ఇంఫాల్: ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై మణిపూర్ లో చేపట్టిన ఆందోళన మరింత హింసాత్మకంగా మారింది. గత రాత్రి రాష్ట్రంలోని చురచందాపూర్ లో చేపట్టిన ఆందోళనలో నలుగురు మృతి చెందగా.. మంగళవారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులు ఆందోళన కారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అనేక విమర్శలకు దారితీస్తోంది.
సోమవారం రాత్రి మణిపూర్ దక్షిణ ప్రాంతంలోని చురచంద్పూర్లో ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మణిపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఫుంగ్జతాంగ్ టాన్సింగ్ ఇంటిని ఆందోళన కారులు దహనం చేశారు.