IT-bpm
-
192 బిలియన్ డాలర్లకు ఐటీ ఆదాయాలు
ముంబై: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (ఐటీ–బీపీఎం రంగం ఆదాయాలు 2020 ఆర్థిక సంవత్సరంలో 8.4 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 192 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. 2019–20లో కొత్త తరం డిజిటల్ విభాగాల ఆదాయాలు 23 శాతం పెరగడం, నికరంగా 2.05 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని నాస్కామ్ వివరించింది. భవిష్యత్ అంచనాలకు సంబంధించి పరిశ్రమ ఆశావహంగానే ఉన్నప్పటికీ కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణే కొనసాగించనున్నట్లు నాస్కామ్ చైర్మన్ కేశవ్ మురుగేశ్ విలేకరులకు తెలిపారు. 43.6 లక్షల మంది సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు కచ్చితంగా ఎంత స్థాయిలో ఉంటాయన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు చెప్పారు. అయితే, సరఫరా వ్యవస్థలో చైనా కీలక దేశం కావడంతో క్లయింట్లపైనా, ఫలితంగా పరిశ్రమపైనా పరోక్ష ప్రభావాలు ఉండొచ్చన్నారు. మెషీన్ లెర్నింగ్‌తో ప్రయోజనమే: చంద్రశేఖరన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలు.. భారత్ వంటి వర్ధమాన దేశాలకు ప్రయోజనకరమేనని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. -
ఐదేళ్లలో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏ దేశమైనా సాంకేతికంగా శరవేగంగా అభివద్ధి చెందుతుంటే దాని ప్రభావం కచ్చితంగా ఉద్యోగులపై ఉంటుందనేది తెల్సిందే. ఫలితంగా ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. పర్యవసానంగా పాత ఉద్యోగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులే కొత్త ఉద్యోగాల్లో కుదురుకోగలరు. మిగితా వాళ్లకు ఉద్వాసన చెప్పక తప్పదు. 2022 నాటికి భారత్‌లో కూడా ఈ పరిణామాలు సంభవిస్తాయని ‘యర్నెస్ట్ అండ్ యంగ్’ అనే మేనేజ్మెంట్ కన్సెల్టింగ్ సంస్థ డిసెంబర్లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. పలు రకాల పరిశ్రమలు, 130 మంది వ్యాపారవేత్తలు, పలువురు విద్యావేత్తల అభిప్రాయలను తెలుసుకోవడం ద్వారా ఈ సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం ఈ నాలుగేళ్ల కాలంలో ప్రస్తుతమున్న ప్రైవేట్ ఉద్యోగాల్లో 20 నుంచి 35 శాతం వరకు ఉద్యోగాలు పోతాయి. ప్రతి మందిలో ఒకరికి కొత్త ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం ఉనికిలోనే లేని ఆ ఉద్యోగం రేపు ఎక్కడా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. ముఖ్యంగా భారత టెక్ సెక్టార్లో ఉద్యోగాల నియామకం క్రమంగా మందగిస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రత్యక్షంగా 38 లక్షల మంది పనిచేస్తుండగా, పరోక్షంగా 1.30 మంది పనిచేస్తున్నారు. ఈ రంగంలో ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతో ఆధునిక సాంకేతిక జ్ఞానం అవసరం అవుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంను సమకూర్చుకోవడం వల్ల పాత ఉద్యోగులు పోతారు. కొత్త నియామకాలు తగ్గుతాయి. ఉదాహరణకు ఐటీ–బీపీఎం పురోభివద్ధి శాతం ఆరు శాతం ఉంటే నియమకాలు మూడు నుంచి మూడున్నర శాతం వరకు ఉంటాయి. 2022 నాటికి మూడొంతుల ఉద్యోగాలకు కొత్త నైపుణ్యం అవసరం అవుతుంది. ఐటీ–బీపీఎం రంగంలోనే 2022 నాటికి 45 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో నాలుగున్నర లక్షల నుంచి తొమ్మిది లక్షల ఉద్యోగాలు కొత్తవి ఉంటాయని సర్వేలో అంచనా వేశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ రంగాల్లో కొత్త స్కిల్స్ అవసరం అవుతాయని, ఒక్క ఐటీ–బీపీఎంలోనే కాకుండా వెలుపలున్న ఐటీ రంగంలో కూడా భారీగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. -
ఐటీ-బీపీఎం రంగంలో మహిళల జోరు
బెంగళూరు: ఐటీ-బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) రంగంలో మహిళలు జోరుమీదున్నారు. నాస్కామ్ సర్వే ప్రకారం.. 2012 నుంచి చూస్తే ఉద్యోగార్థుల్లో మహిళల వాటా 5 శాతం పెరుగుదలతో 28 శాతానికి పెరిగింది. వీరు ప్రారంభ స్థాయి నియామకాల్లో 51 శాతం వాటాను ఆక్రమించారు. విశాఖలో నాస్కామ్ వేర్‌హౌస్ ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ తన స్టార్టప్ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో వేర్హౌస్ను ఏర్పాటు చేయనున్నది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.