inquires CM
-
పూడిమడిక బీచ్‌లో విద్యార్థుల గల్లంతు ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పోలవరంపై చంద్రబాబు కొంగజపం పూడిమడక బీచ్‌లో అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారిని జగదీష్, యశ్వంత్, సతీష్, గణేష్, చందుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: మున్సిపల్ , అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. సురేష్‌తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. అస్వస్థతతో బాధపడుతున్న మంత్రికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసి యాంజియోప్లాస్టి చేశారు. చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’ -
అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడించారు. గ్యాస్ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు. చదవండి: అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్ లీక్! పలువురికి అస్వస్థత బ్రాండిక్స్‌లో ఒక యూనిట్లో పనిచేస్తున్న మహిళలను అందరిని ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడ నుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు. -
వీడు మామూలోడు కాదు.. విచారించాలంటూ పోలీసులకే లేఖ
సాక్షి, హైదరాబాద్: కేసుల దర్యాప్తు సందర్భంగా నిందితులతో పాటు అనుమానితులకూ నోటీసులు ఇస్తుంటారు. అయితే సిటీ సైబర్ క్రైం పోలీసులకు చిత్రమైన అనుభవం ఎదురైంది. రూ.60 లక్షల మోసం కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న మధ్యప్రదేశ్ వాసి ‘నన్ను పిలవండి.. విచారించండి’అంటూ లేఖ రాశాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆమె వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, ట్రేడింగ్ పేరిట రూ.5 లక్షలు తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఫోన్ చేసి తమ వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలో ఉన్న మొత్తం రూ.4 కోట్లకు చేరిందని చెప్పారు. అది బదిలీ చేయాలంటే ముందుగా బ్రోకరేజ్ చెల్లించాలని షరతు విధించారు. దీంతో దాదాపు రూ.60 లక్షలు బ్యాంకు ఖాతా ల్లోకి ఆ మహిళ బదిలీ చేశారు. తర్వాత వారి నుంచి స్పందన లేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రజత్ పటారియాను ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావించారు. తప్పుడు ధ్రువీకరణలతో సిమ్ వినియోగించడంతో చిరుమానా పట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చందన్నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో రజత్ ఉంటాడని తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. ఇటీవల ఓ పని కోసం చందన్నగర్ ఠాణాకు వెళ్లిన రజత్‌కు పలానా కేసులో అనుమానితుడిగా ఉన్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు. దీంతో సైబర్ క్రైం పోలీసులకు పోస్టు ద్వారా లేఖ పంపాడు. తనకు నోటీసులిస్తే వస్తానంటూ అందులో పేర్కొన్నాడు. -
జిల్లాల వివాదంపై సీఎం ఆరా
కలెక్టర్లతో సమావేశాలు.. 8 జిల్లాల ఏర్పాటు లాంఛనమే సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు ప్రధానంగా మూడు జిల్లాల్లో చిచ్చు పెట్టింది. వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రాంతాల వారీగా భిన్నాభిప్రాయాలు నెలకొనటంతో వివాదం ముదురుతోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో వివాదాస్పదంగా మారిన కేంద్రాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రెండు రోజులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త జిల్లాలపై కలెక్టర్లు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించటంతో పాటు ప్రజలు, ప్రజా ప్రతినిధుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, జనగాం.. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల, వనపర్తి.. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసే కొత్త జిల్లాలపై వెల్లువెత్తిన ఆందోళనలు, అభ్యంతరాలపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లపై ప్రత్యేక నివేదికను అందించాలని రెవెన్యూ ఉన్నతాధికారులు, సీఎస్‌కు సీఎం సూచించినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలనే ఆందోళన తీవ్రమవుతుండటంతో పరిస్థితిని అంచనా వేసేం దుకు సీఎం శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను పిలిపించి సమీక్ష జరిపారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డి.కె.అరుణ పట్టుబడుతున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజన ప్రక్రియపైనా ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. విపక్ష నేతలతోపాటు సొంత పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు తయారు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఎనిమిది జిల్లాలపై స్పష్టత: వివాదాస్పద కేంద్రాలను మినహాయిస్తే ఎనిమిది కొత్త జిల్లాల ప్రతిపాదనలు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. వాటికి సంబంధించిన సరిహద్దులు, మ్యాపులు తయారవుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, మెదక్‌లో సిద్దిపేట, నల్లగొండలో సూర్యాపేట, వరంగల్‌లో భూపాలపల్లి, ఖమ్మంలో కొత్తగూడెం, కరీంనగర్లో జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, మహబూబ్‌నగర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. వీటిని ప్రకటించటం లాంఛనమేనని, ఏయే ప్రాంతాలను వీటిలో కలపాలనే అంశంపైనే తుది కసరత్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలను జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి అందాయి.