inter-caste marriages
-
కుల నిర్మూలన ఇలాగేనా?
ఆర్ఎస్ఎస్ నాయకులు కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను కూడా వారు వివరించాలి. ప్రస్తుత మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వ విద్యాలయాల్లో కులతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకూ దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. జాతీయ స్థాయిలో కుల గణనను డిమాండ్ చేస్తూ, ద్విజ ఆధిపత్యం కలిగిన సమాజంలో తమ చారిత్రక స్థానం పట్ల స్పృహను ప్రదర్శిస్తూ, తమ సంఖ్య గురించి శూద్ర/ఓబీసీలు చైతన్యాన్ని చూపుతున్న నేపథ్యంలో– ఎట్టకేలకు, ఆర్ఎస్ఎస్ బహిరంగ వేదికలపై కుల నిర్మూలన గురించి మాట్లాడుతోంది. కుల నిర్మూలన కోసం దత్తాత్రేయ çహొసబలే, ఇతర నాయకులు దళితులు, శూద్రులకు ఆలయ ప్రవేశాన్ని, నీటి హక్కు లను గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ రెండు అంశాలూ కాలం చెల్లినవి మాత్రమే కాదు, ఇవి సామాజిక వివక్షను తొలగించే అవకాశం లేదు. రెండు సామాజిక వ్యవస్థల శక్తి మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థలలో కుల తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఆహార సాంస్కృతిక ఘర్షణలకు దారి తీస్తుంది. కులాల మధ్య విభజితమైన ఆహార సంస్కృతి కూడా కులాంతర వివాహాలకు అడ్డుగోడగా నిలుస్తో్తంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. వివాహం, ఆహార సాంస్కృతిక కండిషనింగ్ అనేవి, సామాజిక బృందాలను ఏకం చేయగలవు లేదా విభజించగలవు కాబట్టి వాటిని నేను ఉద్దేశపూర్వకంగానే శక్తి అని పిలుస్తాను. కుల వివాహ వ్యవస్థ, సామా జికంగా వేర్పాటుతో కూడిన ఆహార సాంస్కృతిక పరంపర అనేవి వేయి సంవత్సరాలుగా దేశంలో కుల అంతరాలను కొనసాగించాయి. కుల కేంద్రకమైన వివాహ వ్యవస్థ అనేది వ్యక్తుల డీఎన్ఏను కుల ప్రాతిపదికన విభజించడానికి ఉద్దేశించబడింది. గత వందేళ్ల ఆర్ఎస్ఎస్ ఉనికిని చూసినట్లయితే, కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలను అది ప్రోత్సహిస్తుందనడానికి వారి రచనల్లో గానీ, నాయకుల ప్రసంగాల్లో గానీ ఎలాంటి ఆధారాలు లేవు. కులాంతర వివాహం వివిధ వృత్తులు కలిగిన రెండు వేరు వేరు వర్గాల మధ్య రక్త సంబంధాలను మార్పిడి చేస్తుందని డా. బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు. ఇది ఇద్దరు భాగస్వాముల కులాన్ని బలహీనపరచడమే కాకుండా, వారి సంతానపు మానసిక, శారీరక సామర్థ్యాలను మెరుగు పరుస్తుంది. బహుశా అలాంటి కులాంతర వివాహాన్ని రుజువు చేయడానికి ఆయన సవితా అంబేడ్కర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. సాధారణంగా పాశ్చాత్య సంస్కృతితో మాంసాహారం తినే దళితుడు, భారతీయ వాతావరణంలో మాత్రమే పెరిగిన బ్రాహ్మణ స్త్రీ తమ వైవాహిక జీవి తంలో ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు అనే సమాచారం మన వద్ద లేదు. అంబేడ్కర్, సవిత తమ ఆహారాన్ని పూర్తి శాకాహారంగా గానీ, మిశ్రమ ఆహారంగా గానీ మార్చుకుని ఉండొచ్చు. లేదా ఎదుటివారి ఆహార ఎంపికను మరొకరు గౌరవించి ఉండొచ్చు. ప్రస్తుత వ్యవస్థలో కులాంతర వివాహం అన్ని కులాలకు చెందిన భారతీయ యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున కులాంతర వివాహాల పరిధి పెరుగుతోంది. అవి జరుగుతున్నాయి కూడా. కానీ కులాంతర వివాహాలను