్రభావాన్ని కళ్ళకు కట్టింది. పర్యావరణ మార్పుకు ప్రధాన కారణాలైన శిలాజ ఇంధనాల వినియోగం లాంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే, ప్రజల ఆరోగ్యానికే పెను ప్రమాదమని లాన్సెట్ నివేదిక హెచ్చరిస్తోంది. భారత్‌కు సంబంధించి ఈ నివేదిక చెప్పిన అంశాలు, చేస్తున్న హెచ్చరికలు ఆలోచన రేపుతున్నాయి. మన దేశంలో 1986 – 2005 మధ్య కాలంతో పోలిస్తే, 2018 – 2022 మధ్య కాలంలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగాయట. ఇప్పటికే ఈ అధిక ఉష్ణోగ్రత పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు మలేరియా, డెంగ్యూ కేసుల్ని పెంచుతున్నాయి. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్, సెప్సిస్, కలరాలకు సానుకూలంగా తయారవుతున్నాయి. అలాగే, ‘బ్రోకెన్ రికార్డ్’ శీర్షికన ఐరాసా వెల్లడించిన తాజా నివేదిక సైతం పరిమితులు దాటి గ్రీన్హౌస్ వాయువుల విడుదల పెరిగిన కథను వివరించింది. వెరసి, ఉష్ణోగ్రతలు పారిశ్రామికీరణకు ముందు స్థాయి కన్నా 2 డిగ్రీలు, వీలుంటే 1.5 డిగ్రీలు మించి పెరగరాదని 2015 నాటి ప్యారిస్ ఒప్పందం (పీఏ)లో చేసుకున్న బాసలు చెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. నికరంగా కర్బన ఉద్గారాలు లేని ‘నెట్ జీరో’కు కట్టుబడతామని అనేక దేశాలు మాట ఇస్తున్నా, అది ‘విశ్వసనీయంగా’ లేదని తాజా నివేదిక తేల్చేసింది. భూతాపం పెంపును 1.5 డిగ్రీల లోపలకు నియంత్రించే అవకాశాలు నూటికి పద్నాలుగు వంతులేనట! 2021తో పోలిస్తే 1.2 శాతం ఎక్కువగా 2022లో ప్రపంచమంతా కలసి 57.4 బిలియన్ల కర్బన ఉద్గారాలను వెలువరించిందని లెక్క. అలాగే, కరోనాలో 4.7 శాతం తగ్గిన ఉద్గారాలు ఈ ఏడాది మళ్ళీ కరోనా ముందు స్థాయికి చేరిపోవచ్చని అంచనా. నిజానికి, పర్యావరణ మార్పు, ధనిక – బీద అసమానతలు విడదీయరాని జంట. ప్రధానంగా ధనిక దేశాల పాపానికి పేద దేశాలు బలి అవుతున్నాయి. పర్యావరణ మార్పు ప్రభావాన్ని మోస్తున్నాయి. ధనిక దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలనీ, చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలనీ కాప్28 లాంటి చోట్ల పేద దేశాలు ఒత్తిడి తెస్తున్నది అందుకే. కానీ, అతి తక్కువ సంఖ్యలోని ఆ ధనిక దేశాలే ప్రపంచ పర్యావరణ విధానాన్ని నిర్ణయిస్తుండడంతో పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. ఈజిప్ట్‌లో నిరుడు కాప్27 సదస్సులో ‘నష్ట పరిహార నిధి’ని ఏర్పాటు చేయాలంటూ ఒప్పందం కుదిరింది. స్వీయ కర్బన ఉద్గారాలు తక్కువే అయినా ధనిక దేశాల ఉద్గారాలతో నష్టపోతున్న బీద దేశాలను పర్యావరణ మార్పు ప్రభావాల నుంచి కాపాడేందుకు ఈ నిధిని ఉద్దేశించారు. ఆలోచన మంచిదైనా, ఆచరణకు వచ్చే సరికి ఆ నిధి ద్వారా డబ్బులు ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారనేది ఇప్పటికీ తేలనే లేదు. ఇంకా చిత్రమేమిటంటే– పర్యావరణానికి తూట్లు పొడిచే భారీ చమురు ప్రణాళికలు వేస్తున్న దుబాయ్‌లో కాప్28 సమావేశం జరగనుండడం! అలాగే, వాతావరణ సంక్షోభం, ప్రకృతి సంక్షోభం... ఈ రెంటినీ భిన్నమైన సవాళ్ళుగా భావిస్తూ, స్పందిస్తున్నాం. వాటి వల్ల సమాజంలో తలెత్తే సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రపంచమంతా చేస్తున్న ప్రమాదకరమైన తప్పు అదే! తీవ్ర వాతావరణ ఘటనలతో వర్ధమాన దేశాల్లో బాలికలకు నాణ్యమైన విద్య దెబ్బ తింటోందని ప్లాన్ ఇంటర్నేషనల్ నివేదిక మాట. పర్యావరణ బాధిత 30 దేశాల్లో ఏటా కనీసం 1.25 కోట్ల మంది బాలికలు అర్ధంతరంగా చదువుకు గుడ్‌బై చెప్పడానికి వాతావరణ మార్పులు కారణమవుతాయని ‘మలాలా ఫండ్’ సైతం హెచ్చరిస్తోంది. ఇలాంటి గణాంకాలెన్నో వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం. అందుకే, పర్యావరణ మార్పు గురించి మాటల కన్నా చేతలు ముఖ్యం. రానున్న దుబాయ్ సదస్సు లోనూ ప్యారిస్ ఒప్పందం తాలుకు అమలు తీరుతెన్నులపై ప్రపంచం మళ్ళీ చర్చిస్తుంది. ఈసారైనా మాటలు తగ్గించి, చేతలపై దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే, పర్యావరణంపై ప్రపంచం ఇప్పటికే గాడి తప్పింది. దుష్ఫలితాలూ చూస్తోంది. తాజా హెచ్చరికలు పెడచెవిన పెడితే మరిన్ని కష్టాలు తప్పవు. ప్రపంచానికి పరిష్కారం ఎడారి దేశంలోనూ ఎండమావిగా మారితేనే మానవాళికి నష్టం. -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్‌తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్‌లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్‌లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్‌గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్‌లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్‌లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్‌లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’
రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అపారమైన సహజ వనరులు, మానవ వనరులకు తోడు అన్ని విధాలుగా సహకరించే రాష్ట్ర ప్రభుత్వం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి కదలివస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, జిందాల్, భంగర్, భజాంకా, ఒబెరాయ్, దాల్మియా, సింఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి స్వయంగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం కూడా పారిశ్రామికవేత్తలను ఏపీవైపు వచ్చేలా చేస్తోంది. – సాక్షి, అమరావతి ఐటీలోనూ మేటి.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్ఎస్ డేటా సెంటర్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, టెక్ మహీంద్రా, డబ్ల్యూఎన్ఎస్, టెక్నోటాస్‌్క, టెక్‌బుల్ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టులు, హార్బర్లు.. పారిశ్రామిక పార్కులు రూ.18,000 కోట్లతో ప్రభుత్వం కొత్తగా నాలుగు పోర్టులు(రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద) నిరి్మస్తోంది. వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా రూ.3,700 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్ ల్యాండ్లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్ల(విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు)లో రూ.11,753 కోట్లతో నక్కపల్లి, రాంబల్లి, కృష్ణపట్నం, కొప్పర్తి, చిత్తూరు సౌత్, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలోనూ కొప్పర్తిలో వైఎస్సార్‌ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, అనంతపురంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. లక్షలాది మందికి ఉపాధి.. సీఎం జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలయ్యింది. ఇందులో సీఎం జగన్ చేతుల మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్యపరమైన ఉత్పత్తిని కూడా సీఎం జగన్ 2019 డిసెంబర్ 5న ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడంతో 13,63,706 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా మరో 86 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా వాస్తవ రూపంలోకి వస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభిస్తుంది. -
ఆది నుంచీ వివాదమే.. బైలడిల్లా.. కుట్రల ఖిల్లా!
ఆదివాసీ జనాభా మెజార్టీ గా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని గనులు ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగానే నిలుస్తున్నాయి.పారిశ్రామికీకరణ మొదలయ్యాక బ్రిటిషర్ల హయాం నుంచి నేటి వరకు అక్కడి ఖనిజ సంపదపై పట్టు కోసం పట్టువిడవకుండా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే నిన్నమొన్నటి వరకు పచ్చని అడవిని తుపాకీ మోతలు ఎరుపెక్కించేవి. తాజాగా ఇక్కడ మైనింగ్ చేసుకునేఅవకాశాన్ని అదానీ కంపెనీకి కేంద్రం కట్టబెట్టడంతో బైలడిల్లా గనులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బైలడిల్లా గనుల గత చరిత్రపై ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో బైలడిల్లా ప్రాంతం ఉంది. దట్టమైన అడవిలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 35 కిలోమీటర్ల పొడవు, 9 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించిన కొండల ప్రాంతాన్ని బైలడిల్లాగా పిలుస్తున్నారు. ఇక్కడున్న ధాతువులో అత్యధికంగా 60 నుంచి 68 శాతం వరకు ఇనుము లభిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఈ గుట్టల్లోనే విలువైన టిన్, నియోలియం, టాంటాలమ్ వంటి ఖనిజాలూ ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చాక జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇక్కడ ఇనుప ఖనిజం వెలికి తీస్తున్నారు. బస్తర్ రాజ్యాన్ని కలుపుకోవాలనుకున్న బ్రిటిషర్లు వరంగల్ కేంద్రంగా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయులు తర్వాత పరిస్థితులు అనుకూలించక బస్తర్ ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా మొదటగా అన్నమదేవ్ బస్తర్‌లో సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బ్రిటిషర్లు భారతదేశం మీద పట్టు సాధించే సమయానికి అన్నమదేవ్ వారసుల్లో 19వ రాజైన రుద్రప్రతాప్దేవ్ దాని పాలకుడిగా ఉన్నాడు. ఆయనకు మగ సంతానం కలగలేదు. 1921 నవంబర్‌లో రుద్రప్రతాప్ మరణించే సమయానికి ఆయన కుమార్తె ప్రపుల్లకుమారి దేవికి 11 ఏళ్లు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో బ్రిటిషర్లు బస్తర్ రాజ్యాన్ని తమలో కలిపేసుకోవాలని చూసినా భౌగోళిక అననుకూలత కారణంగా వెనుకడుగు వేశారు. మరోవైపు ఒడిశా ప్రాంతానికి చెందిన భంజ్ రాజవంశానికి చెందిన ప్రపుల్ల చంద్ర భంజ్‌దేవ్‌తో ప్రపుల్లకుమారి వివాహం జరిగింది. ఇల్లరికం వచ్చిన ప్రపుల్ల చంద్ర రాజయ్యాడు. అనారోగ్య కారణాలతో రాజును తప్పించి.. వారసత్వ సంక్షోభ సమయంలో బస్తర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బ్రిటిషర్లకు ఇక్కడి బైలడిల్లా గనుల గురించి తెలిసింది. ప్రపంచ యుద్ధాల కారణంగా ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు బైలడిల్లా గనులపై బ్రిటిష్ ప్రభుత్వం కన్నేసింది. తమ చేతికి మట్టి అంటకుండా తక్కువ ఖర్చుతో పని సాధించేందుకు సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఆరో నిజాం ద్వారా బస్తర్ రాజ్యంతో సంప్రదింపులు ప్రారంభించింది. బైలడిల్లా గనులు విషయంలో నిజాం రాజుతో ఒప్పందం చేసుకోవాలంటూ ప్రపుల్ల చంద్ర భంజ్‌దేవ్‌పై ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత అనారోగ్య కారణాలు చూపుతూ ప్రపుల్ల చంద్రను బ్రిటిష్ ప్రభుత్వం కోల్‌కతాకు పంపించడంతో బస్తర్ పాలనా పగ్గాలు ప్రపుల్లకుమారి చేతిలోకి వచ్చాయి. తదనంతర కాలంలో ప్రఫుల్ చంద్ర కన్నుమూశారు. అంతు చిక్కని రాణి మరణం బైలడిల్లా గనుల విషయంలో బస్తర్ పాలకులను మచ్చిక చేసుకునేందుకు 1933లో ప్రపుల్లకుమారి దేవికి రాణి బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసింది. అయినా బైలడిల్లా గనులను నిజాంకు ఇచ్చేందుకు ఆమె సుముఖత చూపలేదు. దీంతో రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 1936లో ప్రపుల్లకుమారి అనారోగ్య కారణాలతో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడ అపెండిసైటిస్ ఆపరేషన్ వికటించడంతో ఆమె మరణించారు. అయితే ఈమె మరణం వెనుక బ్రిటిషర్ల కుట్ర ఉందనేది బస్తర్ అంతఃపుర వాసుల నమ్మకం ప్రభుత్వ దళాల దాడిలో ప్రపుల్లకుమారి మరణానంతరం ఆమె కొడుకు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ బస్తర్‌కు రాజయ్యాడు. తర్వాత కొద్ది కాలానికే బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లారు. ఆ సమయంలో దేశంలో 9వ అతిపెద్ద ప్రిన్సిలీ స్టేట్‌గా బస్తర్ ఉండేది. స్వాతం్రత్యానంతరం పారిశ్రామికీకరణలో వేగం పెంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోగా.. బిలాస్పూర్, భిలాయ్‌ల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో కొన్నింటికి యూరప్ దేశాలతో పాటు జపాన్ సైతం ఆర్థిక సాయం అందించింది. ఆ నెపంతో బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే వ్యూహాన్ని చాపకింద నీరులా పరాయి దేశాలు అమలు చేశాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం – కిరండోల్ రైలు మార్గానికి జపాన్ భారీగా నిధులు సమకూర్చింది. అయితే బైలడిల్లా గనుల నుంచి ఖనిజాన్ని వెలికితీసే ప్రయత్నంతో అప్పటి భారత ప్రభుత్వానికి బస్తర్ రాజు ప్రవీర్‌చంద్ర భంజ్దేవ్కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు అక్కడ నిత్యకృత్యంగా మారాయి. చివరకు 1966లో జరిగిన ఓ ఘర్షణలో ప్యాలెస్‌లోకి భద్రతా దళాలు చొరబడ్డాయి. వారు జరిపిన కాల్పుల్లో ప్రవీర్భంజ్దేవ్, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ తర్వాత బస్తర్ ప్రధాన పట్టణమైన జగదల్పూర్లో ఎన్ఎండీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి బైలడిల్లాలోని ఖనిజాన్ని తవ్వి తీయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇప్పటివరకు అదే కొనసాగుతూ వస్తోంది. గ్రీన్‌హంట్..సల్వా జుడుం 90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలు సత్ఫలితాలు ఇవ్వడం మొదలైన తర్వాత మరోసారి బైలడిల్లా గనులు తెరపైకి వచ్చాయి. అప్పటికి ఈ ప్రాంతం మావోయిస్టుల పట్టులోకి వెళ్లింది. దండకారణ్యం లేదా అబూజ్‌మడ్‌గా పిలిచే ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఈ శతాబ్దం మొదట్లో ప్రారంభమైంది. అడవిని భద్రతా దళాలు జల్లెడ పడుతుండగానే మధ్యలో సల్వా జుడుం ప్రారంభమయ్యింది. మొత్తం మీద రెండు దశాబ్దాల పాటు దండకారణ్యంలో రక్తం ఏరులై ప్రారింది. ప్రజలు, భద్రతా దళాలు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు సగటున ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున బస్తర్‌లో భద్రతా దళాల క్యాంపులు వెలిశాయి. తాజాగా ఇక్కడ అదానీ కంపెనీ మైనింగ్ చేపట్టేందుకు కేంద్రం అవకాశం ఇవ్వడంతో బైలడిల్లాకు సంబంధించి మరో అధ్యాయంమొదలవుతున్నట్టయ్యింది. -
