తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! | decrese the petrol and diesel prices! | Sakshi
Sakshi News home page

తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

Published Thu, Oct 9 2014 5:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 27 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌పై రూ. 2.50, పెట్రోల్‌పై రూ. 1 తగ్గే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 15న మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ తగ్గింపు అమలులోకి రావచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 1.35 డాలర్లు తగ్గి 90.76 డాలర్లకు చేరింది. 2012 జూన్ తర్వాత ధరలు ఈ స్థాయికి దిగి రావడం ఇదే తొలిసారి.

మొత్తంగా ఈ ఏడాదిలో ముడిచమురు ధరలు 18 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 16 నాటికే డీజిల్ ధరలు తగ్గడంతో చమురు కంపెనీలకు లీటరుకు 35 పైసలు లాభం వచ్చింది. ఇది అక్టోబర్ 1 నాటికి రూ. 1.90 పైసలకు పెరిగింది. ఇప్పుడు లాభం రూ. 2.50 చేరిందని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లోనే డీజిల్ ధర తగ్గించాలని ప్రభుత్వం భావించినా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందు వల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement