inquiry commitee
-
దిశ ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్
సాక్షి, హైదరాబాద్/ షాద్‌నగర్/ శంషాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచా రం కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ హైదరాబాద్‌కు వచ్చింది. కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, సభ్యులు బాంబే హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా బాల్దోటా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ చీఫ్ బి.కార్తికేయన్లు ఆదివారం చటాన్‌పల్లిలోని దిశ ఎన్కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. త్రిసభ్య కమిటీతో పాటు ‘దిశ’హత్యాచారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) చైర్మన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, విచారణాధికారి (ఐఓ) జె.సురేందర్‌రెడ్డి, శంషాబా ద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, కమిషన్ తరుఫు న్యాయవాదు లు, కమిషన్ సెక్రటరీ కూడా ‘దిశ’సంఘటనా స్థలికి సంబంధించిన ప్రైవేట్ గెస్ట్‌హౌస్, తొండుపల్లి గేటు, చటాన్‌పల్లి ప్రాంతాలను సుమారు 6 గంటలపాటు సందర్శించారు. తొలుత నలుగురు నిందితులను దర్యాప్తు నిమిత్తం ఉంచిన ప్రైవేట్ గెస్ట్ హౌస్‌ను బృందం సందర్శించింది. ఆ తర్వాత ‘దిశ’ఘటనకు కారణమైన తొండుపల్లి గేటును పరిశీలించింది. దిశ స్కూటర్‌ను ఎక్కడ పార్క్ చేసింది? నిందితులు లారీని ఎక్కడ నిలిపి ఉంచారు? వంటి వివరాలపై డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రహరీలోకి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు 20 నిమిషాల పాటు బృందం అక్కడే గడిపింది. కాగా, తొండుపల్లి గేటు సమీపంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి త్రిసభ్య కమిటీని కలిశారు. తమకు కూడా ఒకరోజు సమయమివ్వాలని శ్రీధర్‌రెడ్డి కోరగా.. ‘మీ సమస్యలన్నీ మాకు తెలుసని.. మీకు న్యాయం జరుగుతుంది’అని కమిషన్ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుల తరఫున విచారణ వద్దు... సిర్పుర్కర్ కమిషన్ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సంద ర్శించి, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించింది. ‘దిశ’కేసు సమయం లో స్టేషన్లో రికార్డ్ల నిర్వహణ, విలేకరుల సమావేశం నిర్వహించిన సమావేశం గది, స్టేషన్‌లోని ఇతరత్రా ప్రాంతాలను పర్యవేక్షించింది. ఇదిలా ఉండగా.. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పుర్కర్ కమిటీ ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుందని, నిందితుల తరుఫున విచారణ చేయడమేంటని ప్రశ్నిస్తూ షాద్‌నగర్ పీఎస్ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ‘కమిషన్ గో బ్యాక్’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నేతలు స్టేషన్ ముందు బైఠాయించారు. చటాన్‌పల్లిలో ప్రతీ అంశం పరిశీలన.. షాద్‌నగర్ పీఎస్ నుంచి కమిటీ నేరుగా చటాన్‌పల్లికి చేరుకుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సుమారు గంటసేపు క్షుణ్నంగా పరిశీలించింది. సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం నిందితులను తీసుకొచ్చిన బస్ ఎక్కడ నిలిపారు? దిశ వస్తువులను ఎక్కడ పాతి పె ట్టారు? నిందితులు ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఆ సమయంలో పోలీసులు నిల్చున్న చోటు, ఎదురు కాల్పుల్లో నిందితుల మృతదేహాలు పడి ఉన్న దూరం.. వంటి ప్రతీ అంశంలోనూ కమిషన్ క్షుణ్నంగా వివరాలు సేకరించింది. ‘దిశ’ను దహనం చేసిన ప్రాంతాన్ని సాధ్యమైనంత దగ్గరికి వెళ్లి పరిశీలించింది. కాగా, ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ జరిగి డిసెంబర్ 6తో రెండేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2లోపు సుప్రీంకోర్ట్‌కు కమిషన్ నివేదికను సమర్పించే అవకాశముంది. -
వైద్యానికి వచ్చి అంధురాలై..
