instructs
-
ప్రాజెక్టుల్లో ‘ఆవిరి’ లెక్కలెంత..?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఆవిరి నష్టాలు (ఎవాపరేషన్ లాస్సెస్)పై కృష్ణా బోర్డు దృష్టి పెట్టింది. ప్రస్తుతం వేసవి సీజన్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో ఉండే ఆవిరి నష్టాల లెక్కలు తేల్చాలని నిర్ణయించింది. ఇప్పటికే తనవద్ద ఉన్న వివరాలతో ఆవిరి నష్టాలను అంచనా వేసిన కృష్ణాబోర్డు, దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలను సైతం కోరింది. ఈ నష్టాలను లెక్కిస్తున్న తీరు, ఇంతవరకు జరిగిన ఆవిరి నష్టాలపై తమకు నివేదిక సమర్పించాలని కోరుతూ గురువారం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఇందులో ప్రాజెక్టు ల నుంచి గత ఏడాది జూన్నుంచి ఇంతవరకు రెండు ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదల, ప్రవాహాలు, విద్యుత్ వినియోగం, నిల్వలు తదితర వివరాల ఆధారంగా ఆవిరి నష్టాలపై తన అభిప్రాయాన్ని తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో గత ఏడాది జూన్నుంచి ఫిబ్రవరి చివరి వరకు 50 రోజులు ఎలాంటి ఆవిరి నష్టాలు లేవని, 128 రోజుల్లో మాత్రం 300 క్యూసెక్కులు అంతకుమించి ఆవిరి నష్టం ఉందని తెలిపింది. ఆగస్టు, అక్టోబర్ మధ్యలో ఆవిరి నష్టాలు 450 నుంచి 900 క్యూసెక్కుల మేర ఉన్నాయంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 2016–17లో 7.40 టీఎంసీ, 2017–18లో 3.02, 2018–19లో 4.07, 2019–20 (ఫిబ్రవరి) వరకు 6.65 టీఎంసీలుగా ఉందని బోర్డు వెల్లడించింది. ఇక సాగర్ పరిధిలో 143 రోజుల పాటు 300 క్యూసెక్కులకు పైగా ఆవరి నష్టాలున్నాయని బోర్డు వెల్లడించింది. ఇక 2016–17లో 10.58, 2017–18లో 8.88, 2018–19లో 11.66, 2019–20లో 7.64 టీఎంసీల మేర ఆవిరి నష్టాలున్నాయని తెలిపింది.తెలుగు రాష్ట్రాలు 2019–20 ఏడాదిలో ఏ మేరకు ఆవిరి నష్టాలు గమనించాయో తమకు తెలియజేయాలని కోరింది. -
ఎన్నికల షెడ్యూల్ కు సిద్ధం కండి!
-
ఎన్నికల షెడ్యూల్ కు సిద్ధంకండి!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ ఐదు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తమ పోల్ షెడ్యూల్ ప్రకటనకు సిద్ధంగా ఉండాలని సూచించింది. షెడ్యూల్ ప్రకటన రాగానే ప్రవర్తన నియమావళి అమలుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఎన్నికలు జరగనున్నఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల కేబినెట్ కార్యదర్శులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. జనవరి 4వ తేదీన ఈ పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశలుగా యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఒకరోజు ఎన్నికల జరగనున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిబంధనల జాబితాను జారీ చేసింది. ప్రచారం కోసం అధికారిక వాహనాల ఉపయోగాన్ని తొలగింపు, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు నుంచి రాజకీయ కార్యనిర్వాహకుల చిత్రాలు తొలగింపు, అధికారి పార్టీ ప్రకటనలకు ప్రజాధనం వాడకంపై నిషేధం తదితర నిబంధనలను పంపించింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రీ-యోగ్యతకు సంబంధించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు గుర్తు చేసింది. కాగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ మే 27తో, మిగిలిన నాలుగురాష్ట్రాల అసెంబ్లీ గుడువు మార్చితో ముగియనున్న సంగతి తెలిసిందే.