సాధారణంగా తల్లిదండ్రులు అంగీకరించరు. ఎందుకంటే ఇది సామాజిక కళంకాన్ని తీసుకొస్తుంది. అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఒక భాగస్వామి దళి తుడు, మరొకరు దళితేతరులు అయినప్పుడు అలాంటి వివాహితు లను చంపడం ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శకంగానూ, భారతదేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగానూ ఉన్న ఆర్ఎస్ఎస్ ఈ సమస్యతో ఎలా వ్యవహరిస్తుందో సమాజానికి తెలియదు. ఈ సంస్థ నాయకులు సనా తన ధర్మం లేదా హిందూ సంప్రదాయం గురించి నిరంతరం మాట్లాడుతుంటారు. కులాంతర వివాహాలు సనాతన ధర్మంలో లేక హిందూ సంప్రదాయంలో భాగమేనా అన్నది వాళ్లు స్పష్టం చేయాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కుల నిర్మూలన ఒక క్లిష్టమైన యత్నం. కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను, సాధనాలను వివరించాలి. కులాలు, మాంసాహారం, శుద్ధ శాకాహారులు కుల వ్యవస్థ భారతీయుల మధ్య భోజనాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. శతాబ్దాలుగా దేశంలోని వివిధ కులాల ప్రజలు పక్క పక్కనే కూర్చుని భోంచేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్ వ్యవస్థలు కుల రహితంగా తినే వీలును కల్పించాయి. కానీ గ్రామాల్లో ఇప్పటికీ ఇది పెద్ద సమస్య. అనేక పాఠశాలల్లో దళితులు వండిన ఆహారాన్ని దళితేతరులు తినడం లేదు. ఈ పరంపరకు వ్యతి రేకంగా ఆర్ఎస్ఎస్ స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు. శాకాహారం, మాంసాహారం అనే సమస్య ప్రస్తుతం చాలా ఐఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో తీవ్రమైన సమస్యగా మారింది. కొంతమంది కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ శాకాహార సంస్కృతిలో భాగమయ్యారు. పైగా వారు పూర్తి శాకాహార మెనూని అవలంబించాలని ఆయా సంస్థలను కోరుతున్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో, విశ్వ విద్యాలయాలలో శాకాహారం మాత్రమే అందించాలని ఆదేశాలను పంపిన మొదటి విద్యా మంత్రి స్మృతి ఇరానీ. ముంబై ఐఐటీతో సహా ఇతర ఐఐటీల అధిపతులు శాకాహారం, మాంసాహారం తినేవారికి వేర్వేరు వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటన్నింటికీ కారణం సనాతన ధర్మాచరణకు చెందిన శాకాహార భావజాలమే. ముస్లింలను, క్రైస్తవులను విడిచిపెట్టండి... శూద్రులు, దళితులు, ఆదివాసీలు భారతదేశంలో ప్రధానంగా మాంసాన్ని, లభ్యత ఆధారంగా శాకాహారాన్ని తినడం ద్వారా జీవిస్తున్నారు. కానీ పండుగ సందర్భాలలో వారికి ఇష్టమైనది మాంసాహారమే. ఆహార సాంస్కృతిక పరంపరలో స్పష్టమైన కుల వర్ణ విభజన ఉంది. ఆర్ఎస్ఎస్ తన స్వచ్ఛమైన శాకాహార సంస్కృతిని వదులుకుంటుందా? బహిరంగ, వ్యక్తిగత ప్రదేశాలలో ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినడం గురించి ఏ వైఖరిని తీసుకుంటుంది? హిందూ లేదా హిందూత్వ ఆహార సంస్కృతి ఏమిటి? ఇది స్వచ్ఛమైన శాకాహారమా లేదా వ్యక్తిగత ఎంపిక ఆధారంగా మిశ్రమ ఆహారమా? వ్యక్తిగత ప్రాధాన్యాల ఆధారంగా ఆహార సంస్కృతిని ప్రజా స్వామ్యీకరించడం కుల నిర్మూలన చర్యల్లో ఒకటి. కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కుటుంబాల ఆహార స్వేచ్ఛ గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసీలందరూ మాంసాహారాన్ని తింటుంటారు. బ్రాహ్మణులు, వైశ్యులు కులపరంగా శాకాహారులు. వారి పిల్లలకు అలాగే తినేలా శిక్షణ ఇస్తారు. ఈ పద్ధతులను ప్రస్తావించకుండా ఆర్ఎస్ఎస్ కులాన్ని ఎలా నిర్మూలిస్తుంది? కుల నిర్మూలనకు దశలవారీగా ఉపయోగపడే నాలుగు సామాజిక సాధనాలను నేను గుర్తించాను. వాటి గురించి ఈ సంస్థ మౌనంగా ఉంది. 1) తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకు దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దళితులు, ఆదివాసీలు, శూద్రులతో సహా అన్ని కులాల కోసం వాటిల్లో ప్రవేశానికి హక్కు కల్పించేలా ధార్మిక పాఠశాలలను, కళాశాలలను తెరవాలి. 2) చర్మశుద్ధి నుండి కుండల తయారీ వరకు అన్ని వృత్తుల గౌరవం పెరిగేలా బోధనా సామగ్రిని రూపొందించాలి. 3) దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. 4) మాంసాహారం, శాకాహారంతో సంబంధం లేకుండా ఇతరుల ఆహార ఎంపికను గౌరవిస్తూ కలిసి భోంచేసేలా చూడాలి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుతో సహా, శుద్ధ శాకాహారమే హిందూ లేదా భారతీయ ఆహార సంస్కృతిగా జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలి. కుల నిర్మూలన గురించి ఆర్ఎస్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలపై తన వైఖరిని స్పష్టంగా తెలియ జేయాలి. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
గొప్ప ప్రేమికుడిగా ఉండు
న్యూఢిల్లీ: మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. అయితే కొందరు యువకులు దురుద్దేశంతో ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటున్నారనీ, అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు గతేడాది 23 ఏళ్ల హిందూ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం హిందూ మతంలోకి కూడా మారాడు. అయితే తమ కుమార్తెను ట్రాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించడంతో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును బుధవారం విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎంఆర్ షాల ధర్మాసనం స్పందిస్తూ..‘మేం యువతి భవిష్యత్ గురించే ఆందోళన చెందుతున్నాం. సుప్రీంకోర్టు కులాంతర, మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు. ఇలాంటి వివాహాలను వాస్తవానికి ప్రోత్సహించాలి. మీరు నమ్మకమైన భర్తగా, గొప్ప ప్రేమికుడిగా వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా యువతి తండ్రి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘హిందూ యువతులను ట్రాప్ చేసేందుకు ఓ ముఠా పనిచేస్తోంది. యువతితో వివాహం కోసం ముస్లిం యువకుడు మతం మారడం సిగ్గుచేటు. ఆర్యసమాజ్‌లో యువతితో వివాహం కోసం మతంమారిన యువకుడు ఇప్పుడు ఇస్లాం మతాన్ని తిరిగి స్వీకరించాడు. ఆమెకు ఎలాంటి భద్రత అవసరంలేదు. కాబట్టి యువతి తన తల్లిదండ్రులతోనే కలిసిఉండేలా ఆదేశాలివ్వండి’ అని కోరారు. అయితే దీన్ని యువతి వ్యతిరేకిస్తున్నట్లు ఆమె భర్త తరఫున లాయర్ కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ కేసులో యువతి ఇంప్లీడ్ అయ్యేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో సెప్టెంబర్ 24లోపు తమ స్పందనను తెలియజేయాలని యువతితో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. -
వ్యక్తి ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమా?
