Investigating officers
-
అవునని తెలిసీ... కాదని అంటాం!
‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు... వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు ‘క్యాస్ట్ ప్రైడ్’ రచయిత మనోజ్ మిత్తా. కులహత్యలు జరిగినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కులం గురించి, అది మన వ్యవస్థలలోకి చొరబడిన విద్వేష మార్గం గురించి నాకు మరీ అంతగా తెలియదు. అదృష్టవశాత్తూ మనోజ్ మిత్తా రాసిన ‘క్యాస్ట్ ప్రైడ్: బ్యాటిల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా’ నా చేతికి అందింది. దట్టమైన పుస్తకం అది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అడవిని చూడలేనంతగా చెట్ల కింద కూరుకుపోయినట్లుగా ఉంది. అయితే మీరు గొప్ప పట్టుదలను కలిగి ఉంటే కనుక చదవదగిన పుస్తకమే అనిపిస్తుంది. ఏమైనా, మనోజ్ తనకు తానుగా సత్యాన్ని గుర్తించాడని కనిపెట్టినప్పుడు మొదట నా ముఖంపై చిరునవ్వు వెలసింది. ‘‘1984లో సిక్కుల ఊచకోత, 2002లో ముస్లింలపై జరిగిన మారణకాండల మీద పుస్తకాలు రాశాక, మూడో పుస్తకాన్ని భారతదేశంలోని సామూహిక హింసపై రాయాలన్నది నా అసలు ప్రణాళిక. దళితుల హత్యలపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశం’’ అంటాడు మనోజ్. అయితే ఏడేళ్ల పరిశోధన తర్వాత అతడు తెలుసుకున్నది ఏమిటంటే, ఇంకా చాలా కథే ఉందని! ‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు, పునర్విచారణ న్యాయ నిర్ణేతలు వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు మనోజ్. అతడి ఈ గ్రహింపు సూటిగా ఉన్నది, సరళమైనది, బాధతో కూడినది. కులహత్యలు జరిగినప్పుడు, కుల మారణ కాండలు సంభవించినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా కూడా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘అత్యంత స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కుల వివాదాలను, కుల దౌర్జన్యాలను అదుపులోకి తెచ్చేందుకు 1816–2019 మధ్య ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో తెలిపే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘‘అంటరానితనం నిర్మూలనకు అంటూ 1950లో ఏదైతే ప్రయత్నం జరిగిందో అది... అప్పటికే అంటరానితనం నుంచి విముక్తి పొంది ఉన్నవాళ్లపై మరింతగా దిగ్భ్రాంతి కరమైన హింసాత్మక చర్యలకు ఆధిపత్య కులాలవారిని ప్రేరేపించి, సామూహిక హత్యలు అనే ఒక కొత్త దురాగతాన్ని కనిపెట్టేందుకు వారు పాల్పడేంతగా వ్యతిరేకతకు కారణమైంది’’ అని మనోజ్ రాశారు. 1968లో తమిళనాడులోని కీలవేణ్మణిలో తొలిసారి అటువంటి సామూహిక హత్యలు జరిగాయి. మనోజ్ పేర్కొన్న దారుణాలలో నేను బాగా గుర్తెరిగినది బెల్చి హత్యాకాండ. అది జరిగినప్పుడు నా వయసు 22. ఆ భయానక ఊచకోతకు లండన్ నుంచి వెలువడే ‘ది స్పెక్టేటర్’ పత్రిక ‘ది హంటింగ్ ఆఫ్ హరిజన్’ అనే శీర్షికను పెట్టడం కన్నా కూడా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది... ఇందిరా గాంధీ చూపిన చొరవ. అర్ధరాత్రి సమయంలో రుతుపవనాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు మావటి వెనుక ఏనుగుపై కూర్చొని, ఆ చీకట్లో తనను అంతా గుర్తించగలిగేలా టార్చిలైట్ల వెలుగులో బెల్చి చేరుకోవడం. ‘‘ఆ విధంగా చేయడం ద్వారా ఆమె జనాదరణను ఒడిసి పట్టుకున్నట్లయింది’’ అంటాడు మనోజ్. ఈ పుస్తకం ద్వారా తప్ప... ఇంతవరకు నాకు తెలియందీ, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందీ, ‘‘కులపరమైన హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించిన మొట్టమొదటి, బహుశా ఏకైక జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ’’ కావడం. మన తాజా రాజకీయాలపై, నిజానికి ఇప్పటి మన ప్రజాస్వామ్యంపై ఎంత కఠోర వ్యాఖ్య! మనల్ని బాధించే విషాదాలపై మన పాలకులు ఎలా çస్పందిస్తున్నారనే దానిపైన కూడా ఇది కచ్చితమైన వ్యాఖ్య. అయితే మనోజ్ ఉద్దేశం ఇందిరాగాంధీ చొరవ గురించి చెప్పడం కాదు. బెల్చి ఘటనను మన వ్యవస్థ ఒక కులద్వేష దురాగతంగా అంగీకరించడానికి ఎందుకు ఇష్టపడలేదన్న ప్రశ్నను లేవనెత్తడం. నాడు హోమ్ మంత్రిగా ఉన్న చరణ్‌సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనకు కుల, మత, భూ తగాదాలు గానీ, రాజకీయాలు గానీ కారణం కాదు. కొన్ని పత్రికల్లో వచ్చిన విధంగా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యం కూడా కాదు’’ అని ప్రకటించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ధన్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ చరణ్ సింగ్‌తో తీవ్రంగా విభేదించింది కానీ, అది కుల దురాగతమేనని ఆయన్ని ఒప్పించలేకపోయింది. చరణ్ సింగ్ చేసినటువంటి ఖండన ప్రకటనలు దాదాపు ప్రతిసారి కూడా మన ప్రతిస్పందనల్ని వికలపరుస్తాయని మనోజ్ వాదిస్తాడు. అగ్రవర్ణాలవారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తిరస్కరిస్తారు. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులు సహకరించుకోవడం, బలహీనమైన న్యాయ విచారణ, వాదనలు, తీర్పులు, సుప్రీంకోర్టుకు చేరిన పునర్విచారణల నిర్వహణలో సైతం ఈ అగ్రవర్ణ భావన పని చేస్తుందని మనోజ్ అంటాడు. ఆఖరికి మనమెంతో గొప్పగా భావించే నాయకుల గురించి కూడా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘ఈ నిర్దిష్ట సందర్భంలో ఎల్లవేళలా మహాత్ముడిలా కనిపించరు’’ అని గాంధీ గురించి, ‘‘కుల సంస్కరణలను ఆయన ప్రతిఘటించలేదు, లేదా పెద్దగా వాటి కోసం ప్రయత్నించనూ లేదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే’’ అని నెహ్రూ గురించి, చివరికి అంబేడ్కర్ గురించి కూడా – నేను ఎక్కువ వివరాలు ఇవ్వను గానీ– ‘‘ఆయన కథేమీ ఆశ్చర్యాలు లేనిదైతే కాదు’’ అని అంటూ... ‘‘స్వాతంత్య్ర సమరయోధులు తప్పనిసరిగా సమానత్వ ఉద్యమశీలురు కావాలనేముంది?’’ అని ముగిస్తాడు మనోజ్. పుస్తకం గురించి నా ఏకైక విమర్శ ఏమిటంటే... చదివేందుకు ఇది కొంచెం తేలికగా ఉండవలసిందనీ, పేజీలు పొంగిపొర్లేలా వివరాలు ఇవ్వడం వల్ల పుస్తకంలో ప్రధాన సందేశాన్ని తరచు అవి మరుగున పడేస్తున్నాయనీ. అయినప్పటికీ అది మనం వినవలసిన, మనం గుర్తుంచుకోవలసిన సందేశమే. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఏసీపీ నేతృత్వంలో నవీన్ హత్యకేసు దర్యాప్తు
అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకేసులో దర్యాప్తు అధికారిగా వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన నేతృత్వంలో పలు పోలీసు బృందాలు లోతుగా దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే విజయవాడ జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఉన్నాయని.. వాటిని పరిశీలిస్తే నవీన్, హరిహరకృష్ణతోపాటు ఇంకా ఎంతమంది అక్కడికి వ చ్చారనేది తేలనున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, బాటసింగారం ప్రాంతాలపై హరిహరకృష్ణకు ముందే స్పష్టమైన అవగాహన ఉన్నట్టు భావిస్తున్నారు. శివారు ప్రాంతాలు కావడం, పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో.. నిర్మానుష్య ప్రాంతాలను ఎన్నుకుని గుట్టుచప్పడు కాకుండా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం. నవీన్, హరిహరకృష్ణ, వారి స్నేహితులు గతంలో గంజాయికోసం ఈ ప్రాంతాలకు వచ్చి ఉంటారని, ఈ క్రమంలోనే హత్యకు నిర్మానుష్య ప్రాంతాన్ని సులువుగా ఎంచుకుని ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడి కస్టడీ కోసం నేడు పిటిషన్ ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమ వారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ హత్యకు సంబంధించి హరిహరకృష్ణ, నవీన్ స్నేహితులను కూడా విచారించనున్నట్టు సమాచారం. నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ.. ఆ తర్వా త నవీన్ స్నేహితులతో ఫోన్లో మాట్లాడిన ఆడి యో రికార్డులు బయటికి వచ్చాయి. హరిహరకృష్ణ హత్యకు పాల్పడిన ఆందోళన, భయం వంటివేమీ లేకుండా మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి అన్నకూ నేర చరిత్రే.. ఖిలా వరంగల్: స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ స్వస్థలం వరంగల్‌లోని కరీమాబాద్ ప్రాంతం. తండ్రి స్థానికంగా ఆర్ఎంపీ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. హరిహరకృష్ణ అన్న ముఖేశ్ గతంలో ఓ హత్యానేరంలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు హరిహరకృష్ణ తాను ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని దారుణంగా హత్యచేయడం కరీమాబాద్ ప్రాంతంలో కలకలం రేపింది. నవీన్ తల్లిదండ్రులు మమ్మల్ని క్షమించాలి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మా యిని ప్రేమించడం దురదృష్టకరమని.. అయి నా తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని నిందితుడు హరిహరకృష్ణ తండ్రి పేరాల ప్రభాకర్ పేర్కొన్నారు. తన కొడుకును ఉన్నతంగా చూడాలని అనుకున్నానని, కానీ ఇలా అవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని వివరించారు. నవీన్ తల్లిదండ్రులకు తీరని లోటు జరిగిందని.. వారు తన కుటుంబాన్ని పెద్ద మనసుతో క్షమించాలని విజ్ఞప్తి చేశారు. -
తప్పుడు ఆధార్‌తో ఖాతా తెరిచి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ. 1,96,88,136 కాజేసిన కేసులో సుప్రియ ఎలిజబెత్ హెడింగ్ కీలక నిందితురాలని స్పష్టమవుతోంది. సికింద్రాబాద్‌లోని బ్రాంచ్‌లో ఖాతా తెరిచేందుకు ఆమె సమర్పించిన ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసినదిగా తేలింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న సుప్రియ కోసం గాలిస్తున్నారు. అపెక్స్ బ్యాంక్‌ను ఆన్లైన్లో దోచే యడానికి స్కెచ్ వేసిన సైబర్ నేరగాళ్లు ఈ నెల 2న సుప్రియ ఎలిజబెత్ అనే మహిళతో సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఖాతా తెరిపించారు. అందులో పద్మారావునగర్ అడ్రస్ పొందుపరుస్తూ తన ఆధార్‌కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా ఇచ్చింది. దీన్ని సరిగ్గా పరిశీలించ కుండానే బ్యాంకు అధికారులు ఆమోదించేశారు. కర్ణాటకకు చెందిన ఆధార్‌కార్డును స్కాన్ చేసి, అందులో ముందు వైపు సుప్రియ పేరు, వెనుక వైపు చిరునామా ఉండే చోట పద్మారావునగర్ను చేర్చి ప్రింటౌట్ తీసినట్లు పోలీసులు తేల్చారు. కాజేసిన డబ్బు పది బ్యాంకుల్లోకి