సోమవారం ప్రకటించిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో పరీక్షరాసిన విద్యార్థుల్లో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. నల్లగొండ జిల్లాలో అత్యత్పంగా 58 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లోనూ రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో నల్లగొండ లాస్ట్ ప్లేస్లో నిలవడం గమనార్ణం.
మొత్తం 3, 78, 978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 2, 32,742 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.4 శాతం. గత ఏడాదితో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభం అవుతాయని, ఫీజు గడువును మే 6 గా నిర్ణయించామన్నారు. విద్యార్థినీ, విద్యార్థులందరూ ఆ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. కాగా ఫెయిల్ అయిన విద్యార్థినీ, విద్యార్థుల కోసం మొదటిసారి ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు.