International Indian Film Academy
-
IIFA అవార్డ్స్ 24వ ఎడిషన్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
అందచందాలతో అదిరె.. ఐఫా ఈవెంట్!
-
ప్లీజ్.. నా నుంచి అది ఆశించొద్దు: సల్మాన్
ముంబై: స్టార్ హీరో అయినప్పటికీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటాడు. అయినా అతని స్టార్ డమ్ కు ఏ లోటూ లేదు. బాలీవుడ్ మూవీలను వంద కోట్ల క్లబ్ కు చేరడం నీళ్లప్రాయంగా మార్చిన హీరో సల్మాన్ ఖాన్. శుక్రవారం అతని పెళ్లి విషయంపై కాస్త వివాదం కావడం తెలిసిందే. తమ్ముడు అర్బాజ్ ఖాన్ పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడంతో పాటు సమర్ధించుకున్నాడు. ఈ జూన్ 23-26 తేదీల మధ్య ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఫా) ఉత్సవాలపై సల్మాన్ మాట్లాడుతూ... తాను హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ లాగ డాన్స్ చేయలేనని చెప్పాడు. అందుకే ఐఫాలో వారి అంత మంచి స్టెప్పులు వేయలేనని, అందుకే తన నుంచి అలాంటివి ఆశించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తనకు వచ్చిన విధంగా నార్మల్ స్టెప్పులతో అలరించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాడు. వరుస షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ తాను చాలా బిజీగా ఉన్నా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరగనున్న ఐఫా వేడుకల్లో పాల్గొంటానని చెప్పాడు. సల్మాన్ ఎక్కడుంటే అక్కడ చాలా ఫన్నీగా ఉంటుందని, కుటుంబమంతా ఉన్న ఫీలింగ్ కలుగుతుందని సీనియర్ హీరో అనిల్ కపూర్ అభిప్రాయపడ్డాడు. ఐఫాలో కరీనా కపూర్, మోనాలి ఠాకూర్, ప్రీతమ్, నీతి మోహన్ ఫర్మార్మెన్స్ చూడవచ్చని చెప్పాడు. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ కంటెస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తారని అనిల్ వివరించాడు. -
ఐఫా - ఉత్సవమ్
-
దక్షిణాది సినీ అవార్డుల సంరంభం షురూ!
హిందీ సినిమాకు సంబంధించి పదహారేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) ఉత్సవాలు తొలిసారిగా దక్షిణాదికి విస్తరించాయి. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) సినిమాల ప్రముఖులనూ ఒకే వేదికపై తీసుకు వచ్చాయి. రెండు రోజుల ఈ దక్షిణాది సినీ అవార్డుల సంరంభానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియమ్ వేదిక అయింది. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందిస్తున్న ఈ ‘ఐఫా - ఉత్సవమ్’ తొలి నాటి వేడుకలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ‘ఐఫా’ నిర్వాహకులైన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ‘విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్’ డెరైక్టర్ విజ్ సబ్బాస్ జోసెఫ్ వేడుకల వివరాలను తెలిపారు. ‘ఐఫా-ఉత్సవమ్’ పేరిట దక్షిణాది లోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు నాలుగింటిలోని ప్రతిభను గుర్తించి, అవార్డులు అందించడానికి ‘ఐఫా’ సన్నద్ధమైనట్లు ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. సోమవారం నాడు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల వేడుక జరుగనుంది. ఈ వేడుక కోసం పలువురు ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణులు భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ అవార్డులకో బ్రాండ్ ఇమేజ్ ఉంది! - పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ‘‘హిందీ పరిశ్రమ తర్వాత అత్యధిక సంఖ్యలో సినిమాలను నిర్మించే పరిశ్రమగా తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు ఉంది. ‘ఐఫా’ అవార్డులకు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతి ఏటా ఈ వేడుకలను చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది. అలాంటి ఈ అవార్డు వేడుకలు తొలిసారిగా దక్షిణాదికి రావడం, హైదరాబాద్‌లో నిర్వహించడం ఆనందంగా ఉంది.’’ హైదరాబాద్ బెస్ట్ ప్లేస్! - బి. వెంకటేశమ్, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ‘‘మొదటి నుంచి సాంస్కృతిక వేదికగా హైదరాబాద్‌ను నంబర్‌వన్ చేయాలనే ఆలోచనతో విశేషమైన కృషి చేస్తున్నాం. ఇలాంటి వేడుకలకు హైదరాబాద్ అనువైన స్థలం. ‘ఐఫా’ వేడుకలకు హైదరాబాద్‌ను శాశ్వత వేదికగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.’’ విజ్ సబ్బాస్ జోసఫ్, విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ - ‘ఐఫా’ డెరైక్టర్ ‘‘‘ఐఫా- ఉత్సవమ్’ వేడుకలను డిసెంబరులోనే నిర్వహించాల్సి ఉంది. కానీ హఠాత్తుగా చెన్నైను వరదలు ముంచెత్తడంతో సంఘీభావంగా ఈ వేడుకలను వాయిదా వేశాం. గతంలో జరిగిన ఉత్తరాది వేడుకలకు ఏ మాత్రం తీసిపోకుండా చరిత్రలో నిలిచిపోయేలా ఈ అవార్డు వేడుకలను ప్లాన్ చేస్తున్నాం.’’ అప్పట్లో అందరూ చెన్నయ్‌లోనే - శివరాజ్‌కుమార్, ప్రముఖ కన్నడ హీరో ‘‘హిందీ పరిశ్రమకే కాకుండా దక్షిణాది పరిశ్రమకు కూడా ఈ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉంది. మా నాన్నగారు రాజ్‌కుమార్ ఉన్న సమయంలో అన్ని భాషల సినీ పరిశ్రమల వాళ్ళూ చెన్నైలోనే ఉన్నారు. అలాంటి చెన్నై వరదబాధితుల బాధను అర్థం చేసుకుని అన్ని భాషల వాళ్ళూ ముందుకు వచ్చారు. ఇప్పుడు జరిగే వేడుకల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’’ వాళ్ల డ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నా! - ప్రియమణి ‘‘ చెన్నై వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఫండ్‌రైజర్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది. హీరోయిన్స్‌తో పాటు రామ్‌చరణ్, అఖిల్, జీవా లాంటి అగ్ర హీరోలు కూడా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అగ్ర హీరోలు ఇలా ఆహూతుల సమక్షంలో వేదికపై నర్తించడం ఇదే తొలిసారి. వాళ్ళందరి డ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నా!’’ తమిళనాడు ప్రభుత్వం తరపున థ్యాంక్స్! - నాజర్, ప్రముఖ సినీ నటుడు డిసెంబర్లో జరగాల్సిన ‘ఐఫా- ఉత్సవమ్’ వేడుకను తమిళనాడు వరద బాధితులకు సంఘీభావంగా ఇప్పటి దాకా వాయిదా వేసినందుకు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. వచ్చే ఏడాది చెన్నైలో ఈ వేడుకలను జరపాలని కోరుకుంటున్నా.’’ మన హైదరాబాద్‌కు కొత్త కళ - దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ సంగీత దర్శకుడు ‘‘ ‘ఐఫా’ వేడుకలు మన ఊరికి రావడంతో హైదరాబాద్‌కు కొత్త కళ వచ్చింది. ‘శ్రీమంతుడు’ సినిమాకుగానూ మ్యూజిక్ డెరైక్టర్ గా, అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘సూపర్ మచ్చీ’ సాంగ్‌కు గీత రచయితగా అవార్డులకు నామినేట్ అయ్యాను. అవార్డు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ కావడం ఇష్టం. అందుకే, ఈ వే డుకల్లో