హైదరాబాద్ : కులాంతర వివాహాల కోసం తన జీవితాంతం పోరాటం చేస్తానని గత ఏడాది మిర్యాలగూడలో సంచలనాత్మక రీతిలో హత్యకు గురైన ప్రణయ్ సతీమణి అమృత అన్నారు. ప్రస్తుతం పలువురు కులదురహంకార ధోరణితో వ్యక్తుల ప్రాణాలకుంటే కులానికే ప్రాధాన్యమివ్వడం దారుణమన్నారు. అందరి సహకారం వల్లనే తాను ఎంతో ధైర్యంతో బయటకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుశ్రుత, దేవార్ష్ల న్యాయ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న ‘కులదురహంకార హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం–బాధితులకు న్యాయం కోసం జరగాల్సిన ఉద్యమం మన కర్తవ్యాలు’అనే అంశంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమృ త మాట్లాడుతూ.. ప్రణయ్ హత్యలో భాగస్వాములైన 8 మందిలో ఒక్కరే జైలులో ఉన్నారని, మిగతా వారంతా బయట తిరుగుతున్నారని, అందరికీ శిక్ష పడేవరకు తాను రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. కులదురహంకార హత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే శక్తివంచన లేకుండా పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రేమ పేరుతో ఒక్కరు మోసం చేస్తే అందరూ అలా చేస్తారని భావించవద్దన్నారు. వ్యక్తుల ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమివ్వడం సరైంది కాదన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అనేక మంది బాధితులు తమకు డబ్బులు కాదు.. న్యాయం కావాలని కోరుకుంటున్నారన్నారు. సామాజిక వేత్త సాంబశివరావు మాట్లాడుతూ.. జనగామ జిల్లా గూడూరు మండ లానికి చెందిన సుశృత, ఆమె నాలుగేళ్ల కుమారుడు దేవార్ష్లను అతి కిరాతకంగా హత్య చేశారని, ఇలాంటి వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు. కులనిర్మూలన సంఘం నేత గాంధీ మాట్లాడుతూ ఇప్పటివరకు 50 కులదురంహంకార హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాల ప్రోత్సాహానికి గాను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ... తన కొడుకుదే చివరి హత్య కావాలని కోరుకున్నానని కానీ ఇంకా అలాంటి హత్యలే కొనసాగడం బాధాకరమన్నారు. తన కోడలు అమృత చేస్తున్న పోరాటం అమోఘమైందని ఆమె తన కూతురైతే పాదాభివందనం చేసేవాడినన్నారు. కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, తదితరులు పాల్గొన్నారు. -
కులాంతర వివాహం చేసుకుంటే చంపేస్తారా!
సాక్షి, హైదరాబాద్: కులాంతర వివాహాలు చేసుకున్నవారిపై జరుగుతున్న దాడులపట్ల ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతికయుగంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొంది. మిర్యాలగూడ, అమీర్‌పేట్‌లో చోటు చేసుకున్న వరుస ఘటనలపై ఆరా తీసిన సభ్యులు పైవిధంగా స్పందించారు. వీటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షలకు పెంచిందని, కానీ రాష్ట్రంలో కేవలం రూ.50 వేలు మాత్రమే ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మొత్తాన్ని అర్హులకు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, ఆ వర్గాల ఆర్థిక, సామాజికాభివృద్ధిని అధ్యయనం చేసేందుకు తొమ్మిది మంది ఎంపీలతో కూడిన పార్లమెంటరీ కమిటీ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం రామోజీఫిల్మ్ సిటీలోని ఓ హోటల్లో పార్లమెంటరీ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ సీతారాం నాయక్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషితోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాల పురోగతిని అడిగి తెలుసుకుంటూనే వివిధ అంశాలపై ఉన్న సందేహాలను యంత్రాగంపై సంధించారు. వీటిలో కొన్నింటికి అధికారులు సమాధానాలు చెప్పినప్పటికీ... మెజారిటీ అంశాలపై స్పష్టత ఇవ్వలేకపోయారు. వివరణలను పక్షం రోజుల్లోగా పార్లమెంట్ కమిటీకి నివేదించాలని సభ్యులు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారమిస్తే చర్యలే... ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితత్వంతో ఇవ్వాలని పార్లమెంటు కమిటీ అధికారులకు సూచించింది. తమ వద్ద సమాచారం ఉందని, వాటితో పొంతన లేకుండా గణాంకాలు పెంచి చూపొద్దని, తప్పుగా తేలితే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. గురుకులాలతో డ్రాపౌట్లు, కల్యాణలక్ష్మి పథకంలో బాల్యవివాహాలు తగ్గాయని వెల్లడించారు. రాష్ట్రంలో అట్రాసిటీ కేసులు పెరిగాయని పార్లమెంటు కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కుల వివక్షతో జరిగిన మరణాల గురించి ప్రశ్నించగా, అలాంటి హత్యలు జరగలేదని అధికారులు అన్నారు. సింగరేణి మైనింగ్ విస్తరణలో భూములు కోల్పోయినవారి కోసం తీసుకున్న చర్యల గురించి కమిటీ సభ్యులు ప్రశ్నించగా అధికారులు తడబడ్డారు. ఇన్నోవేషన్ కార్యక్రమాలపైనా సభ్యులు ఆరా తీశారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు తెలపగా, ఎస్టీల గురించి ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూపంపిణీ సాధ్యం కాదని తెలిపారు. అధ్యయనం తాలూకు నివేదికను వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికి సమర్పించనున్నట్లు పార్లమెంటరీ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. -
ఇక ఆ పెళ్లిళ్లకు భయం లేదు..
కులాంతర వివాహాలు చేసుకోదలిచారా..? పెద్దల చేతిలో పరువు హత్యలకు గురవుతామని భీతిల్లుతున్నారా..? ఇక మీకా బెంగలేదు. ఇలాంటి జంటలకు అన్ని విధాల అండదండలను కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం సాక్షిగా ప్రకటించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన వీరన్ కుమార్తె విమలాదేవిని అతని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న దిలీప్‌కుమార్ 2014లో ప్రేమవివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో అదే ఏడాది అక్టోబరులో విమలాదేవిని ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తెచ్చేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు విమలాదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంతేగాక ఎవరికీ తెలియకుండా దహన సంస్కారాలు చేశారు. దీనిపై విమలాదేవి భర్త దిలీప్‌కుమార్ మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి రామసుబ్రమణియన్ 2016 ఏప్రిల్‌లో తీర్పు చెప్పారు. పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించి పంచాయితీ ముఠాతో కుమ్మక్కుగా వ్యవహరించారు. ఈ కారణంగా సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. ఇలాంటి పరువు హత్యలను అడ్డుకునేందుకు, కులాంతర వివాహాలు చేసుకునేవారికి రక్షణ కల్పించాలని, జిల్లాల వారీగా సాంఘిక సంక్షేమశాఖ, ఆదిద్రావిడ సంక్షేమ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక సహాయక కేంద్రాలను నెలకొల్పాలని తీర్పులో సూచించారు. ఉత్తర్వులు అమలుచేయలేదని పిటిషన్ కోర్టు ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని ఆరోపిస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిపై కులవివక్ష నిర్మూలన సంఘం రాష్ట్ర కార్యదర్శి సామువేల్‌రాజ్.. మద్రాసు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను గతంలో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి ఎమ్.సత్యనారాయణన్ ముందుకు ఇటీవల విచారణకు వచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక విభాగాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటైనట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇటీవల బదులు పిటిషన్ వేశారు. విమలాదేవీ కేసులో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన చెక్కానురాణి ఇన్స్పెక్టర్ సుకుమార్, వత్తలగుండు ఇన్స్పెక్టర్ వినోద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంది, ఉసిలంపట్టి సబ్ ఇన్స్పెక్టర్ రాణిలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. మూడేళ్ల పాటు వారందరికీ ఇంక్రిమెంట్లు కట్ చేసినట్లు తెలిపారు. డీఐజీ లేదా ఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక విభాగాలు, ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసి ఫోన్ నంబర్లను ప్రచారం చేశారు. ఈ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను పోలీస్ వెబ్సైట్లో పొందుపరచాలని ఏప్రిల్ 10వ తేదీనే ఆదేశించినట్లు తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకునే వారు ఈ ఫోన్ నంబర్ లేదా ఆన్లైన్ మూలంగా సమాచారం ఇవ్వవచ్చు. వధూవరులు కోరినట్లయితే సమీప పోలీస్‌స్టేషన్‌లోని ఇన్స్పెక్టర్ తగిన భద్రత కల్పించడంతోపాటు వారిపై నిరంతర నిఘా పెడతారు. నిధుల కేటాయింపు పరువు హత్యలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం నిధులను సైతంకేటాయించింది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తాత్కాలికంగా బస, రక్షణ, ఇరుకుటుంబాల మధ్య సామరస్యపూర్వక చర్చలకు కౌన్సెలింగ్ నిపుణుల కేటాయింపు చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ, సహకారం అందించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. అన్ని చర్యలు చేపట్టిన కారణంగా ప్రభుత్వంపై వేసిన కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేయాలని బదులు పిటిషన్లో న్యాయవాది కోరారు. ఈ కేసును న్యాయమూర్తి ఆగస్టు 9వ తేదీకి వాయిదావేశారు. -
ప్రేమి'కుల'కు భరోసా
