Inter Topper
-
‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా
సాక్షి, విజయవాడ: ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. టెన్త్, ఇంటర్ టాపర్లకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నియోజకవర్గాలు, 27 న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయి కార్యక్రమం నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా, అయితే ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది. చదవండి: నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. -
మాట నిలబెట్టుకున్న సీఎం.. టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాప్టర్ రైడ్
రాయ్‌పూర్: టెన్త్, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హెలికాప్టర్ రైడ్ కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్లో తనతో పాటు తీసుకెళ్లి గగన విహారం చేయించారు. తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన క్రమంలో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలా సంతోషంగా ఉందని, ఈ రైడ్ ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ ఉత్సాహం నింపినట్లవుతుందన్నారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. చదవుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్ రైడ్‌పై ట్వీట్ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. #WATCH | Raipur, Chhattisgarh: Toppers of class 12 and class 10 were taken on a helicopter ride by the state govt as was promised by CM Bhupesh Baghel in May pic.twitter.com/gjHu8lGBKS — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022 𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁 देखिए, बच्चे कितने खुश हैं! हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे। आज इसकी शुरुआत हो गयी है। कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx — Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
ఊపిరి ఆగింది.. ఉత్తీర్ణతలో మెరిసింది
గద్వాల: బాగా చదివి, మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని కలలు కన్న ఆ విద్యార్థిని.. ఇంటర్ పరీక్ష రాసి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది.. కానీ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన నల్లన్న కుమార్తె రాజేశ్వరి (18) జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ చదివింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు మే 19న కుమార్తె రాజేశ్వరిని ఆమె తండ్రి బైక్‌పై ఎక్కించుకుని గద్వాల నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తండ్రీ కుమార్తె అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కాగా, మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రాజేశ్వరి ఎంపీసీలో 867 మార్కులు సాధించి జిల్లాలోని కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. ఇంటర్లో రాజేశ్వరి ప్రతిభను గుర్తు చేసుకుని అధ్యాపకులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. -
టాప్–10లో 11,214 మంది
ఫస్టియర్‌లో 9,593 మంది, సెకండియర్‌లో 1,621 మంది సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 11,214 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు (టాప్–10) సాధించారు. ఇందులో ప్రథమ సంవత్సర విభాగంలో 9,593 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరంలో 1,621 మంది ఉన్నారు. ఫస్టియర్‌లో ఎంపీసీ కేటగిరీలో 7,441, బైపీసీలో 1,756, ఎంఈసీలో 304, హెచ్ఈసీలో 12, సీఈసీలో 80 మంది విద్యార్థులున్నారు. సెకండియర్‌లో ఎంపీసీ కేటగిరీలో 83, బైపీసీలో 636, ఎంఈసీలో 64, హెచ్ఈసీలో 13, సీఈసీలో 25 మంది ఉన్నారు. టెన్త్‌లో 9.3 జీపీఏ.. ఇంటర్లో 991 మంచిర్యాల సిటీ: మంచిర్యాలకు చెందిన పిట్టల లక్ష్మీ భవాని బైపీసీలో 991 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. మంచిర్యాల ఆల్ఫోర్స్ కాలేజీలో చదివిన ఈమె.. టెన్త్‌లో 9.3 జీపీఏ సాధించింది. భవానిని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అభినందించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీశైల మల్లికార్జున్, శారద ఆనందం వ్యక్తంచేశారు. ఐఏఎస్ కావాలని ఉంది నిజామాబాద్ అర్బన్: ఎంపీసీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నోమన్ రజ్వీ 993 మార్కులు సాధించాడు. కాకతీయ కాలేజీలో చదివిన రజ్వీ.. ‘‘నాకు ఐఏఎస్ కావాలని ఉంది. అందుకే పకడ్బందీగా చదువుతున్నాను’’ అని చెప్పాడు. మెరిసిన దర్జీ బిడ్డ.. పరకాల: ఒకటే కరెంట్ బల్బు.. ఆ బల్బు కిందే రెక్కల కష్టం.. ఈ కష్టాలన్నీ చూస్తూ పెరిగిన ఓ పేదింటి బిడ్డ ఇంటర్ ఫలితాల్లో మెరిసింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ఎల్దండి వెంకటేశ్వర్లు–అనిత దంపతుల కుమార్తె రాధిక ఫస్టియర్ ఎంసీపీలో 466 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండోస్థానం సాధించింది. టైలర్ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు.. ఆర్థికభారమైనా తమ కుమార్తెను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాడు. టెన్త్‌లో 9.8 జీపీఏ రావడంతో భీమారంలోని సాయి శివానీ కళాశాల యాజమాన్యం ఇంటర్ విద్య ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. ఐఏఎస్ సాధిస్తా.. ఖమ్మం జెడ్పీసెంటర్: ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం రెజొనెన్స్ కాలేజీకి చెందిన కొండా నిఖిత(ఎంపీసీ) 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ‘‘ఇది జీవితంలో మరిచిపోలేను. ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం. ఇదే స్ఫూర్తితో కష్టపడి చదువుతా..’’ అని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. -
ఇంటర్ టాపర్లు వీరే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) ఫలితాల్లో అత్యధిక మార్కులను (993) ఖమ్మం జిల్లాకు చెందిన కొండా నిఖిత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ నోమన్ రజ్వి సాధించి టాపర్లుగా నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన వంగాల సాయిచరణ్ 992 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇక బైపీసీలో మంచిర్యాల జిల్లాకు చెందిన పిట్టల లక్ష్మి భవానీ, రంగా రెడ్డి జిల్లాకు చెందిన పోతరాజు దీపిక, హైదరాబాద్‌కు చెందిన అమ్లినా ప్రియదర్శిని 991 మార్కులతో టాపర్లుగా నిలిచారు. బైపీసీ టాపర్లు ముగ్గురు బాలికలే కావడం విశేషం. 990 మార్కులను మరో ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన పోచంపల్లి దివ్య 986 మార్కులతో టాపర్‌గా నిలవగా.. సీఈసీలో వనపర్తి జిల్లాకు చెందిన జె.సాయిస్వరూప్రెడ్డి 976 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. హెచ్ఈసీలో 950 మార్కులతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శివార్చక మానస టాపర్‌గా నిలిచింది. ప్రథమ సంవత్సరంలో.. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 467 టాప్ మార్కులను 12 మంది విద్యార్థులు సాధించారు. బైపీసీలో 436 టాప్ మార్కులను 11 మంది విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో 493 టాప్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సాధించగా, సీఈసీలో 492 టాప్ మార్కులను ఒకే ఒక విద్యార్థి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన బి.హర్ష సాధించారు. హెచ్ఈసీలో 470 టాప్ మార్కులను హైదరాబాద్‌కు చెందిన లికితారెడ్డి సాధించారు. ఫస్టియర్ టాపర్లు వీరే... ఎంపీసీలో...: 12 మంది 467 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వారి వివరాలు కలావేన కార్తీక్ (కరీంనగర్), పింగిలి మనీశ్‌రెడ్డి(కరీంనగర్), ములగాని తనూజ(ఖమ్మం), శ్యామలాంబ పూజిత (భద్రాద్రి), ఎస్.ప్రియాశర్మ(నిజామాబాద్), గత్ప పావణి (మహబూబ్‌నగర్), పుట్ట లావణ్య(మహబూబ్‌నగర్), యానాల నవీన్‌రెడ్డి(రంగారెడ్డి), తూము జోహార్రెడ్డి (రంగారెడ్డి), కందిమల్ల ప్రణీత(రంగారెడ్డి), బూర్ల సంధ్య (మేడ్చల్), అనిరెడ్డి అఖిల(మేడ్చల్) బైపీసీలో...: 11 మంది 436 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వివరాలు అతావుల్లా (నిజామాబాద్), వీరమల్ల చైతన్య(నల్లగొండ), గుండ్లకుంట వరూధిణి(మహబూబ్‌నగర్), చిలువేరు అనూష(రంగారెడ్డి), షేక్ ఇఫ్రా (రంగారెడ్డి), గవిరెడ్డి శ్రావణి(రంగారెడ్డి), మహ్మద్ దుర్దాణా పర్వీన్(రంగారెడ్డి), మల్లేపల్లి నవ్యశ్రీ (మేడ్చల్), ఠాకూర్ హారిక (హైదరాబాద్), ఆర్మాన్ సానియాఖాన్(హైదరాబాద్), చందుపట్ల ప్రత్యూషరెడ్డి(హైదరాబాద్). ఎంఈసీలో...: ఆరుగురు 493 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వారి కంచుపతి యువ రజని(మేడ్చల్), భూపాల్‌రెడ్డి శివారెడ్డి(మేడ్చల్), గుడపాటి స్పందన (మేడ్చల్), దీపిక సాహూ (హైదరాబాద్), దొడ్డవారి ప్రణీత(హైదరాబాద్), వి.రిషిక (హైదరాబాద్). సీఈసీలో..: బి.హర్ష (492) వరంగల్, దూరిశెట్టి వివేక్(488) కరీంనగర్, తస్లీం ఫాతిమా(488) రంగారెడ్డి, భవేష్ గోయల్(488)మేడ్చల్, పస్తం దేవిక(488) హైదరాబాద్ టాపర్లుగా నిలిచారు. హెచ్ఈసీలో..: లిఖితారెడ్డి(470) హైదరాబాద్, సుంకరి శ్రీసాయితేజ (469)హైదరాబాద్, వెన్న మేఘన(469) హైదరాబాద్, పల్లె శ్రీను (464) మెదక్, జర్పుల నందిని(463) భద్రాద్రి కొత్తగూడెం టాపర్లుగా నిలిచారు. -
కళాశాల టాపర్... పరీక్ష రాయలేని దుస్థితి
జోగిపేట (మెదక్): ఆ విద్యార్థిని కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం టాపర్. కానీ కాలేజీ నిర్వాకం వల్ల ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష రాయలేని దుస్థితి ఎదురైంది. విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించినా యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడం వల్ల హాల్ టికెట్లు జారీ కాలేదు. దీంతో మెదక్ జిల్లా జోగిపేటలోని క్రాంతి జూనియర్ కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాయలేకపోయారు. మంగళవారం హాల్‌టికెట్ల కోసం కళాశాలకు వద్దకు చేరుకున్న విద్యార్థులు విషయం తెలిసి భోరున విలపించారు. ఫస్ట్‌ఇయర్‌లో 403 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిన స్వాతి రెండో సంవత్సరం పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడడంతో కన్నీరు మున్నీరైంది. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కాగా, మొదటి సంవత్సరం విద్యార్థులకు సకాలంలో హాల్‌టికెట్లు ఇవ్వని కారణంగా 60 మంది విద్యార్థులు సోమవారం నాటి పరీక్షను రాయలేక పోయారు. కళాశాలకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడం.. విద్యార్థులకు సమాచారం అందించక పోవడం వల్ల మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లింది.