information department
-
YSR Lifetime Achievement Award 2022: 30 మంది దిగ్గజాలకు ప్రభుత్వ పురస్కారాలు
-
డాక్టర్ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్-2022 అవార్డ్స్ ప్రకటన
-
30 మంది దిగ్గజాలకు ప్రభుత్వ పురస్కారాలు
సాక్షి, అమరావతి: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డాక్టర్ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, డాక్టర్ వైఎస్సార్ అచీవ్మెంట్–2022 పురస్కారాలకు ఎంపికైన దిగ్గజాల జాబితా విడుదలైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన విశిష్ట వ్యక్తులు, సామాజిక సేవ రంగంలోని వివిధ సంస్థలకు కలిపి 30 అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్), అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. చదవండి: అమరావతి పెట్టుబడిదారుల కోసం ఉత్తరాంధ్రులకు వెన్నుపోటు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ప్రతిబింబించేలా ప్రజా సేవకు కృషి చేస్తున్న వారిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అవార్డులకు ఎంపిక చేశామన్నారు. మన గ్రామం, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన మాట, భాష వంటి అంశాలను ప్రమాణికంగా తీసుకున్నామన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా అవార్డులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే వ్యవసాయానికి 5, సంస్కృతి–సంప్రదాయాలకు 5, మహిళా సాధికారత, రక్షణకు 3, సాహిత్య సేవ రంగానికి 3, విద్యా రంగానికి 4, పత్రికా రంగానికి 4, వైద్య రంగానికి 5, పరిశ్రమ రంగంలో ఒక అవార్డును ఇస్తున్నామన్నారు. 20 మందికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, 10 మందికి అచీవ్మెంట్ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారాలను 20 మందికి, వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారాలను 10 మందికి ఇవ్వనున్నట్టు కృష్ణమోహన్ తెలిపారు. లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక.. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపికలను అందజేస్తామన్నారు. దిశ పోలీసింగ్ విభాగంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితులను కాపాడిన ఐదుగురు పోలీసులకు ఉమ్మడిగా అవార్డులను ఇస్తున్నామన్నారు. సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, సంస్థలు, పలువురు వ్యక్తుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామన్నారు. - వ్యవసాయం (అందరికీ వైఎస్సార్ అచీవ్మెంట్) 1. ఆదివాసీ కేజూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ (సోడెం ముక్కయ్య, బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా) 2. కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (ఎ.గోపాలకృష్ణ, అంబేడ్కర్ కోనసీమ జిల్లా) 3. అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (జయబ్బ నాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా) 4. అమృతఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, కేఎల్ఎన్ మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా) 5. కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా - కళలు–సంస్కృతి 1. కళాతపస్వి కె.విశ్వనాథ్ (వైఎస్సార్ లైఫ్‌టైమ్) 2. ఆర్.నారాయణమూర్తి (వైఎస్సార్ లైఫ్‌టైమ్) 3. సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ (వైఎస్సార్ అచీవ్మెంట్) 4. పెడన కలంకారీ నేతన్న పిచుక శ్రీనివాస్ (వైఎస్సార్ అచీవ్మెంట్) 5. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్ కట్లరీ షేక్ గౌసియా బేగం (వైఎస్సార్ అచీవ్మెంట్) - సాహిత్య సేవ (వైఎస్సార్ లైఫ్‌టైమ్) 1. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 2. ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ విజయకుమార్ 3. రాయలసీమ ప్రసిద్ధ రచయిత డాక్టర్ శాంతి నారాయణ - మహిళా సాధికారత–రక్షణ 1) ప్రజ్వలా ఫౌండేషన్ సునీతా కృష్ణణ్ (వైఎస్సార్ లైఫ్‌టైమ్) 2) ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్ సెంటర్ (వైఎసాŠస్ర్ లైఫ్‌టైమ్) 3) దిశ పోలీసింగ్–రవాడ జయంతి, ఎస్వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజరత్తయ్య, పి.