తరలించి.. అపెక్స్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని 102 లావాదేవీల్లో కాజేశారు. కొన్ని రోజులపాటు ఈ బదిలీలు జరిగాయి. అయితే రోజూ బ్యాంక్ అధికారులు తీసే బ్యాలెన్స్ షీట్లో తేడాలు కనిపించకుండా హ్యాకర్‌గా వ్యవహరించిన నైజీరియన్ జాగ్రత్తలు తీసు కున్నారు. ఆ లావాదేవీలు బ్యాలెన్స్ షీట్లోకి రాకుండా డిలీట్ చేసేయడంతో బ్యాంకు అధికారులు గుర్తించలేకపోయారు. కాజేసిన మొత్తంలో రూ.1.94, 88,136 హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్సీ, కోటక్ బ్యాంకుల్లో ఉన్న 10 ఖాతాల్లోకి మళ్లించి విత్ డ్రా చేసేశారు. వీటిలో బెంగళూరు, ఎర్నాకుళంలోని ఖాతాలు సుప్రియ పేరుతో, ఢిల్లీ లోని ఖాతా ఆమె తండ్రిగా ఆధార్‌కార్డులో పొందుపరిచి ఉన్న జార్జ్ హెడింగ్ పేర్లతో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరితోపాటు నగరంలో ఉండి వెళ్లిన నైజీరియన్ విల్సన్ కోసమూ ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ఇకపై మృతుల నమూనాలు సేకరించండి
నేరాల దర్యాప్తులో ఉభయ రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు ఆదేశం - దర్యాప్తు అధికారుల తీరుపై అసంతృప్తి - మృతుల రక్తపు మరకలు, గోళ్లు వంటివి సేకరించాలని సూచన - హత్య కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదు రద్దు సాక్షి, హైదరాబాద్: హత్య, అత్యాచారం, కిడ్నాప్, శిశు హత్య, చట్ట విరుద్ధ గర్భస్రావం, పితృత్వ వివాదాలు తదితర కేసుల్లో దర్యాప్తు అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నేర నిరూపణలో కీలక పాత్ర పోషించే మృతుల ఒంటిపై ఉండే రక్తపు మరకలు, వెంట్రుకలు, గోళ్లు, సున్నిత కణజాలం, ధృడ కణజాలం నమూనాలను దర్యాప్తు అధికారులు సేకరించడం లేదని అభిప్రాయపడింది. మృతదేహాన్ని గుర్తించే విషయంలో ఈ శాంపిళ్లు అవసరమని, వీటిని తప్పనిసరిగా సేకరించేలా కిందిస్థాయి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. తన అత్తను హత్య చేసిన నేరంపై వరంగల్ జిల్లా, భీమారంకి చెందిన గోపు శ్రీనివాసరెడ్డి అలియాస్ పరంధాములుకు కింది కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. దర్యాప్తు అధికారులు మృతురాలి వెంట్రుకలు, గోళ్లు తదితరాలను సేకరించలేదని, దీంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతదేహాన్ని గుర్తు పట్టే అవకాశం లేకపోయిందని తీర్పులో పేర్కొంది. ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేని ఇటువంటి కేసుల్లో డీఎన్ఏ పరీక్ష ఎంతో కీలకమని, అందువల్లే తాము డీజీపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఎటువంటి ఆధారాలూ లేవు... గోపు శ్రీనివాసరెడ్డి తన అత్త లక్ష్మిని వరంగల్ రంగసాయిపేటలో ఉన్న బావిలో తోసి చంపేశాడంటూ పోలీసులు అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కింది కోర్టు శ్రీనివాసరెడ్డికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ శ్రీనివాసరెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశా రు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. కింది కోర్టు తీర్పును తప్పుపట్టింది. లక్ష్మి మృతదేహం బావిలో తేలుతున్నట్లు నెల రోజుల తర్వాత తెలిసిందని, అప్పటికే గుర్తుపట్టే స్థితిలో లేదని ధర్మాసనం పేర్కొంది. మృతురాలి కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు తీర్పు చెప్పిందంది. మృతదేహం తన తల్లిదేనని ఏ ఆధారంగా కుమార్తె గుర్తుపట్టిందో చెప్పలేదని, అసలు అది లక్ష్మి మృతదేహమేనని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలూ లేవని తెలిపింది. దర్యాప్తు అధికారి మృతురాలి గోళ్లు, వెంట్రుకల వంటివి సేకరించి ఉంటే డీఎన్ఏ పరీక్షకు ఆస్కారం ఉండేదని స్పష్టం చేసింది. -
