IPS officers transferred
-
51 మంది ఐపీఎస్‌లు బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్‌గా శ్రీకాంత్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా మనీష్‌కుమార్ సిన్హాను నియమించింది. కొత్త జిల్లాలు, పాలన పరమైన కారణాల నేపథ్యంలో జరిగిన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. -
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, ఏసీబీ డీజీగా అంజనీకుమార్, ఏసీబీ డైరెక్టర్‌గా శిఖా గోయల్, హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్)గా ఏఅర్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్, నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి, సిద్దిపేట్ సీపీగా శ్వేత, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్)గా కల్మేశ్వర్, సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా గజరావు భూపాల్, హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, నిజామాబాద్ సీపీగా నాగరాజు, అదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, బాలానగర్ డీసీపీగా సందీప్ గొనె, శంషాబాద్ డీసీపీగా జగదీష్ రెడ్డి, హైదరాబాద్ కార్ హెడ్ క్వాటర్ జాయింట్ సీపీగా కార్తికేయ, మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 1గా ప్రకాష్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూల్ ఎస్పీగా మనోహర్, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి, జనగాం డీసీపీగా సీతారామ్, నారాయణ్‌పేట్ ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లును నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఏపీలో 13 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
-
తెలంగాణలో ఐపీఎస్‌లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేష్ కుమార్, ఎన్.శివశంకర రెడ్డి, డాక్టర్.వి.రవీంద్రకు ఐజీలుగా, 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ,కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు,ఏ.వెంకటేశ్వరరావుకు డీఐజీలుగా ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. (50 మంది ఐఏఎస్‌ల బదిలీ) ఐజీలుగా రాజేష్ కుమార్ ఎన్.శివశంకర రెడ్డి డాక్టర్.వి.రవీంద్ర డీఐజీలుగా కార్తికేయ కె.రమేష్ నాయుడు వి.సత్యనారాయణ బి.సుమతి ఎం.శ్రీనివాసులు ఏ.వెంకటేశ్వరరావు కాగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న ఐపీఎస్ బదిలీలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. నేడు, రేపు అంటూ ఊరిస్తోన్న ట్రాన్స్ఫర్ల ప్రచారంతో పోలీసు అధికారులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 50మంది ఐఏఎస్‌లోను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తర్వాత రోజు ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని భారీగా ప్రచారం సాగింది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. మంగళవారం కూడా ఇదే తరహా ప్రచారం సాగింది. కొందరు ఔత్సాహికులు ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగి పోయిందంటూ పోస్టింగ్‌లతో సహా సోషల్ మీడియాలో పెట్టేసారు. ఈ సందేశాలు క్షణాల్లో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. పలువురికి స్థాన చలనం.. వాస్తవానికి ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు 2018లోనే జరగాల్సింది. కానీ, అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి. దీంతో ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. 2019 ఏప్రిల్‌లో రాష్ట్ర హోంశాఖ కేంద్రం అనుమతితో 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. వాస్తవానికి పదోన్నతితోపాటు బదిలీ తప్పనిసరి. కానీ, వీరికి పదోన్నతి దక్కినా.. పాత కుర్చీల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 నెలలుగా తమకు కొత్త పోస్టింగ్‌లు వస్తాయని ఎదురు చూశారు. 12 మంది ఐపీఎస్‌లు నగరానికి..! ఇక జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తోన్న దాదాపు 12 మంది ఐపీఎస్ అధికారులను నగరానికి తీసుకురావాలన్న యోచనలో డీజీపీ ఉన్నట్లు సమాచారం. వీరికి గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో, ఇతర రాష్ట్రస్థాయి విభాగాల్లో పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘‘రైట్ పర్సన్ ఎట్ రైట్ పొజిషన్’’ అన్న విధానంలో ఆయన పోస్టింగ్‌లు ఇవ్వనున్నారని సమాచారం. ఎలాంటి పైరవీలకు తావులేకుండా.. పనితీరు ఆధారంగా సరైన స్థానంలో సరైన అధికారికి బాధ్యతలు అప్పజెప్పనున్నారు. -
ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 23 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన స్థానాలు.. గుంటూరు రూరల్ ఎస్పీ- జయలక్ష్మీ గుంటూరు అర్బన్ ఎస్పీ- బీహెచ్‌వీ రామకృష్ణ శ్రీకాకుళం ఎస్పీ- అమ్మిరెడ్డి పశ్చిమ గోదావరి ఎస్పీ- నవదీప్ సింగ్ చిత్తూరు ఎస్పీ- సీహెచ్ వెంకటప్పలనాయుడు తూర్పుగోదావరి ఎస్పీ- నయీం హస్మి విశాఖపట్నం డీసీపీ1- విక్రాంత్‌పాటిల్ విశాఖపట్నం డీసీపీ2- ఉదయ్ భాస్కర్ కృష్ణా ఎస్పీ- రవీంద్రనాథ్‌బాబు విజయనగరం ఎస్పీ- బి రాజకుమారి విజయవాడ జాయింట్ సీపీ- నాగేంద్ర కుమార్ విజయవాడ డీసీసీ2- సీహెచ్ విజయరావు రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్ సీఐడీ ఎస్పీ- సర్వ శ్రేష్ట త్రిపాఠి అక్టోపస్ ఎస్పీ- విశాల్ గున్నీ ఇంటెలిజెన్స్ ఎస్పీ- అశోక్‌కుమార్ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్- రాహులదేవ్ శర్మ ఏలూరు డీఐజీ- ఏఎస్ ఖాన్ అనంతపురం పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్ అనంతపురం ఎస్పీ- బి సత్య ఏసుబాబు ఎస్ఐబీ ఎస్పీ- రవిప్రకాశ్ సీఐడీ డీఐజీ- త్రివిక్రమ్ వర్మ కర్నూలు డీఐజీ- టి వెంకట్రామిరెడ్డి ఏఆర్ దామోదర్, భాస్కర్ భూషణ్, ఎస్వీ రాజశేఖరబాబును హెడ్ కార్వర్ట్స్‌ను అటాచ్ చేశారు. -
ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు హోంశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీల్లో ఇటీవల కొత్త జిల్లాలుగా ఆవిర్భవించిన నారాయణపేట, ములుగుకు పూర్తి స్థాయి ఎస్పీలను కేటాయించింది. దీంతో ఇంతకాలం అక్కడ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తోన్న అధికారులకు అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు. 1. రోహిణి ప్రియదర్శిని (2012 ఐపీఎస్ బ్యాచ్)కి సైబరాబాద్ కమిషనరేట్‌లో క్రైమ్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. 2. సుల్తాన్ బజార్ ఏసీపీగా ఉన్న చేతనాను నారాయణపేట్ ఎస్పీగా బదిలీ చేశారు. ఇప్పటిదాకా అక్కడ అదనపు విధులు నిర్వహిస్తోన్న రమారాజేశ్వరిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. 3. ప్రస్తుతం గోదావరిఖని ఏఎస్పీగా ఉన్న 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రక్షిత కె.మూర్తిని మంచిర్యాల డీసీపీగా బదిలీ చేశారు. 4. ప్రస్తుతం భద్రాచలం డీఎస్పీ గా ఉన్న 2015 బ్యాచ్‌కు చెందిన సంగ్రామ్ సింగ్ పాటిల్ గణపతిరావుకు ములుగు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహించిన భాస్కరన్‌ను రిలీవ్ చేశారు. 5. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఏఎస్పీగా ఉన్న 2016 బ్యాచ్‌కు చెందిన రాజేశ్ చంద్రను భద్రాచలం ఏఎస్పీగా బదిలీ చేశారు. 6. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఏఎస్పీగా ఉన్న 2016 బ్యాచ్ అధికారి శరత్ చంద్ర పవార్‌కు ఏటూరునాగారం ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. 7. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఏఎస్పీగా ఉన్న 2016 బ్యాచ్ అధికారి సాయి చైతన్య మహదేవాపూర్ (కాటారం) ఎస్డీపీవోగా బదిలీ చేశారు. అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్కే ప్రసాద్‌ను మరో చోటకి బదిలీ చేశారు. -
ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు జిల్లాల ఎస్పీలు, పలు శాఖల్లోని ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. తమకు అనుకూలంగా ఉండేలా జిల్లా ఎస్పీలను నియమించుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో దాదాపు 20 మంది ఐపీఎస్ అధికారులను మార్చే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు అధికారం చేపట్టాక 2014, జూలైలో ఒకేసారి 24 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. అనంతరం 2017, మార్చిలో ఆరు జిల్లాల ఎస్పీలను; 2017, జూలైలో 18 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. గత నెలలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తామంటూ అప్పట్లో సీఎం చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలకు సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అనంతరం ఐపీఎస్‌ల బదిలీ ప్రతిపాదనలపై చర్చించేందుకు హోంశాఖ కీలక అధికారులు, డీజీపీ పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ సీఎం దాటవేత ధోరణి అవలంబించినట్టు తెలిసింది. అనుకూలురైన అధికారుల కోసమే.. తమకు అనుకూలంగా ఉండే అధికారులను గుర్తించి అందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టేందుకే సీఎం కాలయాపన చేస్తున్నారని ఒక ఐపీఎస్ అధికారి చెప్పారు. ఇప్పటికే తమ మాట వినని అధికారులను సాగనంపి అనుకూలంగా ఉండేవారి కోసం మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పలువురు ఎస్పీలపై ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమకు బదిలీ తప్పదని తెలిసిన పలు జిల్లాల ఎస్పీలు కార్యాలయంలో ఉండకపోవడం, ఫైళ్లను పరిష్కరించకపోవడం, రోజువారీ సమీక్షలు నిర్వహించకపోవడం చేస్తున్నారు. బదిలీ కోసం రోజులు లెక్కపెడుతూ జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి కాలక్షేపం చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు డైరెక్ట్ ఐపీఎస్ అయితే తమ మాట చెల్లదని భావిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. పదోన్నతి (కన్ఫర్డ్) ఐపీఎస్‌లను తెచ్చుకుంటే చెప్పినట్టు వింటారనే నిర్ణయానికి వచ్చినట్టు పోలీసు శాఖలోనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఫోకల్ పోస్టు (అధిక ఆదాయం వచ్చే జిల్లా) పేరుతో పోస్టింగ్ ఇప్పించేందుకు కూడా కొందరు టీడీపీ నేతలు రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎంతో డీజీపీ భేటీ ఐపీఎస్‌ల బదిలీలపై ఊహాగానాలు రేగుతున్న తరుణంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావులు సీఎం చంద్రబాబుతో శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఉదయం 10 గంటలకు మొదలైన వీరి సమావేశం ఐదుగంటల పాటు సాగినప్పటికీ ఐపీఎస్‌ల బదిలీలపై స్పష్టత రాలేదని అంటున్నారు. ప్రధానంగా పలువురు ఎస్పీల బదిలీలపై డీజీపీ ఠాకూర్ చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకలేదని విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, చలపతి కదలికలను గుర్తించడంతోపాటు మావోయిస్టులను కట్టడి చేసేందుకు ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించినట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇకపై ప్రతి జిల్లాలోనూ సీఎం పర్యటనలు, సభలు ఉంటాయని, ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు, మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరిగింది. తిత్లీ తుపాను సహాయక చర్యల్లో వివాదం నెలకొనడం, బాధితులు ఉద్యమించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని, దీనిపై పోలీసు శాఖ సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సీఎం సూచించినట్టు తెలిసింది. -
9మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రంలో తొమ్మిదిమంది ఐపీఎస్ అధికారుల బదిలీ చేపడుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు 1. ఎస్. శ్యాంసుందర్ --- అసిస్టెంట్ ఇనస్పెక్టర్ జనరల్ అఫ్ పోలీసు(లీగల్) 2. బి. ఉదయ భాస్కర --- ఎస్పీ సిఐడి 3. ఎ. నయిమ్ అస్మి --- ఓ ఎస్ డి కడప 4. ఐశ్వర్య రస్తోగి --- ఓ ఎస్ డి,అనంతపురం 5. ఎం. దీపిక --- ఎఎస్పీ పార్వతీపురం 6. అమిత్ బర్దార్ --- ఎఎస్పీ పాడేరు 7. కె. ఆరిఫ్ హఫీజ్ --- ఎఎస్పీ నర్సీపట్నం 8. వి.అజిత --- ఎఎస్పీ రంపచోడవరం 9. ఎస్. గౌతమి --- అసాల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్ -
ట్విట్టర్ వార్
మైసూరు: నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీపై చేసిన ట్వీట్‌తో ఎంపీ, మహిళా ఐపీఎస్ అధికారి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు... ఐపీఎస్ అధికారులైన మధుకర్‌శెట్టి, కౌశలేంద్రకుమార్, లాభూరామ్, సోనియాసింగ్‌లను ఇటీవల కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలను మైసూరు ఎంపీ ప్రతాపసింహ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఉన్నత పదవులతో గౌరవించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుడంటంతోనే ఐపీఎస్ అధికారులు కేంద్రానికి బదిలీపై వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ ప్రతాపసింహ చేసిన ట్విట్టర్‌పై మహిళా ఐపీఎస్ అధికారి రూప అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను రాజకీయ వివాదాల్లోకి రావద్దంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రతీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారికి కేంద్రంలో పని చేయాలనే ఉంటుందంటూ తెలిపిన ఆమె దీనికి రాజకీయ ప్రతినిధులు రాజకీయ రంగు పులమరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యల ద్వారా పాలన వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తద్వారా పాలన వ్యవస్థ గాడి తప్పుతుందంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రతాపసింహ తాను కేవలం మాధ్యమాల్లో ప్రచురితమైన వార్తలను మాత్రమే షేర్ చేసానని, మీకు వీలైనపుడు ట్వీట్లను మరోసారి పునఃపరిశీలించాలంటూ సూచించారు. దీనిపై మహిళా ఐపీఎస్ అధికారి రూప రాజకీయ నాయకులుగా మీపని మీరు చేసుకుంటూ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను వారి పని చేసుకోనివ్వాలంటూ పరోక్షంగా హితవు పలికి ట్విట్టర్లో మాటల యుద్ధానికి తెరదించారు. -
44 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో అదనపు డీజీపీలతో సహా పదకొండు జిల్లాల ఎస్పీలు కూడా ఉన్నారు. అలాగే పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. పశ్చిమగోదావరి, చిత్తూరు, అనంతపురం, వరంగల్ (రూరల్), ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, విజయనగరం, గుంటూరు (అర్బన్), కర్నూలు, కడప జిల్లాల ఎస్పీలను బదిలీ చేసి కొత్త ఎస్పీలను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.