Insurance compensation
-
బీమా పరిహారం చెల్లింపుపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, అమరావతి: ప్రమాద బీమా పరిహారం పెంపు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బాధిత కుటుంబం అప్పీల్ దాఖలు చేయకపోయినప్పటికీ, ఆ తీర్పుపై బీమా కంపెనీ దాఖలు చేసే అప్పీల్లో సైతం పరిహారం మొత్తాన్ని పెంచుతూ తీర్పు ఇచ్చే అధికారం తమకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో కోరిన మొత్తం కంటే ఎక్కువ పరిహారంగా నిర్ణయించే అధికారం కూడా తమకు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఓ ప్రమాదంలో బాధితుని కుటుంబానికి రూ.1.79 లక్షల పరిహారం చెల్లించాలన్న ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవరించింది. పరిహారం మొత్తాన్ని రూ.5.89 లక్షలకు పెంచింది. ఇందులో ఇప్పటికే చెల్లించిన రూ.1.79 లక్షలకు అదనంగా రూ.4.10 లక్షలను బాధిత కుటుంబానికి చెల్లించాలని బీమా కంపెనీతో పాటు, ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువరించారు. కేసు పూర్వాపరాలివీ గుంటూరు జిల్లా అమరావతికి చెందిన లలూనాయక్ అనే వ్యక్తిని 2005లో ఆటో అతి వేగంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో లలూనాయక్ మరణించగా.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రూ.2 లక్షలను పరిహారంగా ఇప్పించాలని మృతుని కుటుంబ సభ్యులు ప్రమాద బీమా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ బాధిత కుటుంబానికి రూ.1.79 లక్షలను పరిహారంగా చెల్లించాలని బీమా కంపెనీని, ఆటో డ్రైవర్‌ను ఆదేశిస్తూ 2007లో తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ గుంటూరు డివిజనల్ మేనేజర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా.. జస్టిస్ దుప్పల వెంకటరమణ విచారణ జరిపారు. బీమా కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ట్రిబ్యునల్ ఇచ్చిన పరిహారాన్ని రద్దు చేయాలని కోరారు. వాహనం నడిపే సమయంలో ఆటో డ్రైవర్‌కు సరైన లైసెన్స్ లేదన్నారు. మృతుడి భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన పరిహారాన్ని పెంచాలని కోరారు. మృతుని ఆదాయాన్ని నెలకు రూ.1,200గా పరిగణిస్తూ ట్రిబ్యునల్ బీమా పరిహారాన్ని నిర్ణయించిందన్నారు. మృతుడి ఆదాయాన్ని నెలకు రూ.4,500గా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ట్రిబ్యునల్ తీర్పుపై బాధిత కుటుంబం అప్పీల్ దాఖలు చేయకపోయినా పరిహారం మొత్తాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబానికి జరిగే నష్టాన్ని ట్రిబ్యునల్ సరైన కోణంలో పరిశీలించలేదని ఆక్షేపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ట్రిబ్యునల్ నిర్ణయించిన రూ.1.79 లక్షల పరిహారాన్ని రూ.5.89 లక్షలకు పెంచుతున్నట్టు తీర్పులో పేర్కొన్నారు. -
YSR Uchitha Pantala Bheema Scheme: రైతుకు అండగా.. సీఎం వైఎస్ జగన్ పవర్ ఫుల్ స్పీచ్
-
YSR Free Crop Insurance: 15.61 లక్షల మంది ఖాతాల్లోకి రూ. 2997.82 కోట్ల బీమా జమ
-
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా గురించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగం
-
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-
రైతు స్పీచ్ కు ఫిదా.. సెల్ఫీ దిగిన సీఎం జగన్
-
వ్యవసాయం గురించి కలెక్టర్ అద్భుతమైన స్పీచ్
-
వైఎస్ జగన్ నాయకత్వంలో ఇళ్ల ముగింటకే సంక్షేమం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
Sri Satyasai Dist: సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
బీమా.. ఏదీ ధీమా?
సాక్షి, ఎర్రగుంట్ల : రెండేళ్లు గడిచినా భవన నిర్మాణ కార్మికులకు బీమా పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. బడ్జెట్లో నిధుల నిల్వ ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మొండిచేయి చూపిస్తోంది. భవన నిర్మాణ కార్మిక రంగానికి అధిక ప్రాధాన్యత, కార్మికుల కష్టాన్ని వమ్ము చేయమని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం వారి బాగోగులను పట్టించుకోవటం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల్లో తాపీ, పెయింటర్లు, రాడ్ బిల్డింగ్, ఆగర్లు, కార్పెంటర్లతోపాటు 31 విభాగాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపు పొందిన వారు సుమారు 20 వేల మంది ఉన్నారు. గుర్తింపు పొందని వారు వేలల్లో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు, యూనియన్లు ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి వివాహ కానుక, ప్రమాద బీమా, ప్రసూతి ఆనారోగ్యానికి సంబంధించి పథకాలను అమలు చేయించుకోగలిగారు. వివాహం కానుకగా రూ.10వేలు, ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు, ప్రసూతి నిమిత్తం రూ.5వేలు, ఆనార్యోగం సంభవిస్తే రూ.9వేలు భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాలి. ప్రస్తుతం నియోజకవర్గంలో చాలా మంది భవన నిర్మాణ కార్మికులు బీమా పరిహారానికి పూర్తి స్థాయిలో నోచుకోలేదు. ప్రభుత్వం వద్ద ఉన్న కోట్లాది రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధి ఉంది. ఆ నిధి నుంచి టీడీపీ ప్రభుత్వం దోమతెరలు, చలివేంద్రాలు, చంద్రన్న బీమా కార్యక్రమాలకు మళ్లించిందని కార్మికులు, యూనియన్లు ఆరోపిస్తున్నారు. ఆదరణ పథకం గాలిలోనే భవన నిర్మాణ కార్మికులకు ఆదరణ పథకం ద్వారా లబ్ధి అంతంత మాత్రంగా ఉంది. కార్మికుల ఉపాధి,భవన నిర్మాణ సామగ్రి కోసం ఆదరణ పథకం ఏర్పాటు చేశారు. అయితే ఈ పథ«కం కింద ఇంటర్వ్యూలకు వెళ్లినా ఇంత వరకు వారికి సామగ్రి ఇవ్వలేదు. ఎంపికైన వారి నుంచి రూ.2వేలు కట్టించుకున్నారని కార్మికులు చెబుతున్నారు. ప్రతిబంధకంగా నిబంధనలు గతంలో భవన నిర్మాణ కార్మికుల ఇంట్లో పెళ్లయితే దరఖాస్తుకు ఫోటో జతపరిస్తే సరిపోయేది. ప్రస్తుతం గ్రామ కార్యదర్శి సంతకం ఉండటమే కాకుండా మగపెళ్లి వారు గ్రామ కార్యదర్శి సంతకం, ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత వ్యక్తులు కావాలన్న నిబంధన విధించారు. దీంతో అనేక మంది బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేయటానికి వెనకాడుతున్నారు. ప్రభుత్వం స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తనిఖీ చేసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు బీమా సదుపాయం మంజూరు చేయాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. కార్మికుల నడ్డివిరగకొట్టడమే అనునిత్యం కాయాకష్టం చేస్తున్న కార్మికులకు వర్తించే సంక్షేమ నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించింది. ఈ చర్య కార్మికులు, వారి కుటుంబ సభ్యుల జీవన విధానానికి అడ్డుతగలడమే. ఈ విధానంతో కార్మికులు నడ్డివిరగకొడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భనవ నిర్మాణ కార్మికులకు బీమా, పరిహారం అందజేయాలి. – ఎస్.రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎర్రగుంట్ల -
కచ్చితంగా పంట నష్టం అంచనా!
• ఉపగ్రహ పరిజ్ఞానం వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే • పరిజ్ఞానాన్ని రూపొందించిన ‘ఇరి’... ఇప్పటికే తమిళనాడులో అమలు • ప్రతి ఎకరా భూమినీ పరిశీలించొచ్చు • నష్టం జరిగిన 15 రోజుల్లోనే అంచనా.. వెంటనే రైతుకు బీమా పరిహారం • నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఏటా రైతులు కరువు, భారీ వర్షాలు, వడగళ్ల వంటి ఏదో ఓ సమస్యతో నష్టపోతూనే ఉన్నారు. పంట నష్టం ఎంత అనేదానికి కచ్చితమైన అంచనా ఉండడం లేదు. స్థానిక అధికారులు వెళ్లి పరిశీలించడం.. పంట కోత ప్రయోగాలు చేయడం జరుగుతోంది.. ఇందుకు నెలలకొద్దీ సమయం పట్టడంతోపాటు బీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులకు సరిగా పరిహారం చెల్లించడం లేదు. ఇటువంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు ఫిలిప్పీన్‌సలోని ‘అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఇరి)’ ఉపగ్రహ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. వరి దిగుబడి, ధాన్యం రంగు మారితే తెలుసుకోవడం, చీడపీడలతో పంట దెబ్బతినడం వంటివాటన్నింటినీ ఈ పరిజ్ఞానంతో తెలుసుకోవడానికి వీలవుతుంది. తాజాగా దీనిని తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణరుుంచింది. ఇప్పటికే తమిళనాడులో అమలవుతున్న ఈ పరిజ్ఞానంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల బృందం ఇటీవలే అధ్యయనం చేసి వచ్చింది. ఆ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 24.65 లక్షల ఎకరాలుకాగా.. ఈ పరిజ్ఞానం అమలు కోసం మూడేళ్లకు రూ.7.4 కోట్లు ఖర్చవుతుంది. అరుుతే తొలుత దీనిని నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ రెండు జిల్లాలో రూ.16 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. 12 రోజులకోసారి ఉపగ్రహ చిత్రాలు ‘ఇరి’ అభివృద్ధి చేసిన ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే.. ముందుగా సంబంధిత గ్రామాల వారీ భూముల వివరాలు, వాటి సారం, విస్తీర్ణం, నీటి లభ్యత, రైతుల సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ‘ఇరి’ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. ఇందుకోసం ‘ఇరి’ శాస్త్రవేత్తల బృందం ఫిలిప్పీన్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక లేబొరేటరీని ఏర్పాటు చేస్తుంది. మూడేళ్లలో ఒక ఎకరా భూమికి రూ.30 చొప్పున ఫీజు వసూలు చేస్తుంది. తర్వాత అభివృద్ధి పరిచిన లేబొరేటరీని ప్రభుత్వానికి అప్పగిస్తుంది. మొత్తం ఉపగ్రహ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, దానికి సమాచారాన్ని అనుసంధానం చేశాక... రైతు వారీగా, గ్రామం వారీగా, మండలం వారీగా ప్రతి 12 రోజులకోసారి వరి పంటల ఛాయాచిత్రాలు ఉపగ్రహం ద్వారా లేబొరేటరీకి అందుతారుు. వాటిని విశ్లేషించి పంట దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశముంది, కరువు వల్ల దిగుబడి తగ్గుతుందా, వరదలు వడగళ్ల వర్షం వంటివాటితో ధాన్యం రంగు మారిందా... తదితర అంశాలను 90 శాతం కచ్చితంగా అంచనా వేస్తారు. ఈ పరిజ్ఞానం నష్టం జరిగిన 15 రోజుల్లోపులోనే సమగ్ర వివరాలను అందజేస్తుంది, ప్రతీ ఎకరా భూమిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. ఆ ప్రకారం రైతులకు ఆయా కంపెనీలు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుండదని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది ఉపగ్రహ ఆధారిత పరిజ్ఞానంతో కూడిన సమాచారంతోనే రైతులకు పంటల బీమా అందజేయాలని నిర్ణరుుంచడంతో.. అక్కడ అనేక ప్రైవేటు కంపెనీలు టెండర్లో పాల్గొనలేదని ఓ అధికారి తెలిపారు. కేవలం ప్రభుత్వ బీమా కంపెనీయే ముందుకు వచ్చిందని చెప్పారు. ఇతర పంటలకు కూడా వర్తింపజేస్తాం ‘ప్రస్తుతం వరి పంటకు మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో కీలక పంటలైన పత్తి, మొక్కజొన్న, సోయాలకు కూడా అమలుచేసే ఆలోచన ఉంది. దీనికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం వెతుకుతాం. ప్రస్తుత రబీలో వరి పంటకు ప్రయోగాత్మకంగా అమలుచేయాలని అనుకుంటున్నాం..’’ -పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి -
కరువు రైతుకు చేయూత ప్రశ్నార్థకమే
గత ఖరీఫ్‌లో 1.18 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట నష్టం రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు అధికారుల నివేదిక రూ.108 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందించాలని ప్రతిపాదనలు నోరుమెదపని సర్కారు గత ఖరీఫ్‌లో వర్షాభావంతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ.. బీమా పరిహారం మంజూరు ప్రశ్నార్థకంగా మారాయి. సర్కారు దాటవేత వైఖరి అనుసరిస్తోంది. బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహిస్తారు.. ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం చెల్లింపులకు ఎన్ని నిధులు కేటాయిస్తారన్నది వెల్లడైతేనే వాటి మంజూరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబరు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాల్లేవని ప్రభుత్వం చెబుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతి: గత ఖరీఫ్‌లో 1,36,400 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువగా 1.18 లక్షల హెక్టార్లలో మాత్రమే వేరుశెనగ పంటను సాగు చేశారు. వేరుశెనగ సాగు రైతులకు తీవ్ర నష్టాలను మిగి ల్చింది. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టుబడులు, దిగుబడుల రూపంలో రూ.వెయ్యి కోట్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాగం అప్పట్లో నివేదిక పంపింది. పంట నష్టపోయిన 1.2 లక్షల మంది రైతులకు రూ.108 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీగా అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 2010 ఖరీఫ్ నుంచి వేరుశెనగ పంటకు వాతావరణ బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. ప్రీమియం కింద రైతులు రూ.23 కోట్లకుపైగా బీమా సంస్థకు చెల్లించారు. వర్షాభావ పరిస్థితుల రీత్యా పంట నష్టపోయిన నేపథ్యంలో వాతావరణ బీమా కింద కనీసం రూ.60 కోట్లకు పైగా పరిహారాన్ని వేరుశెనగ రైతులకు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. సీఆర్ఎఫ్ (కెలామిటీ రిలీఫ్ ఫండ్) నిధులతో ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వం సీఆర్‌ఎఫ్‌కు 55 శాతం నిధులను సమకూర్చితే తక్కిన 45 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టాయి. ఆ బడ్జెట్లో ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం మంజూరుకు నిధులు కేటాయించలేదు. జూలై 10న 2014-15కు సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. కానీ శాసనసభలో ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ ప్రవేశ పెడుతుందన్న అంశంపై స్పష్టత లేదు. సెప్టెంబరు వరకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కనీసం సెప్టెంబరులో ప్రవేశపెట్టే బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన మేరకు నిధులు కేటాయిస్తేనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం మంజూరయ్యే అవకాశం ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించి.. భవితపై భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం దాటవేత వైఖరి అనుసరిస్తోండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.