శ్రీనివాసులు (ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు) - విద్యా రంగం 1. మదనపల్లి–రిషీ వ్యాలీ విద్యా సంస్థ (వైఎస్సార్ లైఫ్‌టైమ్) 2. కావలి–జవహర్ భారతి విద్యాసంస్థ (వైఎస్సార్ లైఫ్‌టైమ్) 3. వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరాం (వైఎస్సార్ లైఫ్‌టైమ్) 4) బ్యాంకింగ్ రంగంలో వేలాది మందికి దారి చూపిన నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డి (వైఎస్సార్ అచీవ్మెంట్) - జర్నలిజం (అందరికీ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్) 1. బండారు శ్రీనివాసరావు 2. సతీష్‌చందర్ 3. మంగు రాజగోపాల్ 4. ఎంఈవీ ప్రసాదరెడ్డి - వైద్య రంగం (అందరికీ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్) 1. డాక్టర్ బి.నాగేశ్వరరెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2. డాక్టర్ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ (హెపటైటిస్–బి వ్యాక్సిన్) 3. భారత్ బయోటెక్ డాక్టర్ కృషాŠణ్ ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవాక్సిన్) 4. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి 5. గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ - పారిశ్రామిక రంగం (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్) గ్రంథి మల్లికార్జునరావు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్త. -
శక్తికి మించి చేశాం..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వమిదని, భావోద్వేగ పరిస్థితుల్లో కాకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను కోరుతున్నామని సమాచార, పౌర సంబ«ంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రేమ, సానుభూతి ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన వారంలోనే 27% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించారని చెప్పారు. ఆనాడు నిజానికి ఉద్యోగులు కూడా అడగలేదన్న విషయం వాస్తవమా కాదా అన్నది నిండు మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు శక్తికి మంచి చేశామని, పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు. ఆదాయాలు పూర్తిగా పడిపోయాయని, వ్యయం పెరిగిందని చెప్పారు. అందువల్ల కొంత మంది వక్రీకరణలను గమనించి, సానుభూతితో ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చని, అందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. నాడు ఉద్యోగులను వేధించిన వారు ఇవాళ నీతులు చెబుతూ మేకతోలు, ఆవుతోలు కప్పుకున్న తోడేళ్లలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడకూడదని, ఇది ముమ్మాటికీ మీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. ఉద్యోగులు మనసు పెట్టి ఆలోచించాలి ► సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులను ప్రభుత్వం కన్నబిడ్డల్లా చూసుకుంటోంది. ఉద్యోగులు ఆశించిన మేరకు వేతన సవరణ చేయలేక పోవడానికి గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణం. ఉద్యోగుల భావోద్వేగాలను గోతి కాడ నక్కల్లా సొమ్ము చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. ► కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు నివృత్తి చేస్తాం. ఆదాయం దారుణంగా తగ్గింది ► వైఎస్ జగన్ సీఎం అయ్యే నాటికి, అంటే 2018 –19లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.62,473 కోట్లు. ఏడాది తర్వాత 2019–20లో ప్రభుత్వ ఆదాయం రూ.60,933 కోట్లు. నిజానికి అప్పుడు రూ.71,844 కోట్లు ఆదాయం రావాల్సి ఉండింది. దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గింది. ► 2020–21లో ప్రభుత్వ ఆదాయం రూ.82,620 కోట్లుగా అంచనా వేస్తే, రూ.60,688 కోట్లు మాత్రమే వచ్చింది. కోవిడ్ వల్ల దాదాపు రూ.21 వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల ప్రజలను కాపాడుకోవడం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. లాక్డౌన్ పరిస్థితుల్లో వ్యాపారాలు సాగలేదు. దీంతో ఒకవైపు ఆదాయం తగ్గగా, మరో వైపు ఖర్చులు పెరిగాయి. మరో వైపు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సక్రమంగా రాలేదు. జీఎస్టీ, ఆదాయం పన్ను పూర్తిగా రాలేదు. ► 2018–19లో కేంద్రం నుంచి మనకు రూ.32,722 కోట్లు రాగా, 2019–20లో రూ.28,221 కోట్లకు, ఆ తర్వాత ఏడాది 2020–21లో రూ.24,441 కోట్లకు అది తగ్గిపోయింది. ఉద్యోగుల జీతభత్యాల కింద ఇప్పుడు రూ.60,177 కోట్లు చెల్లిస్తుండగా, కొత్త పీఆర్సీ అమలు చేస్తే రూ.70,424 