International Series
-
విదేశాలకు ఆకాశ ఎయిర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ సరీ్వసులు నడిపేందుకు రెడీ అయింది. ముంబై నుంచి దోహాకు తొలి అంతర్జాతీయ సర్వీ సు మార్చి 28న ప్రారంభం కానుంది. వారంలో నాలుగు నాన్–స్టాప్ ఫ్లైట్స్ నడుపనుంది. 2022 ఆగస్ట్ 7న ఆకాశ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభించింది. కంపెనీ వద్ద బోయింగ్ 737 మ్యాక్స్ రకం 23 విమానాలు ఉన్నాయి. 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు 2024 జనవరిలో ఆర్డర్ ఇచి్చంది. -
ఆసీస్‌కు భారత్ జంబో బృందం!
ముంబై: వచ్చే నెలలో కోహ్లి సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాట్లు ఆడనున్న నేపథ్యంలో అక్కడికి టీమిండియా జంబో సేనతో బయల్దేరుతుంది. పైగా కరోనా ప్రొటోకాల్ కూడా ఉండటంతో ఒకేసారి భారీ జట్టునే పంపనున్నట్లు తెలిసింది. మొత్తం 32 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళతారు. ఇందులో భారత్ ‘ఎ’ ఆటగాళ్లు కూడా ఉంటారు. యూఏఈలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు అక్కడి నుంచే నేరుగా ఆసీస్‌కు పయనమవుతారు. కరోనా మహమ్మారి తర్వాత కోహ్లి సేన ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. రెండున్నర నెలల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ మూడు టి20లు, మూడు వన్డేలతోపాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. ఇందులో ఒక డే–నైట్ టెస్టు జరుగుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్ ముగిశాక టెస్టు జట్టులో లేని ఆటగాళ్లను స్వదేశానికి పంపే అవకాశాల్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి తీసుకుంటుంది. ‘జంబో సేన’ ఎందుకంటే... ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఏ దేశంలోనూ పూర్తిస్థాయిలో పునరుద్ధరించనే లేదు. పైగా వెళ్లిన ప్రతీ ఒక్కరు క్వారంటైన్ కావాల్సిందే. దీంతో టూర్ మధ్యలో ఆటగాడు ఎవరైనా గాయపడితే ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే ప్రత్యేక విమానం (చార్టెడ్ ఫ్లయిట్) కావాలి. తీరా భర్తీ అయిన ఆటగాడు అక్కడికి వెళ్లాక జట్టుతో కలిసే అవకాశం కూడా ఉండదు. 14 రోజులు క్వారంటైన్లో గడపాల్సిందే. ఈ సమయంలో రెండు, మూడుసార్లు కోవిడ్ పరీక్ష చేస్తారు. ప్రయాణ బడలికలో కానీ, ఇతరత్రా సౌకర్యాల వల్ల కరోనాను పొరపాటున అంటించుకుంటే ఇంత వ్యయప్రయాసలోర్చి పంపిన ఆటగాడు ఆడే అవకాశం క్లిష్టమవుతుంది. ఇవన్నీ కూలంకశంగా పరిశీలించిన సీనియర్ సెలక్షన్ కమిటీ ఏకంగా జంబో సేనను పంపడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత బృందమే రెండు మూడు జట్లుగా ఏర్పడి ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే సుదీర్ఘంగా సాగే ఈ టూర్ పూర్తిగా ఆటగాళ్ల వరకే పరిమితమవుతుంది. క్రికెటర్ల వెంట సతీమణులు, ప్రియసఖిలకు అనుమతి లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో మాత్రం భార్య, గర్ల్‌ఫ్రెండ్స్‌పై నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలకే వదిలేసిన సంగతి తెలిసిందే. ముందుగా పొట్టి మ్యాచ్‌లు... కంగారూ గడ్డపై ముందుగా భారత్ మూడు పొట్టి మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం టి20లు ముగిశాక... వన్డేలు ఆడుతుంది. అయితే దీనికి సంబంధించిన తేదీలను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోగా తుది షెడ్యూల్‌ను భారత బోర్డుకు తెలియజేసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా టెస్టు స్పెషలిస్టులైన చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలకు మ్యాచ్ ప్రాక్టీస్ ఏర్పాట్లపై బోర్డు దృష్టి పెట్టింది. ఐపీఎల్లో అవకాశంరాని వీరిద్దరికి దేశవాళీ టోర్నీలు కూడా లేక ఎలాంటి ప్రాక్టీసే లేకుండా పోయింది. కరోనా తర్వాత అసలు బరిలోకే దిగలేని వీరి కోసం బోర్డు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసే పనిలో పడింది. సిడ్నీలో క్వారంటైన్? భారత జట్టు బ్రిస్బేన్‌లో అడుగు పెట్టినా... క్వారంటై న్ మాత్రం అక్కడ కుదరదు. క్వీన్స్లాండ్ ప్రభు త్వం కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల్ని అక్కడ బస చేసేందుకు అనుమతించడం లేదు. దీంతో సిడ్నీ లేదంటే కాన్బెర్రాలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీఏ ఉన్నతాధికారులు న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
వైఎస్ఆర్ స్టేడియంలో భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ మ్యాచ్
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ సిరీస్‌కు ఆదివారం నుంచి తెరలేవనుంది. వైఎస్ఆర్ స్టేడియంలో గతంలో ఇంగ్లాండ్ జట్టుతో భారత మహిళా జాతీయ జట్టు సిరీస్ ఆడింది. పురుషుల విభాగంలో క్వాడ్రేంగులర్ సిరీస్‌లో నాలుగు దేశాల అండర్ 19 క్రికెట్‌కు ఆతిథ్య మిచ్చిన విశాఖలో ఈసారి న్యూజిలాండ్-ఎతో భారత్-ఎ జట్టు అనధికార సిరీస్ ఆడనుంది. జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఇరుజట్ల ఆటగాళ్ళు ఆదివారం నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో రాణించేందుకు వేదికగా మారనుంది. ఇక్కడ ఆడిన రెండు అనధికార టెస్ట్‌ల ఫలితం తేలకుండానే డ్రాగా ముగిశాయి. అయితే భారత్-ఎకు నాయకత్వం వహించిన అభిషేక్ నాయర్ వన్డేల్లో స్థానం కోల్పోగా, న్యూజిలాండ్-ఎ కెప్టెన్ లాథమ్ వన్డేల్లో వికె ట్ కీపర్‌గానే ఉండనున్నాడు. ఇదిలా వుండగా వన్డే సిరీస్‌కు ఎంపికైన ఇరుజట్లు వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్లో శనివారం ముమ్మరంగా సాధన చేశాయి. ఉన్ముక్త్, ఆండ్రూ కెప్టెన్లు టెస్ట్ సిరీస్ ఆడిన ఇరు జట్లలోనూ వన్డే సిరీస్‌కు మార్పులు చోటు చేసుకున్నాయి. వన్డే సిరీస్‌లకు కెప్టెన్లను మార్పు చేశారు. ఏకంగా భారత్ తరఫున నలుగురు మినహా జట్టులో మార్పులు చేయగా, న్యూజిలాండ్‌కు మూడే మార్పులు చేశారు. న్యూజిలాండ్-ఎకు లాథమ్ స్థానంలో ఆండ్రూ ఎల్లీస్, భారత్-ఎకు అభిషేక్ స్థానంలో ఉన్ముక్త్‌చంద్ నాయకత్వం వహించనున్నారు. భారత్-ఎ తరఫున వన్డేలు ఆడేందుకు శ్రీకాంత్వా, జలజ్ సక్సేనా, దావల్ కులకర్ణి అవకాశం సాధించగా మిగిలిన జట్టును మార్చారు. ఇక న్యూజిలాండ్-ఎలో బ్రూమ్, బూర్డర్, నీషమ్ స్థానాల్లో కొలిన్, స్కాట్లను తీసుకున్నారు. ఆది, మంగళ, గురువారాల్లో వన్డేలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. విజయపథాన నడిపిస్తా విశాఖ వేదికగా చక్కటి ఇన్నింగ్స్ ఆడిన అనుభవం ఉంది. గడిచిన రెండు టెస్ట్‌ల్లో రాణించలేక పోయాను. ఇప్పుడు ఆడబోయేది వన్డేలు. దానికి తగ్గట్టుగానే ఆటను మార్పు చేసుకుంటా. ఇక్కడే నాలుగు దేశాల అండర్19 క్రికె ట్లో సెంచరీ చేశాను. జాతీయ జట్టులో స్థానం సాధించేందుకు ఈ వన్డే సిరీస్ నాతో పాటు మరికొందరికి అవకాశం కానుంది. - భారత్-ఎ జట్టు కెప్టెన్ ఉన్ముక్త్‌చంద్