International crude oil prices
-
సబ్సిడీయేతర ఎల్పీజీ ధర భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోయిన నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను రికార్డు స్థాయిలో రూ.162.50 తగ్గింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,285 నుంచి రూ.1029.50కు తగ్గిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ చమురు ధర, విదేశీ మారకపు ధరల ఆధారంగా ప్రతినెలా ఒకటో తారీఖున వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. సబ్సిడీని వదులుకున్న గ్యాస్ వినియోగదారుల గ్యాస్ ధర గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తోంది. అలాగే గృహ వినియోగదారుల 12 కోటా పరిధి దాటిన వారు సైతం సబ్సిడీయేతర గ్యాస్ ధరల్లోనే గ్యాస్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
విదేశీ చమురు, గ్యాస్ క్షేత్రాలు భారీగా కొనాలి: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు సగానికి తగ్గిపోయిన నేపథ్యంలో.. విదేశీ చమురు, గ్యాస్ క్షేత్రాలను భారత్ భారీగా కొనుగోలు చేయాలని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అలాగే, దేశీయంగానూ ఇంధన అన్వేషణ కార్యకలాపాలు పెంచాలని, వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వెలిబుచ్చినట్లు ప్రధాన్ తెలిపారు. చమురు రేట్లు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, కర్ణాటకలోని మంగళూరు, పాడూరులలోని వ్యూహాత్మక కేంద్రాల్లో నిల్వలు పెంచుకోవాలని వ్యాపారవేత్తలు సూచించినట్లు ఆయన చెప్పారు. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 27 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌పై రూ. 2.50, పెట్రోల్‌పై రూ. 1 తగ్గే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 15న మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ తగ్గింపు అమలులోకి రావచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 1.35 డాలర్లు తగ్గి 90.76 డాలర్లకు చేరింది. 2012 జూన్ తర్వాత ధరలు ఈ స్థాయికి దిగి రావడం ఇదే తొలిసారి. మొత్తంగా ఈ ఏడాదిలో ముడిచమురు ధరలు 18 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 16 నాటికే డీజిల్ ధరలు తగ్గడంతో చమురు కంపెనీలకు లీటరుకు 35 పైసలు లాభం వచ్చింది. ఇది అక్టోబర్ 1 నాటికి రూ. 1.90 పైసలకు పెరిగింది. ఇప్పుడు లాభం రూ. 2.50 చేరిందని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లోనే డీజిల్ ధర తగ్గించాలని ప్రభుత్వం భావించినా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందు వల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది.