25లోగా తెలంగాణలో ఓటరు స్లిప్పులు పంచండి
కలెక్టర్లకు భన్వర్‌లాల్ ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశ పోలింగ్ జరిగే తెలంగాణ ప్రాంతం లో ఓటరు స్లిప్పుల పంపిణీని ఈనెల 25లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ స్లిప్పుల పంపిణీ, తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ ఏర్పాట్లుపై ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ సందర్భంగా ఎవరైనా ఇం ట్లో లేకపోయినా, లేదా మృతిచెందినా, మరో చోటకు తరలిపోయిన ఓ టర్ల పేర్లతో విడిగా జాబితా రూపొందించాలని సూచించారు.
పోలింగ్ రోజు ఈ జాబితాలోని వారు ఓటింగ్‌కు వస్తే ఒకటికి రెండుసార్లు ఆ వ్యక్తిని నిర్ధారించుకున్న తరువాతే ఓటింగ్‌కు అనుమతించాలన్నారు. రెండో దశలో పోలింగ్ జరిగే సీమాంధ్రలో ఓటర్ స్లిప్పులను బుధవారం నుంచి పం పిణీ చేయాలని ఆదేశించారు. సీమాంధ్రలో బుధవారం నామినేషన్ల గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని అదనపు ఈవీఎంలు అవసరమో నివేదిక పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.