Isaiah
-
‘ఈసీ వద్ద ఉండాల్సిన డేటా బాబుకు ఎక్కడిది’
సాక్షి, కర్నూలు : చంద్రబాబు పాలన మొత్తం శంకుస్థాపనలతోనే నిండిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల డేటా చంద్రబాబు వద్దకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ పేరుతో చంద్రబాబు, అతని కొడుకు లోకేష్ భారీ స్కామ్‌కు దిగారని అన్నారు. ఎన్నికల సంఘం చొరవ తీసుకుని తండ్రీ, కొడుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు టీడీపీ వ్యతిరేకుల ఓట్లు తొలగించే కార్యక్రమానికి తెరలేపాడని మండిపడ్డారు. (‘ఏటీఎం, క్రెడిట్ కార్డు పాస్వర్డ్స్ మార్చుకోవాలి’) -
వైఎస్ జగన్‌పై దాడి.. ప్రత్యక్ష సాక్షిని నేనే
నందికొట్కూరు: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి చాలా హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో ఐజయ్య విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడి జరిగినపుడు తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. సెల్ఫీ కోసం వచ్చి రెప్పపాటులో కత్తితో దాడి చేసి చంపాలని ప్రయత్నించాడని వెల్లడించారు. కత్తితో దాడి చేసిన వెంటనే నన్ను కొట్టొద్దు, పోలీసులకు అప్పగించండి అని మాత్రమే నిందితుడు అన్నాడని పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై ఎవరూ దాడి చేయవద్దు.. పోలీసులకు అప్పగించండని మాత్రమే ఆ సమయంలో వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. ఎయిర్‌పోర్టులో ప్రథమ చికిత్స అనంతరం టీటీ వేయించుకుని వైఎస్ జగన్ హైదరాబాద్ వెళ్లారని స్పష్టం చేశారు. చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. దాడి జరిగిన తర్వాత వైఎస్ జగన్ పక్క రాష్ట్రం వెళ్లిపోయారని టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయారు కానీ జగన్‌కు హైదరాబాద్‌కు వెళ్లడానికి ఎలాంటి భయం అవసరం లేదని వ్యాఖ్యానించారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం ముఖ్యమంత్రి మరిచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన దాడి, తదనంతర పరిణామాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని ఐజయ్య పేర్కొన్నారు. జగన్‌పై జరిగిన దాడిని స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్యపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. మంగళవారం నందికొట్కూరు యువనేస్తం కార్యక్రమంలో పాల్గొని రూ.2 వేల నిరుద్యోగ భృ హామీ ఇచ్చి వెయ్యికి కోత పెట్టడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు.. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేస్తున్న అక్కడున్న పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. అధికారుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే సభను బాయ్‌కట్ చేశారు. -
కొత్త జీవితం కావాలి
