రక్తహీనతపై అవగాహన
రామకృష్ణాపూర్ : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సింగరేణి హెల్త్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తహీనతపై అవగాహన కల్పించారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్రెడ్డి మాట్లాడుతూ రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడుతుందన్నారు. మగవారిలో 14 నుంచి 16 గ్రాములు, స్త్రీలలో 12 నుంచి 14 గ్రాములు, పిల్లల్లో 16 నుంచి 18 గ్రాముల హీమోగ్లోబిన్ రక్తంలో ఉండాలన్నారు. తినే ఆహారంలో ఇనుప ధాతువు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేషన్ సిబ్బంది రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.