IT Cell officials
-
హీరో సిద్దార్థ్‌కు బెదిరింపులు.. ఖండించిన బీజేపీ
తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వస్తున్నాయని హీరో సిద్దార్థ్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేగాక అత్యాచారం బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పాడు. అయితే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ ఫోన్ నంబర్ లీక్ చేయడం వల్లే ఇలా జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఇవాళ సిద్దార్థ్ మరో ట్వీట్ చేస్తూ తనకు, తన కుటుంబం భద్రత దృష్ట్యా పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే రాష్ట్ర బీజేపీ స్పోక్స్‌పర్సన్ నారాయణన్ తిరుపతి కూడా దీనిపై స్పందించారు. సిద్దార్థ్ ప్రధాని మోదీని అగౌరపరిచి మరోసారి నేరస్థుడయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సిద్ధార్థ్ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. గతంలో నేను అతడిపై కేసు పెట్టాను. అది ఇప్పటికీ కోర్టులోనే ఉంది. తాజాగా అతడు ప్రధాన మంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి మరోసారి అపరాది అయ్యాడు. ఇటీవల సిద్దార్థ్ చేసిన ట్వీట్లో కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వివాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుతం తనకు వస్తున్న బెదిరింపుల్లో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు. ఒకవేళ అతనికి సమస్య ఉంటే చట్టపరమైన చర్య తీసుకోవాలి. కానీ, ప్రధానమంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకత తీసుకురావడం సరైనది కాదు. ఇది ఖండించదగిన చర్య’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ వింగ్ హెడ్ సీటీఆర్ నిర్మల్ కుమార్ సిద్దార్థ్ ఆరోపణలను ఖండించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సిద్దార్థ్‌కు వస్తున్న బెదిరింపులకు బీజేపీకి ఎలాంటి సబంధం లేదు. సిద్దార్థ్ వంటి వ్యక్తులపై దృష్టి పెట్టొద్దని పార్టీ సభ్యులు, అనుచరులను అభ్యర్థిస్తున్న’ అని పేర్కొన్నారు. కాగా తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ తన మొబైల్ నంబర్ లీక్ చేసిందని, గడిచిన 24 గంటల్లో తనకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చినట్లు సిద్దార్థ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని, ఆ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను.. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే అని తెలిపాడు. అంతేగాక వీట్నింటిని పోలీసులుకు అందించానని కూడా సిద్దార్థ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. During this pandemic all of us very much focused on supporting people in providing food, medicine..etc Requesting all supporters not to give any attention to individuals like @Actor_Siddharth who are just trying to pass time, pls stay focused on covid support to people. pic.twitter.com/1d9Eirnqx3 — CTR.Nirmal kumar (@CTR_Nirmalkumar) April 29, 2021 చదవండి: నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్ పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
మాయావతి మాజీ కార్యదర్శికి ఐటీ షాక్
సాక్షి, ముంబై: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మయావతికి మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్‌రామ్‌కు ఐటీ విభాగం షాకిచ్చింది. అక్రమ ఆస్తులకు సంబంధించి ఆదాయ పన్నుఅధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నోయిడా, కోల్‌కతా, ముంబైతోపాటు మొత్తం 19 స్థిరాస్తులను ఆదాయపు పన్ను శాఖ ఎటాచ్ చేసింది. నేత్రకు చెందిన మొత్తం 230 కోట్ల రూపాయల విలువైన 'బినామి' ఆస్తులను ఎటాచ్ చేసినట్టుగా అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. 1988 బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం సెక్షన్ 24 (3) కింద, వివిధ వాణిజ్య, నివాస ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. జప్తుచేసిన వాటిలో వాణిజ్య, నివాస సముదాయాలుతోపాటు రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన ‘మాంట్ బ్లాంక్' కలాలు, నాలుగు విలాసవంతమైన ఎస్యూవీ కార్లు ఉన్నాయి. బీఎస్పీ అధినేత మాయావతి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వివిధ ఉన్నత పదవుల్లో పనిచేసిన నేత్రామ్ నివాసం, కార్యాలయాలపై ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.300 కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. యూపీలో బీఎస్పీ పాలనలో షుగర్ మిల్లుల పెట్టుబడుల కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ కూడా ఆయనను విచారిస్తోంది. కాగా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
