ISIS module
-
ఐసిస్ మాడ్యూల్ నేత సహా 15 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కొరడా ఝళిపించింది. సంస్థకు చెందినట్లుగా అనుమానిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో శనివారం దాడులు జరిపి 15 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి సాకిబ్ నచాన్ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇతడు కొత్తవారిని తమ గ్రూప్‌లోకి చేర్చుకుంటూ వారితో విధేయతతో ఉంటామని ప్రమాణం చేయిస్తుంటాడని వెల్లడించారు. మహారాష్ట్రలోని పగ్ధా–బోరివలి, థానె, మిరా రోడ్డు, పుణెలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఉదయం దాడులు జరిపినట్లు వివరించారు. ఐసిస్ తరఫున ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఉగ్ర సంబంధ చర్యల్లో వీరు పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, తుపాకులు, ఇతర ఆయుధాలు, నిషేధిత సాహిత్యం, సెల్ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
న్యూఢిల్లీ గణతంత్ర వేడుకలకు సరిగ్గా నెల రోజుల ముందు దేశంలో ఉలికిపాటు. దేశంలో భారీ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ – నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) చాకచక్యంగా పట్టుకుని వారి కుట్రను భగ్నం చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచిస్తున్న, హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం (ఇస్లాం కోసం యుద్ధం) అనే సంస్థకు చెందిన 10 మంది అనుమానితులను ఎన్ఐఏ బుధవారం అరెస్టు చేసింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలే వీరి లక్ష్యమనీ, సంస్థలోని సభ్యులంతా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారేనని వెల్లడించింది. అరెస్టయిన వారంతా ఇప్పటివరకు ఎటువంటి నేర చరిత్రా లేని వారేననీ, ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహాకు చెందిన ఓ ముఫ్తీ (ముస్లిం మతాచారాలపై తీర్పులిచ్చే న్యాయ నిపుణుడు) కూడా వీరిలో ఉన్నాడనీ, ఇతనే ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి అని ఎన్ఏఐ ఐజీ అలోక్ మిత్తల్ చెప్పారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఆమ్రోహ, లక్నోల్లో సోదాలు జరిపి, స్థానికంగా తయారు చేసుకున్న రాకెట్ లాంచర్ సహా పలు పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. సోదాల అనంతరం హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాంకు చెందిన మొత్తం 16 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వారిని విచారించి 10 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసింది. మరింత మంది అరెస్టయ్యే అవకాశం ఉందని అలోక్ మిత్తల్ చెప్పారు. సమాచారంతో ముందస్తుగానే నిఘా సోదాల్లో చేతితో తయారు చేసిన ఆయుధాలు, ఇంకా పరీక్షించాల్సి ఉన్న రాకెట్ లాంచర్, ఆత్మాహుతి జాకెట్ల తయారీకి ఉపయోగించే పదార్థాలు, వంద అలారం గడియారాలు, 12 నాటు తుపాకీలు, వందలకొద్దీ బుల్లెట్లు, వంద మొబైల్ ఫోన్లు, 135 సిమ్‌కార్డులు, ఏడున్నర లక్షల రూపాయల డబ్బు, బాంబు తయారీలో వాడే పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్ తదితరాలను భారీ మొత్తాల్లో ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఏయే ప్రభుత్వ సంస్థలపై, రాజకీయ నాయకులపై దాడులు చేయాలో ఇప్పటికే వారు రెక్కీ నిర్వహించారనీ, మరికొన్ని రోజుల్లో దాడులు చేయడానికి సిద్ధమయ్యారని అలోక్ చెప్పారు. హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం ప్రణాళికల గురించి తమకు ముందుగానే సమాచారం వచ్చిందనీ, అప్పటి నుంచి వారిపై ఎన్ఐఏ నిఘా పెట్టిందన్నారు. అనుమానిత ఉగ్రవాదులు చాలా వేగంగా బాంబులు తయారు చేస్తూ పోతుండటంతో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలోని ఉగ్రవాద వ్యతిరేక దళంతో కలిసి ఎన్ఐఏ వారి కుట్రను బుధవారం భగ్నం చేశామని అలోక్ తెలిపారు. వీరి హిట్ లిస్ట్‌లో ఢిల్లీ పోలీస్, ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయని ఇతర దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ ‘ఇతర సంస్థలు వారికి ఇష్టమొచ్చింది ఏదైనా చెప్తాయి. ఈ కేసును దర్యా ప్తు చేస్తున్నది మేము. ఆధారాల్లేకుండా మేము అలాంటి వ్యాఖ్యలు చేయలేం’ అని అన్నారు. నెట్లో చూసి నేర్చుకున్నారు! ఎన్ఐఏ ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను ఆమ్రోహాలో, మరో పది మందిని ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన నిధులను హర్కత్–ఉల్–హర్బ్–ఇ–ఇస్లాం సభ్యులు సొంతంగానే సమకూర్చుకున్నారంది. ‘పేలుడు పదార్థాల తయారీలో వీరు ఇప్పటికే చాలా పురో గతి సాధించారు. బాంబులను ఇక జతపరచడమే తరువాయి. ఆ తర్వాత రిమోట్ కంట్రో ల్ బాంబులతో, ఆత్మాహుతి దాడులతో, పైప్ బాంబులతో దేశంలో భయోత్పాతం సృష్టించాలనేది వీరి ప్రణాళిక’ అని అలోక్ మిత్తల్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముఫ్తీ మహ్మద్ సుహైల్ (29)తోపాటు నోయిడాలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి, హ్యుమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్ మూడో ఏడాది చదువుతున్న మరో విద్యార్థి కూడా ఉన్నారని అలోక్ చెప్పారు. మరో ఇద్దరు వెల్డింగ్ పని చేసుకుని జీవనం సాగించేవారన్నారు. ‘దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం హర్కత్ సంస్థను మూడు, నాలుగు నెలల క్రితం సుహైల్ స్థాపించి, వివిధ వ్యక్తులను సభ్యులుగా చేర్చుకున్నాడు. వాట్సాప్, టెలిగ్రాం వంటి యాప్‌ల ద్వారా వారు సంభా షించుకున్నారు. బాంబులు ఎలా చేయాలో వీరికి ఎవరూ శిక్షణ ఇవ్వలేదనీ, ఇంటర్నెట్లో చూసి సొంతంగానే నేర్చుకున్నట్లు ప్రాథమి కంగా తెలుస్తోంది’ అని అలోక్ వివరించారు. సోదాల్లో తమకు ఓ వీడియో లభించిందనీ, బాంబులు ఎలా తయారు చేయాలో సుహైల్ ఇతరులకు సూచనలిస్తూ రూపొందించిన వీడియో అది అని తెలిపారు. విద్యార్థులు.. వెల్డర్లు.. ఇమామ్‌లు న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసిన ఐసిస్ ప్రేరేపిత ఉగ్ర ముఠాలోని సభ్యులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారందరి వయసు 20–35 ఏళ్ల మధ్య ఉంది. అందులో కొందరు విద్యార్థులు కాగా, మరికొందరు వెల్డింగ్, వస్త్ర దుకాణం లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన సూత్రధారి ముఫ్తీ మహ్మద్ సుహైల్ వారందరినీ ఇస్లాం పేరిట ప్రభావితం చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది. వారి వ్యక్తిగత వివరాలిలా ఉన్నాయి. 1. ముఫ్తీ మహ్మద్ సుహైల్ అలియాస్ హజ్రత్ (29): ఈ బృందం వ్యవస్థాపకుడు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన హజ్రత్ స్థానిక మదరసాలో ముఫ్తీగా పనిచేస్తున్నాడు. 3–4 నెలల క్రితం ఈ సంస్థను స్థాపించి ఆన్లైన్లో ఐసిస్ భావజాలాన్ని బోధించాడు. బాంబును ఎలా తయారుచేయాలో అతడు సభ్యులకు వివరిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. 2.అనాస్ యూనస్ (24): జఫ్రాబాద్‌కు చెందిన యూనస్ నోయిడాలోని ఓ ప్రైవేట్ వర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బాంబులు తయారుచేయడానికి అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు, బ్యాటరీలను సేకరించాడు. 3.రషీద్ జాఫర్ రఖ్ అలియాస్ జాఫర్ (23): జఫ్రాబాద్‌కు చెందిన ఇతడు బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 4.సయీద్ (28): అమ్రోహాలోని సైదాపూర్ ఇమ్మాకు చెందినవాడు. వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్న ఇతడు పిస్టల్స్, రాకెట్ లాంచర్లను తయారుచేశాడు. 5.రాయీస్ అహ్మద్: సయీద్‌కు సోదరుడు. ఇతనికి కూడా వెల్డింగ్ దుకాణం ఉంది. సోదరులిద్దరూ ఐఈడీలను తయారుచేయడానికి 25 కిలోల పేలుడు పదార్థాలు, గన్‌పౌడర్‌ను సేకరించారు. 