మంచి పాటలతో ఓ ఊపు ఊపడానికి రెడీ అవుతున్నా’’ సినీ పరిశ్రమలో దాదాపు సగం దక్షిణాదిదే! - ర సూల్ పూకుట్టి, ‘ఆస్కార్’ అవార్డ్ గెలిచిన ప్రముఖ సౌండ్ ఇంజనీర్ ‘‘ ‘ఐఫా’ వేడుకలను నిర్వహిస్తున్న విజ్ క్రాఫ్ట్ సంస్థతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. దక్షిణాదిలో ఎందుకు చేస్తున్నారని నిర్వాహకులను అడిగాను. భారతీయ సినీ పరిశ్రమ వ్యాపార గణాంకాలను చూస్తే, పరిశ్రమలో 45 శాతం వాటా దక్షిణాదిదే. దాదాపు 17 వేల కోట్ల టర్నోవర్ ఉన్న దక్షిణాదిలో ఇలాంటి వేడుకలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ‘ఐఫా - ఉత్సవమ్’లో కేవలం గ్లామరే కాకుండా చెన్నై వరద బాధితులను ఆదుకోవడమనే మానవీయ కోణం కూడా ఉంది.’’ ఈ మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాతలు డి.సురేశ్‌బాబు, కె.ఎస్. రామారావు, కథానాయికలు తాప్సీ, మమతా మోహన్‌దాస్, ఆదాశర్మ, నిఖిత, పారుల్ యాదవ్, హీరో నవదీప్ తదితరులు పాల్గొన్నారు. సూపర్‌హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తున్నా! - రామ్‌చరణ్, ప్రముఖ హీరో ఈ వేడుకల గురించి అగ్ర తెలుగు హీరో రామ్‌చరణ్ ఒక ప్రకటన చేస్తూ, ‘‘దక్షిణాది పరిశ్రమను సత్కరించడానికి ‘ఐఫా’ చేస్తున్న కృషి అభినందనీయం. ఎంటర్టైన్మెంట్ దృష్టితోనే కాకుండా ఓ ఫండ్ రైజర్‌గా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి సారిగా సౌత్‌లో జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సౌత్ ఇండియన్ సినిమాల్లోని సూపర్‌హిట్ సాంగ్స్‌కు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నా’’ అని తెలిపారు. -
బాహుబలికి 14, శ్రీమంతుడుకి 11
హిందీ సినిమాకు సంబంధించి గడచిన పదహారేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) ఉత్సవాలు ఈ సారి దక్షిణాదికి విస్తరించాయి. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) సినిమాల ప్రముఖులనూ ఈ ‘ఐఫా ఉత్సవమ్ -2015’ ఒకే వేదికపై తీసుకువస్తోంది. వివిధ కేటగిరీల్లో విజేతలను నిర్ణయించేందుకు ఇప్పుడు నామినేషన్ల హంగామా మొదలైంది. తెలుగు సినిమా నామినేషన్లలో ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఉత్తమ నటుడు, నటి, సంగీత దర్శకుడు, పాటలతో సహా 14 విభాగాల్లో ‘బాహుబలి’ నామినేట్ అయింది. ఇక, ‘శ్రీమంతుడు’ చిత్రం ఏకంగా 11 కేటగిరీల్లో నామినేటైంది. ‘బాహుబలి’ చిత్రం నుంచి ఉత్తమ గాయని విభాగానికి ముగ్గురూ, ఉత్తమ గాయకుడి చిత్రానికి ఇద్దరు నామినేట్ అవడం విశేషం. రానున్న డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే ఈ ‘ఐఫా - ఉత్సవమ్’లో విజేతల ప్రకటన, అవార్డు ప్రదానం జరుగుతుంది. ఇండస్ట్రీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీలకు సంబంధించి ఓటు వేస్తారు. ఆ ఓట్లన్నిటినీ లెక్కించి, శాస్త్రీయ పద్ధతిలో విజేతలను నిర్ణయిస్తారు. -
భాగ్యనగరిలో... దక్షిణాది సినీ ఉత్సవం
