ఆకట్టుకున్న ఐటీ ఎక్స్పో –2016
విజయవాడ (గాంధీనగర్) :
కృష్ణా పుష్కరాల సంద ర్భంగా పవిత్ర సం గమం ఘాట్ వద్ద రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐటీ ఎక్స్పో –2016 ఆకట్టుకుంటోంది. ఔత్సాహికులు ప్రదర్శించిన వినూత్న సాంకేతికాంశాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు విశేషంగా ఆకర్షించాయి. కేఎల్ యూనివర్శిటీ విద్యార్థులు రూపొందించిన పురుగుమందులు చల్లే డ్రోన్, అంబులెన్స్ చేరుకోలేని ప్రదేశాల్లో ప్రమాదాల బారిన పడిన వారికి ప్రథమ చికిత్స కిట్‌ను అందించే డ్రోన్ ప్రదర్శన యాత్రికులను అబ్బురపరిచాయి. ఆన్లైన్ కడియం నర్సరీ మొక్కల విక్రయం, వాటి నిర్వాహణపై సూచనలు అందుబాటులోకి తెస్తూ ప్లాన్్టషిప్ సంస్థ రూపొందించిన అప్లికేషన్, సైబర్‌సెక్యూరిటీ ఆండ్రాయిడ్ అప్లికేషన్, సామ్ ఎస్బీసీ సంస్థ ప్రదర్శించిన సిస్టమ్ మాడ్యూల్స్, ఎఫ్రా్టనిక్స్ సంస్థ ప్రదర్శించిన వాటర్ స్టేడా తాగునీటి వ్యవస్థ నియంత్రణ తదితర అంశాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.