సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) ఫలితాల్లో అత్యధిక మార్కులను (993) ఖమ్మం జిల్లాకు చెందిన కొండా నిఖిత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ నోమన్ రజ్వి సాధించి టాపర్లుగా నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన వంగాల సాయిచరణ్ 992 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇక బైపీసీలో మంచిర్యాల జిల్లాకు చెందిన పిట్టల లక్ష్మి భవానీ, రంగా రెడ్డి జిల్లాకు చెందిన పోతరాజు దీపిక, హైదరాబాద్‌కు చెందిన అమ్లినా ప్రియదర్శిని 991 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
బైపీసీ టాపర్లు ముగ్గురు బాలికలే కావడం విశేషం. 990 మార్కులను మరో ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన పోచంపల్లి దివ్య 986 మార్కులతో టాపర్‌గా నిలవగా.. సీఈసీలో వనపర్తి జిల్లాకు చెందిన జె.సాయిస్వరూప్‌రెడ్డి 976 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. హెచ్‌ఈసీలో 950 మార్కులతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శివార్చక మానస టాపర్‌గా నిలిచింది.
ప్రథమ సంవత్సరంలో..
ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 467 టాప్ మార్కులను 12 మంది విద్యార్థులు సాధించారు. బైపీసీలో 436 టాప్ మార్కులను 11 మంది విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో 493 టాప్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సాధించగా, సీఈసీలో 492 టాప్ మార్కులను ఒకే ఒక విద్యార్థి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన బి.హర్ష సాధించారు. హెచ్‌ఈసీలో 470 టాప్ మార్కులను హైదరాబాద్‌కు చెందిన లికితారెడ్డి సాధించారు.
ఫస్టియర్ టాపర్లు వీరే...
ఎంపీసీలో...: 12 మంది 467 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వారి వివరాలు కలావేన కార్తీక్ (కరీంనగర్), పింగిలి మనీశ్‌రెడ్డి(కరీంనగర్), ములగాని తనూజ(ఖమ్మం), శ్యామలాంబ పూజిత (భద్రాద్రి), ఎస్.ప్రియాశర్మ(నిజామాబాద్), గత్ప పావణి (మహబూబ్‌నగర్), పుట్ట లావణ్య(మహబూబ్‌నగర్), యానాల నవీన్‌రెడ్డి(రంగారెడ్డి), తూము జోహార్‌రెడ్డి (రంగారెడ్డి), కందిమల్ల ప్రణీత(రంగారెడ్డి), బూర్ల సంధ్య (మేడ్చల్), అనిరెడ్డి అఖిల(మేడ్చల్)
బైపీసీలో...: 11 మంది 436 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వివరాలు అతావుల్లా (నిజామాబాద్), వీరమల్ల చైతన్య(నల్లగొండ), గుండ్లకుంట వరూధిణి(మహబూబ్‌నగర్), చిలువేరు అనూష(రంగారెడ్డి), షేక్ ఇఫ్రా (రంగారెడ్డి), గవిరెడ్డి శ్రావణి(రంగారెడ్డి), మహ్మద్ దుర్దాణా పర్వీన్(రంగారెడ్డి), మల్లేపల్లి నవ్యశ్రీ (మేడ్చల్), ఠాకూర్ హారిక (హైదరాబాద్), ఆర్మాన్ సానియాఖాన్(హైదరాబాద్), చందుపట్ల ప్రత్యూషరెడ్డి(హైదరాబాద్).
ఎంఈసీలో...: ఆరుగురు 493 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. వారి కంచుపతి యువ రజని(మేడ్చల్), భూపాల్‌రెడ్డి శివారెడ్డి(మేడ్చల్), గుడపాటి స్పందన (మేడ్చల్), దీపిక సాహూ (హైదరాబాద్), దొడ్డవారి ప్రణీత(హైదరాబాద్), వి.రిషిక (హైదరాబాద్).
సీఈసీలో..: బి.హర్ష (492) వరంగల్, దూరిశెట్టి వివేక్(488) కరీంనగర్, తస్లీం ఫాతిమా(488) రంగారెడ్డి, భవేష్ గోయల్(488)మేడ్చల్, పస్తం దేవిక(488) హైదరాబాద్ టాపర్లుగా నిలిచారు.
హెచ్‌ఈసీలో..: లిఖితారెడ్డి(470) హైదరాబాద్, సుంకరి శ్రీసాయితేజ (469)హైదరాబాద్, వెన్న మేఘన(469) హైదరాబాద్, పల్లె శ్రీను (464) మెదక్, జర్పుల నందిని(463) భద్రాద్రి కొత్తగూడెం టాపర్లుగా నిలిచారు.
ఇంటర్ టాపర్లు వీరే
Published Mon, Apr 17 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
Advertisement