కాకినాడ క్రైం: రామచంద్రపురం డివిజన్ పరిధి కుందూరు పీహెచ్సీలో ఓ బాలికకు 2015లో అటెండర్ వైద్యం చేయడంతో చూపు కోల్పోయిన ఘటనపై శనివారం కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ జరిగింది. రాష్ట్ర కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనీల్ సింఘాల్ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో విచారణాధికారిగా జోన్–1 ఆర్‌డీఎంహెచ్‌ఎస్ జి.సావిత్రి, సహాయ విచారణాధికారిగా జోన్–1 ఇన్చార్జి డీడీ శ్రీనివాస్‌కుమార్ వ్యవహరించారు. చార్జి మెమోలు పొందిన వారిలో నాటి డీఎంహెచ్ఓ ఎం.సావిత్రమ్మ, స్టాఫ్ నర్సులు జె.ఉమా, వి.సుగుణ, ఎస్పీహెచ్ఓ దుర్గాప్రసాద్, మెడికల్ అధికారి బీజే ప్రవీణతో పాటు ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) ఎస్.ప్రవల్లిక ఉన్నారు. ఆ ఆరుగురి నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నామని సావిత్రి తెలిపారు. కుడి కన్ను కోల్పోయిన బాలిక గొల్లపల్లి ఉదయశ్రీ నాటి ఘటనపై లిఖిత పూర్వక సమాచారాన్ని అందించిందన్నారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. జరిగింది ఇదీ.. 2015 జనవరి 22న జరిగిన ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. ఆ రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కుందూరు పీహెచ్‌సీకి కంట్లో బురద నీరు పడటంతో అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ఉదయశ్రీ కుటుంబ సభ్యులతో కలసి వచ్చింది. ఆ సమయంలో వైద్యులు, నర్సులు గానీ అందుబాటులో లేరు. అక్కడే ఉన్న ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)గా పనిచేస్తున్న ఎస్.ప్రవల్లిక వైద్యం చేయాలని సిద్ధపడింది. సిరంజీకి సూదిగుచ్చి తోచిన వైద్యం చేయడానికి పూనుకుంది. ఈ క్రమంలో ఆ సూది నేరుగా బాలిక కుడి కంట్లో దిగబడిందని చెబుతున్నారు. తీవ్ర రక్తస్రావమై ఉదయశ్రీ తన కుడి కన్నును కోల్పోయింది. అప్పటి కలెక్టర్ అరుణ్‌కుమార్ ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. ప్రవల్లికతో పాటు అప్పటి డీఎంహెచ్ఓ, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎస్పీహెచ్ఓ, ఎంఓపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే వైద్యాధికారి ప్రవీణ అధికారిక పనులతోనే బయటకు వెళ్లడంతో క్రిమినల్ కేసు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఈ ఘటనపై ఇప్పటికే ఆర్డీఓ, కలెక్టర్ విచారణలు జరగ్గా శనివారం శాఖాపరమైన విచారణ పూర్తయింది. చదవండి: జనం ముందు కత్తులు.. తెర వెనుక పొత్తులు నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ -
‘జేఎన్‌యూ’పై నేడు విచారణ
న్యూఢిల్లీ: జేఎన్‌యూ లో ఫిబ్రవరి 9 నాటి వివాదాస్పద కార్యక్రమంపై విచారణ కోసం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ మంగళవారం బహిరంగ విచారణ జరపనుంది. వర్సిటీ పాలక భవనం వద్ద దీన్ని నిర్వహించనుంది. అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించడం గమనార్హం. కమిటీ మూడు అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తుందని జేఎన్‌యూటీఏ ప్రధాన కార్యదర్శి విక్రమాదిత్య చౌద్రీ చెప్పారు. దీనిపై అభిప్రాయాలు చెప్పేందుకు వర్సిటీ యంత్రాంగానికి కూడా ఆహ్వానం పంపారు. మరోవైపు, మనుస్మృతికి సంబంధించిన పత్రాలను ఎందుకు తగలబెట్టారో వివరణ ఇవ్వాలని జేఎన్యూకు చెందిన ఐదుగురు ఏబీవీపీ మాజీ విద్యార్థులకు వర్సిటీ నోటీసులివ్వగా, తగలబెట్టడంలో తప్పేం ఉందని వారు ఎదురు ప్రశ్నించారు. దేనిపైనైనా నిరసన వ్యక్తం చేయడం తమ హక్కు అని పేర్కొన్నారు. కాగా, వర్సిటీ అధికారులు.. తాజాగా అడ్మినిస్రేటివ్ భవనంపై జై భీమ్ అని రాసినందుకు జితేంద్ర కుమార్ అనే విద్యార్థికి నోటీసు జారీచేశారు.