6.జుబైర్ మాలిక్ (20): జఫ్రాబాద్‌కు చెందిన మాలిక్ ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 7.జైద్ (22): జుబైర్ సోదరుడు. నకిలీ పత్రాలతో సోదరులిద్దరూ సిమ్ కార్డులు, కనెక్టర్లు, బ్యాటరీలు కొనుగోలు చేశారు. సొంతింటి నుంచే బంగారం దొంగిలించి డబ్బు సమకూర్చుకున్నారు. 8.సాకిబ్ ఇఫ్తికార్ (26): ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌కు చెందినవాడు. బక్సార్‌లోని మదరసాలో ఇమామ్‌గా పనిచేస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్‌కు సాయం చేశాడు. 9.మహ్మద్ ఇర్షాద్ (28): ఆటోరిక్షా నడిపే ఇర్షాద్ అమ్రోహా నివాసి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు దాచేందుకు రహస్య ప్రాంతాన్ని కనుగొనడంలో హజ్రత్‌కు సాయం చేశాడు. 10. మహ్మద్ ఆజామ్ (35): ఢిల్లీలోని చౌహాన్ బజార్ నివాసి. మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్‌కు సాయం చేశాడు. బుధవారం జఫ్రాబాద్‌లో తనిఖీల్లో పాల్గొన్న ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు -
మళ్లీ ఐసిస్ కలకలం.. రంగంలోకి ఎన్ఐఏ, 5గురు అరెస్టు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కలకలం రేపుతోంది. ఐసిస్‌కు అనుకూలంగా "హర్కత్ ఉల్ అరబ్ ఏ ఇస్లాం" పేరిట ఓ ఉగ్ర విభాగం పనిచేస్తోందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. దీనికి సంబంధించి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్)తో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు.. అమ్రోహ ప్రాంతంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో ఒకరిని స్థానిక మదర్సా నుంచి అదుపులోకి తీసుకోగా.. మిగతా వారిని అమ్రోహలోని ఇతర ప్రదేశాల్లో ఉండగా అరెస్టు చేశారు. కొత్త పేరుతో దేశంలో వీరు ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు భావిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. వీరు దేశంలో విధ్వంసాలకు ఏమైనా కుట్ర పన్నారా? అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. -
‘ప్రీ యాక్టివేటెడ్’కు ఫుల్స్టాప్ పడేనా?
సాక్షి, సిటీబ్యూరో: మూడన్నర నెలల కిందట.. సినిమాల ప్రభావంతో సాయి, రవి, మోహన్ అనే యువకులు పదోతరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేసి, అతని తల్లిదండ్రుల నుంచి డబ్బు గుంజాలనుకున్నారు. పథకం ప్రకారం బేగంబజార్ ప్రాంతం నుంచి రెండు ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు కొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మరో రెండు ఖరీదు చేశారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లు, గుర్తింపుతో ఉన్నవే. ఆ సిమ్ కార్డుల నుంచే కిడ్నాపర్లు అభయ్ కుటుంబీకులతో బేరాలాడారు. తర్వాత ఆ కిడ్నాప్ హత్యోదంగా మారిన సంగతి తెలిసిందే. నాటి కేసు దర్యాప్తు క్లిష్టంగా మారడానికి ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డులూ ఓ కారణం. గత నెలలో.. జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపుతోకి తీసుకుంది. కుట్రలు అమలు చేయడంలో భాగంగా వారు సంప్రదింపులు జరుపుకోవడానికి ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల్నే వినియోగించారు. ముఠాలో కీలక వ్యక్తి అయిన ఫహద్ దగ్గర తొమ్మిది ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు లభించాయి. చార్మినార్ బస్టాప్ ఎదురుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఔట్లెట్లో వాటిని ఖరీదేచేశారని ఎన్ఐఏ గుర్తించింది. నగరంలో యథేచ్ఛగా లభిస్తున్న ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దుర్వినియోగానికి మచ్చుతునకలివి. పెద్ద సంఘటనలు కాబట్టి కొన్ని పోలీస్ రికార్డులకు వస్తున్నాయిగానీ ఈ తరహా సిమ్ కార్డులతో జరుగుతోన్న నేరాలుఘోరాలకు ఎన్నో! అసాంఘిక శక్తులకు