ఉత్తమ క్రికెటర్లు బుమ్రా, పూనమ్‌ | Jasprit Bumrah And Poonam Yadav Set To Receive Top BCCI Awards | Sakshi
Sakshi News home page

ఉత్తమ క్రికెటర్లు బుమ్రా, పూనమ్‌

Published Mon, Jan 13 2020 3:13 AM | Last Updated on Mon, Jan 13 2020 4:41 AM

Jasprit Bumrah And Poonam Yadav Set To Receive Top BCCI Awards - Sakshi

జస్‌ప్రీత్‌ బుమ్రా, పూనమ్‌ యాదవ్‌

భారత స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ సీజన్‌లో ఆలస్యంగా ఆటలోకి వచ్చిన... బీసీసీఐ అవార్డుల్లో ముందున్నాడు. గత సీజన్‌లో విశేషంగా రాణించిన ఈ పేసర్‌కు 2019 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అవార్డులు లభించాయి.

ముంబై: గత సీజన్‌లో తన పేస్‌తో నిప్పులు చెరిగిన సీనియర్‌ ఫాస్ట్‌»ౌలర్‌ బుమ్రాకు రెండు అవార్డులు లభించాయి. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల వేడుకలో అతను ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్, దిలీప్‌ సర్దేశాయ్‌ పురస్కారాల్ని పొందాడు. 2018–19 సీజన్‌కు సంబంధించిన వేడుకను ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించారు. గత సీజన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌  అన్ని ఫార్మాట్లలో కనబరిచిన ఉత్తమ ప్రదర్శన (మొత్తం 73 వికెట్లు)కు గాను పాలీ ఉమ్రిగర్‌ అవార్డు ఇస్తారు. ఈ పురస్కారంలో భాగంగా అతనికి ప్రశంసా పత్రం, ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల చెక్‌ అందజేశారు. ఇక దిలీప్‌ సర్దేశాయ్‌ పురస్కారాన్ని టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇస్తారు.

దీంతో 34 వికెట్లు తీసిన బుమ్రానే ఈ అవార్డు వరించగా, ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్‌ చేజిక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా పూనమ్‌ యాదవ్‌ పురస్కారం గెల్చుకుంది. గత సీజన్‌లో పూనమ్‌ భారత్‌ తరఫున 8 వన్డేల్లో 14 వికెట్లు, 15 టి20 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసింది. అలనాటి పరుగుల యంత్రం, బ్యాటింగ్‌ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్‌కు కల్నల్‌ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షల చెక్‌ ప్రదానం చేశారు. మహిళల్లో ఈ పురస్కారం అంజుమ్‌ చోప్రాకు దక్కింది. పురుష క్రికెటర్‌కు సమానమైన నజరానాను అమె అందుకుంది.

టెస్టుల్లో అత్యధిక పరుగులు (52.07 సగటుతో 677) చేసిన చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ కేటగిరీలో దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు పొందాడు. ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్‌ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్పగా అరంగేట్రం చేసిన మయాంక్‌ అగర్వాల్‌కు ఉత్తమ అరంగేట్రం క్రికెటర్‌ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 2 లక్షలు దక్కాయి. దేశవాళీ క్రికెట్‌ టోర్నీలలో విశేషంగా రాణించిన విదర్భ జట్టుకు బీసీసీఐ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు లభించింది. ఈ అవార్డు వేడుకలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, సెహా్వగ్‌ సహా దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు, రంజీ ఆటగాళ్లు పాల్గొన్నారు.

ఎవరికి ఏ అవార్డు అంటే...
►కృష్ణమాచారి శ్రీకాంత్‌: కల్నల్‌ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షలు)
►అంజుమ్‌ చోప్రా: బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం (మహిళ; ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షలు)
►జస్‌ప్రీత్‌ బుమ్రా: పాలీ ఉమ్రిగర్‌ (ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌; ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు), దిలీప్‌ సర్దేశాయ్‌ (టెస్టుల్లో అత్యధిక వికెట్లు; ట్రోఫీ, రూ.2లక్షలు)
►దిలీప్‌ దోషి: బీసీసీఐ ప్రత్యేక అవార్డు (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు)
►చతేశ్వర్‌ పుజారా: దిలీప్‌ సర్దేశాయ్‌ (టెస్టుల్లో అత్యధిక పరుగులు; ట్రోఫీ, రూ.2లక్షలు)
►పూనమ్‌ యాదవ్‌: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు)
►స్మృతి మంధాన: మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (ట్రోఫీ, రూ.2లక్షలు)
►జులన్‌ గోస్వామి: మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు (ట్రోఫీ, రూ.2లక్షలు)
►మయాంక్‌ అగర్వాల్‌: అంతర్జాతీయ ఉత్తమ అరంగేట్రం (ట్రోఫీ, రూ.2లక్షలు)
►షఫాలీ వర్మ: అంతర్జాతీయ ఉత్తమ అరంగేట్రం (మహిళ; ట్రోఫీ, రూ.2 లక్షలు)
►శివమ్‌ దూబే (ముంబై): లాలా అమర్‌నాథ్‌ (రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్‌; ట్రోఫీ, రూ. 5 లక్షలు).
►నితీశ్‌ రాణా(ఢిల్లీ): లాలా అమర్‌నాథ్‌ (దేశవాళీ వన్డే క్రికెట్‌లో ఉత్తమ ఆల్‌రౌండర్‌; ట్రోఫీ, రూ. 5 లక్షలు)
►మిలింద్‌ కుమార్‌ (సిక్కిం): మాధవరావు సింధియా (రంజీ ç ట్రోఫీలో అత్యధిక పరుగులు, రూ. 2.5 లక్షలు).
►అశుతోష్‌ అమన్‌ (బిహార్‌): మాధవరావు సింధియా (రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు; ట్రోఫీ, రూ. 2.5 లక్షలు)
►విదర్భ: ఉత్తమ దేశవాళీ జట్టు (మెమెంటో).  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement