ముంబై: తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఐపీవో కుంభకోణంలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ డిపాజిటరీకు సైతం పాత్ర ఉన్నట్లు నియంత్రణ సంస్థ సెబీ నిర్థారించింది. 2005లో వెలువడ్డ కొన్ని పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సెబీ గతంలోనే బయటపెట్టింది. దీనిలో భాగంగా గతంలోనే కార్వీను 18 నెలల 26 రోజులపాటు నిషేధించింది కూడా. దీంతో ప్రస్తుతం ఎలాంటి జరిమానాలూ విధించడంలేదని సెబీ తెలిపింది.
కాగా, కార్వీ స్టాక్ బ్రోకింగ్ సైతం తమ డిపాజిటరీ కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు లేవని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు యథాతథంగా నడుస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నంకాకుండా తమ వ్యవస్థను, కార్యకలాపాల విధానాలను ఆధునీకరించినట్లు వివరించింది.
2005 ఐపీవో అవకతవకల్లో కార్వీ పాత్ర: సెబీ
Published Wed, Jan 29 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement