International cricketers
-
‘స్మార్ట్ ఫోన్ మా అబ్బాయిని అంతర్జాతీయ క్రికెటర్‌గా మార్చేసింది’
అతనికి పుట్టుకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. ఏ భాష సరిగా చదవడం రాదు... రాయడమూ పూర్తిగా రాదు. సైగలతోనే తన భావాలను వ్యక్తంచేస్తాడు. సాధారణ పాఠశాలలోనే చదివాడు. కష్టపడి డిప్లొమా పూర్తిచేశాడు. పదో తరగతి పాసైన తర్వాత తల్లి కొనిచ్చిన స్మార్ట్ ఫోన్లో చూసి తనకు ఇష్టమైన క్రికెట్ నేర్చుకున్నాడు. అంతర్జాతీయ బధిరుల క్రికెట్లో నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు ఒక చాలెంజ్‌గా మారాడు. ఇదీ.. ఎనీ్టఆర్ జిల్లా కొండపల్లికి చెందిన బధిరుల అంతర్జాతీయ క్రికెటర్ రావూరి యశ్వంత్ నాయుడు విజయగాథ. సాక్షి, అమరావతి: కొండపల్లికి చెందిన రావూరి యశ్వంత్‌నాయుడు స్మార్ట్ ఫోన్లో చూస్తూ క్రికెట్ నేర్చుకున్నాడు. మంచి బౌలర్‌గా ఎదిగాడు. ఫోన్లో క్రికెట్ పాఠాలు నేర్చుకుంటూ ఉండగా, ఆన్లైన్లో వచి్చన చిన్న మెసేజ్ చూసి 2015లో ఢిల్లీలో సెలక్షన్స్‌కు వెళ్లాడు. అప్పుడే తొలిసారిగా బధిరుల జాతీయ జట్టు ఏర్పడటంతోపాటు యశ్వంత్‌కు చోటు దక్కింది. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అంతకుముందు ఏపీ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. అప్పులు చేసి అండగా నిలిచిన తల్లి గత ఏడాది బధిరుల క్రికెట్‌ను బీసీసీఐ దత్తత తీసుకుంది. అప్పటివరకు మ్యాచ్‌లకు వెళితే ఖర్చంతా క్రీడాకారులదే. యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు 2015లో అనారోగ్యంతో చనిపోయారు. నాటి నుంచి అతనిని తల్లి బేబి అన్ని విధాలా ప్రోత్సహించారు. కుమారుడు క్రికెట్ ఆడేందుకు వెళ్లడానికి అప్పులు చేసి డబ్బులిచ్చారు. యశ్వంత్ 20ఏళ్ల వయసులో ఢిల్లీలో జరిగిన తొలి బధిరుల వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ టోరీ్నలో మనదేశం విజేతగా నిలిచింది. సాధారణ అంతర్జాతీయ పేసర్లతో సమానంగా బౌలింగ్ చేయగలిగిన యశ్వంత్ 135 జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 167 వికెట్లు తీశాడు. అయినా యశ్వంత్‌కు మ్యాచ్ ఫీజు ఉండదు. ఒక సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిస్తే రూ.1,100 ఇచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టు మొత్తానికి రూ.లక్ష ఇచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన సమయంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచి్చన విందులో పాల్గొన్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఆహా్వనం ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయారు. గతంలో యశ్వంత్‌కు రూ.5లక్షలు ఇవ్వాలని శాప్‌ను ప్రభుత్వం ఆదేశిస్తూ లెటర్ ఇచ్చినా డబ్బులు లేవన్నారు. మెక్‌గ్రాత్ నుంచి మెళకువలు.. గోకరాజు గంగరాజు సహకారంతో 2016లో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో యశ్వంత్‌కు కోచింగ్ తీసుకునే అవకాశం దక్కింది. అప్పుడే ఆ్రస్టేలియా దిగ్గజ బౌలర్ గ్లేన్ మెక్‌గ్రాత్ వచ్చారు. ఆయన యశ్వంత్ బౌలింగ్‌ని మెచ్చుకుని ఎన్నో మెళకువలు నేరి్పంచారు. స్టెయిన్ నా ఫేవరెట్.. ‘నాకు అమ్మంటే ఎంతో ఇష్టం. మా అక్క సుమ నా విజయంలో వెన్నంటే ఉంటుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ నా ఫేవరెట్. బ్యాటింగ్, కోచింగ్‌లో ద్రావిడ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నా. ఈ ఏడాది ఖతార్‌లో జరగాల్సిన బధిర టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. దాని సెలక్షన్స్‌కు వెళ్లే ముందు మంగళగిరి క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంటే కుడి మోకాలు వద్ద గాయమైంది. నాలుగు నెలలు రెస్ట్. త్వరలో బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, కేరళలో సౌత్ జోన్, జమ్మూ–కశ్మీర్ డెఫ్ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నా.’ – సైగల ద్వారా వెల్లడించిన రావూరి యశ్వంత్ స్మార్ట్ ఫోన్ మా అబ్బాయి జీవితాన్ని మార్చింది ‘స్మార్ట్‌ఫోన్ పిల్లలను చెడగొడుతుందంటారు. మా అబ్బాయిని మాత్రం అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దింది. మావాడికి పుట్టకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. వాడు 10వ తరగతి పాసైన తర్వాత ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ కొనిచ్చా. దానిలో వీడియోలు చూస్తూ అంతర్జాతీయ బధిర క్రికెట్ బౌలర్లలో నంబర్ వన్‌గా ఎదిగాడు. ఇప్పుడు నా కొడుకు ఆటను నేను స్మార్ట్ ఫోన్లో చూస్తున్నాను.’ – బేబి, అంతర్జాతీయ క్రికెటర్ రావూరి యశ్వంత్ తల్లి -
క్రికెటర్లకేంటీ దుస్థితి.. ఒకరేమో కార్పెంటర్‌గా మరొకరేమో క్యాబ్ డ్రైవర్‌గా
న్యూఢిల్లీ: క్రీడల చరిత్రలో ఫుట్‌బాల్ తర్వాత అత్యధికంగా కాసుల కురిపించే ఆటగా చలామణి అవుతున్న క్రికెట్లో కొందరు మాజీలు ఆర్ధిక కష్టాల కారణంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేవియర్ డోహర్టీ కార్పెంటర్‌గా పని చేసుకుంటున్న విషయం వెలుగు చూడగా, తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్ దయనీయ స్థితి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. 2015 వన్డే ప్రపంచ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న డోహర్టీ ఆర్థిక కష్టాల కారణంగా కార్పెంటర్ అవతారమెత్తాడు. లెఫ్టార్మ్ స్పిన్నరయిన డోహర్టీ.. ఆస్ట్రేలియా తరఫున 60 వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడి 55 వికెట్లు తీశాడు. 2001-02 సీజన్లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆయన.. 17 ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగాడు. అతను చివరి సారిగా గతేడాది భారత్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్నాడు. ఇక ఆర్ధిక ఇబ్బందులు తాలలేక క్యాబ్ డ్రైవర్‌గా మారిన అర్షద్ ఖాన్‌ది కూడా అంతర్జాతీయ క్రికెట్లో భారీ నేపథ్యమే. పాకిస్థాన్ తరఫున 1997-98లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్.. 2006 వరకు 9 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు. భారత్ 2005 పాక్ పర్యటనలో అదరగొట్టిన అర్షద్.. దిగ్గజ ఆటగాళ్లైన సెహ్వాగ్, సచిన్ వికెట్లను తీసి, అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అయితే, రిటైర్మెంట్ అనంతరం గడ్డు పరిస్థితులు ఎదురవ్వడంతో క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. కుటుంబాన్ని పోషించేందుకు సిడ్నీలో నానా తంటాలు పడుతున్నాడు. ఇక అర్షద్ తన చివరి టెస్ట్, వన్డేను భారత్‌లోనే ఆడాడు. మొత్తంగా ఆర్ధిక కష్టాల కారణంగా దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్న అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల జాబితా చాలా పెద్దగానే ఉంది. శ్రీలంక ఆటగాడు సూరజ్ రణ్దీవ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు మాథ్యూ సింక్లెయిర్, క్రిస్ కెయిన్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆడమ్ హోలియోక్, ఆసీస్ స్పీడ్ స్టార్ క్రెయిగ్ మెక్ డెర్మాట్.. ఇలా ప్రస్తుత, పాత తరానికి చెందిన ఆటగాళ్ల జాబితా చాంతాడంత ఉంది. చదవండి: టీమిండియానే ప్రపంచ ఛాంపియన్.. ఆసీస్ కెప్టెన్ జోస్యం -
ఉత్తమ క్రికెటర్లు బుమ్రా, పూనమ్
భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో ఆలస్యంగా ఆటలోకి వచ్చిన... బీసీసీఐ అవార్డుల్లో ముందున్నాడు. గత సీజన్లో విశేషంగా రాణించిన ఈ పేసర్‌కు 2019 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అవార్డులు లభించాయి. ముంబై: గత సీజన్లో తన పేస్‌తో నిప్పులు చెరిగిన సీనియర్ ఫాస్ట్»ౌలర్ బుమ్రాకు రెండు అవార్డులు లభించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల వేడుకలో అతను ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశాయ్ పురస్కారాల్ని పొందాడు. 2018–19 సీజన్‌కు సంబంధించిన వేడుకను ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించారు. గత సీజన్లో అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కనబరిచిన ఉత్తమ ప్రదర్శన (మొత్తం 73 వికెట్లు)కు గాను పాలీ ఉమ్రిగర్ అవార్డు ఇస్తారు. ఈ పురస్కారంలో భాగంగా అతనికి ప్రశంసా పత్రం, ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల చెక్ అందజేశారు. ఇక దిలీప్ సర్దేశాయ్ పురస్కారాన్ని టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇస్తారు. దీంతో 34 వికెట్లు తీసిన బుమ్రానే ఈ అవార్డు వరించగా, ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్ చేజిక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా పూనమ్ యాదవ్ పురస్కారం గెల్చుకుంది. గత సీజన్లో పూనమ్ భారత్ తరఫున 8 వన్డేల్లో 14 వికెట్లు, 15 టి20 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసింది. అలనాటి పరుగుల యంత్రం, బ్యాటింగ్ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్‌కు కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షల చెక్ ప్రదానం చేశారు. మహిళల్లో ఈ పురస్కారం అంజుమ్ చోప్రాకు దక్కింది. పురుష క్రికెటర్‌కు సమానమైన నజరానాను అమె అందుకుంది. టెస్టుల్లో అత్యధిక పరుగులు (52.07 సగటుతో 677) చేసిన చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ కేటగిరీలో దిలీప్ సర్దేశాయ్ అవార్డు పొందాడు. ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గొప్పగా అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్‌కు ఉత్తమ అరంగేట్రం క్రికెటర్ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 2 లక్షలు దక్కాయి. దేశవాళీ క్రికెట్ టోర్నీలలో విశేషంగా రాణించిన విదర్భ జట్టుకు బీసీసీఐ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు లభించింది. ఈ అవార్డు వేడుకలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెహా్వగ్ సహా దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు, రంజీ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఎవరికి ఏ అవార్డు అంటే... ►కృష్ణమాచారి శ్రీకాంత్: కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షలు) ►అంజుమ్ చోప్రా: బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం (మహిళ; ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షలు) ►జస్ప్రీత్ బుమ్రా: పాలీ ఉమ్రిగర్ (ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్; ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు), దిలీప్ సర్దేశాయ్ (టెస్టుల్లో అత్యధిక వికెట్లు; ట్రోఫీ, రూ.2లక్షలు) ►దిలీప్ దోషి: బీసీసీఐ ప్రత్యేక అవార్డు (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు) ►చతేశ్వర్ పుజారా: దిలీప్ సర్దేశాయ్ (టెస్టుల్లో అత్యధిక పరుగులు; ట్రోఫీ, రూ.2లక్షలు) ►పూనమ్ యాదవ్: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు) ►స్మృతి మంధాన: మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (ట్రోఫీ, రూ.2లక్షలు) ►జులన్ గోస్వామి: మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు (ట్రోఫీ, రూ.2లక్షలు) ►మయాంక్ అగర్వాల్: అంతర్జాతీయ ఉత్తమ అరంగేట్రం (ట్రోఫీ, రూ.2లక్షలు) ►షఫాలీ వర్మ: అంతర్జాతీయ ఉత్తమ అరంగేట్రం (మహిళ; ట్రోఫీ, రూ.2 లక్షలు) ►శివమ్ దూబే (ముంబై): లాలా అమర్నాథ్ (రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్; ట్రోఫీ, రూ. 