నిధుల గోల్‌మాల్‌పై కొనసాగుతున్న విచారణ
సబ్‌ట్రెజరీలో రికార్డులు పరిశీలించిన డిప్యూటీ డెరైక్టర్ సురేంద్రబాబు తెనాలి రూరల్: తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధులు గోల్మాల్ అవడంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కార్యాలయ ఉద్యోగి తాడికొండ వరుణ్‌బాబు ప్రభుత్వోద్యోగుల వేతనాలకు సంబంధించి కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ నుంచి నిధులను అక్రమంగా తన, తన తమ్ముడి ఖాతాల్లోకి మళ్లించి నట్టు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ తతంగానికి సంబంధించి ఖజానాశాఖ అదికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతోపాటు శాకాపరమైన విచారణను కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి వరకు రూ. 34 లక్షలు దారిమళ్లినట్టు గుర్తించిన అధికారుల విచారణకు మంగళవారం సాంకేతికపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. ఖజానా శాఖకు సంబంధించిన సెంట్రల్ సర్వర్ డౌన్ అవడంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వివరాలను అధికారులు తెలుసుకోలేకపోయారు. ఖజానా శాఖ డిప్యూటీ డెరైక్టర్ కె.సురేంద్రబాబు తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయానికి వచ్చి రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్నానికి వచ్చిన ఆయన సర్వర్ కనెక్ట్ అవుతుందేమో అని ఎదురుచూశారు. ఫలితం లేకపోవడంతో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఇప్పటివరకు కార్యాలయ అధికారులు, సిబ్బంది విచారణలో తెలిసిన అంశాలు, అందుకు సంబంధించిన ఫైళ్లను తనిఖీచేశారు. సర్వర్ కనెక్ట్ అయితే గాని మరిన్ని వివరాలు తెలియవని, మరో రెండు మూడు రోజులకుగానీ పూర్తి వివరాలు తెలియరావని సురేంద్రబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు వెలుగుచూసిన మొత్తంతోపాటు మరో రూ. 30 నుంచి రూ. 40 లక్షల వరకు అవకతవకలు జరిగి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. అధికారులకు తలనొప్పి.. వరుణ్‌బాబు బాగోతం సబ్‌ట్రెజరీ కార్యాలయ ఉ్నతాధికారులకు తలనొప్పిగా మారింది. జూనియర్ అకౌంటెంట్ అయిన వరుణ్‌బాబు సాంకేతికపరంగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో నిధులను తనకు సంబంధించిన ఖాతాల్లోని మళ్లించాడు. ఈ తతంగమంతా కంప్యూటర్ల ద్వారా జరుగుతుండడంతో అధికారులు గుర్తించలేకపోయారు. భారీ మొత్తంలో నిధులు గోల్మాల్ కావడం తెలుసుకుని అవాక్కయ్యారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కార్యాలయ అధికారులకు తలనొప్పిగా మారింది. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కె.వెంకటేశ్వర్లు, సబ్ ట్రెజరీ అధికారి టీఏ రాయల్ కార్యాలయ అధికారులుగా ఉన్నారు. తమ కార్యాలయంలో నిధులు గోల్మాల్ అవడంపై ఉన్నతాధికారులు వీరిని వివరణ అడిగే ఆస్కారం లేకపోలేదు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ వ్యవహారం తమకు తలనొప్పిగా మారిందని, ‘త్వరలో పదవీ విరమణ చేయనుండగా, ఇదేం ఖర్మ’ అంటూ ఓ అధికారి ఆవేదనను వెళ్లగక్కినట్టు సమాచారం.