
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర సమాచార శాఖ, తెలంగాణ ప్రాంతీయ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)అదనపు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై హైదరాబాద్ వచ్చారు. ‘రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా’ హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో’కు కూడా ఆయన అధిపతిగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రచురణల విభాగం, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పరిధిలో పని చేస్తుంది.