irigation water
-
మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి
మర్రిపాడు: మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్‌రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మెట్టప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం కృషి చేస్తోందన్నారు. మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్–1, 2తో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గ్రామాల వారీగా నాయకులను విక్రమ్‌రెడ్డికి పరిచయం చేయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను నిరంతరం అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందుగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, బోయళ్ల పద్మజారెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్, సొసైటీ చైర్మన్ యర్రమళ్ల చిన్నారెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, నారపరెడ్డి సుబ్బారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
కాళేశ్వరం నీళ్లు.. చెరువులకే ముందు!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత త్వరగా సాగునీరివ్వాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాకున్నా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రధాన కాలువ నుంచి నేరుగా ఫీడర్ చానల్‌ను తవ్వి.. చెరువులను నింపడంతోపాటు నేరుగా పొలాలకు కూడా నీరివ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రిజర్వాయర్లకన్నా ముందుగా శరవేగంగా కాల్వల పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతోంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులు ఇప్పటికిప్పుడు పూర్తయ్యే అవకాశం లేని నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫీడర్ చానల్ ద్వారా 400 వరకు చెరువులు నింపడంతోపాటు 3.5 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా కాల్వల తవ్వకాలను ముమ్మరం చేస్తోంది. ఈ నాలుగు రిజర్వాయర్లకు నీరు వచ్చే మిడ్‌మానేరు–మల్లన్నసాగర్ మధ్య అనుబంధ పనులను పూర్తి చేస్తోంది. దిగువకు అంతా సిద్ధం.. కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్‌కు చేరాలంటే ఎగువనున్న మేడిగడ్డ–ఎల్లంపల్లి, ఎల్లంపల్లి–మిడ్‌మానేరు, మిడ్‌మానేరు–మల్లన్నసాగర్ లింకు పనులు పూర్తి కావాలి. ఇప్పటికే మేడిగడ్డ–ఎల్లంపల్లి మధ్య మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌస్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపును మూడు ప్యాకేజీలు (ప్యాకేజీ 6, 7, 8)గా విడగొట్టగా... ఇందులో మేడారం రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్యాకేజీల పరిధిలో 49.81 కిలోమీటర్ల మేర టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా.. 49.63 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. గ్రావిటీ కెనాల్, అప్రోచ్ చానల్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇక మిడ్‌మానేరుకు వచ్చే నీటిని మల్లన్నసాగర్‌కు తరలించే పనులను ప్యాకేజీ 10, 11, 12గా విడగొట్టగా.. అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్ల పనులు జూన్ నాటికి పూర్తి కానున్నాయి. వాటి పరిధిలో పంపుల బిగింపు ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తంగా జూన్ నాటికి ఈ పనులన్నింటినీ పూర్తిచేసి అనంతగిరి కింద సిరిసిల్ల జిల్లాలో 30 చెరువులు నింపి, 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 39, సిరిసిల్ల జిల్లాలో 59 చెరువులు నింపడంతోపాటు ఎడమ కాల్వ కింద 70 వేల ఎకరాలు, కుడి కాల్వ కింద 40 వేల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఈ రిజర్వాయర్ల అనంతరం మల్లన్నసాగర్‌కు చేరే నీటిని ఫీడర్ చానల్ తవ్వి.. గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింది కాల్వలకు అనుసంధానించనున్నారు. తద్వారా నేరుగా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధమైంది. మల్లన్నసాగర్ దిగువన 3.50 లక్షల ఎకరాలకు.. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీలు, కొండపోచమ్మ 15, గంధమల 9.86, బస్వాపూర్ 11.39 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతుండగా.. వాటిని పూర్తి చేసేందుకు మూడేళ్ల సమయం పట్టనుంది. ఆలోగానే వాటి కింది ఆయకట్టుకు నీరిచ్చేలా తాజా ప్రత్యామ్నాయాన్ని అధికారులు సిద్ధం చేశారు. రంగనాయక సాగర్ నుంచి వచ్చే నీటిని నేరుగా మల్లన్నసాగర్ పరిధిలో 8 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ తవ్వి గంధమల, బస్వాపూర్ కాల్వలకు తరలిస్తారు. అటు కొండపోచమ్మ సాగర్ కింది కాల్వలకు నీటిని తరలించే పనులు కూడా మొదలు పెట్టారు. ఈ రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చయ్యే ఈ ఫీడర్ చానల్‌తో గంధమల, బస్వాపూర్‌ల ప్రధాన కాల్వల కింది 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. దీంతోపాటు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను నింపి రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు జూలై నాటికి పూర్తయ్యే అవకాశముంది. దీనికిందే 150 చెరువులు నింపేలా ప్రణాళిక వేశారు. అటు మల్లన్నసాగర్ కింద 1.25 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా.. 90 చెరువులు నింపి వీలైనంత ఆయకట్టుకు నీరందిస్తారు. మొత్తంగా ప్రత్యామ్నాయ చర్యల కారణంగా వచ్చే వర్షాకాలం నాటికే 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి. -
అన్నదాత ఆక్రోశం
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు ఎండిన వరి దుబ్బులతో నిరసన పెనుగొండ: సాగు నీటి ఎద్దడితో పంట చేలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు. వంతుల వారీ విధానంలోనూ నీటిని అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ వందలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ మండలంలోని రామన్నపాలెం వద్ద రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ప్రతి ఎకరాకు నీరందిస్తామంటూ అధికారులు దాళ్వా ప్రారంభంలో నమ్మించి నిండా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు మధ్యలో నీరు అందకపోవడంతో దిక్కుతోచని స్థిలిలో ఉన్నామన్నారు. ఆచంట కాలువ పరిధిలోని వడలి, రామన్నపాలెం, తామరాడ ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిన వరి దుబ్బులను నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. పత్తాలేని నీటి సంఘ నాయకులు రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కి నిరసన తెలిపినా నీటి సంఘాల నాయకులు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పత్తా లేకుండాపోయారు. కనీస సమాధానం చెప్పడానికి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. కొద్దిసేపటికి నీటిపారుదల శాఖ సూపర్వైజర్ అబ్బులు రావడంతో ఏఎస్సై బి.నాగిరెడ్డి సమక్షంలో కౌలు రైతు సంఘ నాయకడు గుర్రాల సత్యనారాయణ చర్చలు జరిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాగు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులు యర్రంశెట్టి భాస్కరరావు, ముద్రౌతు త్రిమూర్తులు, పేరాబత్తుల సత్యనారాయణ, పేరాబత్తుల రామలింగేశ్వరరావు, చిట్యాల వీరన్న, జక్కం కృష్ణారావు తదితరులు నాయకత్వం వహించారు. శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలి సార్వా, దాళ్వా సాగులకు నీటి ఎద్దడి రాకుండా దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి సూర్నిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వంతుల వారీ విధానంతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. -
నీటి ఎద్దడి ఆ’వరి’ంచె..
భీమ సీమలో పలుచోట్ల పంట విరామం సాగు నీరందక డెల్టా రైతుల గగ్గోలు పంట వేయకపోతే భూములు చౌడుబారతాయని ఆందోళన భీమవరం అర్బన్ : సాగునీటి సరఫరాలో వంతులవారీ విధానం అన్నదాతలను కష్టాల పాల్జేస్తోంది. శివారు ప్రాంతాలకు నీరందకపోవడంతో డెల్టా కేంద్రమైన భీమవరం మండలంలోని పలు గ్రామాల్లో వరి చేలు బీడువారాయి. దాళ్వా సీజన్ ప్రారంభంలోనూ నీరు లేకపోవడంతో 11 గ్రామాల్లో రైతులు పంట విరామం ప్రకటించారు. కాళీపట్నం, ఎల్జీ పాడు, లోసరి, వెంప పంట కాలువల ద్వారా సాగునీరు శివారు ప్రాంతాలకు అందటం లేదు. ఈ కారణంగా వెంప, తుందుర్రు, గూట్లపాడు, లోసరి, గరవళ్లదిబ్బ, బర్రెవానిపేట, ఎల్‌వీఎన్‌పురం, దెయ్యాలతిప్ప, నాగిడిపాలెం, నాగేంద్రపురం, తోకతిప్ప గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో నాట్లు వేయడం మానేశారు. దీనివల్ల 2 వేల ఎకరాలు దాళ్వా పంటకు దూరమయ్యాయి. ఆశలన్ని నీరు సార్వా సీజన్లో వర్షాలు, తుపానుల వల్ల పంట చేతికి అందే సమయంలో ముంపుబారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ సీజన్లో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు దాళ్వా సాగుపైనే ఆశలు పెట్టుకోవడం పరిపాటి. ఈ ఏడాది శివారు ప్రాంతాలకు ముందుగానే నీటిఎద్దడి తలెత్తడంతో క్రాప్ హాలిడే ప్రకటించారు. అన«ధికార తూరలతో ఇబ్బందులు లోసరి, వెంప, కాళీపట్నం, గూట్లపాడు పంట కాలువలను ఆనుకుని కొన్నిచోట్ల చేపలు, రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటికి అధిక మొత్తంలో నీరు అవసరం కావడంతో అనధికార తూములు ఏర్పాటు చేసి తోడేస్తున్నారు. దీంతో పంట కాలువల ద్వారా శివారు ప్రాంతాలకు నీరు వెళ్లడం లేదు. పోనీ.. కనీసం డ్రెయిన్లలోని మురుగు నీటిని చేలల్లోకి మళ్లించి పంటలు పండిద్దామంటే స్లూయిజ్ నిర్మాణ పనుల వల్ల వాటిలోకి సైతం నీరు రావడం లేదు. దీంతో వరినాట్లు వేయలేని పరిస్థితి తలెత్తింది. పంట పండించకుండా భూముల్ని ఖాళీగా వదిలేస్తే చేపలు, రొయ్యల చెరువుల వల్ల చౌడుబారిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ససూయిజ్ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి లోసరి గ్రామంలోని మురుగు డ్రెయిన్‌పై స్లూయిజ్ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఆ పనులైనా పూర్తయి ఉంటే మురుగు నీటినైనా వాడుకుని పంట వేసేవాళ్లం. గతంలో నీటి ఎద్దడి వస్తే ఇలానే పంట పండించుకునేవాళ్లం. పంట సాగు చేయకపోతే చేలు ఉప్పు తేలి చౌడుబారిపోతున్నాయి. రామాయణం సత్యనారాయణ, రైతు, లోసరి వారవా Ðవరినాట్లు వేయలేదు నేను ఎకరం పొలంలో వరి పండిస్తున్నాను. గత దాళ్వాలోనూ పంట పండించాం. ఈసారి సాగునీరు రాకపోవడంతో వరి నాట్లు వేయలేదు. పంటను నష్టపోయాం. అధికారులు, ప్రజాప్రతినిధులు మా సమస్యను పరిష్కరించాలి. గుద్దటి శ్రీనివాస్, రైతు, లోసరి నీరందిస్తాం లోసరిలో గరువు ఆయకట్టు పరిధిలో లేదు. కొంతమంది రైతులు ఆరుతడి పంటలు పండిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో వంతుల వారి విధానం ద్వారా ఆ ప్రాంతానికి నీళ్లందిస్తాం. ఎగువ ప్రాంతంలో నీటి వాడకం వల్ల శివారు ప్రాంతాలకు తక్కువగా వస్తుందని ఇరిగేషన్ ఏఈ వెంకటేశ్వర్లు చెప్పారు. వెంకటేశ్వర్లు, ఏఈ, నీటి పారుదల శాఖ