inter second year result
-
AP Inter Results 2024: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటలకంటే?
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నాపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించింది. ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. -
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెకండియర్ విద్యార్థులందరూ పాస్ అయినట్లు ఆయన ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని, కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల యావరేజ్‌కి 30 శాతం.. ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రతిభకి 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేశామని తెలిపారు. విద్యార్థులకు ఈ ఫలితాలపై అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్ మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్లలో అవకతవకలకి పాల్పడే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ హెచ్చరించారు. ఫలితాల కోసం www.sakshieducation.com www.examresults.ap.nic.in www.results.bie.ap.gov.in www.bie.ap.gov.in www.results.apcfss.in -
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తయినప్పటికీ.. కరోనా కారణంతో థియరీ పరీక్షలు షెడ్యూల్ (మే 5 నుంచి 23 వరకు) ప్రకారం జరగలేదు. ఆపై సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై బోర్డు కసరత్తు జరిపి విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కాగా, 2021 మార్చి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 10,32,469 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5,12,959 మంది, సెకండియర్ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు. ఫలితాల కోసం కొన్ని వెబ్సైట్లు www.sakshieducation.com , www.examresults.ap.nic.in, www.results.bie.ap.gov.in, www.bie.ap.gov.in -
రంగారెడ్డి ఫస్ట్.. నల్లగొండ లాస్ట్
సోమవారం ప్రకటించిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో పరీక్షరాసిన విద్యార్థుల్లో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. నల్లగొండ జిల్లాలో అత్యత్పంగా 58 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లోనూ రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్‌లో నల్లగొండ లాస్ట్ ప్లేస్‌లో నిలవడం గమనార్ణం. మొత్తం 3, 78, 978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 2, 32,742 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.4 శాతం. గత ఏడాదితో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభం అవుతాయని, ఫీజు గడువును మే 6 గా నిర్ణయించామన్నారు. విద్యార్థినీ, విద్యార్థులందరూ ఆ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. కాగా ఫెయిల్ అయిన విద్యార్థినీ, విద్యార్థుల కోసం మొదటిసారి ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. -
మళ్లీ అమ్మాయిలదే పైచేయి
అమ్మాయిలు మళ్లీ అదరగొట్టారు! సోమవారం ఉదయం విడుదైన ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం 66.86 గా నమోదయింది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మాత్రం 55.91 వద్దే ఆగిపోయింది. అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలు 5.23శాతం మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం పాస్ పర్సంటేజీ 61.14గా నమోదయినట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఆనందంగా ఉన్నారని, అందుకు తానుకూడా సంతోషిస్తున్నానని మంత్రి అన్నారు. గతవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ అమ్మాయిలదే పైచేయి కావడం గమనార్హం.