5 లక్షలు). ►నితీశ్ రాణా(ఢిల్లీ): లాలా అమర్నాథ్ (దేశవాళీ వన్డే క్రికెట్లో ఉత్తమ ఆల్‌రౌండర్; ట్రోఫీ, రూ. 5 లక్షలు) ►మిలింద్ కుమార్ (సిక్కిం): మాధవరావు సింధియా (రంజీ ç ట్రోఫీలో అత్యధిక పరుగులు, రూ. 2.5 లక్షలు). ►అశుతోష్ అమన్ (బిహార్): మాధవరావు సింధియా (రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు; ట్రోఫీ, రూ. 2.5 లక్షలు) ►విదర్భ: ఉత్తమ దేశవాళీ జట్టు (మెమెంటో). -
గ్రెగ్ చాపెల్‌కు ఏమీ తెలియదు: సెహ్వాగ్
భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ క్రికెటర్‌గా గొప్ప వ్యక్తి కావచ్చేమోగానీ... ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదని వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో తనను చాలా ఇబ్బంది పెట్టాడని, బలవంతంగా తన బ్యాటింగ్ స్టాన్స్‌ను మార్చే ప్రయత్నం చేశాడని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెటర్లకు కోచ్ అవసరం ఉండదని, ఆటగాళ్ల అవసరాలను గమనించే స్నేహితుడిలా కోచ్ ఉండాలని సూచించాడు. -
ఆంధ్ర నుంచి ఆటగాళ్లు రావాలి!
ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ ఆకాంక్ష త్వరలోనే విశాఖకు టెస్టు హోదా ముగిసిన ఏసీఏ వజ్రోత్సవాలు సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆకాంక్షించారు. ఇక్కడి అకాడమీలలో అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఉన్నాయని, వర్ధమాన ఆటగాళ్లు వాటిని ఉపయోగించుకొని కెరీర్లో ఎదగాలని ఆయన సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఏసీఏ వజ్రోత్సవాలు ఆదివారం ఇక్కడ ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసన్, చక్కటి స్టేడియం ఉన్న విశాఖకు త్వరలోనే టెస్టు హోదా కల్పిస్తామని చెప్పారు. టెస్టు హోదా గురించి బీసీసీఐ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఐసీసీ పరిశీలనలో ఉందని అన్నారు. క్రికెట్ అభివృద్ధి కోసం ఒక్కో అసోసియేషన్‌కు బీసీసీఐ దాదాపు రూ. 50 కోట్లు కేటాయిస్తోందని, అన్ని ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధిపై బోర్డు దృష్టి పెట్టిందన్నారు. ‘జార్ఖండ్ తదితర రాష్ట్రాలు ఈ నిధులతో కొత్త స్టేడియాలు నిర్మించుకున్నాయి. గతంతో పోలిస్తే చిన్న నగరాలనుంచి ఆటగాళ్లు ఇప్పుడు ఎక్కువ మంది పెద్ద స్థాయికి చేరుకుంటున్నారు. ధోని ఇందుకు చక్కటి ఉదాహరణ’ అని శ్రీని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో బీసీసీఐతో పాటు ఐసీసీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని, ఐపీఎల్ కారణంగా కూడా ఆదాయం పెరుగుతోందని శ్రీనివాసన్ వెల్లడించారు. ఆంధ్ర మాజీ క్రికెటర్లకు ఆర్థిక సహాయం నిమిత్తం ఏసీఏ ప్రకటించిన చెక్‌ను అందజేసిన ఐసీసీ చైర్మన్... బీసీసీఐ కూడా గతంలోనే మాజీ ఆటగాళ్లు, అంపైర్ల సంక్షేమం కోసం ‘వన్ టైమ్ బెనిఫిట్ స్కీమ్’ను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు శివలాల్ యాదవ్, సంజయ్ పటేల్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు డీవీ సుబ్బారావు, గోకరాజు గంగరాజు, ఏపీ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీఏ 13 జిల్లాల ప్రతినిధులు శ్రీనివాసన్‌ను గజమాలతో సత్కరించారు. జాతీయ క్రీడలకు ఆతిథ్యమిస్తాం... 2017లో జరిగే జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర క్రీడా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగు పర్చుకునేందుకు జాతీయ క్రీడల నిర్వహణ మంచి అవకాశమన్న ఆయన... కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 2 వేల కోట్లు ఇవ్వవచ్చని వెల్లడించారు.