టీటీడీ బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో పట్టుబడ్డ బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు వెలుగుచూస్తున్నాయి. బంగారంపై టీటీడీ ద్వంద్వ వైఖరి, తమిళనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను బెదిరించి, పలు రకాలుగా ఒత్తిడి చేసి బంగారాన్ని విడిపించుకుపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తమిళనాడులో ఈ నెల 18న ఎన్నికల పోలింగ్ జరగనుండగా 17 రాత్రి తిరువళ్లూరు జిల్లా సరిహద్దు పూందమల్లి తహశీల్దారు పరిధిలో రూ.400 కోట్లకు పైగా విలువైన 1,381 కిలోల బంగారు కడ్డీలను అక్కడి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. సీక్వెల్ గ్లోబల్ క్రిటికల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన వాహనంలో బంగారం తరలిస్తుండగా ఈ వాహనానికి ముందు, వెనుక రెండు వాహనాలు ఉన్నాయి. ఒక వాహనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రైవేటు సాయుధ బందోబస్తు ఉంది. పట్టుబడ్డప్పుడు టీటీడీకి చెందిన బంగారమని వాహనాల్లోని వ్యక్తులు మౌఖికంగా చెప్పారేగానీ అందుకు తగిన ఆధారాలు వారి వద్ద లేవు. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మొత్తం మూడు వాహనాలు కాగా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం రెండే వాహనాలని రికార్డు చేశారు. మరి మూడో వాహనం ఏమైనట్లు? అది ఎవరికి చెందినది? బంగారం ఉన్న వాహనానికి ముందు, వెనక ఉన్న వాహనాల్లో ఒకటి అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమైనదో ఆ ఏడుకొండలవాడికే తెలియాలి. బంగారం పట్టుబడగానే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రెవెన్యూ శాఖాధికారులకు అప్పగించారు. రెవెన్యూ శాఖ బంగారాన్ని ట్రెజరీలో భద్రపరిచి ఆదాయపన్ను (ఐటీ) శాఖాధికారులకు సమాచారం ఇచ్చింది. టీటీడీ నిర్లక్ష్యంపై ఐటీ శాఖ అనుమానాలు చెన్నై నుంచి తిరుపతికి రోడ్డు మార్గంలో బంగారం రవాణాలోనూ, పొందడంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల అంతులేని నిర్లక్ష్యంపై ఐటీ శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బంగారం పట్టుబడ్డప్పుడు ఈ అంశంపై అనేక ప్రశ్నలను సంధించింది. వాహనంలోని వారు బంగారం టీటీడీకి చెందినదని చెప్పారు. అయితే, అధికారులు వాకబు చేయగా తమకేమీ సంబంధం లేదని టీటీడీ బదులిచ్చింది. అంతలోనే మరికొద్దిసేపటికి బంగారం తమదేనని, తీసుకోవడానికి అధికారులు వస్తున్నారంటూ మాటమార్చింది. బంగారం తమదే అయితే టీటీడీకి ఈ తడబాటు ఎందుకని ఐటీ శాఖ ప్రశ్నిస్తోంది. వందల కోట్ల విలువైన బంగారం టీటీడీకి చేరుకుంటున్నప్పుడు దాన్ని పొందేందుకు టీటీడీ ఈవో ప్రత్యేక అధికారుల బృందాన్ని తగిన పత్రాలతో ముందుగానే సిద్ధం చేయాల్సి ఉంది. ఫలానా రోజు బంగారం వస్తుందనే సమాచారాన్ని కూడా సదరు బృందానికి ముందురోజే తెలియజేయాల్సి ఉంది. అంతేకాకుండా బంగారాన్ని భద్రం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, బంగారం పట్టుబడ్డాక తమిళనాడు అధికారులు తెలియజేసిన తర్వాత కూడా ఆ బంగారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం.. ఆ తర్వాత తేరుకుని తమదేనని చెప్పడంపై ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా విలువ చేసే బంగారంపై టీటీడీ ఇంత నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈసీపై టీటీడీ ఈవో ఒత్తిడి బంగారం తమకు చేరే వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకుదే బాధ్యత అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వాదిస్తున్నారు. ఇది నిజమే అనుకున్నా బంగారం ఎప్పుడు వస్తోంది? ఎలా వస్తోంది? అనే అవగాహన లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఖరీదైన సరుకును రవాణా చేసే క్రమంలో పంపేవారు, పత్రాలు ఎంత ముఖ్యమో పొందుతున్న వ్యక్తులు లేదా సంస్థలు కూడా అంతే ముఖ్యం. అయితే, బంగారం విషయంలో పంపుతున్నవారి పత్రాలు ఉన్నాయి కానీ టీటీడీకి చెందిన బంగారమే అనే విషయంలో స్పష్టత లేదని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. పట్టుబడ్డ బంగారం అధిక మొత్తంలో ఉండటంతో ఈ కేసు ఐటీ పరిధిని దాటి డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చేతుల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ క్లియరెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు పత్రాలను తనిఖీ చేశారు. మొత్తం వ్యవహారాన్ని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయానికి వదిలేశారు. దీంతో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయి. ‘ఇది టీటీడీకి చెందినదని తెలుసా.. దేవుడి బంగారానికి కూడా తనిఖీలా.. నేను కూడా ఐఏఎస్ అధికారినే.. చెబితే వినిపించుకోరా?’ అంటూ పరుష పదజాలంతో ఈసీని బెదిరించినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పలుకోణాల్లో ఈసీపై ఒత్తిడి పెంచడంతో తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించి బంగారం అప్పగించినట్లు తెలుస్తోంది. బంగారం తమదే అయినప్పుడు టీటీడీ హడావిడిగా ఇంత హైరానా పడటం, ఈసీని బెదిరించడం, ఒత్తిళ్లకు గురిచేయడంలోని ఔచిత్యం ఏమిటనే వాదన ఐటీ వర్గాల్లో వినిపిస్తోంది. -
అడుగుపెడితే.. అరెస్టే!
