Innovative campaign
-
మార్పు కోసం.. ఆటో డ్రైవర్ ఆలోచన..
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆటో డ్రైవర్.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఉరుకులు పరుగుల జీవితం.. ఎంతో కష్టపడితే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లవు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రతిక్షణం సమాజం గురించే.. సమాజంలో ఉన్న సమస్యలు.. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న విపరీత ధోరణులపై అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే యువతలో, సమాజంలో మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. అయితే ఓ ఆటోడ్రైవర్.. తాను ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు. తన పరిధిలో ఏం చేయగలనో ఆలోచించాడు. కూడళ్లు, విద్యుత్ స్తంభాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం మారాలి.. మార్పు రావాలి.. అంటూ కొటేషన్స్ రాయడం ప్రారంభించారు. ఆయన పేరు దాడే శ్రీనివాస్.. అంబర్‌పేటకు చెందిన శ్రీనివాస్.. రెండున్నరేళ్లకు పైగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు.రోజుకో కొటేషన్..వివేకానంద సూక్తులు, వాక్యాలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెబుతున్నాడు 45 ఏళ్ల శ్రీనివాస్. ఈయనకు దేశ భక్తి కూడా ఎక్కువే. తన ఆటోలో ప్రయాణించే వారు తమ సమస్యలు చెప్పుకొంటుంటే ఎంతో బాధ అనిపించేదని, వీటన్నింటికీ కారణం సమాజంలో పెరుగుతున్న విపరీత ధోరణులే కారణమని పేర్కొంటున్నాడు. ఇక, తల్లిదండ్రులను ఆస్తుల కోసం హింసించడం.. పెద్ద వారిపై గౌరవం లేకుండా ఉండటం వంటివి ఎన్నో ఉదంతాలు చూసి ఆవేదనకు గురయ్యేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇక, యువత చెడు అలవాట్లకు బానిసై విలువలు లేని జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారిలో చిన్న మార్పు అయినా వస్తుందనే నమ్మకంతో ఇలా కొటేషన్లు రాస్తున్నానని చెప్పాడు. అలాగే తన ఆటోపై కూడా ప్రతి రోజూ కొత్త కొటేషన్లు రాస్తుంటానని వివరించాడు.చిన్నతనంలోనే నగరానికి.. షాద్‌నగర్ కుర్వగూడకు చెందిన శ్రీనివాస్ చిన్నతనంలోనే నగరానికి వలస వచ్చాడు. ఇంటరీ్మడియెట్లోనే చదువు ఆపేసిన శ్రీనివాస్.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని కూడా చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో నిలపాలనే ఉద్దేశంతో ఇంట్లో చిన్న బోర్డు ఏర్పాటు చేసి, దానిపై మంచి సూక్తులు రాసేవాడట. దీంతో వారు కూడా పెద్ద చదువులు చదువుకొని.. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ధర్మబద్ధంగా, సహనంతో ప్రతి ఒక్కరూ జీవిస్తే సమాజంలో ఉన్న అనేక సమస్యలు రూపుమాపుతాయనేది తన నమ్మకమని చెబుతున్నాడు. -
పిల్లల ఫొటోల్ని షేర్ చేయకండి
గువాహటి: సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం చిన్నారుల ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై అస్సాం పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన చిన్నారుల చిత్రా లను వాడుకున్నారు. ‘పిల్లలు సోషల్ మీడియా ట్రోఫీలు కాదు, నెటిజన్ల దృష్టిలో పడేందుకు చిన్నారుల గోప్యతతో వ్యాపారం చేయకండి, మీ చిన్నారుల కథ చెప్పే అవకాశం వారికే ఇవ్వండి, లైక్స్ పాతబడిపోతాయి కానీ, డిజిటల్ మరకలు శాశ్వతం’వంటి సందేశాలను జత చేశారు. ఇటీవలి కాలంలో ఫ్యామిలీ వ్లాగర్లు ప్రచారం కోసం చిన్నారులను కూడా వాడుకోవడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో తాము ఎలా కనిపిస్తామో తెలియని చిన్నారులను ప్రచారం కోసం ఉపయోగించుకోవడం ఎన్నో విధాలుగా నష్టం తెస్తుందని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లల చిత్రాలను షేర్ చేయడం హానికరం కాదని తల్లిదండ్రులు మొదట్లో భావించవచ్చు. కానీ, పిల్లలను గురించి అవసరం లేకున్నా ఎక్కువ మందికి తెలియడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చర్య పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడంతోపాటు, వారి మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అస్సాం పోలీసుల ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది అద్భుతం, నేటి తల్లిదండ్రులకు ఇలాంటి సందేశాలు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. అస్సాం పోలీసులు ఇటీవల సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ సినిమాలతో ప్రభావితమైన సైబర్ నేరగాళ్ల కృత్రిమ మేధ చిత్రాలను ట్వీట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. -
మునుగోడు యాక్షన్ ప్లాన్ రెడీ.. లక్ష మంది కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకముందే వినూత్నంగా ప్రచారంలోకి వెళుతోంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న ఆ పార్టీ నేతలు.. లక్ష మంది కాళ్లు మొక్కి ఓట్లడగాలని నిర్ణయించారు. ప్రచారం కోసం ఇప్పటికే 100 రోజుల కార్యాచరణ రూపొందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వయంగా కాళ్లు మొక్కి ఓట్లు అడిగే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సమాచారం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే గ్రామానికి ఓ సమన్వయకర్తను నియమించారు. రాజీవ్ జయంతిలో భాగంగా నియోజకవర్గంలోని 125 గ్రామాలు, పట్టణ ప్రాంతాలు కలిపి మొత్తం 176 చోట్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టీపీసీసీస్థాయి నేతలతోపాటు పలు జిల్లాల నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి ఐదుగురు నేతల చొప్పున పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే గ్రామానికి ఓ సమన్వయకర్తను నియమించగా, వారికి మరో నలుగురు నాయకులు తోడు కానున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వీరంతా గ్రామాల్లోనే ఉండి స్థానిక కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతిచోటా పేదలకు పండ్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం టీపీసీసీ పేరుతో సోనియా, రాహుల్‌గాంధీ చిత్రపటాలతోపాటు రాజీవ్‌గాంధీ బొమ్మ, హస్తం గుర్తుతో కూడిన బ్యాగ్‌ను కూడా రూపొందించారు. అదేవిధంగా మన మునుగోడు–మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు, కరపత్రాలు కూడా రూపొందించారు. ఈ స్టిక్కర్లు, కరపత్రాలను శుక్రవారం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జులు,ముఖ్య నేతలతో రేవంత్‌రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించనున్న మన మునుగోడు–మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నేతలు పార్టీ జెండాలు ఎగురవేసి రాజీవ్‌గాంధీకి నివాళులర్పించాలని, ఆయన దేశం కోసం చేసిన త్యాగం, సేవల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్లు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని, నాయకులను నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలను ఎదుర్కొనాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అందులోభాగంగా ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. తనతో సహా వెయ్యి మంది నాయకులు వంద మంది చొప్పున మొత్తం లక్ష మందికి పాదాభివందం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. చదవండి: మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..? -
మహమ్మారికి ‘మాస్క్’ దెబ్బ
సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో భాగంగా అధికారులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు నగర ప్రధాన కూడళ్లలో లారీపై కళాజాత నిర్వహిస్తూ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలంటూ పాటల రూపంలో వినిపిస్తున్నారు. చదవండి: కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా? -
వినూత్నం: బాయిలర్ కోడి, పెరుగు ప్యాకెట్లు
