IPO scam
-
కార్వీపై ఏడాది నిషేధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ను ఐపీవో స్కాం వీడటం లేదు. ఏడాది పాటు కొత్తగా ఎటువంటి ఐపీవోలు చేపట్టకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. 2003-05లో జరిగిన ఐపీవో స్కాం కేసుకు సంబంధించి సెబీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సోమవారం నుంచి ఏడాది పాటు ఐపీవోలకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష కార్యకలాపాల నుంచి కేఎస్బీఎల్ని నిషేధించింది. కానీ ఈ తీర్పు వెలువడేలోగా తీసుకున్న ఐపీవోలను చేపట్టవచ్చని సెబీ స్పష్టం చేసింది. ఈ ఐపీవో స్కాంకు సంబంధించి మార్చి, 2014లో సెబీ కేఎస్‌బీఎల్‌ను ఆరు నెలల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కార్వీ సెక్యూరిటీస్ అప్పలెట్ ట్రిబ్యునల్‌ను (శాట్)ను ఆశ్రయించగా ఈ కేసులో కార్వీ వాదనలతో పాటు, అహ్మదాబాద్ భారత్ ఓవర్సీస్ బ్రాంచ్ మేనేజర్ని విచారించి నాలుగు నెలల్లోగా తుది ఉత్తర్వులను జారీ చేయాలని ఆదేశించింది. విచారణ అనంతరం ఏడాది పాటు కొత్త ఐపీవోలను చేపట్టరాదని సెబీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
పదేళ్ల ఐపీఓ స్కామ్‌పై సెబీ మళ్లీ విచారణ
న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల క్రితం నాటి ఐపీఓ స్కామ్‌పై మళ్లీ దర్యాప్తు జరపాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఐడీఎఫ్సీ, సాస్కేన్, సుజ్లాన్ కంపెనీల ఐపీఓలకు సంబంధించి జీలస్ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రయిటర్ జయేశ్ పి. ఖండాల్వా పాత్రపై ఈ దర్యాప్తు జరగనున్నది. ఈ ఐపీఓల డీమ్యాట్ స్కామ్ ద్వారా భారీగా ప్రయోజనాలు పొందారనే ఆరోపణలు వచ్చాయి. కాగా మొదటగా ఈ విషయం 2005 సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఐపీఓకు సంబంధించి వివిధ నిబంధన ఉల్లంఘన జరిగిందని, వివిధ వ్యక్తుల సంబంధాల మధ్య తాజాగా దర్యాప్తు జరపాలని నిర్ణయించామని సెబీ పూర్తి కాల సభ్యుడు ప్రశాంత్ సరన్ పేర్కొన్నారు. ఖండ్వాలా బినామీ పేర్లతో వేలాది డీమ్యాట్ అకౌంట్ల ద్వారా షేర్లు పొంది వాటి ద్వారా లాభపడ్డాడని సెబీ ప్రాథమికంగా నిర్ధారించింది. రిటైల్ కేటగిరిలో షేర్లను పొందేందుకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఆపరేటర్లకు ఖండ్వాలా సొమ్ములిచ్చాడని సెబీ కనుగొన్నది. ఇలా పొందిన షేర్లను ఆ ఆపరేటర్లు ఖండ్వాలకు బదిలీ చేశారని, వాటిని ఆయన విక్రయించి చట్టవిరుద్ధంగా లాభాలను ఆర్జించారని ఆ దర్యాప్తులో తేలింది. -
కొత్త గరిష్టాల నుంచి నష్టాల్లోకి
సెన్సెక్స్ 145 పాయింట్లు డౌన్ ► 26,127 వద్ద ముగింపు ► 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ వారాంతం రోజున కూడా ఇటీవల అలవాటైన బాటలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలోనే ప్రధాన ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 26,300కు, నిఫ్టీ 7,841కు చేరాయి. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఆపై అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. రోజు మొత్తం ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 26,007 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరికి 145 పాయింట్ల నష్టంతో 26,127 వద్ద ముగిసింది. ఇదే విధంగా కదలిన నిఫ్టీ సైతం 40 పాయింట్లు క్షీణతతో 7,790 వద్ద స్థిరపడింది. వెరసి 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ కాలంలో సెన్సెక్స్ 1,265 పాయింట్లు లాభపడ్డ సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ 5% డౌన్: ప్రధానంగా రియల్టీ, మెటల్, పవర్, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 3-1.5% మధ్య తిరోగమించగా, ెహ ల్త్‌కేర్ 2% ఎగసింది. హెల్త్‌కేర్ షేర్లలో వొకార్డ్ 14% జంప్‌చేయగా, గ్లెన్‌మార్క్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ, లుపిన్, క్యాడిలా హెల్త్ 7-2% మధ్య పుంజుకున్నాయి. కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఊరట హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌పై ఐపీవో స్కాంలో సెబీ విధించిన ఆరు నెలల నిషేధంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేను పొడిగించింది. ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ స్టే కొనసాగుతుంది. అంతకుముందు 2003-2005 ఐపీవోలో జరిగిన అవకతవకలను సెబీ నిర్థారిస్తూ ఆరు నెలల పాటు కొత్త పథకాలను, కొత్త కార్యక్రమాలను చేపట్టకూడదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
2005 ఐపీవో అవకతవకల్లో కార్వీ పాత్ర: సెబీ
ముంబై: తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఐపీవో కుంభకోణంలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ డిపాజిటరీకు సైతం పాత్ర ఉన్నట్లు నియంత్రణ సంస్థ సెబీ నిర్థారించింది. 2005లో వెలువడ్డ కొన్ని పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సెబీ గతంలోనే బయటపెట్టింది. దీనిలో భాగంగా గతంలోనే కార్వీను 18 నెలల 26 రోజులపాటు నిషేధించింది కూడా. దీంతో ప్రస్తుతం ఎలాంటి జరిమానాలూ విధించడంలేదని సెబీ తెలిపింది. కాగా, కార్వీ స్టాక్ బ్రోకింగ్ సైతం తమ డిపాజిటరీ కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు లేవని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు యథాతథంగా నడుస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నంకాకుండా తమ వ్యవస్థను, కార్యకలాపాల విధానాలను ఆధునీకరించినట్లు వివరించింది.