పరిహారం రూ. 5 లక్షలకు పెంపు
ప్రకృతి విపత్తుల్లో మృతుల కుటుంబాలకు పెరిగిన ఎక్స్‌గ్రేషియూ
పంటలకు పెట్టుబడి రాయితీ హెక్టారుకు రూ.15 వేలకు పెంపు
హుదూద్ నేపథ్యంలో ఉత్తర్వులు
హైదరాబాద్: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 1.5 లక్షల పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల ని ర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తుల్లో వికలాంగులైన వారికిచ్చే పరిహారం రూ.62 వేల నుంచి రూ.లక్షకు పెరి గింది. పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీ కూడా పెరిగింది. జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదికల మేరకు పరిహారం, పెట్టుబడి రాయితీ పెంచుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ ఎ.ఆర్.సుమార్ తెలి పారు. నిజమైన బాధితులకే పరిహారం అందేలా గ్రామాలు, రైతుల వారీ పంట నష్టం వివరాలను, వారి బ్యాంకు ఖాతాలతో సహా పంపించేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వివరాలిలా ఉన్నాయి..
♦వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిరప, కూరగాయలు, ఉల్లి, బొప్పాయి, పుచ్చకాయ తోటలకు హెక్టారుకు ప్రస్తుతం రూ.10 వేలుగా ఉన్న పెట్టుబడి రాయితీ రూ.15 వేలకు పెరిగింది.
♦మొక్కజొన్నకు రూ.8,333 నుంచి రూ. 12,500కు, పెసర, మినుము తదితర పప్పులు, పొద్దు తిరుగుడు, సోయాబీన్, గోధుమ తదితర పంటలకు రూ.6,250 నుంచి రూ.10 వేలకు పెరిగింది.
♦మామిడి, నిమ్మ, జీడిమామిడి తదితర పండ్ల తోటలకు పెట్టుబడి రారుుతీ రూ.15 వేల నుంచి రూ.20 వేలకు, అరటికి రూ. 24 వేల నుంచి రూ.25 వేలకు చేరింది.
♦కూలిపోయిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరి హారం రూ.500 నుంచి రూ.1,000కి పెరిగింది.
♦గాయపడిన వారికిచ్చే పరిహారం పెరిగింది. వారానికి మించి ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన వారికిచ్చే సాయం రూ.9,300 నుంచి రూ.50 వేలకు పెంచారు. వారంలోపు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన వారికిచ్చే సాయం రూ. 3,100 నుంచి రూ.15 వేలు చేశారు.
♦పాక్షికంగా ఇళ్లు దెబ్బతిని, నీట మునిగి పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారికి దుస్తులు, ఇతర ఇంటి సామగ్రి కోసం ఇచ్చే సాయం రూ.2,700 నుంచి రూ.4 వేలకు పెరిగింది.
♦విపత్తు బాధితులకు తక్షణ సహాయం కింద ప్రస్తుతం పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.30 ఇస్తుండగా దీని స్థానే 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 2 కిలోల పప్పు, లీటరు పామాయిల్, అర కిలో కారప్పొడి, అర కిలో ఉప్పు, కిలో చక్కెర, మూడు కిలోల బంగాళా దుపంలు, రెండు కిలోల ఉల్లిపాయలు ఇస్తారు.
♦చేనేత కార్మికులకు, మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తారు.
♦పక్కా ఇల్లు కూలిపోయిన వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రస్తుతం రూ.70 వేలు ఇస్తుం డగా ఇక నుంచి ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద ఇచ్చే సొమ్ముతోపాటు రూ.50 వేలు ఇస్తారు. పూరిళ్లు కోల్పోయినవారికి రూ.15 వేల స్థానే రూ.25 వేలు ఇస్తారు. ఆవులు, గేదెలు చనిపోతే రూ.20 వేలు పరిహారం ఇస్తారు. పవర్‌లూమ్ కోల్పోయిన చేనేతలకు రూ.10 వేలు ఇస్తారు. పడవలు కోల్పోయిన, దెబ్బతిన్న వారికి ఇచ్చే పరిహారం కూడా కొంత మేరకు పెంచారు.