Investment Subsidy crops
-
కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ సజావుగా సాగిన పంటహక్కు సాగుదారు పత్రాల (సీసీఆర్సీ) జారీ ప్రక్రియలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయంతో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని కాజేయడమే లక్ష్యంగా కౌలు కార్డులను అధికార టీడీపీ నేతలు కాజేస్తున్నారు. కనీసం సెంటు భూమి కూడా లేని వారితోపాటు సాగుకు దూరంగా ఉండే టీడీపీ కార్యకర్తలు సైతం సీసీఆర్సీ కార్డులు పొందుతున్నారు. భూ యజమాని అంగీకారం అనే నిబంధన వల్ల మెజార్టీ కౌలు రైతులు నష్టపోతున్నారనే సాకుతో సీసీఆర్సీ చట్టం స్థానంలో కౌలురైతు చట్టం–2024 తెస్తున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. అయితే కొత్త చట్టం ముసాయిదా ఇంకా సిద్ధం కానందున పాత చట్టం ప్రకారమే నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్సీలు జారీ చేయాలి. గత సర్కారు ఏటా సగటున 5.19 లక్షల చొప్పున ఐదేళ్లలో 25.93 లక్షల మందికి సీసీ ఆర్సీలు జారీ చేసింది. 2023–24లో రికార్డు స్థాయిలో 8.35 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. 2024–25 సీజన్లో కనీసం 10 లక్షల మందికి సీసీ ఆర్సీలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా మే 15వతేదీ నుంచే సీసీఆర్సీ మేళాలు నిర్వహించేందుకు సిద్ధం కాగా ఎన్నికల కోడ్ సాకుతో విపక్షాలు అడ్డుకోవడంతో సీసీఆర్సీ కార్డుల జారీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జూన్ నెలాఖరులో సీసీఆర్సీల జారీ ప్రక్రియ చేపట్టింది. అయితే కేవలం 40 రోజుల్లో 8.50 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ కావడం సందేహాలకు తావిస్తోంది.టీడీపీ నేతల బెదిరింపులుఇది మా ప్రభుత్వం.. భూ యజమాని అంగీకారంతో పనిలేదు.. మేము చెప్పిన వారికే కౌలు కార్డులు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పలు చోట్ల క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. వాస్తవానికి కౌలుకిచ్చిన సాగుదారుడికే కౌలు కార్డు ఇచ్చేందుకు భూ యజమాని అంగీకారపత్రం ఇవ్వాలి. అలాంటిది భూయజమాని తాను కౌలుకిచ్చిన భూమినే భాగాలుగా విభజించి తమ కుటుంబ సభ్యుల పేరిట, తమకు నచ్చిన వారి పేరిట అంగీకార పత్రాలిస్తూ బోగస్ సీసీఆర్సీలు పొందుతున్నట్టు గుర్తించారు. మరికొన్ని చోట్ల భూ యజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి దొడ్డిదారిన కౌలుకార్డులు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా కార్డుకు రూ.500 నుంచి రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.పెట్టుబడి సాయం కాజేసేందుకే..రూ.20 వేల పెట్టుబడి సాయంతో పాటు ఇతర సంక్షేమ ఫలాలు పొందేందుకు ఈ కార్డే ప్రామాణికం కావడంతో టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యులు, కార్యకర్తల పేరిట సీసీఆర్సీలు పొందుతున్నారు. దీనివల్లే పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్డులు జారీ అయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల్లో మూడో వంతు బోగస్ కావచ్చని భావిస్తున్నారు.విచారిస్తున్నాం..సీసీఆర్సీల జారీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో భూమి ఖాతా ఆధారంగా సీసీఆర్సీలు జారీ చేస్తారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో సభ్యులు ఒకే భూమిపై వేర్వేరుగా సీసీఆర్సీ కార్డులు పొందుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆరోపణలపై సీఎంఆర్వో పీడీని వివరణ కోరాం. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం.– ఎస్.ఢిల్లీరావు, డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
Fact Check: టీడీపీ కోసం ఇదేనా మీ 'పెట్టుబడి సాయం'!
