IPM
-
100 పెట్రోల్ బంకుల ఏర్పాటులో ఐపీఎం
గువాహటి: ఇంధన రిటైల్ స్టార్టప్ సంస్థ ఇండో పెట్రోలియం మార్కెటింగ్ (ఐపీఎం) తొలి దశలో 100 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనుంది. అస్సాంతో మొదలుపెట్టి వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జ్ఞాన్ ప్రకాశ్ శర్మ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అయిదు రిటైల్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని, మొదటిది జోర్హాట్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఔట్లెట్ల ఏర్పాటుకు అనువైన స్థల సమీకరణలో తోడ్పాటు అందించాల్సిందిగా జిల్లాల యంత్రాంగాలకు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు శర్మ వివరించారు. ప్రభుత్వ రంగ రిఫైనర్ల నుంచి కొనుగోలు చేయడం లేదా దిగుమతి చేసుకోవడం ద్వారా ఇంధనాలను సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ నుమాలిగఢ్ రిఫైనరీస్‌తో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో అస్సాం, నార్త్ పశి్చమ బెంగాల్లో 25 ఔట్లెట్స్ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఒక్కో బంకులో దాదాపు 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగలదన్నారు. తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు వీలున్న ప్రాంతాల్లో సీఎన్జీ, బయోఇంధనాలను కూడా విక్రయిస్తామని తెలిపారు. అన్ని బంకుల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పాయింట్లు ఉంటాయని శర్మ చెప్పారు. -
ఐపీఎం విభజన పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యల్లో ఒకటిగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) విభాగం విభజన పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఇటీవల ఏపీ, తెలంగాణలకు పోస్టులను విభజిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర ఐపీఎం విభాగంలో 89 కేటగిరీల్లో మొత్తం 607 పోస్టులున్నాయి. వీటిని 58ః42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు విభజించారు. ఏపీకి 350, తెలంగాణాకు 257 పోస్టులు కేటాయించారు. ఏపీకి కేటాయించిన 350 పోస్టుల్లో 140 ఖాళీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య పోస్టుల విభజన చేయకపోవడంతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇబ్బందులు ఉండేవి. తాజాగా.. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఖాళీలను భర్తీచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం 2017 అక్టోబర్ నుంచి ఐపీఎం రాష్ట్ర కార్యాలయం కార్యకలాపాలు ఏపీలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో పలువురు ఉద్యోగులు తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చారు. పోస్టుల విభజన పూర్తవ్వడంతో స్థానికత ఆధారంగా సొంత రాష్ట్రాలకు ఉద్యోగులను కేటాయించారు. ఈ క్రమంలో ఏపీ నుంచి 17 మంది తెలంగాణకు వెళ్తుండగా.. ఆరుగురు తెలంగాణ నుంచి ఏపీకి రానున్నారు. త్వరలో రాష్ట్ర ల్యాబ్ అందుబాటులోకి.. ఈ నేపథ్యంలో.. త్వరలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ కార్యకలాపాలు రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలకు కలిపి హైదరాబాద్‌లో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది. దీంతో ఆహార భద్రత తనిఖీల్లో భాగంగా సీజ్ చేసిన నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపుతున్నారు. అక్కడి నుంచి నివేదికలు రావడానికి రెండు వారాల నుంచి నెలరోజుల సమయం పడుతోంది. ఫలితంగా కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యమవుతోంది. దీంతో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖపట్నంలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటును వేగవంతం చేసింది. ల్యాబొరేటరీ భవనానికి మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. నమూనాలు పరీక్షించడానికి అవసరమైన అధునాతన పరికరాలను సమకూర్చనున్నారు. వీలైనంత త్వరగా ల్యాబ్ కార్యకలాపాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె. నివాస్ తెలిపారు. -
