intercity express train
-
నేడు వందే మెట్రో పరుగు
సాక్షి, హైదరాబాద్: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైలు సిరీస్‌లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి 360 కి.మీ. దూరంలో ఉన్న భుజ్ నగరం మధ్య ఇది రాకపోకలు సాగిస్తుంది. ఇప్పటికే మరిన్ని వందే మెట్రో రైళ్లను సిద్ధం చేసిన రైల్వే శాఖ, త్వరలో వాటిని కూడా ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్–విజయవాడ రూట్ ఉంది.వందేభారత్ తరహాలోనే..వందే మెట్రో కూడా వందేభారత్ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. కానీ, లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది. దీని సీటింగ్ పూర్తిగా వేరుగా ఉండనుంది. ముగ్గురు చొప్పున కూర్చునే వెడల్పాటి సీట్లను ఏర్పాటు చేశారు. సీట్ల మధ్యలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించేందుకు వీలుగా లోకల్ రైళ్లలో ఉన్నట్టుగా రూఫ్ భాగంలో హ్యాండిల్స్ ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో 12 కోచ్‌లుంటాయి. మొత్తం 1,150 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. నిలబడి ప్రయాణించేవారితో కలుపుకొంటే మొత్తం సామర్థ్యం 3208 అవుతుంది. ఈ రైళ్లలో రిజర్వేషన్ వ్యవస్థ అమల్లో ఉండదంటున్నారు. అందుకే సీట్లకు నంబరింగ్ ఉండదు.350 కి.మీ. నిడివి వరకు..100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్‌లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం.కనీస చార్జీ రూ.30ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.కు) రూ.445గా ఉండనుంది. సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్, నేరుగా లోకోపైలట్‌తో మాట్లాడేందుకు టాక్ బ్యాక్ యూనిట్, అగ్నిమాపక వ్యవస్థ, ఇన్ఫర్మేషన్ స్క్రీన్, ఫైర్ అలారమ్, దివ్యాంగుల టాయిలెట్, అనారోగ్యానికి గురైన వారికి స్ట్రెచర్ తదితరాలు రైల్లో ఉంటాయి. -
Intercity Express Train: పట్టాలెక్కని పేదోడి రైలు
రాజంపేట: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులకు తక్కువ ధరతో గమ్యాలను చేర్చే రైలుగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల ఆదరణ దక్కించుకుంది. అలాంటి రైలిప్పుడు జిల్లా ప్రయాణికులకు దూరమయ్యేలా రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 57273/57274 నంబర్లతో కాకినాడ–తిరుపతి–హుబ్లీ (ఇంటర్సిటీ రైలు) ఉభయ జిల్లాల మీదుగా నడిచింది. అలాగే సీమవాసులు కోస్తా కారిడార్ ప్రయాణానికి ఈ రైలు అందుబాటులో ఉండేది. అన్ని వర్గాల ప్రజల ప్రయాణానికి అనుకూలంగా ఉన్న రైలును ఫస్ట్‌వేవ్ కరోనా సమయంలో రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరణ విషయాన్ని పట్టించుకోలేదు. రెండు రాష్ట్రాల యాత్రికులకు సౌకర్యంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన యాత్రికులతోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులకు సౌకర్యంగా ఈ రైలు నడిచింది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తక్కువ ధరతో టికెట్ తీసుకొని ప్రయాణించే యాత్రికులపై రైల్వేబోర్డు శీతకన్ను వేసిందనే అపవాదును మూటకట్టుకుంది. సీమ జిల్లాలో పేద ప్రయాణికుల ఆదరణ పొందిన ఏకైక రైలు ఇంటర్సిటీ అని చెప్పుకోవచ్చు. ప్రజాసౌకర్యం కన్నా ఆదాయమే ప్రధానం అన్న విధంగా ఎన్డీఏ సర్కారు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్) ఇంటర్ సిటీ దరిచేరని డెమో రేణగుంట–గుంతకల్లు మధ్య నడుస్తున్న డెమో ఎక్స్‌ప్రెస్ రైలుకు పెట్టిన ధరలతో పోలిస్తే ఇంటర్సిటీ మేలంటున్నారు ప్రయాణికులు. ఉదాహరణకు నందలూరు నుంచి కడపకు రూ.10నే. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చార్జీతో డెమోను తీసుకొచ్చి రూ.30 తీసుకుంటున్నారు. ఒక వేళ రూ.30 టికెట్ తీసుకున్నా, స్టేషన్ నుంచి ఆటోకు రూ.20 కావడం మొత్తం మీద రూ.50 అవుతోంది. అలాంటప్పుడు బస్సులో వెళితే నేరుగా టౌన్లోకి వెళ్లవచ్చు కదా అనే భావనతో ప్రయాణికులు డెమో వైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. 12 బోగీల ఫార్మిసన్‌తో నిత్యం రద్దీగా.. ఇంటర్సిటీ రైలు 12 బోగీల ఫార్మిసన్‌తో నిత్యం రద్దీగా నడిచేది. నందలూరులో కూడా ఈ రైలు క్రూ ఛేంజింగ్ ఉండేది. రెండు రిజర్వేషన్ బోగీలు కూడా ఉండేవి. ఉభయ జిల్లాలకు చెందిన వారు అనేక మంది కర్ణాటక ప్రాంతంలోని హుబ్లీ కేంద్రం వరకు రాకపోకలు సాగించేవారు. రెండు రాష్ట్రాల మధ్య తక్కువ ధరతో గమ్యానికి చేరుకొనేవారు. అందువల్ల ఈ రైలు ఎప్పుడైనా రద్దీతో నడిచేది. ఫుట్‌బోర్డు ప్రయాణం కొనసాగేది. అలాంటి రైలును ఇప్పుడు రైల్వేశాఖ కనుమరుగు చేసేలా తీసుకుంటున్న విధానాలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. -
'ఇంటర్ సిటీ'లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో స్వప్న అనే బీ టెక్ విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. రైల్లో వెళ్తుండగాన ఆమె తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి రైలును జనగాం స్టేషన్లో నిలిపివేశారు. జనగాం స్టేషన్ రైల్వే అధికారులకు వారు సమాచారం అందించారు. దాంతో స్వప్నను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు వెల్లడించారు. దాంతో స్వప్నను అక్కడినుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి అప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకోడానికి ఎందుకు ప్రయత్నించిందో మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆమె వెంటనే బంధువులు కానీ స్నేహితులు లేరు. పోలీసులు ఆమెపై ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన స్వప్నను ఖమ్మం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు.