Irak
-
యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి!
జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై డ్రోన్ దాడికి ప్రతిగా యూఎస్ మిలటరీ ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియా స్థావరాలపై బాంబు దాడి చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సిరియాలో జరిగిన యూఎస్ వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మరణించారు. వారిలో ముగ్గురు నాన్ సిరియన్లు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతు కలిగిన 85 మిలీషియా స్థావరాలపై అమెరికా ప్రతీకార వైమానిక దాడులను ప్రారంభించిందని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సైనిక వైమానిక దాడులు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ దళాలు 125కు మించిన యుద్ధ సామగ్రితో 85కు మించిన లక్ష్యాలపై దాడి చేశాయి. అదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు మృతి చెందారని, చాలామంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. It is bring reported that the #US has began air strikes on #Iraq Earlier we saw 5 B1 lancers flying from US towards Middle East region pic.twitter.com/bjGntkKz9I — Free Pakistan 🇺🇦 🇷🇺 🇮🇱 🇵🇸 🇺🇸 (@ukr69h) February 3, 2024 ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటనలో అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని అన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు. శుక్రవారం డోవర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో వీర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. గత వారంలో జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులు మృతిచెందారు. ఈఘటనలో సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార దాడులు ప్రారంభించారు. ARE WE AT WAR😳😳😳 The United States has begun a wave of airstrikes in Iraq and Syria. This is retaliation for a fatal drone attack that killed three soldiers. pic.twitter.com/JmJsM5Gpe3 — Graham Allen (@GrahamAllen_1) February 2, 2024 -
ఇరాక్‌లో ఉండలేం.. ఇండియాకు రప్పించండి
దండేపల్లి: ఉపాధి కోసం ఊరు వదిలి ఇరాక్ వెళ్లిన వలస కూలీలకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. తిరిగి భారత్‌కు వద్దామనుకుంటే చాలామందికి వీసా గడువు ముగియడంతో ఇరాక్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో వలస కార్మికులకు ఏం చేయాలో తెలియక బోరుమంటున్నారు. కార్మికులు తమ బాధలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మంత్రి కేటీఆర్‌తో పాటు, ఎంపీలకూ ట్విట్టర్లో పోస్టులు సైతం చేశారు. వివరాలు.. కోవిడ్–19 కారణంగా ఇరాక్‌లో కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. కొందరు భారతీయులకు వీసా గడువు ముగిసింది. ఇంకొందరికి అకామా(గుర్తింపు కార్డు)లేక కంపెనీల్లో పనులు దొరకడం లేదు. దీంతో వలస కార్మికులు రోడ్డున పడ్డారు. నాలుగు నెలలుగా ఉండేందుకు, తినేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ భరించలేక ఇంటికి వద్దామన్నా వచ్చే పరిస్థితులు లేవు. ఇక వీసా గడువు ముగిసిన వారు ఇరాక్‌లోనే ఉంటే వారికి నెలకు రూ. 30వేలు వరకు అక్కడి ప్రభుత్వం జరిమానాలు కూడా విధిస్తుండటం వలస కార్మికులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇరాక్‌లో తెలంగాణకు చెందిన సుమారు 250 మందికిపైగా ఇబ్బందులు పడుతున్నామని తమ బాధలను సాక్షికి ఫోన్ ద్వారా తెలిపారు. ఇరాక్‌లో ప్రస్తుతం ఉండటానికి, తినడానికి ఇంటి దగ్గర అప్పులు చేయించి డబ్బులు తెప్పించుకుంటున్నామని, తమని స్వరాష్ట్రానికి రప్పించేలా చేయాలని మాజీ ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌లకు ట్విట్టర్లో వేడుకుంటూ సందేశం పంపారు. కాగా, గత నెల 13న తమ కోసం ఎర్బిల్‌లో విమానం సిద్ధం చేసినా ఇరాక్ ప్రభుత్వం అకామాలు లేవని ఇండియాకు పంపకుండా అడ్డుకుందని వారు వాపోయారు. ఎర్బిల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవట్లేదని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియుడి కోసం దేశం దాటొచ్చింది..!
సాక్షి, వెల్గటూరు(ధర్మపురి): ఇరాక్ వేదికగా తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఐదేళ్లు అక్కడే కలిసి కాపురం చేశారు. చుట్టీ మీద ఇంటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడు ఇండియాకు చేరాడు. ఫోన్ నంబరు మార్చడంతో మోసపోయానని గ్రహించిన సదరు యువతి ఇరాక్ నుంచి నేరుగా వెల్గటూరు చేరుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అల్లె చంద్రశేఖర్ బతుకుదెరువుకు ఐదేళ్ల క్రితం ఇరాక్‌వెళ్లాడు. నేపాల్‌కు చెందిన లలితఅన్నా సైతం ఉపాధి నిమిత్తం ఇరాక్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఐదేళ్లు కలిసికాపురం సైతం చేశారు. ఇటీవల అక్టోబర్‌లో చంద్రశేఖర్ చుట్టీమీద స్వగ్రామం వెంకటాపూర్ వచ్చాడు. కొద్దిరోజులు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. తరువాత చంద్రశేఖర్ ఫోన్‌నంబర్ మార్చివేశాడు. లలితకు చాలారోజుల నుంచి ఫోన్ చేయకపోవడంతో తనవద్ద ఉన్న రాజశేఖర్ ఓటర్ ఐటీ ఆధారంగా శనివారం వెల్గటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. చంద్రశేఖర్ తనకు పెళ్లి కాలేదని చెప్పి ప్రేమపేరుతో లోబర్చుకున్నాడని, అతడికిపెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసి మోసపోయాయని వాపోయింది. పోలీసులే తనకు న్యాయం జరిగేలా చూడాలని లలిత వేడుకుంటోంది. -
మృత్యు చెరనుంచి...
ఇరాక్ అంతర్యుద్ధంలో చిక్కుబడిన 46మంది నర్సులతో సహా అక్కడున్న వేలాదిమంది భారతీయుల యోగక్షేమాలపై వ్యక్తమైన ఆందోళన సకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా సమసిపోయింది. సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించి ఒడు పుగా వ్యవహరించడం, అనుకూలమైన ఫలితాన్ని రాబట్టడం నిజమైన దౌత్యం అవుతుంది. ఆ విషయంలో నరేంద్ర మోడీ సర్కారు నూటికి నూరుపాళ్లూ విజయం సాధించింది. పల్లెలనూ, పట్టణాలనూ, నగరా లనూ స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్న ఇరాక్, సిరియా ఇస్లామిక్ ప్రభుత్వం(ఐఎస్ఐఎస్) మిలిటెంట్లు దారిపొడవునా ఎంతటి రక్తపా తాన్ని సృష్టిస్తున్నారో ప్రతి రోజూ మీడియాలో వెలువడిన కథనాలు ఇరాక్ వెళ్లినవారి కుటుంబాలనూ, బంధువులనూ కలవరపరిచాయి. నర్సులందరినీ మిలిటెంట్లు తిక్రిత్ నుంచి బలవంతంగా మోసుల్ తరలించారని, అక్కడినుంచి ఎటు తీసుకెళ్తారో తెలియడంలేదని వార్తలు వచ్చినప్పుడు అందరూ కంగారుపడ్డారు. ఎప్పుడు ఎలాంటి కబురు వినవలసివస్తుందోనన్న బెంగతో ఎన్నో కుటుంబాలవారు కంటి నిండా కునుకులేకుండా క్షణమొక యుగంగా గడిపారు. ఈ నేపథ్యంలో 46మంది నర్సులతోపాటు దాదాపు 800మంది క్షేమంగా స్వదేశానికి చేరడం వారి కుటుంబాలకు మాత్రమే కాదు...దేశ ప్రజలకే ఊరట కలిగించింది. విధి రాతను ఎదిరిద్దామని, బతుకుల్లో కాస్తంత వెలుగులు నింపు కుందామని పొట్టచేతబట్టుకుని వెళ్లడమే ఒక సాహసం. అయినవాళ్లకు దూరంగా, అసలే పరిచయంలేని ప్రాంతంలో నెగ్గుకురావడంలో ఎన్నో సమస్యలుంటాయి. ఇక నిత్యమూ జాతుల అంతర్గత పోరుతో సతమ తమయ్యే ఇరాక్లాంటి దేశంలోకి అడుగుపెట్టడమంటే మాటలు కాదు. అయినా అలాంటిచోటకు మన దేశంనుంచి దాదాపు 10,000 మంది వెళ్లారు. మూడు నెలలక్రితం కూడా అప్పో సప్పోచేసి ఏజెం ట్లకు లక్షన్నర చొప్పున చెల్లించి వెళ్లినవారున్నారు. వీరిలో చాలామంది ఏమాత్రం ప్రాణాలకు భరోసాలేని ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఏ దేశంలోనైనా మిలిటెంట్లు పౌరులను బందీ లుగా పట్టుకున్నప్పుడు అక్కడి ప్రభుత్వా లతో మాట్లాడి వారి విడుదలకు చర్యలు తీసుకోవడం సాధారణం. కానీ, ఇరాక్ పరిస్థితి వేరు. అక్కడ ప్రభు త్వం ఉన్నా అది నామమాత్రావశిష్టం. ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలోని భద్రతా బలగాలే మిలిటెంట్లకు దాసోహం అంటున్నాయి. భారీ రిఫైనరీలు సైతం మిలిటెంట్ల చేతికి చిక్కాయి. అలాంటిచోట బందీల చెర విడిపించడానికి ఆ ప్రభుత్వాన్ని నమ్ముకోవడం సాధ్యం కాదు. అందువల్లే ఇప్పుడు మిలిటెంట్ల చెరలో ఉన్నవారిని విడిపించడానికి అనధికారవర్గాలద్వారానే మన ప్రభుత్వం ప్రయత్నించింది. ఇరాక్‌లో పనిచేస్తున్న భారతీయ వ్యాపారుల ద్వారా మిలిటెంట్లతో సంప్రదిం పులు జరిపి బందీలను క్షేమంగా తీసుకురాగలిగింది. ఇంకా అక్కడ వేలాదిమంది భారతీయులు చిక్కుకుని ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఒప్పందంకింద ఇది సాధ్యమైందన్న వివరాల్లోకి వెళ్లకపోవడమే సబబు. తిండీ నీళ్లూ లేక అలమటిస్తూ, స్వదేశానికొచ్చే దారిలేక నిత్యం నరకం అనుభవిస్తున్న అనేకానేకమందిని కూడా తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నాలకు ఆ వివరాలు ఆటంకం కలిగిస్తాయి. ఇరాక్‌నుంచి తిరిగొచ్చినవారు చెబుతున్న కథనాలు ఒళ్లు గగుర్పొ డిచేలా ఉన్నాయి. తమను పంపేటపుడు ఏజెంట్లు భారీ మొత్తాల్లో డబ్బు గుంజి అక్కడ బతుకు బ్రహ్మాండంగా ఉంటుందన్న హామీలి చ్చారని, తీరా వెళ్లాక అత్యంత దుర్భరమైన జీవితాన్ని చవిచూశామని వారు చెబుతున్నారు. మృత్యువు కోరల్లోంచి బయటికొచ్చి, మళ్లీ సొంత గడ్డపై అడుగుపెట్టడం వారికి సంతోషంగానే ఉండొచ్చుగానీ రోజులు గడుస్తున్నకొద్దీ చేసిన అప్పులు, ఎప్పటినుంచో ఉన్న సమ స్యలూ మళ్లీ వేధించడం మొదలుపెడతాయి. ఒకపక్క తిరిగొచ్చిన నర్సులు తాము ఎన్ని ఇబ్బందులు పడిందీ వివరిస్తుండగానే మరికొం దరు అక్కడికి వెళ్లేందుకు సంసిద్ధులవుతున్నారు. నర్సింగ్ కోర్సులో చేరడానికి చేసిన వేలాది రూపాయల అప్పు చెల్లించడానికి అంతకన్నా తమకు గత్యంతరం లేదని వారు చెబుతున్నారు. ఇది మన ప్రభుత్వా లకు సవాల్ వంటిది. చావు ముంగిట్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధప డటం, అందుకు ఏజెంట్లను ఆశ్రయించడం వంటివి సాగుతున్నా యంటే లోపం ఎక్కడున్నదో కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ గుర్తించడం అవసరం. మన దేశంనుంచి దాదాపు 80 లక్షలమంది ఉపాధి, ఉద్యోగాల కోసం పలు దేశాలకు వలస వెళ్లినట్టు అంచనా. తగిన విద్యార్హతలు, నైపుణ్యం లేనివారు ఇందులో ఎక్కువ. ఇలాంటి వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు నానాటికీ తగ్గిపోతుండటం ఒక సమస్యయితే... నర్సింగ్ కోర్సులు చేసినవారికి అయిదారు వేల రూపా యలకు మించి ఆస్పత్రులు వేతనాలు చెల్లించకపోవడం మరో సమస్య. ఉపాధి అవకాశాలు పెంచి, బోగస్ ఏజెంట్లను ఏరేయడంతో పాటు నర్సులకు