-
అడుగుపెడితే.. అరెస్టే!
- ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంకు ఆధునిక హంగులు - ‘పొరుగు రాష్ట్రాల’ నేరగాళ్ల ఫొటోలూ నిక్షిప్తం - సిటీలో ‘వలస దుండగుల’ బెడద తగ్గించేందుకే - కసరత్తు చేస్తున్న నగర ఐటీ సెల్ అధికారులు దృష్టి మళ్ళించి దోపిడీలు చేయడంలో బివాండీ ముఠా దిట్ట. ఈ ముఠాను ఇటీవలే నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెన్నై, ముంబై, అజ్మీర్, బెంగళూరు, జల్గాం పోలీసులకూ సుపరిచితమే.. అటు బ్యాంకు ఖాతాదారుల్ని టార్గెట్‌గా చేసుకుని అటెన్షన్ డైవర్షన్‌తో కొల్లగొడుతున్న బిహార్ ముఠా కూడా అబిడ్స్ పోలీసులకు చిక్కింది. వీరిపై అక్కడా కేసులున్నాయి. ఇవే కాదు.. పొరుగు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి కొల్లగొడుతున్న ఘరానా గ్యాంగ్స్ ఎన్నో ఉన్నాయి. వీటికి చెక్ చెప్పడానికి సన్నాహాలు చేస్తున్న నగర పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంకు ఆధునిక హంగులు అద్దుతున్నారు. దీంతో నగరంలో అడుగుపెట్టగానే నేరస్తులను పట్టుకునేలా వ్యూహం రచిస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ ‘పని’ పూర్తయ్యాకే చిక్కుతున్నారు.. మహానగరం అనేక రాష్ట్రాలకు చెందిన వలస దొంగలకు విలాస కేంద్రంగా మారుతోంది. ఏపీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన ముఠాలు తరచూ సిటీకి ‘వచ్చి వెళ్తుంటాయి’. వీరంతా పంజా విసిరిన తర్వాతే పోలీసులకు చిక్కుతున్నారు. కొన్ని సందర్భాల్లో నిందితుల్ని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి అంతరాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే గుర్తించి, కట్టడి చేయగలిగితే నగరవాసికి నష్టం లేకుండా చేయవచ్చు. ఇదే ఆలోచన నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డికి వచ్చింది. దీంతో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంలో మార్పులకు నాంది పడింది. ప్రస్తుతం వినియోగిస్తున్న విధానమిలా.. నగర పోలీసు విభాగం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను నెక్ సంస్థ నుంచి ఖరీదు చేసింది. దీన్ని ఐటీ సెల్ అధికారులు ఆఫ్‌లైన్ విధానంలో వినియోగిస్తున్నారు. నగరంలోని వివిధ ఠాణాల పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అరెస్టు అయిన నిందితుల ఫొటోల డేటాబేస్‌ను రూపొందించారు. ఇవి నిక్షిప్తమై ఉన్న సర్వర్‌తో ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో నగరంలోని ఏ పోలీసుస్టేషన్, ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులైనా ఓ వ్యక్తి ఫొటోను పంపి, గతంలో ఎక్కడైనా అరెస్టు అయ్యాడా? అనేది తెలపాలని ఐటీ సెల్‌ను కోరుతున్నారు. ఈ ఫొటోను సాఫ్ట్వేర్ ఆధారంగా సర్వర్‌లో సెర్చ్ చేసి అలాంటి వివరాలుంటే గుర్తిస్తున్నారు. ‘పొరుగు వారి’ వివరాలూ చేరుస్తూ.. ఈ సిస్టంలో హైదరాబాద్‌లో అరెస్టయిన నేరగాళ్ల ఫొటోలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో పట్టుబడిన వారి ఫొటోలు, వివరాలను నిక్షిప్తం చేయనున్నారు. ఈ మార్పుల నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో ప్రధాన ప్రాంతాల్లోని సర్వైలెన్స్ కెమెరాలను పరిపుష్టం చేస్తారు. దీనికోసం ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆన్లైన్లో ఉంచి లైవ్ సెర్చ్‌లు చేయడానికి ఐటీ సెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌కు సర్వర్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానిస్తారు. ఇదే సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పాత నేరగాళ్లు, మిస్సింగ్ కేసులకు సంబంధించి అదృశ్యమైన వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా నగరంలో ఏ సీసీ కెమెరా ముందు నుంచైనా ఆ వ్యక్తి కదలికలు ఉంటే సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించే సర్వర్ తక్షణం కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం ట్రాఫిక్ విభాగం ఏర్పాటు చేస్తున్న ఐటీఎంఎస్ ప్రాజెక్టు ద్వారా సమకూరుతుండగా ఫేషియల్ రికగ్నైజేషన్ను ప్రభుత్వం అందించే నిధులతో సమీకరించుకుని అభివృద్ధి చేస్తున్నారు.