కదిలిన ఐపీఎం యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్ : పాలల్లో నాణ్యతా లోపాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’బ్యానర్ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లు స్పందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య మంత్రి కె.లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం(ఎఫ్ఎస్ఎస్) సమగ్రంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు.. పాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ కె.శంకర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 154 రకాల పాల ప్యాకెట్ల నమూనాలను సేకరించి నాణ్యతను తనిఖీ చేశామని.. ఇందులో 123 నమూనాలను జీహెచ్ఎంసీ పరిధిలోనే సేకరించామన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 16, ఇతర ప్రాంతాల్లో 10 బ్రాండ్లకు చెందిన పాల ప్యాకెట్లు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిర్దేశించిన ప్రకారం లేవని తెలిపారు. వీరిపై ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కేసులు నమోదు చేశామని.. ఇందులో 14 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. -
తెలుగు పోలీసులకు కేంద్ర పతకాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రకటించే అవార్డులలో పలువురు తెలుగు రాష్ట్రాల అధికారులకు చోటు దక్కింది. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ విభాగంలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు అధికారులు ఎంపికయ్యారు. పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలన్ట్రీ విభాగంలో 12 మంది ఏపీ అధికారులు, ఇండియన్ పోలీస్ మెడల్ విభాగంలో తెలంగాణకు చెందిన 12 మంది అధికారులు చోటు దక్కించుకున్నారు. రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు తెలంగాణ 1. టి.వి. శశిధర్ రెడ్డి, ఐపీఎస్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎల్ అండ్ వో), రాచకొండ 2. ఎం.వెంకటేశ్వరరావు అడిషనల్ ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ 1. పీవీ సునీల్ కుమార్, ఐజీ, హైదరాబాద్ 2. వీడులముడి సురేశ్ బాబు, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఏలూరు ఇండియన్ పోలీస్ మెడల్ విభాగంలో 12 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. తెలంగాణ 1. వి. సత్యనారాయణ, ఐపీఎస్, డీసీపీ, సౌత్ జోన్, హైదరాబాద్ 2. కె. సురేంద్రనాథ్ రెడ్డి, డీఎస్పీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్ 3. పి. ప్రేమ్చందర్, ఎస్ఐ, ఈవోడబ్ల్యూ, సీఐడీ, హైదరాబాద్ 4. కె. తిరుపతి, ఎస్ఐ-వీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా 5. భూక్య బాల, ఏఆర్ఎస్ఐ, కరీంనగర్ 6. సి.శంకర్, ఏఎస్ఐ, పీటీసీ, కరీంనగర్ 7. జె.వి.శేషగిరిరావు, ఏఎస్ఐ, రీజనల్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ 8. షేక్ జలీల్ అహ్మద్, ఏఎస్ఐ, ఐఎస్‌డబ్ల్యూ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్ 9. కె. సత్యనారాయణ, ఏఎస్ఐ, ఐఎస్‌డబ్ల్యూ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్ 10. కె. ప్రభాకర్, హెచ్‌సీ 4582, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ 11. కె. కిషన్, హెచ్‌సీ 1811, కరీంనగర్ 12. మహమ్మద్ మహమూద్, ఏఎస్ఐ, అంబర్ పేట, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలన్ట్రీ విభాగంలో 12 మంది ఏపీ అధికారులు ఎంపికయ్యారు. 1. ఎస్. శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండంట్ 2. యు.లక్ష్మణ, సీనియర్ కమాండో 3. ఎం.సూర్య తేజ, జూనియర్ కమాండో 4. జె. రాంబాబు, జానియర్ కమాండో 5. బి. నాగ కార్తిక్, సబ్ ఇన్స్పెక్టర్ 6. కె. ఆనంద రెడ్డి, డీఎస్పీ 7. ఎం. నవీన్ కుమార్, జూనియర్ కమాండో 8. కె.ఉదయ కుమార్, జూనియర్ కమాండో 9. జి. మహేశ్వరరావు, జూనియర్ కమాండో 10. కె. శ్రీనివాసరావు, ఏఆర్పీసీ 11. తోటపల్లి సూర్య ప్రకాశ్, కానిస్టేబుల్ 12. పి.ఎస్.జి. పవన్ కుమార్, కానిస్టేబుల్