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయినా ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. ► పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల కోర్కెలన్నీ తీర్చలేనందుకు సీఎం జగన్ కూడా బాధ పడుతున్నారు. సీపీఎస్ రద్దు కోసం గతంలో ఉద్యోగులు ఆందోళన చేస్తే, చంద్రబాబు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. ► ఉద్యోగులపై కేసులను సీఎం జగన్ 2020 జూలై 30న జీఓ నెం.731 ద్వారా ఎత్తివేయడం వాస్తవం కాదా? నాడు కేసులు పెట్టిన వారు ఇవాళ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. యూపీ, గుజరాత్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అక్కడ హెచ్ఆర్ఏ ఎలా ఇస్తున్నారు? బీజేపీ నేతలు తెలుసుకొని మాట్లాడాలి. ఐఆర్‌పై వక్రీకరణలు తగునా? ► ఐఆర్ అంటే మధ్యంతర భృతి. ఒక ఉద్యోగికి ప్రభుత్వం మధ్యంతరంగా ఇచ్చే డబ్బు అని అర్థం. పీఆర్సీ ఇవ్వాలి కాబట్టి, ఆలోగా ఈ డబ్బును తీసుకోండి అని ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఈ డబ్బు పీఆర్సీ సర్దుబాటుకు లోబడే ఉంటుంది. గతంలో ఎప్పుడు ఐఆర్ ఇచ్చినా, తర్వాత ప్రకటించిన పీఆర్సీని పరిగణలోకి తీసుకుని సర్దుబాటు చేసి, జీతాలను ఖరారు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఇదే విధానాన్ని మొదట నుంచి అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అంతే. ► ఈ విషయం ఉద్యోగ సంఘాల నాయకులకు తెలిసీ కూడా ఐఆర్‌ను జీతంలో భాగంగా పరిగణిస్తూ వక్రీకరణ చేస్తున్నారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సర్కార్ ఏర్పాటైన వారం రోజుల్లోనే ఎవరూ అడక్కపోయినా 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ► 7,55,075 మంది ఉద్యోగులకు ఐఆర్ కింద రూ.17,918 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? హెచ్ఆర్ఏ అన్నది జీతభత్యాల్లో ఒక అంశం కాదా? హెచ్ఆర్ఏ అన్నది మనకు అందుతున్న గ్రాస్ శాలరీలో ఒక సబ్ కాంపొనెంట్. ఇదే హెచ్ఆర్ఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన రైల్వే, కేంద్రీయ విద్యాలయాల టీచర్లు, ఆల్ఇండియా ఆఫీసర్స్, పోస్టల్ ఉద్యోగులకూ ఇస్తున్నది వాస్తవం కాదా? వీరికి జీతాలు పెంచిన మాట వాస్తవం కాదా? ► అంగన్వాడీ కార్యకర్తల జీతం 2018కు ముందు ఉన్న రూ.7 వేల నుంచి రూ.11,500కు పెంచలేదా? ► మినీ అంగన్వాడీల జీతం రూ.4,500 నుంచి రూ.7 వేలు చేయ లేదా? ► వీఓఏ, సంఘమిత్రలు, యానిమేటర్స్ జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచలేదా? ► శానిటరీ వర్కర్ల జీతాలు రూ.8 వేల నుంచి 18 వేలకు పెంచలేదా? ► శానిటరీ సూపర్ వైజర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచలేదా? ► ఆశా వర్కర్ల జీతాలు 2018కు ముందు రూ.3వేల –6వేలు ఉంటే, వాటిని రూ.10 వేలకు పెంచ లేదా? ► ఎంఎన్ఓ జీతాలను రూ.6,700 నుంచి రూ.17,746కు పెంచలేదా? ► కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచ లేదా? ► హోంగార్డుల డైలీ డ్యూటీ అలవెన్స్‌లను రూ.600 నుంచి రూ.710కి పెంచ లేదా? ► కుక్ కం హెల్పర్ల జీతాలను రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచలేదా? ► కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఏటా జీతాల రూపంలో రూ.1100 కోట్ల చెల్లింపులు ఉంటే, ఇప్పుడు ఏడాదికి చెల్లిస్తున్నది సుమారు రూ.3 వేల కోట్లు. ఇది మేలు కాదా? ► ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయ లేదా? ఇవన్నీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు కాదా? ఇవన్నీ నిజాలు కావా? ► ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంపు. దీనివల్ల రెండేళ్ల సర్వీసు పెరగడంతోపాటు 24 నెలల జీతం అదనంగా లభిస్తుంది. ఇది ఉద్యోగులకు లాభం కాదా? ► నెలకు రూ.1 లక్ష జీతం అందుకునే ఉద్యోగికి రెండేళ్ల కాలంలో రూ.24 లక్షలు జీతం రూపేణా వస్తాయి. దీనివల్ల ఆయా ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేసినట్టు కదా? ► రెండేళ్ల అదనపు సర్వీసుతో పాటు ఆ సమయంలో 4 డీఏలు, 2 ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఇది వారికి మేలు చేసినట్టు కాదా? ► సర్వీసు పెరగడం వల్ల పెన్షన్ రూపేణా ప్రభుత్వం నుంచి వాటా పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్ పెరగదా? ► దేశంలో ఎన్నిచోట్ల 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు ఉంది? ► సర్వీసు కాలానికి గ్రాట్యుటీ కింద ఇదివరకు ప్రభుత్వం ఇచ్చేది రూ.12 లక్షలు. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం రూ.16 లక్షలకు పెంచడం మేలు చేసే నిర్ణయం కాదా? ► ఏ ఉద్యోగి అడగకపోయినా ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నది మేలు చేయడం కాదా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌లో 10% స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్ చేసిన మాట వాస్తవం కాదా? ఈ స్థలాలను 20 శాతం రిబేటుతో ఇవ్వాలన్నది మేలు చేసేది కాదా? దీనివల్ల నేరుగా రూ.10 లక్షల వరకు లబ్ధి కలగడం లభించదా? ► కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి జూన్ 30లోగా నియామకాలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం వాస్తవం కాదా? ► ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవల్లో భాగంగా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.28 లక్షల మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించింది. ఈ ఉద్యోగులకు మేలు చేసేలా రెండున్నరేళ్లకే రెగ్యులరైజ్ చేస్తోంది. 2022 జూన్ 30తో వీరి ప్రొబేషన్ ముగుస్తోంది. జూలై 1 నుంచి రెగ్యులర్ స్కేలు అమల్లోకి వస్తోంది. దీనివల్ల వారికి గణనీయంగా జీతాలు పెరుగుతున్న మాట నిజం కాదా? ► కాంట్రాక్టు ఉద్యోగులకూ మినిమం టైం స్కేలు వర్తింపు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది కాదా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దళారీల బారి నుంచి బయట పడేయలేదా? వారికి కత్తిరింపులు లేకుండా, లంచాలకు తావివ్వకుండా పూర్తి జీతాలు అందించడం లేదా? వీరందరికీ ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలను కల్పించడం వాస్తవం కాదా? వీరికి కూడా 23 శాతం ఫిట్మెంట్ వర్తింప చేయడం మేలు చేసే నిర్ణయం కాదా? ఇలాంటి పనులు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చేశాయా? ► కేంద్ర ప్రభుత్వ కమిటీ చేసిన సిఫార్సు 14.29 శాతమే. కాని ఈ ప్రభుత్వం ఇంతటి పరిస్థితుల్లో కూడా 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన మాట నిజం కాదా? ఐఆర్ రూపంలో రూ.17,918 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పీఆర్సీ వల్ల ఏడాదికి రూ.10,247 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడుతున్న విషయం వాస్తవం కాదా? ► 2018–19లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.62,503 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.52,513 కోట్లు. అంటే 84 శాతం జీతాల రూపంలో చెల్లించారనే విషయాన్ని గమనించాలి. ► 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.60,688 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.67,340 కోట్లు. 111% జీతాల రూపంలో చెల్లించడం నిజం కాదా? జీతాలు ఎలా తగ్గుతాయి? ► మొత్తంగా గ్రాస్ శాలరీ పెరిగిందా? లేదా? అన్నది చూసుకోవాలి. ► ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాల రూపంలో ఏటా చెల్లింపులు రూ.60,177 కోట్లు అయితే, కొత్త పీఆర్సీ ద్వారా ఇకపై రూ.70,424 కోట్లు చెల్లింపులు ఉంటాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా భారం రూ.10,247 కోట్లు పడుతుంది. ఈ పరిస్థితిలో జీతాలు తగ్గుతాయన్న వాదనకు ఆస్కారం ఎక్కడిది? ► ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులు వాస్తవాలు చెప్పి ఉద్యోగులను మంచి దిశగా జాగృతం చేయాల్సింది పోయి వక్రీకరణలు చేయడం సబబేనా? ఉద్యోగులను పెడదోవ పట్టించడం న్యాయమేనా? ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు లాంటి వారి చేతిలో నాయకులు కీలు బొమ్మలు కావడం తగునా? వారికి అమ్ముడుపోయి వక్రీకరణలు చేయడం సరైనదేనా? ప్రభుత్వం ఇంత మేలు చేస్తున్నా, మేలు జరగనట్టుగా భ్రమలు కల్పించి వక్రీకరణలతో ఉద్యోగులను రెచ్చగొట్టడం కరెక్టేనా? ► ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న పనులు ఉద్యోగుల భవిష్యత్తుకు భంగకరంగా మారదా? భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా ఐఆర్ ఇవ్వడానికి ముందుకు వస్తుందా? ఉద్యోగులకు సానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకునేలా ఉండాల్సిన పరిస్థితులను ధ్వంసం చేస్తే, దెబ్బతినేది ఉద్యోగులు కాదా? ఈ విషయాలను అందరూ గమనించాలి. -
‘సాక్షి’కి ప్రకటనల జారీలో ప్రభుత్వ వివక్ష...
సాక్షి, అమరావతి: సాక్షి దినపత్రికకు ప్రచార ప్రకటనల జారీలో రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు పాల్పడడాన్ని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది. ఆ రెండు పత్రికలకు (ఈనాడు, ఆంధ్రజ్యోతి) అత్యధిక బిజినెస్‌ను కల్పించారని, అయితే భారీ సర్క్యులేషన్ గల సాక్షి పత్రికకు మాత్రం అతి తక్కువ బిజినెస్‌ను కల్పించారని, ఇందులోనే వివక్ష కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, ఒక విధానం లేకుండా ప్రచార ప్రకటనలు ఎలా జారీ చేశారో సమాధానం చెప్పాల్సిందిగా సమాచార శాఖను కాగ్ కోరింది. దీనిపై సమాచార శాఖ కమిషనర్ కాగ్‌కు లిఖిత పూర్వక సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే ఆ రెండు పత్రికలకు ఎక్కువ బిజినెస్ కల్పించామని, సాక్షికి తక్కువ కల్పించడానికి కూడా వారి ఆదేశాలే కారణమని స్పష్టం చేశారు. దీనిపై సంతృప్తి చెందని కాగ్.. సరైన సమాధానం చెప్పాల్సిందిగా మరోసారి కోరింది. దీనిపై కూడా సమాచార శాఖ కమిషనర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ సీఎం, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే పనిచేశామని, అంత పెద్దస్థాయిలో ఆదేశాలను అమలు చేయడం తప్ప చేసేదేమీ ఉండదని పేర్కొన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు సమాచార శాఖ జారీ చేసిన ప్రచార ప్రకటనలపై కాగ్ నివేదికను రూపొందించింది. మూడేళ్లలో సమాచార శాఖ ప్రచార ప్రకటనలకు 125.42 కోట్ల రూపాయలను వ్యయం చేసిందని, ఇందులో 44 శాతం అంటే 54.04 కోట్ల రూపాయల మేర ఆ రెండు పత్రికలకే (ఈనాడు, ఆంధ్రజ్యోతి) ప్రయోజనం కలిగించిందని కాగ్ ఎత్తి చూపింది. అత్యధిక సర్క్యులేషన్ గల సాక్షి పత్రికకు కేవలం 8.99 కోట్ల రూపాయల బిజినెస్‌ను మాత్రమే ఇచ్చారని, తక్కువ సర్క్యులేషన్ గల ఆంధ్రజ్యోతికి భారీ బిజినెస్ ఎలా కల్పించారని ప్రశ్నించింది. ప్రకటనల జారీలో సహజ న్యాయాన్ని, పారదర్శకతను పాటించలేదని కాగ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని తేటతెల్లమైందని పేర్కొంది. -
ఎన్నికల ప్రచారానికి భారీ బడ్జెట్!
