IRF
-
హిజాబ్ వ్యవహారం మా అంతర్గతం: భారత్
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛ(ఐఆర్ఎఫ్) సంఘంలో అమెరికా ప్రతినిధి రషద్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాలపై రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలంది. దీనిపై కొన్ని దేశాలు చేసిన విమర్శలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం తిప్పికొట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరు పారేసుకోవద్దని సూచించారు. వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు అవసరమైన వ్యవస్థలు, యంత్రాంగం తమకు ఉన్నాయన్నారు. ఈ వివాదాన్ని ఓ కుట్రగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అభివర్ణించారు. సుప్రీంలో పిల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని విద్యా సంస్థల్లోనూ ఉమ్మడి డ్రెస్ కోడ్ అమలయ్యేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో నోటీస్ బోర్డుపై హిజాబ్ గురించి అభ్యంతరకరంగా రాశారంటూ తల్లిదండ్రులు నిరసనకు దిగారు. దీనికి బాధ్యురాలిగా ఓ టీచర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. -
జకీర్‌కు 78బ్యాంకు ఖాతాలు.. కోట్ల రియల్ ఎస్టేట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాంమత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎస్) గురించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విస్తుపోయే విషయాలు చెప్పింది. రియల్ ఎస్టేట్ రంగంలో జకీర్ సంస్థ దాదాపు 100 కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టిందంట. అలాగే, ప్రస్తుతం జకీర్ నాయక్‌కు 78 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటన్నింటిపై తాము నిఘా పెట్టామని, పరిశీలిస్తున్నామని చెప్పింది. జకీర్ సోదరి నైలా నౌషాద్ నూరానీతో సహా ఇప్పటి వరకు మొత్తం 20 సంస్థలకు చెందిన వ్యక్తులను ప్రశ్నించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పన్ను చెల్లింపుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకొని విశ్లేశిస్తున్నట్లు పేర్కొంది. ఒక్కసారి మొత్తం వ్యవహారం పరిశీలన పూర్తయ్యాక జకీర్ నాయక్‌ను ప్రశ్నించేందుకు సమన్లు పంపించే విషయం చెబుతామని అన్నారు. గత ఏడాది(2016) నవంబర్ 19న ముంబయిలోని జకీర్ నాయక్ చెందిన ఐఆర్ఎఫ్ ప్రాంగణంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరోక్షంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఐఆర్ఎఫ్పై ఆరోపణలు కూడా గట్టిగా వచ్చాయి. -
తీవ్రవాదులుగా మారాలి అన్నందుకే...
న్యూఢిల్లీ: జకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)పై నిషేధం ఎందుకు విధించాల్సి వచ్చిందో కేంద్ర హోంశాఖ వివరణయిచ్చింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు ఆయన సంస్థపై నిషేధం విధించినట్టు వెల్లడించింది. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను స్తుతించడం, ప్రతి ముస్లిం తీవ్రవాదిగా మారాలని జకీర్ నాయక్ తన ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టారని తెలిపింది. మతం పేరుతో విద్వేషాలు సృష్టించాలని తన అనుయాయులు, మద్దతుదారులను ఉసిగొల్పారని హోంశాఖ ప్రకటించింది. వివిధ మతాలు, వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా ప్రసంగాలు చేశారని ఆరోపించింది. మత సామరస్యాన్ని దెబ్బతీశారని...ఆత్మహుతి దాడులను సమర్థించారని, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గురువారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో హోంశాఖ పేర్కొంది. ఐఆర్ఎఫ్ ను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించింది. జకీర్ నాయక్ అత్యంత విద్వేషపూరిత వ్యక్తిగా పేర్కొంది. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.