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారంతో సీఎం వైఎస్ జగన్ సర్కారు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే ఈనాడు పత్రిక మాత్రం బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. కరువుతోపాటు మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగియకుండానే ఇన్పుట్ సబ్సిడీ(పంట నష్టపరిహారం) జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేస్తుంటే.. ఈనాడు మాత్రం ‘సంక్రాంతి పోయింది..సెట్టింగులూ తీసేశారు..!’అంటూ వ్యంగ్యంగా రైతులను తప్పుదోవ పట్టించేలా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ విషం కక్కింది. ఆరోపణ: ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు వాస్తవం: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌తో పాటు ప్రస్తుత రబీ సీజన్లోను కొనసాగుతున్నాయి. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలు కాగా 63.46లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వలన 21.48 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. పూర్తి స్థాయి గణాంకాలతో ఎన్నిసార్లు అధికారులు వివరణ ఇచ్చినా... ఈనాడు మాత్రం పదేపదే 31 లక్షల ఎకరాల్లో పంటలు సాగవలేదంటూ అబద్ధాలు అచ్చేస్తూనే ఉంది. 6 ప్రామాణికాలు (వర్షపాతం, పంట విత్తిన విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భజలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 7 జిల్లాల్లో 103 కరువు మండలాలుగా గుర్తించారు. బెట్ట పరిస్థితుల వల్ల 14.07 లక్షల ఎకరాలలో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.27 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్కతేల్చారు. రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 55.28 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 39.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాధారణ విస్తీర్ణం 19.53 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 12.62 లక్షల ఎకరాల్లో సాగైంది. రబీలో 35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని, వరి 11.40 లక్షల ఎకరాలలో మాత్రమే సాగైందంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది. ఆరోపణ: మిచాంగ్ వల్ల 20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాస్తవం: రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన మిచాంగ్ తుఫాన్ వల్ల 22 జిల్లాల్లో 6.56 లక్షల ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయిన 4.61 లక్షల రైతులకు రూ.442.35 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఈనాడు పట్టించుకోకుండా తుఫాన్ వల్ల 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అడ్డగోలుగా అబద్ధాలు అచ్చేస్తూనే ఉంది. గత 57 నెలలుగా వైపరీత్యాలు సంభవించిన ప్రతీసారి ఆ సీజన్ చివరలో పరిహారం ఇస్తున్నారు. ఇలా ఇంతవరకు 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీని అందించింది. ఆరోపణ: ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు గాలికొదిలేశారు వాస్తవం: ఖరీఫ్‌లో కరువు, రబీలో మిచాంగ్ తుఫాన్ వల్ల 20.63 లక్షల ఎకరాలలో పంటలు నష్టపోయిన 11.57 లక్షల మంది రైతులకు అంచనా వేసిన రూ.1,289.38 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని సీజన్ చివర్లో నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెలాఖరులోనే ఇన్పుట్ సబ్సిడీ పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అయినా సరే ఇవేమీ ఈనాడుకు పట్టదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురద జల్లుతూ రైతులను గందరగోళ పరిచేలా విషంకక్కడమే పనిగా పెట్టుకుంది. -
పరిహారం రూ. 5 లక్షలకు పెంపు
ప్రకృతి విపత్తుల్లో మృతుల కుటుంబాలకు పెరిగిన ఎక్స్‌గ్రేషియూ పంటలకు పెట్టుబడి రాయితీ హెక్టారుకు రూ.15 వేలకు పెంపు హుదూద్ నేపథ్యంలో ఉత్తర్వులు హైదరాబాద్: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 1.5 లక్షల పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల ని ర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తుల్లో వికలాంగులైన వారికిచ్చే పరిహారం రూ.62 వేల నుంచి రూ.లక్షకు పెరి గింది. పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీ కూడా పెరిగింది. జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదికల మేరకు పరిహారం, పెట్టుబడి రాయితీ పెంచుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ ఎ.ఆర్.సుమార్ తెలి పారు. నిజమైన బాధితులకే పరిహారం అందేలా గ్రామాలు, రైతుల వారీ పంట నష్టం వివరాలను, వారి బ్యాంకు ఖాతాలతో సహా పంపించేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వివరాలిలా ఉన్నాయి.. ♦వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిరప, కూరగాయలు, ఉల్లి, బొప్పాయి, పుచ్చకాయ తోటలకు హెక్టారుకు ప్రస్తుతం రూ.10 వేలుగా ఉన్న పెట్టుబడి రాయితీ రూ.15 వేలకు పెరిగింది. ♦మొక్కజొన్నకు రూ.8,333 నుంచి రూ. 12,500కు, పెసర, మినుము తదితర పప్పులు, పొద్దు తిరుగుడు, సోయాబీన్, గోధుమ తదితర పంటలకు రూ.6,250 నుంచి రూ.10 వేలకు పెరిగింది. ♦మామిడి, నిమ్మ, జీడిమామిడి తదితర పండ్ల తోటలకు పెట్టుబడి రారుుతీ రూ.15 వేల నుంచి రూ.20 వేలకు, అరటికి రూ. 24 వేల నుంచి రూ.25 వేలకు చేరింది. ♦కూలిపోయిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరి హారం రూ.500 నుంచి రూ.1,000కి పెరిగింది. ♦గాయపడిన వారికిచ్చే పరిహారం పెరిగింది. వారానికి మించి ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన వారికిచ్చే సాయం రూ.9,300 నుంచి రూ.50 వేలకు పెంచారు. వారంలోపు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన వారికిచ్చే సాయం రూ. 3,100 నుంచి రూ.15 వేలు చేశారు. ♦పాక్షికంగా ఇళ్లు దెబ్బతిని, నీట మునిగి పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారికి దుస్తులు, ఇతర ఇంటి సామగ్రి కోసం ఇచ్చే సాయం రూ.2,700 నుంచి రూ.4 వేలకు పెరిగింది. ♦విపత్తు బాధితులకు తక్షణ సహాయం కింద ప్రస్తుతం పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.30 ఇస్తుండగా దీని స్థానే 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 2 కిలోల పప్పు, లీటరు పామాయిల్, అర కిలో కారప్పొడి, అర కిలో ఉప్పు, కిలో చక్కెర, మూడు కిలోల బంగాళా దుపంలు, రెండు కిలోల ఉల్లిపాయలు ఇస్తారు. ♦చేనేత కార్మికులకు, మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తారు. ♦పక్కా ఇల్లు కూలిపోయిన వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రస్తుతం రూ.70 వేలు ఇస్తుం డగా ఇక నుంచి ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద ఇచ్చే సొమ్ముతోపాటు రూ.50 వేలు ఇస్తారు. పూరిళ్లు కోల్పోయినవారికి రూ.15 వేల స్థానే రూ.25 వేలు ఇస్తారు. ఆవులు, గేదెలు చనిపోతే రూ.20 వేలు పరిహారం ఇస్తారు. పవర్లూమ్ కోల్పోయిన చేనేతలకు రూ.10 వేలు ఇస్తారు. పడవలు కోల్పోయిన, దెబ్బతిన్న వారికి ఇచ్చే పరిహారం కూడా కొంత మేరకు పెంచారు.