కొత్తదనం అంటే పైపై అలంకారాలు, పేరులు మార్చడం కాదు, వస్తువు నాణ్యతలో మార్పు రావాలి. మన జీవితంలో నూతనత్వం అన్నది తన సంవత్సర ప్రవేశంతో కలుగదు. నూతనత్వం ఓ ప్రత్యామ్నాయం కాదు, అది ఓ పరిష్కారం. ప్రతి నూతన సంవత్సరం మనమొక నూతనత్వాన్ని కోరుకోవటం పరిపాటి. నూతనత్వాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. నేటి ప్రపంచంలో కొత్తదనమన్నది ప్రతి రంగంలో అవసరం. పాతవి గతిస్తేనే గాని కొత్తదనానికి నాంది పలకలేము. గతం పాత అయితే రాబోతున్నది ఏదో అది కొత్తది. కాలం ఒక ప్రయాణమైతే జరిగిపోయే ప్రతి విషయం మనం దాటి వెళ్లే ఓ మైలురాయి అవుతుంది. ఇలా సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు, తరాలు మన జీవితంలో దొరలిపోతాయి. ఈ ప్రయాణంలో జరిగినవన్ని మంచివి కాకపోవచ్చు. అవి మేలు-కీడుల, లాభ-నష్టాల, సుఖ-దుఃఖాల సమ్మిళితం. గతంలో కొందరి జీవితంలో ఒక గాయం, కాని అట్టి గాయం కొందరి జీవితాలలో ఒక పాఠమే నేర్పుతుంది. మన గతమంతా జ్ఞాపకాలే. వాటిని తలంచినంతా గుండెల్లో బాధ, కళ్లల్లో కన్నీళ్లు. అలా జీవితంలో గాయపడిన, దగాపడిన, నిరాశ నిసృ్పహల్లోకి దిగజారిన వారినుద్దేశించి ఆ దేవాదిదేవుడు ఇలా సెలవిచ్చాడు ‘‘మునుపటి వాటిని జ్ఞాపక ం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును మీరు దాని నాలోచింపరా?’’ - (యెషయా 43:18:19) గతం ఓ జ్ఞాపకాల సుడిగుండం. నిరాశ నిర్లిప్తతల వలయం. అట్టి చేదు గతం నుండి నూతనత్వంలోనికి రావాలని ఆ దేవాదిదేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ‘ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను’ అంటూ మనలో ధైర్యాన్ని, ఒక కొత్త ఆశని కలుగచేయుచున్నాడు. గతాన్ని, పూర్వాన్ని జ్ఞాపక చేసుకొనకుడి, తలంచుకొనకుడి అని ఆ దేవుడు తెలియ చేస్తున్నాడు. అనగా పాత జ్ఞాపకాలకు స్వస్తి పలకాలి. మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఒక నూతన ఆరంభం అవసరమవుతుంది. పౌలు అను భక్తుని జీవితంలో తన గతం ఓ హింసాయుత జీవితం. తన భక్తి, తన మతం, అభిమతం అంతా గతి తప్పిన స్థితి. నేటి పరిభాషలో చెప్పాలంటే అతడు ఓ మత ఉగ్రవాది, చాంధసవాది. తన విద్య, మతనిష్ట, తన జాతి, పౌరసత్వం, తన కుటుంబ నేపథ్యం అంతా భ్రష్టత్వానికి, స్వార్థానికి, దురహంకారానికి ఉపయోగించాడు. చివరకు సత్యం తెలుసుకున్నవాడుగా -‘‘పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను’’ - (1 తిమోతి 1:15) అని ప్రకటించాడు. తన పాప జీవితమును, పాత జీవితం నుండి మారిన నూతన జీవితంలోనికి వచ్చాడు. ‘‘మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి, నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి,’’- (యెహెజ్కేలు 18:31) అని బైబిలు బోధిస్తుంది. నూతనత్వానికి నిర్వచనం మారిన మన మనసు కావాలి. సంవత్సరాలు మారినా, మనిషి మనసు మారనిచో మనిషి ప్రవర్తనలో మార్పు రాజాలదు. కొత్తదనం అంటే పైపై అలంకారాలు కాదు. పేరులు మార్చడము కాదు, వస్తువు యొక్క నాణ్యతలో మార్పు రావాలి. అలాగే మన జీవితంలో నూతనత్వం అన్నది తన సంవత్సర ప్రవేశంతో కలుగదు. నూతనత్వం ఓ ప్రత్యామ్నాయం కాదు, అది ఓ పరిష్కారం. మన జీవితంలో నూతన నిర్ణయాలతో, తన ప్రమాణాలతో సరియైన ప్రాధాన్యాలతో దృఢ సంకల్పంతో ముందుకు అడుగు వేయాలి. ఇట్టి ప్రక్రియలోనే మన జీవితం నూతన పరచబడుతుంది. అలాంటి కొత్త జీవితం మనకు కావాలి. మనందరిలో రావాలి. - రెవ.పి.ఐజాక్ వరప్రసాద్