international yoga festival
-
యోగా వేడుకలు ప్రారంభం
వాషింగ్టన్/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అంతర్జాతీయ యోగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా పలు దేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌తోపాటు న్యూయార్క్‌లోని గవర్నర్స్ ఐలాండ్‌లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో అమెరికాలో భారత రాయబారితోపాటు దౌత్యాధికారులు, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. న్యూయార్క్‌లోని గవర్నర్స్ ఐలాండ్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సమీపంలో యోగా ఉత్సవాలు రెండు గంటలపాటు జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారు, తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నెదర్లాండ్స్‌లో రవిశంకర్ నేతృత్వంలో.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ నెదర్లాండ్స్‌లో యోగా వేడుకలను ప్రారంభించారు. రాజధాని అమ్‌స్టర్‌డ్యామ్‌లోని మ్యూజియం స్క్వేర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. నేపాల్‌లోని ముక్తినాథ్ ఆలయంలో, పారిస్‌లోని ఈఫిల్ టవర్ సమీపంలో, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లలో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రజలు పాల్గొని ఆసనాలు వేశారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ ముందు యోగాసనాలు వేస్తున్న ఔత్సాహికులు -
అన్నింటికీ సమాధానం యోగా
అంతర్జాతీయ యోగా ఉత్సవాలనుద్దేశించి మోదీ ప్రసంగం రిషికేశ్: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం ద్వారా శాంతిని సాధించే మార్గం యోగా అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రిషికేశ్‌లో గంగానది ఒడ్డున జరుగుతున్న అంతర్జాతీయ యోగా ఉత్సవాలనుద్దేశించి గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యోగా అంటే ఎక్సర్సైజ్ కాదని, మనఃశరీరాలను ప్రకృతికి చేరువ చేసే మార్గమని స్వయంగా రోజూ యోగా సాధన చేసే ప్రధాని వివరించారు. యోగా సాధనతో సమాజాన్ని చూసే దృక్పథం మారుతుందన్నారు. ‘అహం(నేను) నుంచి వయం(మనం) వైపు చేసే ప్రయాణమే యోగా’ అని వివరించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారిన నేపథ్యంలో యోగాసాధనం అత్యంత ఆవశ్యకంగా మారిందన్నారు. ఇస్రో ఇటీవల విజయవంతంగా నిర్వహించిన 104 ఉపగ్రహాల ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ.. శాస్త్ర,సాంకేతిక రంగాల లోతులే కాకుండా, ఆత్మగత లోతులను పరిశోధించడంలో భారతీయులకు విశ్వాసం ఉందన్నారు. అనాదిగా సాధువులు, మేధావులు శాంతి సాధన కోసం ఏకమై పరిశోధన చేసిన ప్రాంతంగా రిషికేశ్ ప్రఖ్యాతిని ప్రధాని గుర్తు చేశారు. అంతర్జాతీయ యోగా ఉత్సవాల నిర్వహణకు రిషికేశ్ సరైన స్థలమన్నారు. జీవితానికి సంబంధించిన అత్యంత క్లిష్ట సమస్యల పరిష్కారానికి ఆలోచనలు సాగించిన మేధావుల గడ్డగా భారత్‌ను అభివర్ణించిన జర్మన్ మేధావి మాక్స్ ముల్లర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ఉటంకించారు.