inner line permit
-
ఆ రాష్ట్రాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపు?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులతో సహా ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని ఇవ్వనుంది. అయితే కొన్ని రాష్ట్రాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించారు. ఆ రాష్ట్రాలు ఏవి? ఎందుకు మినహాయింపునిచ్చారు? మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గిరిజన ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరు. వీటిలో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదా మంజూరైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయాణానికి ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ (ఐఎల్పీ) అవసరమయ్యే అన్ని ఈశాన్య రాష్ట్రాలలో సీఏఏ చట్టం అమలు చేయరు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్లకు ఐఎల్పీ వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో స్వయంప్రతిపత్తి గల కౌన్సిళ్లుగా ఏర్పడిన గిరిజన ప్రాంతాలను కూడా సీఏఏ పరిధి నుంచి తప్పించారు. అసోం, మేఘాలయ, త్రిపురలలో ఇటువంటి స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లు ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూయేతరులు తొలుత తాము ఈ మూడు దేశాలలో ఎక్కడైనా నివాసితులుగా నిరూపించుకోవాలి. అప్పుడే వారికి భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఇందుకోసం వారు వారి పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, అక్కడ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికేట్ లేదా లైసెన్స్, భూమి పత్రాలను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది. -
భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..
వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు. ఐఎల్పీ పర్మిషన్ అంటే? ఇన్నర్ లోన్ పర్మిట్ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆరు ప్రదేశాలు ఇవే.. అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్‌కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది. నాగలాండ్.. సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్‌కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్.. భారత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్‌లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్‌తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. మిజోరం.. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిల్చార్, కోల్‌కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి. సిక్కిం.. భారత్‌లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్‌డాంగ్, యమ్తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లద్దాక్.. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. -
అక్కడ లీటరు పెట్రోలు రూ. 190!
ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలంటూ మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఆందోళన అక్కడి ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఇంఫాల్- డిమాపూర్, ఇంఫాల్ - సిల్చార్ జాతీయ రహదారులు మూసుకుపోవడంతో రాష్ట్రంలోకి సరుకులు వచ్చే మార్గం లేకుండా పోయింది. దీంతో రాజధాని ఇంఫాల్ నగరంలో పెట్రోలు ధర దాదాపు రూ. 190 వరకు చేరుకుంది. అలాగే ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలు, పప్పుధాన్యాలు, కూరగాయల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. ఇంఫాల్- డిమాపూర్ జాతీయ రహదారిలో ఆగస్టు మధ్యవారంలో భారీ కొండ చరియ విరిగిపడింది. దాంతో అక్కడి రోడ్డు మార్గం మొత్తం మూసుకుపోయింది. మరమ్మతు పనులు ఇంకా పూర్తి కాలేదు. దానికి తోడు ఆందోళనల కారణంగా మరో జాతీయ రహదారి కూడా మూసుకుపోయింది. ఇవే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలయ్యాయి. రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో పెట్రోలును రేషన్ పద్ధతిలో అమ్ముతున్నారు. అక్కడ కొనాలంటే ఐదారు గంటలు పడుతోంది. పని కూడా మానేసుకుని ఇక్కడ ఒక రోజంతా వేచి చూడాల్సి వస్తోందని హీరోజిత్ సింగ్ అనే వ్యక్తి చెప్పారు. అయితే బ్లాక్‌లో కొనాలంటే మాత్రం ఐదు నిమిషాల్లోనే దొరుకుతోందని, ఇదెలా సాధ్యం అవుతోందని ఆయన ప్రశ్నించారు. -
మణిపూర్ లో హింస:మరో ఇద్దరి మృతి
ఇంఫాల్: ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై మణిపూర్ లో చేపట్టిన ఆందోళన మరింత హింసాత్మకంగా మారింది. గత రాత్రి రాష్ట్రంలోని చురచందాపూర్ లో చేపట్టిన ఆందోళనలో నలుగురు మృతి చెందగా.. మంగళవారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులు ఆందోళన కారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అనేక విమర్శలకు దారితీస్తోంది. సోమవారం రాత్రి మణిపూర్ దక్షిణ ప్రాంతంలోని చురచంద్‌పూర్‌లో ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మణిపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఫుంగ్జతాంగ్ టాన్సింగ్ ఇంటిని ఆందోళన కారులు దహనం చేశారు.