సాక్షి, అమరావతి: ఈవెంట్లు, సదస్సులు, దీక్షల పేరుతో నాలుగున్నరేళ్లపాటు లెక్కాపత్రం లేకుండా కోట్ల రూపాయలను ఇష్టారాజ్యంగా వ్యయంచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు.. తాజాగా ఎన్నికల ప్రచారానికి భారీగానే ప్రణాళికను సిద్ధంచేసింది. ఇందులో భాగంగా రూ.582 కోట్ల అదనపు బడ్జెట్‌కు సమాచార శాఖ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి సూచనతోనే సమాచార శాఖ ఈ ఏడాది మార్చిలోగా ఔట్‌డోర్, ఇన్డోర్ పేరుతో ప్రచారానికి ఏకంగా రూ.482 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధంచేసింది. ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్లో ప్రచారం కోసం కేటాయించిన రూ.121.72 కోట్లను ఖర్చు చేసేశామని.. బకాయిల కోసం రూ.100 కోట్లతో పాటు మార్చి నెలాఖరు వరకు ప్రచార నిమిత్తం రూ.482 కోట్లతో కలిపి మొత్తం రూ.582 కోట్లను అదనంగా కేటాయించాల్సిందిగా ఆర్థిక శాఖకు సమాచార శాఖ ప్రతిపాదనలు పంపించింది. వీటిని పరిశీలించిన ఆర్థిక శాఖ ఆశ్చర్యానికి గురైంది. ఎన్నికల ముందు ప్రచారం కోసం ఇంత పెద్దఎత్తున వ్యయం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల ముందు ప్రజాధనాన్ని ఇంత పెద్ద మొత్తంలో వినియోగించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు బడ్జెట్ ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. దీంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగారు. సమాచార శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదించడంతో పాటు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ముఖ్యమంత్రే ఒత్తిడి చేయడంతో ఆర్థిక శాఖ చేసేదేమీలేక ప్రతిపాదనల్లో సగం మొత్తాన్ని తగ్గించాల్సిందిగా సమాచార శాఖకు సూచించింది. ఇప్పటికే రూ.60.18కోట్లు ఖర్చు కాగా, ముఖ్యమంత్రి ఈ ఏడాదిలో చేసిన వివిధ ఈవెంట్లు, సదస్సుల నేపథ్యంలో ఇప్పటివరకు ప్రచారం కోసం ఏకంగా రూ.60.18 కోట్లు వ్యయంచేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన ఒక్కరోజు నవ నిర్మాణ దీక్ష ప్రచారానికి రూ.8.67 కోట్లను వెచ్చించారు. ‘అంబేద్కర్ ఆశయం–చంద్రన్న ఆచరణ’ ఈవెంట్ ప్రచారం కోసం రూ.3కోట్లు ఖర్చుపెట్టారు. ఇక 1500 రోజుల పాలన పూర్తి పేరుతో రూ.17.79 కోట్లు వ్యయం చేశారు. అలాగే, రంజాన్, ఏరువాక–పౌర్ణమి, జలసిరి హారతి, యువనేస్తం, పోలవరం తదితర ఈవెంట్లకు ఏకంగా రూ.31.91కోట్లు ఉపయోగించారు. అంతేకాక, వివిధ ఈవెంట్ల కోసం ఔట్ డోర్ ప్రచారానికి అంటే హోర్డింగ్స్ కోసం ఈ ఏడాది ఇప్పటివరకు రూ.30.26 కోట్లు వెచ్చించారు. ఇందులో స్వచ్ఛభారత్, సంక్రాంతి సంబరాలు హోర్డింగ్స్‌కు రూ.ఏడున్నర కోట్లను వ్యయం చేశారు. సామూహిక గృహ సముదాయాల ఈవెంట్ల ప్రచారానికి రూ.4.6కోట్లు, 1500 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో రూ.12 కోట్లు, యువనేస్తానికి రూ.6కోట్లు ప్రచారానికి ఖర్చుపెట్టారు. -
సమాచారశాఖ ఏడీజీగా విజయ్‌కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర సమాచార శాఖ, తెలంగాణ ప్రాంతీయ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)అదనపు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై హైదరాబాద్ వచ్చారు. ‘రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా’ హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో’కు కూడా ఆయన అధిపతిగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రచురణల విభాగం, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పరిధిలో పని చేస్తుంది. -
మున్సిపాలిటీల్లో ఆంక్షలను ఎత్తేయాలి
టీయూడబ్ల్యూజే డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాల మీడియా కవరేజీపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) సలహాదారు, సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. జర్నలిస్టులను నియంత్రించాలనే భావన సరికాదన్నారు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ జావెద్ హమద్ ఉర్దూ జర్నలిస్టులపై కేసులతో పాటు వేధింపులకు పాల్పడుతున్నారని దీనిపై ప్రభుత్వం, ఎంఐఎం నాయకత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూ ఉన్నందున ఈ జర్నలిస్టులకు, పత్రికలకు ఆయా అంశాల్లో తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంగళవారం ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, సంఘ నేతలు విరాహత్ అలీ, మాజిద్లతో కలసి ఆయన విలేకరులకు తెలియజేశారు. హెల్త్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం చేసిన అనేక వాగ్దానాలు ఆచరణలో అమలు కావడం లేదన్నారు. కొత్త అక్రెడిటేషన్లు ఇచ్చిన వారి కి, అక్రెడిటేషన్లు లేనివారికి, డెస్క్ జర్నలిస్టులకు ఇవి ఇంతవరకు అందలేదన్నారు. జిల్లాల విభజనకు అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థను విభజించనందున పాత జిల్లాల ప్రాతిపదికనే బస్సుపాస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. గత 3, 4 ఏళ్లలో వివిధస్థాయిల్లోని 330 మంది జర్నలిస్టులు చనిపోయారని, వారిలో ప్రభుత్వపరంగా 60 మందికే సహాయం అందిందన్నారు. మిగతా వారందరికీ సహాయం అందేలా చూడాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇలా అన్ని వ్యవస్థలను ప్రెస్ అకాడమీకి అప్పగించకుండా ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేసేలా ప్రభుత్వం చూడాలని ఐజేయూ నేత అమర్ సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య సుప్రీంకోర్టులో తేలినందున ప్రస్తుతం సమాచారశాఖ ఆధ్వర్యంలోని ఆయా స్థలాలను జవహర్లాల్ హౌసింగ్ సొసైటీకి అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం
సమాచార శాఖ కొత్త కార్యాలయాలపై సమీక్షలో నవీన్ మిట్టల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రచారం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ జరుపుతున్నామని ఆ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. నూతన జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుపై క్షేత్ర స్థాయిల అధికారులతో శనివారం హైదరాబాద్‌లోని సమాచార భవన్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని 27 జిల్లాలకు సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారులు, సమాచార ఇంజనీరింగ్ విభాగం ఒకే చోట ఉండి పనిచేయాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలకు కావాల్సిన వసతి, సామగ్రి, వాహనాలు, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిని జిల్లా పౌర సంబంధాల అధికారిగా పిలవనున్నట్టు పేర్కొన్నారు. ఐటీడీఏలు ఉన్న ఉట్నూరు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా అదనపు పీఆర్ ఓ కార్యాలయాలు ఉంటాయని తెలిపారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి, సూర్యాపేటల్లో సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డెరైక్టర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలోని కార్యాలయాలు నోడల్ సెంటర్లుగా పనిచేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారాన్ని పర్యవేక్షిస్తాయన్నారు. ప్రతి జిల్లాలో అడిషనల్ పీఆర్ఓ, ఏపీఆర్ఓ, ముగ్గురు పబ్లిసిటీ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, టైపిస్టు, డ్రైవర్లను కేటాయిస్తున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు డెరైక్టర్ నాగయ్య కాంబ్లీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కిషోర్‌బాబు, జాయింట్ డెరైక్టర్ వెంకటేషం పాల్గొన్నారు. -
‘సమాచారం’ నై..
రాష్ట్ర సమాచార శాఖ కమిషనరేట్‌లో అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్ మీడియా ప్రతినిధులను ఇబ్బంది పెడుతోంది. సమన్వయం చేసేవారు కరువవ్వడంతో ఎవరికివారే యమునాతీరే చందంగా వ్యవస్థ నడుస్తోంది. ప్రజలకు తెలియజేసేందుకు పత్రికా ప్రతినిధులకు ఇవ్వాల్సిన సమాచారం విషయంలో తమ బాధ్యత కాదని కొందరు.. తమ పనికాదని మరికొందరు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇంతజరుగుతున్నా పరిస్థితిని గాడినపెట్టాల్సిన పెద్దలు పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విజయవాడ : నూతన రాజధాని కేంద్రంలో ఏర్పాౖటెన రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో కోల్డ్‌వార్ నడుస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన కమిషనరేట్ అధికారులు, స్థానికంగా పనిచేసే అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. మీడియాకు సమాచారం ఇవ్వటానికి ఇటీవల అవుట్ సోర్సింగ్‌లో నియమితులైన సిబ్బందికి, ప్రభుత్వ సిబ్బందికి మధ్య కూడా పడటం లేదు. ఎవరికి వారు తమకు సంబంధం లేదని తప్పుకుంటున్నారు. దీంతో పత్రికా ప్రతినిధులకు కార్యక్రమాల వివరాలు మెసేజ్‌లు కూడా సక్రమంగా అందడంలేదు. ఎవరూ ఏ పని చేస్తున్నారో ఎవరికీ తెలియటం లేదు. బుధవారం టూరిజంపై మంత్రుల కమిటీ నిర్వహించిన సమాచారం, కాపు కార్పొరేషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు అందించటంలో అధికారులు అలసత్వం వహించారు. ప్రతి రోజూ పత్రికలకు సమాచారం ఇవ్వటం, ఫొటోలు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఫీడ్ పంపటం, పత్రికా ప్రకటనలు జారీలో కూడా తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీరందరినీ సమన్వయం చేసే నాథుడే లేకపోవటంతో మీడియా ప్రతినిధులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇన్‌కెమెరా మీటింగ్‌లలో స్పాట్ ఐటమ్స్ ఎవరూ పట్టించుకోవటం లేదు. మీడియాను లోపలకు అనుమతించకపోగా, సమాచారం ఇవ్వకపోవటం వల్ల పాత్రికేయులకు తిప్పలు తప్పడంలేదు. రాష్ట్ర స్థాయి అధికారులు, సీఎం ప్రెస్మీట్లు, క్యాంపు కార్యాలయంలో జరిగే విషయాలను మెయిల్స్ ద్వారా ఆలస్యంగా ఇస్తున్నారు. స్థానికంగా ఉండే సమాచార అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కేవలం కలెక్టర్ పర్యటనలు, సమావేశాలకు పరిమితమవుతున్నారు. మంత్రులు, ఇతర వీఐపీల సమావేశాలు, ముఖ్యమైన ఇంటర్నల్ సమావేశాలకు సమాచార శాఖ అధికారులు ఎగనామం పెడుతున్నారు. సమాచారం అడుగుతుంటే ఎవరికి వారు తమకు సంబంధం లేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. స్థానికంగా జరిగే సమావేశాల సమాచారం కూడా సక్రమంగా పంపటంలో అధికారులు విఫలమవుతున్నారు. ఎవరికి వారే యమునాతీరే.. అవుట్‌సోర్సింగ్‌లో నియమించిన ఉద్యోగులు కూడా కొన్ని సమావేశాలకు సంబంధించి ప్రెస్నోట్లు వస్తాయని, సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వస్తాయని, కొందరు డివిజన్, అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి వస్తాయని ఎవరికివారు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ చివరకు సమాచారం ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడలో మకాం ఉంటున్న సమాచార శాఖ కమిషనర్ వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి అధికారుల మధ్య సమన్వయం చేయాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు. -
‘సమాచార’మేదీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ విధి విధానాలను, ప్రణాళికల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి బహుముఖ మాధ్యమాల ద్వారా కృషి చేయాల్సిన జిల్లా సమాచార శాఖ సుప్తచేతనావస్థలో ఉంది. ప్రజల స్పందనను, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంది. జిల్లా అధికారులకు, సమాచార శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడటం ప్రజలకు శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటే జిల్లా సమాచార శాఖ అధికారి పోస్టును అప్‌గ్రేడ్ చేశారు. ఏడీ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించినా ప్రయోజనం లేకుండా పోయింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్లు మ్యానిటరింగ్ చేయటం, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యక్రమాలకు బస్సులు పెట్టేందుకు మాత్రమే సమాచార శాఖ పనిచేస్తోందనే ప్రచారం ఉంది. ప్రభుత్వం ఇటీవల అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వాటికి సంబంధించిన సమాచారం ఏదీ ఆ శాఖ వద్ద లేకపోవడం గమనార్హం. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారం, వాటిపై జరుగుతున్న సర్వేలు, క్షేత్రస్థాయిరివ్యూల వివరాలు కూడా ఆ శాఖ వద్ద లేవు. అయితేఉన్నతాధికారులు కూడా ఉద్దేశపూర్వకంగానే సమాచారశాఖను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.దీనికి తోడు సమాచార శాఖ అధికారులు కూడా విషయాలన్నీ తెపిోవాలనే ఆసక్తి కనబరచకపోవడంఅధికారుల పనితీరును తెలియజేస్తోంది. జిల్లాకుచెందిన మంత్రి హరీష్‌రావు, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తరచూ జిల్లాలో పర్యటిస్తున్నారు. సమీక్షసమావేశాల్లో పాల్గొంటున్నారు.వీరి పర్యటన వివరాలు ఎలా లేదన్నా కనీసం 48గంటల ముందు ఖరారవుతుంది. కానీ ఆ విషయంమాత్రం సమాచార శాఖకు తెలియదు. తీరా సమావేశంజరుగుతున్నప్పుడో... మంత్రి బయలుదేరుతున్నప్పుడో తెలిసి హడావుడిగా మీడియాకు సమాచారంచేరవేస్తున్నారు.దీంతో మీడియా ప్రతినిధులు వార్తలను కవర్‌చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇదేవిషయాన్ని కొంతమంది మీడియా ప్రతినిధులుగతంలో ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ దృష్టికి తీసుకెళ్లగా... ప్రసార మాధ్యమాలకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం కేవలం ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని అన్నారు. దానికి పూర్తి బాధ్యత వారిదేనన్నారు. ఇపికైనా ఆ శాఖ అధికారుల్లో చలనంవస్తుందని ఆశిద్దాం.