* పరువు హత్యలపై హైకోర్టు కన్నెర్ర * ఇక భద్రతకు భరోసా కీలక ఆదేశాలు జారీ * జిల్లాకో ప్రత్యేక విభాగం * తాత్కాలిక ఇళ్ల నిర్మాణానికి చర్యలు సాక్షి, చెన్నై: కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు మద్రాసు హైకోర్టు అండగా నిలిచింది. పరువు హత్యలపై కన్నెర్ర చేసింది. ఈ ప్రేమికుల భద్రతకు భరోసా ఇస్తూ, ప్రతిజిల్లాకు ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో పలు సామాజిక వర్గాల అధికారులతో ఈ బృందాలు మూడు నెలల్లోపు ఏర్పాటు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవల కాలంగా కులాంతర ప్రేమవివాహాలు పరువు హత్యలకు దారి తీస్తూ వస్తున్నాయి. 2003 నుంచి ఇప్పటి వరకు వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ కులాంతర ప్రేమ వివాహాలకు ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్, గత నెల ఉడుమలైలో శంకర్ బలి అయ్యారు. తెలిసి వందల గణాంకాలు ఉంటే, తెలియకుండా తెర మరుగులో సాగిన హత్యలు మరెన్నో వందల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఈ పరువు హత్యల పరంపర రాష్ట్రంలో కొనసాగుతున్నా అడ్డుకట్ట వేసే వారెవ్వరు లేరన్న విమర్శలు ఉన్నాయి. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో వందలా మంది చూస్తుండగా, గత నెల అతి కిరాతకంగా ఘాతకం జరగడం రాష్ట్రంలో కలకలాన్ని రేపింది. అదే సమయంలో గతంలో తన ప్రేయసిని పరువు హత్య చేశారంటూ దిలీప్ కుమార్ అన్న ప్రియుడు కోర్టుకు ఎక్కి ఉండడం, తాజాగా చోటు చేసుకున్న హత్యల్ని పరిగణలోకి తీసుకున్న మద్రాసు హైకోర్టు, ఇక, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందు కోసం ప్రత్యేకంగా విభాగాలు, కఠిన నిర్ణయాలు, భద్రతకు భరోసా ఇచ్చే ఆదేశాలు జారీ అయ్యాయి. కన్నెర్ర, కొత్త ఆదేశాలు: 2014లో ఉసిరికి చెందిన విమలదేవి, దిలీప్ కుమార్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు కేరళలో కొత్త కాపురం పెట్టారు. అయితే, ఈ ఇద్దరూ కన్పించడం లేదన్న ఫిర్యాదులు పోలీసు స్టేషన్‌కు చేరింది. ఎట్టకేలకు ఆ ఇద్దర్నీ పట్టుకొచ్చిన పోలీసులు ఓ శాసనసభ్యుడి సమక్షంలో పంచాయతీ పెట్టి విడదీశారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, విమల దేవి అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆమె మృత దేహాన్ని ఆగమేఘాలపై దహనం చేయడంతో దిలీప్ కుమార్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో విమల దేవి పరువు హత్యకు బలైనట్టు తేలింది. ఈ కేసు విచారణ సీబీఐ పర్యవేక్షణలో సాగుతోంది. ఈ పరిస్థితుల్లో బుధవారం పిటిషన్ న్యాయమూర్తి రామసుబ్రమణ్యం నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరువు హత్యలు, కులాంతర వివాహాలను పరిగణలోకి తీసుకున్న బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ హత్యలకు అడ్డుకట్ట వేద్దామని, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి భద్రతను కల్పిద్దామని పేర్కొంటూ, ఇందు కోసం జిల్లాకు ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు కావాలని ఆదేశించారు. జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో ఆది ద్రావిడ, సమాజ సంక్షేమ తదితర విభాగాల అధికారులు నియమించాలని, ఈ విభాగాలు 24 గంటలూ పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు భద్రత కల్పించాలని ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకున్న ప్రేమికులు, దంపతులు ఆశ్రయిస్తే వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ విభాగానిదేనని వివరించారు. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించాలని సూచించారు. ఈ విభాగానికి వచ్చే ఫిర్యాదులు, దంపతులకు, ప్రేమికులకు కల్పించిన భద్రత, తదితర వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక టెక్నాలజీ ద్వారా ఆన్లైన్లో పొందు పరచాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఈ విభాగం కోసం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించాలని, ఈ విభాగం ద్వారా తాత్కాలిక గృహాల్ని నిర్మించి కులాంతర వివాహాలు చేసుకునే దంపతులకు నీడను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కౌన్సిలింగ్, వారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపడం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, పెద్దలు అంగీకరిస్తే, వారి వెంట పంపించడం వంటి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రేమికుల్ని పంచాయతీ పెట్టి విడదీయడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు పోలీసులపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
ప్రోత్సాహకం ఏదీ!