గౌరవప్రదమైన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసు కుంటే వలసలను అరికట్టడం సాధ్యమవుతుంది. రెండేళ్లక్రితం పలు రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల నర్సులు సమ్మెచేసినప్పుడు కార్మిక విభాగాల నేతృత్వంలో కనీస వేతనాలు, పనివేళలు వంటి విషయాల్లో ఒప్పందాలు కుదిరాయి. కానీ, ఎన్ని రాష్ట్రాల్లో అవి సక్రమంగా అమల వుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఇరాక్ సంక్షోభంతో వలస పోతున్న పౌరుల సమస్యలు ఎజెండాలోకొచ్చాయి గనుక దీనిలో ఇమి డివున్న అంశాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలి. దేశంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతోపాటు నర్సింగ్ కోర్సువంటివి పూర్తిచేసుకున్నవారికి న్యాయమైన వేతనాలు లభించేలా చర్యలు తీసుకోవాలి. అది పాలకుల కనీస బాధ్యత. -
క్షేమంగా తీసుకొస్తాం!
ఇరాక్‌లో భారతీయ బందీలపై కేంద్రం న్యూఢిల్లీ: ఇరాక్‌లోని మోసుల్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయులను సురక్షితంగా విడిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కిడ్నాప్‌నకు పాల్పడిందెవరో తెలిసిందని, వారి బారి నుంచి భారతీయులను విడిపించేందుకు ఇంటర్నేషనల్ రెడ్ క్రిసెంట్ సంస్థతోనూ, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల వారితోనూ సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టం చేసింది. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న వ్యక్తి కూడా క్షేమంగా ఉన్నాడని తెలిపింది. అలాగే, ఇరాక్‌లోని హింసాత్మక ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరినీ క్షేమంగా ఇండియాకు తీసుకొస్తామని పేర్కొంది. తామంతా ఇక్కడ ప్రమాదంలో ఉన్నామని, స్వదేశానికి తిరిగిరావాలనుకుంటున్నప్పటికీ.. తమ యజమాని పాస్‌పోర్ట్‌లు ఇవ్వడంలేదని నజాఫ్‌లో ఒక నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న భారతీయులు ఆమ్నెస్టీ సంస్థకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వారితో పాటు వందలాదిగా భారతీయ కార్మికులు నజాఫ్‌లో చిక్కుకుపోయారని ఆమ్నెస్టీ తెలిపింది. సున్నీ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న తిక్రిత్ పట్టణంలో చిక్కుకుపోయిన భారతీయ నర్సులు క్షేమంగా ఉన్నారని, వారితో అక్కడి అధికారులు మాట్లాడుతూనే ఉన్నారని అధికారులు చెప్పారు. ఇరాక్‌లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా పొరుగుదేశాల్లోకి వెళ్లేందుకు సహకరించేలా ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాలని భారత ప్రభుత్వం ఆయా దేశాల్లోని భారతీయ దౌత్యాధికారులను ఆదేశించింది. కాగా, ఇరాక్ నుంచి బయల్దేరిన ఆరుగురు పంజాబీలు శనివారం క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మరోవైపు, ఇరాక్‌లో మిలిటెంట్ల దాడులు కొనసాగుతున్నాయి. సిరియా సరిహద్దుల్లోని కకీలక క్రాసింగ్‌ను ఇరాకీ దళాలతో హోరాహోరీ పోరు అనంతరం తిరుగుబాటు దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పోరులో 30 మంది ఇరాక్ సైనికులు మరణించారని సమాచారం. -
నదియాను చూసి నేర్చుకోండి!
ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా ఇంజనీరింగ్ చదువుని పూర్తిచేసిన నదియా తోటి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది. జీవితంలో గెలవడానికి తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు. ఒంటిరితనం మనిషిని గట్టిపరుస్తుంది. ఎదురీదడం నేర్పుతుంది. తోడులేని జీవితాలకు ధైర్యం, పట్టుదలలే నిజమైన అండ అని గుర్తించిన ప్రతి ఒక్క మహిళా జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. నదియా అలాంటి మహిళే. ఇరాక్‌లోని బాగ్దాద్ ప్రాంతానికి చెందిన నదియా పెళ్లయిన ఐదేళ్లకే భర్తను పోగొట్టుకుంది. ఇద్దరు పిల్లల్ని వెంటబెట్టుకుని పుట్టింట్లో దిగిన నదియా మరొకరిపై ఆధారపడానికి ఇష్టపడలేదు. సంప్రదాయ పొరలను చీల్చుకుంటూ ఒంటరిగా బతుకుతూనే, తనలాంటి పదిమంది మహిళలకు అండగా నిలబడింది. తల్లితండ్రీ, ఇద్దరు అన్నలు, వదినలు, వారి పిల్లలు...ఇరుకింట్లో ఒకరికొకరు ఎలాగో సర్దుకుంటున్నారు. నదియా అడుగుపెట్టాక మరింత ఇరుకైంది. ‘నేను ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటానమ్మా’ అంటూ తల్లిని అడగ్గానే ఇంట్లోవాళ్లంతా ససేమిరా అన్నారు. ‘మాతోపాటే నువ్వూ...మాకున్నదానిలో నీకు, నీ పిల్లలకు పెడతాం. భర్తని పోగొట్టుకున్న ఆడది వీధిలో కాలు పెట్టడం ఎంతటి తప్పో నీకు తెలియదా!’ అన్నారు. దాంతో, ఇంట్లో ఉంటూనే ఆమె రకరకాల వ్యాపారాలు చేసి నాలుగు డబ్బులు సంపాదించింది. ఇంతలో ‘ఇంటర్నేషనల్ మెడికల్ కోర్ వాళ్లు మహిళలకు విద్య, ఉద్యోగ, స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిసి అక్కడ చేరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో చదువుకున్న నదియాకు అక్కడ శిక్షకురాలిగా ఉద్యోగం వచ్చింది. ఒక పక్క శిక్షణ ఇస్తూనే మరోపక్క లింగవివక్ష, స్వయం ఉపాధి, ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఉచితంగా మహిళలకు కౌన్సెలింగ్‌లు చేయసాగింది. ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా ఇంజనీరింగ్ చదువుని పూర్తిచేసిన నదియా తోటి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది. నదియా జీవితంలో గెలవడానికి తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. ‘ఇంటర్నేషనల్ మెడికల్ కోర్’వాళ్లు నదియాను ఒక ఉద్యోగినిగానే కాదు ఒంటరి మహిళలకు స్ఫూర్తిగా పరిచయం చేస్తున్నారు.