భారత్‌లో ఇంధనానికి భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో భారత్‌లో ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఏఈఏ) అంచనావేసింది. ‘‘భారత్ 2025 నాటికి అత్యధిక జనాభా దేశంగా ఉంటుంది. పట్టణీకరణకుతోడు, పారిశ్రామికీకరణ వల్ల ఏటా ఇంధన డిమాండ్ 3 శాతం చొప్పున పెరుగుతుంది’’అని తెలిపింది. పప్రంచ ఇంధన వినియోగంపై అంచనాలతో ఓ నివేదికను గురువారం విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, సమర్థవంతమైన విధానాల వల్ల 2030 నాటికి పెరగనున్న విద్యుత్ డిమాండ్‌లో 60 శాతాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాలే తీరుస్తాయని వివరించింది. అదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ మొత్తం ఇంధన డిమాండ్‌లో మూడింట ఒకటో వంతు ఉంటుందని అంచనా వేసింది. ఒకటో వంతు అవసరాలు చమురు ద్వారా తీరతాయని పేర్కొంది. శిలాజ ఇంధనాల దిగుమతుల బిల్లు వచ్చే రెండు దశాబ్దాల కాలంలో రెట్టింపు అవుతుందని అంచనా వ్యక్తీకరించింది. ఇది ఇంధన భద్రతకు రిస్క్‌గా అభివర్ణించింది. ప్రపంచం మొదటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మధ్యస్థ దశలో ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి దీనికి ప్రేరణనిచ్చిందని తెలిపింది. ‘‘రష్యా ప్రపంచంలో శిలాజ ఇంధనాల ఎగుమతుల్లో పెద్ద దేశంగా ఉంది. అయితే, యూరప్‌కు సహజ వాయువు సరఫరాను రష్యా తగ్గించేయడం, అదే సమయంలో రష్యా చమురు, బొగ్గు ఎగుమతులపై యూరప్ ఆంక్షలు విధించడం ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ప్రధాన అవరోధాలు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇంధనాల వారీగా డిమాండ్.. ► భారత్‌లో 2030 నాటికి బొగ్గు డిమాండ్ గరిష్ట స్థాయిలో రోజువారీగా 770 మిలియన్ టన్ను లకు చేరుతుంది. 2021 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యం 240 గిగావాట్లుగా ఉంటే, 2030 నాటికి 275 గిగావాట్లకు పెరుగుతుంది. ► చమురుకి డిమాండ్ 2021కి రోజువారీగా 4.7 మిలియన్ బ్యారెళ్లు ఉంటే, 2030 నాటికి 6.7 మిలియన్ బ్యారెళ్లకు పెరుగుతుంది. 2040 నాటికి 7.4 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుంది. ► 2030 నాటికి అదనంగా పెరిగే విద్యుత్ అవసరాల్లో 60 శాతాన్ని పునరుత్పాదక వనరులు తీరుస్తాయి. అప్పటికి మొత్తం విద్యుత్ అవసరాల్లో పునరుత్పాదక ఇంధనాల వాటా 35 శాతం మేర ఉంటుంది. ఇందులో సోలార్ పీవీ ప్లాంట్ల ద్వారానే 15 శాతం అవసరాలు తీరతాయి. ► సహజ వాయువు డిమాండ్ 2030 నాటికి 115 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుతుంది. 2021 నాటికి ఇది 66 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. మొత్తం మీద పెరిగే ఇంధన అవసరాల్లో గ్యాస్ వాటా 5 శాతంగానే ఉంటుంది. ► తక్కువ ఉద్గారాలు విడుదల చేసే ప్రత్యామ్నా య ఇంధన వనరుల్లో వేగవంతమైన పురోగతి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు.. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. -
తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, హేచరీలు, బల్క్ డ్రగ్ పార్క్...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. పారిశ్రామిక కారిడార్‌కు ఊతం తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్ఈజెడ్ భూ సేకరణను సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడమనే ప్రక్రియ దేశంలోనే తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాకినాడ తీరంలో ఒక వెలుగు ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చురుగ్గా మేజర్ హార్బర్ పనులు కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ మినీ హార్బర్ స్థానే మేజర్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ప్లాంట్లు కూడా సిద్ధవమతున్నాయి. తీరం వెంబడి... ► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి జీవనోపాధి లభిస్తోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది. ► కాకినాడ ఎస్ఈజడ్లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ) ► పెద్దాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది. ళీ తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్ఫ్యాక్టరీలు, థర్మాకోల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. నమ్మకంతో వస్తున్నారు తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్కుకు భూమిని కేటాయిస్తారు. – దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్ హార్భర్ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్ హార్భర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. –పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం -
మేమొస్తే బెంగాల్లో పారిశ్రామికీకరణ
