కాలేజీ ముందు విద్యార్థినుల ఆందోళన
యాకుత్‌పురా (హైదరాబాద్) : పరీక్ష ప్రారంభమైనా తమకు హాల్ టిక్కెట్లు ఇవ్వలేదంటూ విద్యార్థినులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన యాకుత్‌పురాలో ఉన్న ఇస్లామియా బీఈడీ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభమైనా హాల్ టిక్కెట్లు మంజూరు చేయని యాజమాన్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థినులు కాలేజీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.