పశ్చిమగోదావరి: ఓటర్లను ఆకట్టుకోడానికి పోటీల్లో ఉన్న అభ్యర్థులు వినూత్న పద్ధతులు ఆవలంబిస్తున్నారు. ఉండి మండలంలోని ఒక గ్రామంలో వార్డు పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి ఆదివారం తన వార్డు పరిధిలోని ఓటర్లకు ఇంటింటికీ బ్రాయిలర్ కోడి, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, గృహావసర వస్తువులు పంపిణీ చేయడం పరిపాటి. అయితే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కొత్త ధోరణిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాంసాహార ప్రియులు ఆదివారం సాధారణంగా చేపలు, మాంసం కొనుగోలు చేస్తుంటారు. దీనిని గ్రహించిన వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఏకంగా ఒక్కొక్క ఇంటికి బ్రాయిలర్ కోడితో పాటు పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసి పోటీలో ఉన్న ప్రత్యర్థిని కంగు తినిపించారు. అదే మండలంలోని మరొక గ్రామంలో వార్డు పదవికి పోటీలో ఉన్న వ్యక్తి ఇంటి అవసరాలకు ఉపయోగపడే కిరాణా సరుకులను పంపిణీ చేశారు. (చదవండి: మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..) (చదవండి: బాబ్బాబూ.. పోటీలో ఉండండి చాలు..) -
చెప్పులు, చొక్కా లేకుండా ప్రచారం
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిన మోసాలకు నిరసనగా కాళ్లకు చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా, గుండు గీయించుకుని వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు. బీసీలపై జగన్‌కున్న ప్రేమ, బీసీ డిక్లరేషన్‌లో ఆయన ప్రకటించిన నిర్ణయాలు నచ్చి జగన్‌కు అండగా నిలుస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు, ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన మిరియం శ్రీనివాసులు జిల్లా అంతటా వినూత్నంగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. బీసీలను చంద్రబాబు వంచించారని, జిల్లాలో ఒక్క ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి జగన్ సీఎం అయ్యేంత వరకు జిల్లా అంతటా ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగడుతూ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు అన్ని గ్రామాలు తిరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి బీసీ ఇంటికి వెళ్లి జగన్ బీసీ కోసం చేస్తున్న కార్యక్రమాలు, అన్ని పదవుల్లో రిజర్వేషన్ కల్పించడం, బీసీ నిధులకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. -
ఆ జాబితాలో ముంబైకు చోటు
సాక్షి, ముంబై : ప్రపంచంలోని 100 అత్యంత వినూత్న నగరాల జాబితాలో భారత ఆర్థిక, వినోద రాజధాని ముంబైకి చోటుదక్కింది. టుథింక్నో అనే కమర్షియల్ డేటా ప్రొవైడర్ ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో జపాన్ రాజధాని టోక్యో అగ్రస్ధానంలో నిలిచింది. 2017లో ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో 90వ స్ధానంలో చోటు దక్కించుకున్న ముంబై ఈసారి 92వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఈ జాబితాలో మరో భారతీయ నగరం బెంగళూర్ 139వ స్ధానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ 316వ ర్యాంక్, ఢిల్లీ (199), చెన్నై (252), కోల్‌కతా (283), అహ్మదాబాద్ (345), పూణే (346), జైపూర్ (393), సూరత్ (424), లక్నో (442), కాన్పూర్ 9448), మధురై 452వ ర్యాంక్‌ను సాధించాయి. 2017లో టాప్ ఇన్నోవేటివ్ సిటీగా నిలిచిన లండన్ తాజా జాబితాలో రెండవ ర్యాంక్‌ను దక్కించుకుంది. టాప్ 10 నగరాల్లో శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లాస్ఏంజెల్స్, సింగపూర్, బోస్టన్, టొరంటో, పారిస్, సిడ్నీలున్నాయి. రోబోటిక్స్, త్రీడీ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో దూసుకుపోతున్న కారణంగానే లండన్, శాన్ఫ్రాన్సిస్కోలను అధిగమించి టోక్యో నెంబర్‌వన్‌గా నిలిచింది. -
మిస్ కాల్ కొట్టు..
డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. వినూత్న తరహాలో మిస్డ్ కాల్ కొట్టూ, అంటూ ఫ్యాన్సీ నంబర్‌గా 7220072200ను ప్రకటించారు. ఇక ఎన్నికల బరిలో దిగేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధమయ్యారు. సీట్ల పందేరానికి దళపతి స్టాలిన్ నేతృత్వంలో కమిటీని నియమించారు. * వినూత్నంగా కరుణ ప్రచారం * ప్రచారానికి 7220072200 ఫ్యాన్సీ నంబర్ * 22 నుంచి ఆశావహుల ఇంటర్వ్యూ * సీట్ల పందేరానికి ‘స్టాలిన్’ కమిటీ సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో ముందుకు సాగుతున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి అందరి కన్నా ముందుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లు వంటి మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్న కరుణానిధి, మంగళవారం తన ప్రత్యేక ప్రసంగం కోసం మిస్డ్ కాల్ కొట్టూ అంటూ ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ప్రకటించేశారు. వినూత్న రీతిలో ఆసక్తి గల వారు.. మిస్డ్ కాల్ కొట్టూ అంటూ మొబైల్ ఫోన్లలో ఈ ఫ్యాన్సీ నంబర్ ప్రత్యక్షం అవుతున్నాయి. దీనికి మిస్డ్ కాల్ ఇస్తే చాలు, కొన్ని క్షణాల్లో ల్యాండ్ లైన్ నంబర్ నుంచి కాల్ రావడం, నేను మీ..కరుణానిధి అంటూ ప్రసంగం, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ ముప్పై నిమిషాల పాటుగా ప్రచారం సాగుతుండడం గమనార్హం. అయితే, ప్రసంగం వినేందుకు ఓపిక ఉండాలే గానీ, మిస్డ్ కాల్ కొట్టిన వాళ్లకు మాత్రం ఎలాంటి చార్జీల భారం ఉండదు. ఇంటర్వ్యూలు : డీఎంకే తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దరఖాస్తుల పరిశీలన పర్వం ముగిసింది. ఇక, ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేసి, ఎన్నికల బరిలో దించేందుకు తగ్గ కసరత్తుల్లో కరుణానిధి నిమగ్నం అయ్యారు. ఈనెల 22 నుంచి 27వ తేది వ రకు అన్నా అరివాలయంలో ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేయనున్నారు. 22న ఉదయం తొమ్మిది గంటలకు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా, సాయంత్రం నాలుగు గంటలకు విరుదునగర్, తేని, దిండుగల్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 23న ఉదయం తొమ్మిది గంటలకు శివగంగై, మదురై, ఈరోడ్, సాయంత్రం నాలుగు గంటలకు నీలగిరి, కోయంబత్తూరు, సేలం, 24న ఉదయం తొమ్మిది గంటలకు పుదుకోట్టై, నామక్కల్, తిరుప్పూర్, సాయంత్రం నాలుగు గంటలకు కరూర్, పెరంబలూరు, అరియలూరు, 25న ఉదయం నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, కడలూరు, సాయంత్రం విల్లుపురం, ధర్మపురి , కృష్ణగిరి, 26న ఉదయం తిరువణ్ణామలై, వేలూరు, కాంచీపురం, సాయంత్రం తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఆశావహుల ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇక, 27వ తేది ఉదయం పుదుచ్చేరి, కారైక్కాల్లలోని ఆశావహుల ఇంటర్వ్యూలు జరుగుతాయని డీఎంకే కార్యాలయం ప్రకటించింది. స్టాలిన్ కమిటీ : బలమైన కూటమి లక్ష్యంగా డీఎంకే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌లు డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నాయి. ఇక, మరికొన్ని కుల, మైనారిటీ సామాజిక వర్గాల పార్టీలతో పాటుగా డీఎండీకే ఈ కూటమిలోకి వస్తుందన్న ప్రచారం సాగుతున్నది. ఈ పార్టీలతో పొత్తులు ఖరారు చేయడంతో పాటుగా, సీట్ల పందేరం కొలిక్కి తెచ్చేందుకు తగ్గట్టుగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో నాయకులు దురై మురుగన్, టీఆర్ బాలుల కమిటీని రంగంలోకి దించనున్నారు. -
ఓటేయడం ఒక పని కాదు... భాధ్యత