సింగూరు/హౌరా/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సింగూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. భూసేకరణకు వ్యతిరేకంగా గతంలో తీవ్రస్థాయిలో పోరాటం జరిగిన ఇదే ప్రాంతంలో అమిత్ షా పారిశ్రామికీకరణ హామీ ఇవ్వడం విశేషం. తాము అధికారంలోకి రాగానే సింగూరులో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, బంగాళదుంప రైతులను ఆదుకోవడానికి రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని నెలకొల్పుతామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించామని గుర్తుచేశారు. రోడ్ షో సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. తాము ద్వేష రాజకీయాలు కాదు, అభివృద్ధి రాజకీయాలు చేస్తామన్నారు. దీదీ చాలా ఆలస్యం చేశారు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభల్లో హిందూ దేవుళ్లను పూజించడం, చండీ స్తోత్రాలు పారాయణం చేయడాన్ని అమిత్ షా స్వగతించారు. అయితే, ఆమె ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను బీజేపీ 200కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని పునరుద్ఘాటించారు. సింగూరులో బీజేపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ భట్టాచార్య(89) పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. మొదటి 3 దశల్లో 63–68 సీట్లు గెలుస్తాం బెంగాల్లో ఇప్పటివరకు మూడు దశల శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. 91 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వీటిలో 63 నుంచి 68 స్థానాలను తాము దక్కించుకోవడం తథ్యమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలపై భారీ ఆధిక్యత సాధిస్తామని అన్నారు. మిగిలిన ఐదు దశల ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. 200కు పైగా సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని ఛేదిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన హౌరా జిల్లాలోని దోంజూర్ నియోజకవర్గంలో ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రిక్షావాలా ఇంట్లో అమిత్ షా కింద కూర్చొని పప్పు కూరతో అన్నం తిన్నారు. అంతకుముందు దోంజూర్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. మల్లిఖ్ ఫటాక్‌లోనూ రోడ్ షో నిర్వహించారు. మమతా బెనర్జీ పెద్ద నాయకురాలని, పెద్ద సీట్ల తేడాతోనే ఆమె ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రౌడీయిజాన్ని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ వలసలను కఠినంగా అణచి వేస్తామని, సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తామని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థను సంస్కరిస్తున్నామని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. -
పేదలదే నవభారతం
న్యూఢిల్లీ: వెనకబడిన కుటుంబానికి చెందిన అంబేడ్కర్ ముందుకెళ్లకుండా చాలా మంది అవహేళన చేశారని ప్రధాని మోదీ తెలిపారు. వారందరి ప్రయత్నాలను అంబేడ్కర్ విఫలం చేసి రాజ్యాంగ నిర్మాతగా నిలిచారన్నారు. దేశం పేదలు, వెనకబడిన వర్గాలకే చెందుతుందని మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఉన్నత, ధనవంతుల కుటుంబంలో పుట్టడంతో సంబంధం లేకుండా పేదల ఇంట పుట్టినా లక్ష్య సాకారం కోసం అంబేడ్కర్ అహర్నిశలు శ్రమించి విజయం సాధించారని ప్రశంసించారు. ఐక్యంగా గ్రామ్ స్వరాజ్ అభియాన్ ‘చాలా మంది అంబేడ్కర్‌ను అవహేళన చేశారు. వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ముందుకెళ్లొద్దని ఆయన్ను వెనక్కు లాగేందుకు అనుక్షణం ప్రయత్నించారు. ఆయన అభ్యుదయ భావాలను అడ్డుకున్నారు. కానీ నేటి పరిస్థితి భిన్నంగా ఉంది. అంబేడ్కర్ కలలుగన్న పేదలు, వెనకబడిన వర్గాల నవభారతం చిత్రం మన ముందుంది’ అని తెలిపారు. అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ‘గ్రామ్ స్వరాజ్ అభియాన్’ నిర్వహించాలన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్‌ను ముందే చూసి.. ‘దశాబ్దాల క్రితం అంబేడ్కర్ భారత్‌లో పారిశ్రామికీకరణ గురించి మాట్లాడారు. కొత్త ఉద్యోగాల కల్పన అభివృద్ధి గురించి చెప్పారు. నేడు అంబేడ్కర్ కోరిన నవభారత స్వప్న దృశ్యాన్ని నిజం చేసేలా మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోర్టులు, జలమార్గాల అభివృద్ధినీ ఆయన గుర్తించారు’ అనిపేర్కొన్నారు. భారత్‌లో దేశ విభజన, రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే టీమ్ ఇండియా స్ఫూర్తికి అంబేడ్కర్ పునాదులు వేశారని మోదీ పేర్కొన్నారు. సమాఖ్యవిధానం గురించి మాట్లాడారని దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారన్నారు. సహకారాత్మక సమాఖ్య విధానమనే మంత్రాన్నే నేటి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాంమనోహర్ లోహియా, చరణ్ సింగ్, దేవీలాల్ తదితర నేతలు వ్యవసాయం, రైతులను దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా చూశారని ప్రశంసించారు. ‘దుక్కిదున్నటం, మట్టిపై దృష్టిపెట్టడాన్ని మరిచిపోతే మనల్ని మనం మరిచిపోయినట్లే’ అని గాంధీజీ సూక్తిని గుర్తుచేశారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరచాలన్న శాస్త్రి ఆలోచనలను, రైతుల ఆదాయం రెట్టింపుచేసేందుకు ఉద్యమాన్ని తీసుకురావాలన్న లోహియా సిద్ధాంతాలనూ జ్ఞప్తికి తెచ్చారు. రైతులు అధునాతన సాంకేతికతను ఒంటబట్టించుకోవాలన్న 1979నాటి చరణ్ సింగ్ ప్రసంగాన్నీ గుర్తుచేశారు. నివారణే అసలైన మార్గం అనారోగ్యం తలెత్తిన తర్వాత ఇబ్బందులు పడేకంటే.. నిరోధక చర్యలపైనే ప్రజలు దృష్టిపెట్టాలని ప్రజలందరికీ మోదీ సూచించారు. ‘వ్యాధి నిరోధించడానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. త్వరగా నయమయ్యేందుకు దోహదపడుతుంది.