బాగా ఉపయోగపడుతున్న ఈ దందాకు చెక్ పెట్టడంలో పోలీసు విభాగం విఫలమవుతోంది. కనెక్షన్లు పెంచుకుంటూ ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న సర్వీసు ప్రొవైడర్లూ ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్... సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సిమ్‌కార్డులు దుర్వినియోగం కాకుండా, నేరగాళ్లకు ఉపయుక్తంగా ఉండకూడదనే ఈ నిబంధనల్ని రూపొందించారు. ప్రస్తుతం నగరానికి చెందిన అనేక మంది సిమ్కార్డ్స్ రిటైలర్లు, తాత్కాలిక ఔట్లెట్ నిర్వాహకులు తమ దగ్గరకు సిమ్‌కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డు విక్రయదారులు ఇస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీస్తున్నారని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరుతో 100 నుంచి 150 సిమ్‌కార్డులు (కనెక్షన్లు) ముందే యాక్టివేట్ చేస్తున్నారు. ఇది డీఓటీ నిబంధనలకు పూర్తి విరుద్ధమైన అంశం. అనారోగ్యకర పోటీ నేపథ్యంలో... ఈ ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దందా సర్వీసు ప్రొవైడర్ల మధ్య ఉన్న అనారోగ్యకర పోటీతో మరింత పెరిగింది. రిటైలర్లతో పాటు సిమ్‌కార్డుల డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తుండటంతో అనామకులు, నేరగాళ్ల చేతికి సిమ్స్ చేరుతున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చే సిమ్‌కార్డు దరఖాస్తులను పూర్తిస్థాయిలో సరిచూసి, అనుమానాస్పదమైన వాటి యాక్టివేషన్‌ను 24 గంటల్లో కట్ చేయాల్సిన బాధ్యత సర్వీస్ ప్రొవైడర్లపై ఉన్నప్పటికీ వారు కూడా నిర్లక్ష్యం వహిస్తూ టార్గెట్లు ఇచ్చి మరీ ప్రీ-యాక్టివేటెడ్ కార్డులు విక్రయానికి ప్రోత్సహిస్తున్నారనే అనుమానం వ్యక్తంమవుతున్నాయి. సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న అనారోగ్యకర పోటీనే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నామ్‌కే వాస్తే చర్యలతో హడావుడి... దేశ భద్రతను పెనుముప్పుగా మారడంతో పాటు నేరగాళ్లకు కలిసి వస్తున్న ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల వ్యాపారం నగరంలో జోరుగా సాగుతోంది. అభయ్ కేసులో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఆ వ్యవహారాలు సాగిస్తున్న వ్యక్తులు, ముఠాలపై స్పెషల్డ్రై వ్స్ చేపడతామనీ పేర్కొన్నారు. అన్నప్రకారమే నాలుగైదు రోజుల పాటు శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ప్రత్యేక విభాగాలూ రంగంలోకి దిగాయి. సెల్‌ఫోన్ దుకాణాలు, సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన తాత్కాలిక ఔట్‌లెట్స్‌లో వరుస తనిఖీలు చేశాయి. ఈ ‘స్పెషల్ డ్రై వ్’లో ఎంతమంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించారో తెలియదు కానీ... వారం రోజులకే ఈ విషయాన్ని పోలీసులు మర్చిపోయారు. యథాప్రకారం అధికారులు తమ రోటీన్ విధుల్లో నిమగ్నం కాగా అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ఎందుకు ఉండట్లేదు? కేవలం గుర్తింపులు తీసుకుని సిమ్కార్డ్స్ ఇచ్చే విధానం అమలైనా పూర్తి స్థాయి ఫలితాలు ఉండవన్నది సుస్పష్టం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్‌కార్డుల్ని తేలిగ్గా పొందవచ్చు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్‌కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందే. పోస్ట్‌పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ-పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తరవాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకల్ని డీఓటీ ద ష్టికి తీసుకువెళ్లడం ద్వారా బాధ్యులైన సర్వీసు ప్రొవైడర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు భారీగా పెనాల్టీలు విధించడం, అవసరమైతే లెసైన్సులు రద్దు చేసే దిశలో పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.