రెండు కొత్త బంతులకు నో
ముంబై: వన్డేల్లో రెండు కొత్త బంతుల వినియోగాన్ని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలవుతున్నప్పటికీ... వచ్చే జనవరిలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ నిబంధన వద్దే వద్దని స్పష్టం చేస్తామని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
గత సెప్టెంబర్లో జరిగిన భేటీలో భారత్తో సహ శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ బోర్డులు ఈ కొత్త నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత్లోని స్పిన్ వికెట్లపై కొత్త బంతుల నిబంధన వల్ల స్పిన్నర్లకు పట్టు దొరకదనే కచ్చితమైన అభిప్రాయంతో ఉన్న బీసీసీఐ దీన్ని పూర్తి స్థాయిలో అమలు జరిపేందుకు మోకాలడ్డుతోంది.