‘ఆదర్శ దంపతుల’కు మొండిచెయ్యి ⇒ నిధుల మంజూరులో పాలకుల నిర్లక్ష్యం ⇒ ఏళ్ల తరబడి 90 జంటల ఎదురు చూపులు ⇒ బీసీ సంక్షేమ శాఖలో పెరిగిపోయిన దరఖాస్తులు ⇒ ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేదు ఇందూరు : శ్రావణ్, సౌమ్య పెద్దలను ఎదిరిం చి, కట్టుబాట్లను వదులుకుని కులాం తర వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహక బహుమ తి కోసం 2009లో బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకున్నా రు. ప్రస్తుతం ఆ దంపతులకు సంతానం కలిగి అమ్మా, నాన్నలయ్యారు. పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. నేడో రేపో స్కూల్‌కు కూడా వెళ్లే వయస్సు కూడా వచ్చేస్తోంది. నే టి వరకూ ఆ దంపతులకు ప్రభుత్వం నుంచి కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేయలేదు. వచ్చే రూ. పదివేలు ఆసరాగా ఉం టాయనుకున్న ఆ దంపతులు నిధుల కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖ చుట్టూ తిరిగిన సంద ర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని ఈ ఒక్క జంటే కాదు. ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్న 90 జంటలూ ఎదుర్కొంటున్నాయి. అరకొర విదిలింపులు కులాంతర వివాహాలు చేసుకున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుల, మత భేదాలు లేకుండా ఆదర్శ వివాహా లు చేసుకున్న దంపతులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ జంటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా బీసీల పరిస్థితి దారుణంగా ఉంది. ఆదర్శ వివాహాలు చేసుకున్న దంపతులు ప్రభుత్వం అందిం చే పోత్సాహక బహుమతి కోసం 2009లో జిల్లా బీసీ సంక్షేమ శాఖలో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటి వరకూ అందలేందటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. నిధులు ఇస్తున్నాం అన్నట్లుగా సంవత్సరానికి రూ.20 వేలు మంజూరు చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఈ నిధులు కేవలం రెండు జంటలకు మాత్రమే సరిపోతారుు. మిగతా జంటలకు నిరాశే మిగులుతోంది. ఏటా పెరుగుతున్న అర్జీలు ఏటా బీసీ సంక్షేమ శాఖకు 20 నుంచి 30 దరఖాస్తులు అందుతున్నాయి. సంవత్సరానికి రెండు జంటలకు సరిపోయే నిధులివ్వడంతో తదుపరి దంపతులు సంవత్స రాల తరబడి వేచి చూడటం తప్పడం లేదు. జిల్లాలో 2009 నుంచి నేటి వరకూ కలిపి మొత్తం 90 జంటలు దరఖాస్తులు చేసుకున్నాయి. నిధులు వస్తే దేనికైనా ఉపయో గపడుతాయనే ఉద్దేశంతో బీసీ సంక్షేమ శాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సమాధానాలు చెప్పలేని అధికారులు నిధులు వస్తే సమాచారం ఇస్తాం అని విసుక్కుం టున్నారు. 2012-13 సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.40 వేలను జిల్లాకు మంజూరు చేయగా, వాటిని సీనియార్టీ ప్రకారం ఉన్న నాలుగు జంటలకు అందజేశారు. ప్రస్తుతం రూ.80 లక్షలు అవసరం. ఈ నిధులను విడుదల చేయాలని గత రెండు, మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను లేఖల ద్వా రా కోరినా ఫలితం కనబడలేదు. గత నెలలో జిల్లా పరిషత్ స్థాయి సంఘా సమావేశాలలో సైతం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. బీసీ సంక్షేమ శాఖల దరఖాస్తులు కుప్పలుగా పడి ఉంటున్నాయే తప్పా పరిష్కారం లభించడం లేదు. పెళ్లి చేసుకున్న ఇద్దరు కాస్త సంతానంతో ముగ్గురు, నలుగురిగా మారినా ప్రభుత్వం నుంచి పా రితోషకం అందకపోవడం