ipl t20
-
IPL 2024 : విశాఖలో కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసం (ఫొటోలు)
-
చెన్నైతోనే సురేశ్ రైనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నీలో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) జట్టు సురేశ్ రైనాను అట్టిపెట్టుకుంది. యూఏఈలో జరిగిన గత సీజన్లో ఆడటం కోసం రైనా అక్కడిదాకా వెళ్లి... అనూహ్యంగా తిరుగుపయనమయ్యాడు. ఇది చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్కే లీగ్ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనాకు చెన్నై ఫ్రాంచైజీ మంగళం పాడటం ఖాయమనే వార్తలొచ్చాయి. అప్పట్లో ఫ్రాంచైజీ యజమాని, బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ కూడా సూచనప్రాయంగా ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు సూపర్‌కింగ్స్ రైనాను అట్టిపెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను చెన్నై విడుదల చేసింది. భజ్జీ కూడా గత సీజన్ ఆడలేదు. ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు వేలం కోసం బుధవారం (జవవరి 20) ఆటగాళ్ల విడుదలకు, అట్టిపెట్టుకునేందుకు ఆఖరి రోజు కావడంతో ఫ్రాంచైజీలన్నీ జాబితాలు విడుదల చేశాయి. రాజస్తాన్ రాయల్స్ అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను సాగనంపగా... ముంబై ఇండియన్స్ తమ తురుపుముక్క లసిత్ మలింగ (శ్రీలంక)ను వదులుకుంది. కోహ్లి జట్టు బెంగళూరు భారత సీనియర్ సీమర్ ఉమేశ్ యాదవ్‌కు గుడ్‌బై చెప్పింది. పంజాబ్ ఫ్రాంచైజీ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌ను వేలానికి వెళ్లమంది. స్మిత్‌ను పంపించిన రాజస్తాన్ రాయల్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌గా సంజూ సామ్సన్ను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 11న మినీ వేలం నిర్వహించే అవకాశముంది. -
టీమిండియాను యువీయే గెలిపిస్తాడు: మురళీధరన్
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన యువజరాజ్ సింగ్.. ఐపీఎల్లో ఒక్కసారిగా మళ్లీ విరుచుకుపడి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రాబోయే ప్రపంచకప్‌లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించే సత్తా యువీకే ఉందని బెంగళూరు జట్టు సీనియర్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ చెబుతున్నాడు. 29 బంతుల్లో తొమ్మిది సిక్సర్లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన యువరాజ్ చాలాకాలం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో యువరాజ్ మంచి ఆటగాడని, కానీ కొన్నిసార్లు అతడి ఆత్మవిశ్వాసం మాత్రం పడిపోతుంటుందని మురళీ అన్నాడు. టి20 ప్రపంచకప్ తర్వాత దేశమంతా అతడిపై తీవ్ర ఒత్తిడి పెట్టిందని, అలాంటి పరిస్థితుల్లోనే తాను కూడా ఆడానని చెప్పాడు. ఒక్కాసారి యువీ ఫామ్ లోకి వచ్చాడంటే ఇక అతడిని ఆపడం, అడ్డుకోవడం ఎవరివల్లా అయ్యేపని కాదని తెలిపాడు.