ముగిసిన పీహెచ్డీ ఇంటర్వ్యూలు
జేఎన్టీయూ : ఎంఫిల్, పీహెచ్డీ, ఎంఎస్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు శుక్రవారం ముగిశాయని అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఈఈఈ విభాగానికి సంబంధించి శుక్రవారం 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెక్టార్ ప్రొఫెసర్ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, ప్రొఫెసర్ పి.సుజాత ఇంటర్వ్యూలు నిర్వహించారు.