శోచనీయకరమైన విషయమని బాధిత జంటలు వాపోతున్నారుు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలోనైనా తమకు అందాల్సిన ప్రోత్సహకం అందిస్తే సంతోసిస్తామంటున్నారు. నిధుల కోసం వేచి చూస్తున్నాం కులాంతర వివాహాలు చేసుకున్న బీసీ జంటలకు చాలా సంవత్సరాలు గా ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సహకం అందటం లేదు. ప్రభుత్వం ఏ టా రూ.20వేలు మాత్ర మే మంజూరు చేస్తోంది. అవి ఇద్దరికి మాత్ర మే సరిపోతున్నాయి. మిగతా వారికి అన్యాయం జరగుతోంది. దరఖాస్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అ యితే, 90 జంట లకు రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, జి ల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు చాలాసార్లు విన్నవించాం. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశాం. చివరికి ప్రతీ నెలా హైదరాబాద్‌లో జరుగుతున్న ఉన్నతాధికారులు సమీక్షలో కూడా విషయాన్ని తెలుపుతున్నాం. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి -
హర్యనాలో ఖాప్ పంచాయతీల నిర్ణయం
-
కులాంతర పెళ్లిళ్లు పెరిగాయ్!
పెళ్లి విషయంలో కులం గురించి ఆధునికతరం అంతగా పట్టించుకోవడం లేదా? క్యాస్ట్ కంటే క్యారెక్టర్‌కే పాధాన్యత ఇస్తున్నారా? కులం కంటే సామాజిక భద్రతకే పెద్దపీట వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి సర్కారీ గణాంకాలు. దేశంలో నానాటికీ పెరుగుతున్న కులాంతర వివాహాలే ఇందుకు రుజువని చెబుతున్నాయి. ముఖ్యంగా నిమ్న కులాలకు చెందిన వారిని జీవిత భాగస్వాములుగా స్వీకరించేందుకు ముందుకు వస్తున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతుండడం విశేషం. సంఘసంస్కర్తలు ఆశించిన కులవివక్ష నిర్మూలన మన సమాజంలో స్పీడుగా కాకపోయినా నెమ్మదిగా మాత్రం లేవని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే ముందుంది. ఒక్క మహారాష్ట్రలోనే గతేడాది ఇవి నాలుగురెట్లు పెరిగాయి. ఇవన్నీ దళిత కులాలతో సంబంధమున్న పెళ్లిళ్లే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో కేరళలో కులాంతర కళ్యాణాలు ఎక్కువగా జరిగాయి. నిమ్నకులాల వారిని లైఫ్ పార్టనర్స్ చేసుకునేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2012లో 9,623 కులాంతర వివాహాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2011లో ఈ సంఖ్య 7,148గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2012లో 3,040 పెళ్లిళ్లు జరిగాయి. 2011లో 1,805 వివాహాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,296 కులాంతర పెళ్లిళ్లు జరిగాయి. 2011లో కేవలం 563 వివాహాలే నమోదయ్యాయి. కేరళలో 2,454 మంది కులాంతర వివాహాలు చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడులోనూ పెరుగుదల కనిపించడం ఆసక్తికర విషయం. అయితే కులాంతర వివాహాలు చేసుకున్న వారందరూ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనా ధోరణిలో మార్పు రావడం కులాంతర వివాహాలు పెరగడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ఈ ట్రెండ్‌ను ప్రోత్సహిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.50 వేలు ప్రోత్సహకమిస్తోంది. కులవివక్ష నిర్మూలనకు కులాంతర వివాహాలు దోహదపడతాయని సంఘ సంస్కర్తలు గట్టిగా నమ్మారు. ఈ దిశగా ఆధునిక తరం వడివడిగా అడుగులు వేస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.