సీబీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా అస్తానా
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా రాకేష్ అస్తానా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు సీబీఐ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అనిల్ కుమార్ సిన్హా శుక్రవారం పదవీ విరమణ చేయడంతో అసిస్టెంట్ డెరైక్టర్ అస్తానాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం పూర్తికాలం చీఫ్‌ను ఎంపికచేయకపోవడంతో గుజరాత్ కేడర్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అస్తానాను తాత్కాలిక డెరైక్టర్‌గా నియమించారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాకేష్ అస్తానా డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని డీవోపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అరుుతే గడిచిన పదేళ్లలో తదుపరి పూర్తికాలం డెరైక్టర్‌ను ఎంపిక చేయకపోవడం ఇదే తొలిసారి.