హిందీ సినిమాకు సంబంధించి గడచిన పదహారేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) ఉత్సవాలు తొలిసారిగా దక్షిణాదికి విస్తరిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) సినిమాల ప్రముఖులనూ ఒకే వేదికపై తీసుకురానున్నాయి. డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో ఈ ‘ఐఫా ఉత్సవం - 2015’కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియమ్ వేదిక కానుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ‘ఐఫా’ నిర్వాహకులైన ‘విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్’ డెరైక్టర్ విజ్ సబ్బాస్జోసెఫ్ ఈ సంగతి ప్రకటించారు. ఈ కొత్త ముందడుగుకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐ.టి. శాఖ మంత్రి కె. తారకరామారావు (కెటీఆర్) సంతోషం వ్యక్తం చేస్తూ, ‘‘భారతీయ సినిమాకు సంబంధించి అద్భుత ప్రతిభ, అసలు వ్యవహారం అంతా - వింధ్య పర్వతాలకు దిగువన దక్షిణాదిలోనే ఉంది. ఏటా విడుదల చేసే సినిమాల సంఖ్యలో దేశంలోనే రెండో పెద్ద చిత్రపరిశ్రమ తెలుగు చిత్రసీమ. ఇవాళ రెండో అతిపెద్ద గ్రాసర్ ‘బజ్రంగీ భాయ్‌జాన్’ రచయిత కూడా తెలుగువాడే. ఆస్కార్ అవార్డ్ విజేతలు కూడా దక్షిణాదిలో ఉన్నారు. ఇన్నేళ్ళ తరువాతైనా ‘ఐఫా’ను దక్షిణాది సినిమాకు విస్తరించాలని భావించడం చాలా బాగుంది’’ అని వ్యాఖ్యానించారు. ముందుగా వాగ్దానం చేసినట్లుగా రాగల మూడేళ్ళ పాటు ఈ ‘ఐఫా - ఉత్సవం’ భాగ్యనగరిలో జరగాలనీ, అందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందనీ ఆయన పేర్కొన్నారు. గడచిన పదహారేళ్ళలో 4 ఖండాల్లో, 11 దేశాల్లోని 14 వేర్వేరు నగరాల్లో జరిగిన ‘ఐఫా’ ఉత్సవం ఇలా దక్షిణాది సినిమాకు విస్తరించడం పట్ల ప్రముఖ నటుడు ‘పద్మభూషణ్’ కమలహాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘హిందీతో సహా వివిధ భాషల్లో సినిమాలు తీసిన విజయ (నాగిరెడ్డి - చక్రపాణి), ఏ.వి.ఎం, జెమినీ, సురేష్ ప్రొడక్షన్స్ (రామానాయుడు) లాంటి జాతీయస్థాయి ప్రముఖ సంస్థలు, నిర్మాతలు దక్షిణాది వారే. రామానాయుడు గారు 13 భాషల్లో సినిమాలు తీశారు. వీళ్ళందరూ మన సినిమాను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళినవారు. ఇవాళ ప్రపంచంలోనే బలిష్ఠమైన పరిశ్రమ దక్షిణాది చిత్రసీమే’’ అని కమల్ అన్నారు. హీరోలు నాగార్జున , వెంకటేశ్‌లు ఈ ఉత్సవం పట్ల ఆనందం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ - వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని యాదవ్ మాట్లాడుతూ, సౌతిండియన్ సినిమాకు ఈ ఉత్సవం మంచి అవకాశ మన్నారు. సినీ ప్రముఖులు కె.ఎస్. రామారావు, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, ‘జెమినీ’ కిరణ్, దేవిశ్రీ ప్రసాద్, అల్లు శిరీష్, రామ్మోహన రావు, స్పాన్సరర్లు విప్లవ్, అల్లూరి నారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమన్నా హల్చల్ సమావేశంలో హీరోయిన్ తమన్నా ప్రత్యేక ఆకర్షణయ్యారు. ఆమె ధరించిన బటర్ ఫ్లై డ్రెస్ చర్చనీ యాంశమైంది. పారదర్శకంగా, శరీర మంతా కనపడే మోడ్రన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ వస్తుంటే అందరూ కళ్ళప్ప గించారు. ‘ఐఫా’లో ఏం జరుగుతుందంటే... 2000లో ‘ఐఫా’ అవార్డుల ఉత్సవం మొదలైంది. ప్పుడు తొలిసారి ‘ఐఫా ఉత్సవం’ పేరిట మన దక్షిణాది భాషా సినిమాలకు విస్తరించింది.‘ఐఫా - ఉత్సవం’ 2015 మూడు రోజుల పాటు ఈ డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ ఔట్‌డోర్ స్టేడియమ్లో జరుగుతుంది.మొదటి రోజున ‘ఫిక్కీ’తో కలసి ‘ఐఫా’ బిజినెస్ ఫోరమ్‌ను నిర్వహించ నుంది. సినీ టూరిజమ్, కో-ప్రొడక్షన్స్, పెట్టుబడి అవకాశాల్ని చర్చిస్తారు.రెండో రోజు తమిళ, మలయాళ చిత్రసీమల్లోని ప్రతిభావంతుల్ని సన్మానిస్తారు. మూడో రోజు తెలుగు, కన్నడ సినీ ప్రముఖుల్ని గౌరవిస్తారు.