నివారణ ద్వారా వ్యక్తిగతంగా లాభం పొందటంతోపాటు కుటుంబం, సమాజానికీ మేలు చేసినవారమవుతాం’ అని ప్రధాని పేర్కొన్నారు. వ్యాధి నివారణమార్గాల్లో యోగా ఒకటని ఆయన సూచించారు. 2025 కల్లా దేశంలో క్షయ వ్యాధి లేకుండా చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా పదికోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆరోగ్య భారతం స్వచ్ఛ భారతమంత ముఖ్యమైనదన్నారు. ఈ రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయన్నారు. ప్రజలకు తక్కువధరకే ఔషధాలు అందించేందుకు దేశవ్యాప్తంగా 3వేల జనఔషధి కేంద్రాలను ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. వైద్యకళాశాలల్లో సీట్ల సంఖ్యనూ పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. -
రూల్స్ కొండెక్కిద్దాం..!
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ పెద్దలు కుదరదంటున్న కేంద్ర అటవీ శాఖ యాజమాన్య హక్కుల కోసం రాష్ర్ట సర్కారు ఒత్తిడి రెండు కొండలపై హక్కుల కోసం పట్టు అస్మదీయులకు కొండలను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కేంద్ర అటవీమంత్రిత్వ శాఖతో ఢీ అంటూ ఢీ అంటున్నారు. నగరంలోని రెండు కొండలను పీపీపీ విధానంలో తమవారికి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. వాటిని డీనోటిఫై చేయడంతోపాటు యాజమాన్య హక్కు బదలాయించాలని పట్టుబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను సమ్మతించమని కేంద్ర అటవీమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దాంతో ప్రభుత్వ పెద్దలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చి మరీ తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం : నగరంలోని 3,071 ఎకరాల విస్తీర్ణంలోని కొండలను దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. పర్యాటక ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ పేరుతో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ కొండలను అస్మదీయులకు కట్టబెట్టాలని ఎత్తగడ వేశారు. ఇవి రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉండటంతో వారి గొంతులో వెలక్కాయపడింది. దాంతో డీనోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. యాజమాన్య హక్కును బదలాయిస్తూ డీనోటిఫై చేయాలని ప్రతిపాదించింది. అలా అయితే ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టవచ్చని భావించింది. వుడా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు కొన్ని నెలల క్రితం లేఖ కూడా రాసింది. కేంద్రం అనుమతి ఇస్తుందని తొలి విడతగా 1,105 ఎకారాల్లోని సీతకొండ( 893 ఎకరాలు), ఎర్రకొండ(212 ఎకరాలు) పర్యాటక ప్రాజెక్టుల కోసం టెండర్లు కూడా పిలిచింది. వీటి పరిశీలనకు కన్సల్టెన్సీని కూడా నియమించేసింది. కుదరదంటే కుదరదు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఐజీ నగ్వీ ఇటీవల జిల్లాలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షించారు. రిజర్వు ఫారెస్టు పరిధిలోని కొండలను డీనోటిఫై చేయలేమని తేల్చిచెప్పారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పర్యాటక ప్రాజక్టులు, విల్లాల నిర్మాణం మొదైలవి ప్రైవేటు రంగంలో నెలకొల్పనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అవి ప్రజోపయోగ ప్రాజెక్టులు కాకుండా వ్యాపారాత్మక ప్రాజెక్టులు కిందకు వస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో రెవెన్యూ పోరంబోకు కొండలపై పీపీపీ ప్రాజెక్టులు నిర్మించుకోమని కూడా నగ్వీ సూచించారు. రిజర్వు ఫారెస్టు భూములు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అనుమతించినా న్యాయపరమై ఇబ్బందులు వస్తాయని చెప్పడం గమనార్హం. యాజమాన్య హక్కు ఇవ్వాల్సిందే అటవీ శాఖ అభ్యంతరంతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారు. లీజకు విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నాయి. చెట్లను ఇష్టానుశారం నరకడానికి వీల్లేదు. ఓ పరిమితికి మించి నిర్మాణాలు చేపట్టకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే లీజును రద్దు చేస్తారు కూడా. ప్రభుత్వం మాత్రం కొండలను తమ అస్మదీయులకు కట్టబెట్టి వాటిపై భారీ నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించింది. అందుకే ఆ కొండలను డీనోటిఫై చేస్తూ యాజమాన్య హక్కు బదలాయించేలా కేంద్ర ఉన్నతాధికారులను ఒప్పించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. తగిన ప్రతిపాదనలతో ఓ బృందం ఢిల్లీ వెళ్లాలని చెప్పారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
పీడిస్తుండ్రు..!
కలెక్టర్ గారూ..! బాధతో చెప్తున్నా... పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ఆర్అండ్బీ అధికారులు ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే అవరోధాలను ముందుండి పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతి నిధులు వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఈ నెల 18న జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. జిల్లాలో పరిశ్రమలను ఆయా ప్రభుత్వ శాఖలు పీల్చి పిప్పిచేస్తున్న తీరుకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న మండలాల్లో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, కడ్తాల్ తదితర మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు బహుళజాతి కంపెనీలతో పాటు ఔ త్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1.003 పరిశ్రమలున్నాయి. ఇందులో 70 భారీ, మధ్య తరహా పరిశ్రమలు. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉపాధి లభిస్తున్నట్లు అం చనా. అయితే వలసల జిల్లాగా పే రున్న మహబూబ్‌నగర్‌లో పారిశ్రామికీకరణకు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల తీరు అడ్డంకిగా తయారైంది. తమకు రావాల్సిన వాటా ఇస్తేనే ఫైళ్లు కదులుతుండడంపై ఔత్సాహిక పెట్టుబడిదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారు అధికారుల వేధింపులు తట్టుకోలేక తల పట్టుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పునాదిలా భావించే లే ఔట్ అనుమతితో మొదలయ్యే లంచాల పర్వం దసరా మామూళ్ల దాకా కొనసాగుతోంది. సింగిల్‌విండో విధానంలో అనుమ తి ఇవ్వాల్సి ఉన్నా తమను వ్యక్తిగతంగా కలిస్తే తప్ప అనుమతులు ఇ వ్వడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. డీఐసీ, ఏపీఐఐసీ, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి, వాణిజ్య పన్నుల శాఖ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక శాఖ, పోలీసులు ఇలా వివిధ ప్రభుత్వ విభాగాలు పారిశ్రామికవేత్తల నుంచి వసూళ్ల పర్వంలో పోటీలు పడుతున్నాయి. లే ఔట్ అనుమతులతోనే ఆరంభం నూతనంగా పరిశ్రమ ఏర్పాటుకు డై రక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తొ లుత అనుమతి కోసం, ఆ తర్వాత లే ఔట్లో తేడాలున్నాయంటూ వి విధ పద్ధతుల్లో సంబంధిత విభాగం తమకు కావాల్సింది రాబట్టుకుంటోంది. జిల్లా పరిశ్రమల కేం ద్రం (డీఐసీ) సింగిల్‌విండో విధానంలో అనుమతులు ఇప్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి. ఇందులో సభ్యులుగా ఉండే వివిధ విభాగాల అధికారులను వ్యక్తిగతంగా కలిస్తే తప్ప పనికావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ఇస్తుంది. తమకు వచ్చే సబ్సిడీలో ముందస్తుగా 15శాతం ముట్టచెబితే నే డీఐసీ నుంచి ఫైలు ముందుకు కదిలే పరిస్థితి ఉందని ఓ పారిశ్రామికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. డైరక్టరేట్ స్థాయిలో మరో 15శాతం ము ట్ట చెపితే తప్ప సబ్సిడీ ఫైలు ముం దుకు కదిలే పరిస్థితి లేదని చెబుతున్నారు. గరిష్టంగా సబ్సిడీ రూ. 20లక్షల వరకు పొందే వీలుండగా, రూ. 6 లక్షలకు పైగా మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. సబ్సిడీ చెక్కులు ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా చేతులు తడపందే పనికావడం లేదని ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒకరు తన అనుభవాన్ని వివరించారు. దసరా పండుగ వస్తుండడంతో ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్లకు అంతులేకుండా పోతోంది. ‘అవినీతికి తావులేని, పూర్తి పారదర్శకతతో కూడిన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం’ అని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అమలు జరగాలని జిల్లా పారిశ్రామికవేత్తలు ఆకాంక్షిస్తున్నారు. -
25,117 ఎకరాలు సిద్ధం
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పారిశ్రామికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఐటీ ఆధారిత, ఫార్మా, బల్క్‌డ్రగ్, సినీ పరిశ్రమల స్థాపనకు తగినంత ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేస్తోంది. పెట్టుబడులకు ప్రోత్సాహక వాతావరణం కల్పించేందుకు వీలుగారంగారెడ్డి జిల్లాలో తక్షణ కేటాయింపులకు అనువుగా ఉన్న భూములను గుర్తించింది. తెలంగాణ రాష్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ) జిల్లాలో 25,117 ఎకరాల మేర భూమి అందుబాటులో ఉన్నట్లు లెక్క తేల్చింది. నెలరోజులుగా ప్రభుత్వ భూములను సర్వే చేసిన టీఐఐసీ యంత్రాంగం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ను విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు.. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోంది. ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమల స్థాపనను సరళతరం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వివాదరహిత భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది. 10,852 ఎకరాల మిగులు భూమి గుర్తింపు గతంలో వివిధ పరిశ్రమలకు, బడా కంపెనీలకు జిల్లాలో 39వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పారిశ్రామిక అవసరాలకు పోను దీంట్లో సుమారు 10,852 ఎకరాల మేర మిగిలి ఉన్నట్లు జిల్లా యంత్రాంగం లెక్కతీసింది. ఆయా సంస్థలు అట్టిపెట్టుకున్న ఈ భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అదే సమయంలో పెట్టుబడులపై గంపెడాశలు పెట్టుకున్న ప్రభుత్వం.. భూ ల భ్యతపై ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమల వద్ద వృధాగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడమేగాకుండా మరింత భూమిని సేకరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారగణం జిల్లాలో 63,726 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిగ్గు తేల్చింది. దీంట్లో చాలావరకు కొండలు, గుట్టలతో నిండిఉన్నట్లు గుర్తించింది. వీటిని మైనింగ్‌కు ఇస్తే బాగుంటుందని యంత్రాంగం ప్రభుత్వానికి సూచించింది. అదనంగా 14,265 ఎకరాలు ఇప్పటివరకు ఎవరికీ కేటాయించని ప్రభుత్వ భూమి 4,300 ఎకరాలు ఉన్నట్లు తేల్చిన యంత్రాంగం... జిల్లావ్యాపం్తగా అన్ని మండలాల్లోని ప్రభుత్వ భూముల జాబితాను రూపొందించింది. దీంతో జిల్లాలో 63,726 ఎకరాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంట్లో పరిశ్రమల స్థాపనకు యోగ్యమైన భూములపై టీఐఐసీ ప్రత్యేకంగా సర్వే నిర్విహ ంచింది. తొలి దశ లో 6,706.34 ఎకరాలు గుర్తించిన టీఐసీసీ, మలివిడతలో 7,559.29 ఎకరాలు ఉన్నట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 25,117 ఎకరాలు తక్షణ కేటాయింపులకు అనువుగా ఉందని, దీనికి అదనంగా ఇప్పటివరకు ఎవరికి కేటాయించని వివాదరహిత భూమి 4,300 ఎకరాల మేర అందుబాటులో ఉందని గుర్తించింది. అయితే, టీఐసీసీ గుర్తించిన భూమి అధికశాతం కుల్కచర్ల, యాచారం, మర్పల్లి, బషీరాబాద్, బంట్వారం, యాలాల తదితర మారుమూల మండలాల్లోనే ఉండగా.. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అనువైనది కాకపోవడం గమనార్హం. నగర శివార్లలో మాత్రం భూ లభ్యత లేకపోవడం అధికార యంత్రాంగానికి ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డు, విమానాశ్రయం, కృష్ణాజలాలు, తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికసంస్థలు ముందుకొస్తాయని, మారుమూల ప్రాంతాల్లో వందల ఎకరాలు కేటాయించిన ఫలితం శూన్యమేననే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన బాలానగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్, ఉప్పల్ మండలాలతో పాటు గ్రామీణ మండలాలైన దోమ, కుల్కచర్ల, బషీరాబాద్ మండలాల్లో పరిశ్రమలకు అనువుగా ఒక ఎకరా కూడా తేలకపోవడం గమనార్హం. -
భూమాతకు వందనం!
సందర్భం తొలి ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే)ను 1970 ఏప్రిల్ 22న జరుపుకున్నారు. పారిశ్రామీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణం గురించి మన అజాగ్రత్త...మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని అమెరికన్ సెనెటర్ గేలార్డ్ నెల్సన్ ‘ఎర్త్ డే’కు రూపకల్పన చేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన ‘డిస్నీ నేచర్’ 2009లో ‘ఎర్త’ పేరుతో చక్కని డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. తొలి ఎర్త్‌డే (1970) రోజు అమెరికా వీధుల్లో వేలాది మంది పారిశామ్రిక విప్లవానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఎర్త్ డే’ పేరును 2009లో ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే’ గా మార్చింది. ‘ఎర్త్ డే నెట్వర్క్స్ ఇండియా ప్రోగ్రాం’ ప్రధాన కేంద్రం కోల్‌కతాలో ఉంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, వుమెన్ అండ్ ది గ్రీన్ ఎకానమీ, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్... మొదలైన విభాగాలలో ఈ సంస్థ పనిచేస్తుంది. కొన్ని దేశాల్లో ‘ఎర్త్ డే’ను వారం మొత్తం జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటడానికి ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రణాళిక వేసుకున్నాడు. ఈరోజు ధరిత్రీ దినోత్సవాన్ని ఈవిధంగా జరుపుకోవచ్చు. మొక్కలను నాటండి పిట్టల కోసం ఇంటిని నిర్మించండి ‘రీసైక్లింగ్ సెంటర్’కు వెళ్లండి కారు, బైక్‌లలో కాకుండా సైకిల్ మీద ప్రయాణం చేయండి.